breaking news
Village girl
-
బాలికల విద్య భ్రష్టు!
గత శాసనసభ సమావేశాల్లో హైస్కూల్ ప్లస్(ఇంటర్)లలో ప్రవేశాల్లేవని.. ఫలితాలు రావడం లేదని, వాటిని రద్దు చేస్తామని విద్యాశాఖ మంత్రి లోకేశ్ సెలవిచ్చారు. ఈ నెపంతో టీడీపీ కూటమి ప్రభుత్వం పీజీటీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్)లు రిటైరైన చోట కొత్త వారిని నియమించలేదు. ఇప్పుడు తాజా బదిలీల్లోనూ ఇక్కడ పని చేస్తున్న పీజీటీలను బదిలీ చేశారేగానీ, వారి స్థానంలో కొత్త వారి నియామకాలు చేపట్టలేదు. ఈ స్కూళ్లు విజయవంతమవుతుండటంతో వైఎస్ జగన్‌కు మంచి పేరొస్తుందని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం బాలికల విద్యను భ్రష్టుపట్టిస్తోంది. గ్రామీణ బాలికలకు స్థానికంగా ఇంటర్ విద్యను అందించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన హైస్కూల్ ప్లస్‌లను వ్యూహాత్మకంగా నిర్వీర్యం చేస్తోంది. మండలానికి రెండు జూనియర్ కాలేజీలు ఉండాలన్న లక్ష్యంతో 2022లో రెండు విడతల్లో 504 హైస్కూల్ ప్లస్‌లను ప్రారంభించగా, వాటిలో ఒకటి బాలికల కోసం, మరొకటి కో–ఎడ్యుకేషన్ విధానంలో అందుబాటులోకి తెచ్చారు. అయితే, వైఎస్ జగన్‌పై అక్కసుతో నాటి ప్రభుత్వంలోని విద్యా సంస్కరణలను ఒకొక్కటిగా ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేస్తోంది. ఇందులో భాగంగా హైస్కూల్ ప్లస్‌ల్లో పని చేస్తున్న పీజీటీలను ఇటీవల బదిలీల్లో బయటకు పంపి, వారి స్థానంలో కొత్త నియామకాలు చేపట్టలేదు. దీంతో ఆయా స్కూళ్లల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. జీఓ నంబర్ 117 రద్దులో భాగంగా హైస్కూల్ ప్లస్‌లను రద్దు చేస్తామని విద్యా శాఖ మంత్రి ప్రకటించారు. ఈ జీఓ ఉపసంహరణ మార్గదర్శకాలు, ఉత్తర్వుల్లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే, కూటమి ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో హైస్కూల్ ప్లస్‌లను ఇంటర్మీడియట్ బోర్డుకు అప్పగిస్తామని ఒకసారి.. కాంట్రాక్టు టీచర్లను నియమిస్తామని మరోసారి ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ దిశగా కూడా చర్యలు తీసుకోక పోవడం చూస్తుంటే వీటిని నిర్వీర్యం చేసి.. ఎత్తేయడమే లక్ష్యంగా పెట్టుకుందని ఇట్టే తెలుస్తోంది. కుట్రలో కీలక అడుగు⇒ నిజానికి.. రాష్ట్రంలోని 294 ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్‌గా గత ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. రెండో విడతలో మరో 210 హైస్కూళ్లతో కలిపి మొత్తం 504 హైస్కూల్ ప్లస్‌లను అందుబాటులోకి తెచ్చింది. అలాగే, కేజీబీల్లో సైతం ఇంటర్ విద్యను ప్రవేశపెట్టారు. 2022–23 విద్యా సంవత్సరంలో 14 కో–ఎడ్ జూనియర్ కళాశాలలను బాలికల జూనియర్ కళాశాలలుగా మార్చారు. దీంతో మొత్తం 679 మండలాల్లో బాలికల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. ⇒ వీటిల్లోని విద్యార్థుల ఇంటర్ తరగతుల బోధనకు సీనియర్ స్కూల్ అసిస్టెంట్లు 1,850 మందిని పీజీటీలుగా నియమించింది. ఇప్పుడు వీరిలో సగం కంటే ఎక్కువ మందిని కూటమి ప్రభుత్వం బదిలీ చేసి, వారి స్థానంలో ఎవరినీ నియమించకుండా తన కుట్రలో కీలక అడుగు వేసింది. దీంతో ఈ ఏడాది హైస్కూల్ ప్లస్‌ల్లో చేరిన విద్యార్థులకు బోధనా సమస్యలు ఎదురవుతున్నాయి. ఇటీవల ఉపాధ్యాయుల బదిలీల్లోనూ వాటిల్లో ప్రభుత్వం పీజీటీలను కేటాయించక పోవడంతో అక్కడ బోధన కుంటుబడింది. ఫలితంగా పిల్లలంతా ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలకు వెళ్లేలా ప్రభుత్వమే వెనుక ఉండి తతంగం నడిపిస్తుండటం దుర్మార్గానికి పరాకాష్ట. ⇒ శ్రీకాకుళం జిల్లాలోని రొట్టవలస హైస్కూల్ ప్లస్‌లో మ్యాథ్స్, బోటనీ, జువాలజీ పీజీటీలు పదోన్నతిపై ఇతర స్కూళ్లకు బదిలీ అయ్యారు. హరిపురం హైస్కూల్ ప్లస్‌లోని జువాలజీ పీజీటీ ఏడాది క్రితం రిటైరైనా ఇప్పటిదాకా నియమించలేదు. ఉర్లాం హైస్కూల్ ప్లస్‌లో నాలుగు పీజీటీ ఖాళీలను భర్తీ చేయలేదు. చిత్తూరు జిల్లాలో 10 హైస్కూల్ ప్లస్‌లలో 35 పోస్టులు ఏడాది కాలంగా ఖాళీగా ఉన్నాయి. విద్యార్థులున్నా హైస్కూల్ ప్లస్‌లను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందనడానికి ఇలాంటి ఉదాహరణలు ప్రతి మండలంలోనూ కనిపిస్తున్నాయి. విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం ⇒ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సమూల విద్యా సంస్కరణలు ఇతర రాష్ట్రాల ప్రశంసలు పొందాయి. స్వాతంత్య్రం అనంతరం ఎవరూ చేయని స్థాయిలో విద్యా రంగంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. తద్వారా నాణ్యమైన విద్యను పేద పిల్లల ముంగిటకు తెచ్చారు. పోటాపోటీ చేరికలతో ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపు దిద్దుకున్నాయి. ఫలితంగా నాడు సర్కారీ బడుల్లో ఖాళీలు లేక.. ‘నో వేకెన్సీ’ బోర్డులు దర్శనమివ్వడం చూశాం. ఎన్నో జాగ్రత్తలతో విద్యార్థుల యూనిఫాం కిట్ పంపిణీ చేశారు. ⇒ ఇప్పుడివన్నీ గతం. గత ప్రభుత్వంలో విజయవంతంగా అమలైన విద్యా సంబంధిత పథకాలు, కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసింది. పాఠశాలల్లో నాడు–నేడు అభివృద్ధి పనులు అటకెక్కాయి. ఇంగ్లిష్ మీడియంకు మంగళం పాడింది. డిజిటల్ క్లాస్ రూమ్‌లు, టోఫెల్ క్లాసులకు టాటా చెప్పింది. సబ్జెక్ట్ టీచర్లపై వేటు వేసింది. గోరుముద్దను ఘోరంగా మార్చింది. సీబీఎస్ఈ సిలబస్, ఐబీ, ట్యాబులు అక్కర్లేదంది. ⇒ దీంతో ఫలితాలు పడిపోయాయి. ఫలితంగా ప్రభుత్వ బడులను వీడి విద్యార్థులు ప్రైవేటు బాట పట్టారు. తద్వారా ప్రైవేటు యాజమాన్యాలకు మేలుచేసేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని ఇట్టే తెలిసిపోయింది.ప్రభుత్వ చదువులపై విశ్వాసం పోతోంది గత ప్రభుత్వం గ్రామీణ పేద విద్యార్థుల కోసం హైస్కూల్ ప్లస్ పేరిట ఇంటర్ విద్యను అందుబాటులోకి తెచ్చింది. అవి బాగా విజయవంతమయ్యాయి. కానీ, కూటమి ప్రభుత్వంలో ఇవన్నీ నిర్వీర్యమవుతున్నాయి. వీటిల్లో బోధనకు పీజీటీల్లేరు. దీంతో విద్యార్థులు నష్టపోతున్నారు. తల్లిదండ్రులు, పిల్లలు అభద్రతాభావనకు లోనై ప్రభుత్వ చదువులపై విశ్వాసం కోల్పోతున్నారు. హైస్కూల్ ప్లస్‌లను ప్రభుత్వం కొనసాగిస్తుందో లేదో తేల్చాలి. పీజీటీ ఖాళీలను అర్హతగల స్కూల్ అసిస్టెంట్లతో భర్తీ చేయాలి. – వి.రెడ్డి శేఖర్‌రెడ్డి, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ట్రెజరర్ -
మాధురీ దీక్షిత్‌ను ఫిదా చేసిన యువతి
మట్టిలో మాణిక్యాలు ఎంతోమంది ఉన్నారు. తమలో ప్రతిభ ఉన్నప్పటికీ దానిని గుర్తించి సరైన ప్రోత్సాహం అందించేవారు లేకపోవడంతో వెలుగులోకి రావడం లేదు. అలాంటి వారికి సోషల్ మీడియాలో వేదికగా మారుతోంది. దేశం నలుమూలలా జరిగే చిన్న చిన్న సంఘటనలను సైతం ప్రపంచానికి పరిచయం చేస్తోంది. అలాంటి ఓ దృశ్యం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ పల్లెటూరి యువతి డ్యాన్స్ చేస్తున్న వీడియోను నటి మాధురీ దీక్షిత్ ట్విటర్లో షేర్ చేశారు. రాగిరీ అనే ఓ ట్విటర్ యూజర్ ఈ వీడియోను మొదట షేర్ చేస్తూ అలనాటి తారలు మాధురీ దీక్షిత్, హేమ మాలినిని ట్యాగ్ చేశారు. యువతి నృత్యంపై వారి అభిప్రాయాలు తెలపాలని కోరారు. రెండున్నర నిమిషాల నిడివి గల ఈ వీడియోలో ఓ విలేజ్ గర్ల్ పొలాల మధ్య అద్భుతంగా స్టెప్పులు వేస్తూ కనిపిస్తోంది. 1957లో వచ్చిన హిట్ చిత్రం ‘మదర్ ఇండియా’లోని రాజేంద్ర కుమార్, కుమ్కుమ్ నటించిన గోగత్ నహీన్..అనే పాటకు ఆ యువతి ఎక్కడా తడబడకుండా సూపర్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అలరించింది. ఈ డ్యాన్స్ వీడియోపై స్పందించిన ఈ బాలీవుడ్ భామ.. యువతిపై ప్రశంసలు కురిపించారు. ఆ పోస్టుకు ‘వావ్! అమ్మాయి అద్భుతంగా డ్యాన్స్ చేస్తోంది. ప్రపంచానికి పరిచయం చేయాల్సిన టాలెంట్ ఎంతో ఉంది’. అంటూ కొనియాడారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా. ఆ యువతి వివరాలు తెలియరాలేదు కానీ, వీడియోను షేర్ చేసిన ‘రాగిరీ’ సంస్థవారు సంప్రదాయ సంగీతాన్ని, నృత్యాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. మరి అంతలా ఆకట్టుకుంటున్న ఆ యువతి డ్యాన్స్‌ను మీరు కూడా చూసేయండి. చదవండి: ఆమె విషయంలో చిరంజీవి చెప్పిందే నిజమవుతోంది! మూడోసారి తల్లి కాబోతున్న నటి लाजवाब, वाह! She is dancing so beautifully. There is so much talent waiting to be discovered. https://t.co/HZYFwVbj88 — Madhuri Dixit Nene (@MadhuriDixit) February 8, 2021 -
మడిలో మాణాక్యాలు
సాక్షి, బిబ్బిలి(విజయనగరం) : వేకువనే నిద్ర లేస్తారు. అమ్మానాన్నలతో పొలానికెళ్తారు. పంట పనులకు సాయం చేస్తారు. కోసిన కూరగాయల్ని తట్టల్లో మార్కెట్‌కు తరలిస్తారు.. కన్నవారికి కుడి భుజంలా ఉంటూనే.. చక్కగా చదువుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కంటే కూతుర్నే కనాలి.. అన్నట్టున్న ఈ బంగారు తల్లులంతా మండలానికి చెందిన విద్యార్థినులు. పేద కుటుంబాలకు చెందిన వీరిలో అత్యధికులు ఉన్నత విద్య పూర్తి చేశారు. మరికొందరు చదువుకుంటున్నారు. వ్యవసాయ పనులన్నీ ఉదయం 8 గంటల్లోగా పూర్తిచేసి మళ్లీ కళాశాలకు బయలుదేరి వెళ్తూ చదువులోనూ ముందుంటున్న రామభద్రపురం మండల విద్యార్థినులపై కథనమిది. మండల కేంద్రంలోని ఎరుసు సత్యారావు, చిన్నమ్మి దంపతుల కుమార్తెలు శ్యామల ఎమ్మెస్సీ బీఈడీ, మాధవి డిగ్రీ, డైట్ శిక్షణ పూర్తి చేశారు. చింతల శ్రీనివాసరావు, పుణ్యవతి దంపతుల కుమార్తెలు సంగీత ఇంటర్ ద్వితీయ ఏడాది, నాగమణి డిగ్రీ మొదటి ఏడాది చదువుతున్నారు. కర్రి సాంబ, అన్నపూర్ణ దంపతుల కుమార్తెలు సాయి డిగ్రీ, ఐటీఐ, అశ్వని ఇంటర్, గొర్లి శ్రీనివాసరావు, మహాలక్ష్మి దంపతుల కుమార్తె ఝాన్సీ డిగ్రీ పూర్తి చేశారు. మరికొందరు ప్రస్తుతం చదువుకుంటున్నారు. వేకువ జామునే లేచి.. వీరు ఉన్నత విద్య చదువుతున్నాం కదా.. అని ఏమాత్రం బిడియపడకుండా రోజూ తెల్లారే తల్లిదండ్రులతో కలసి పొలాలకు వెళ్లి కూరగాయలు కోసుకొని మార్కెట్లో విక్రయిస్తారు. మరికొందరు కుటుంబ భారాన్ని కూడా మోస్తూ పెద్ద దిక్కు అవుతున్నారు. వ్యవసాయ పనులతో పాటు పాడి పశువులను పోషిస్తూ వాటికి గడ్డి కోయడం, దాణాలు పెట్టడం, పాలు పితకడం, పాల కేంద్రాలకు పాలు సరఫరా చేయడం వంటి పనులు కష్టపడి చేస్తూ ఆదాయ మార్గాలను చూసుకుంటున్నారు. పొలం పనులు చేస్తా నేను ఎమ్మెస్సీ, బీఈడీ చేశాను. బాడంగి టీఎల్ఎన్ స్కూల్లో ఉపాధ్యాయినిగా చేస్తున్నాను. రోజూ వేకువ జామున చెల్లి మాధవి, అమ్మ, నాన్నలతో కలసి కూరగాయలు కోసేందుకు పొలానికి వెళ్తాం. కూరగాయలు కోసి మార్కెట్లో విక్రయించిన తరువాత చెల్లి కాలేజీకి, నేను స్కూల్‌కు వెళ్తాం. తల్లిదండ్రులకు సహాయపడుతున్నందుకు ఆనందంగా ఉంది. – ఎరుసు శ్యామల, ఎమ్మెస్సీ, బీఈడీ, రామభద్రపురం ఆనందంగా ఉంది నేను, అక్క చదువుకుంటూ అన్ని పనుల్లోనూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటున్నాం. తోడ పుట్టిన అన్నదమ్ములు లేరు కాబట్టి మేమే అమ్మ, నాన్నలకు సహాయపడుతున్నాం. పూర్వం నుంచి వ్యవసాయ కుటుంబానికి చెందిన వారం కాబట్టి ఈ పనులు చేయడం ఆనందంగా ఉంది. – చింతల నాగమణి, ఇంటర్ ద్వితీయ సంవత్సరం, రామభద్రపురం. కుమార్తెలే అండ ఉన్నత విద్య చదువుకుంటూ వ్యవసాయ, ఇంటి పనుల్లో కుమార్తెలే సహాయపడుతున్నారు. రోజూ ఉదయం మాతో పాటు పొలంలోకి వచ్చి కూరగాయలు కోస్తారు. మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయిస్తారు. వ్యవసాయంలో కలుపు తీయడం వంటి పనులు చేస్తూ ఆసరాగా నిలుస్తున్నారు. కొడుకులు లేరన్న బాధ మాలో లేదు. – చింతల పుణ్యవతి, సంగీత, నాగమణి తల్లి, రామభద్రపురం -
పల్లెటూరి అమ్మాయిని.. ర్యాంకెలా వచ్చిందో తెలీదు!
తాను పల్లెటూరి అమ్మాయినని, ఏదో ఇంటర్ పాసైతే సరిపోతుందని అనుకున్నానే గానీ.. అసలు టాప్ ర్యాంకు ఎలా వచ్చిందో కూడా తనకు తెలియదని బిహార్ బోర్డు పరీక్షల టాపర్ రుబీ రాయ్ తెలిపింది. పోలీసులు ఆమెను అరెస్టు చేయగా, కోర్టు 14 రోజుల రిమాండుకు పంపిన విషయం తెలిసిందే. తన కాలేజి ప్రిన్సిపాల్ బచ్చారాయ్ తమకు దూరపు బంధువని, కానీ ఆయనతో తాను ఎప్పుడూ మాట్లాడలేదని పోలీసులకు విచారణలో వెల్లడించింది. తన తండ్రి మాత్రం ఆయనతో మాట్లాడి ఉండొచ్చని చెప్పింది. బోర్డు రెండోసారి నిర్వహించిన పరీక్షలలో ఏమీ గుర్తులేవని చెప్పడంతో.. తులసీదాస్ మీద వ్యాసం రాయమంటే ‘తులసీదాస్జీ.. ప్రణామ్’ అన్న ఒకే ఒకే వాక్యం రాసి ఊరుకున్న విషయం తెలిసిందే. అనంతరం పోలీసులు అమెను అరెస్టు చేసి మహిళా పోలీసు స్టేషన్లో ఉంచి తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారు. టాపర్లుగా వచ్చిన 12 మందిని ఇంటర్వ్యూ చేద్దామన్న ఆలోచన టీవీ చానళ్లకు రాకపోయినా.. అక్కడ పాలిటిక్స్ అంటే ఏంటి అని అడగకపోయినా ఈ ర్యాంకుల కుంభకోణం అసలు బయటపడి ఉండేదే కాదు. -
ఇష్టమూ ఉంది... కష్టమూ ఉంది!
రేవతి ఓ పల్లెటూరి అమ్మాయి. అయినా బాగా చదువుకుంటుంది. ఇంజినీరింగ్ పూర్తి చేస్తుంది. కానీ పట్నానికి వెళ్లడానికి మాత్రం ఇష్టపడదు. తన ఊరిని వదిలి వెళ్లడం అస్సలు ఇష్టం ఉండదామెకి. కానీ ఆమె నిర్ణయాన్ని తండ్రి సమర్థించలేకపోతాడు. ఆమె చదువు వృథా కాకూడదని, ఇంకా చదువుకుని జీవితంలో పెకైదగాలని కూతురి కోసం కలలు కంటాడు. ఎలాగో అతి కష్టమ్మీద రేవతిని పై చదువులకు వెళ్లేందుకు ఒప్పిస్తాడు. ఇది ఈమె కథ. ఇక హీరో... గౌతమ్‌కృష్ణ. భారతీయ కట్టుబాట్లు, సంప్రదాయాలను ఇష్టపడని వ్యక్తి. గ్రీన్‌కార్డ్ సంపాదించి అమెరికాలో సెటిలైపోవాలన్న ఆలోచన తప్ప మరో ఆలోచనే ఉండదతడికి. ఈ ఇద్దరూ ఒకరికొకరు తారసపడితే ఎలా ఉంటుంది? పరస్పర విరుద్ధ భావాలు కలిగిన వీళ్లిద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది అన్న కథాంశంతో తెరకెక్కిన సీరియల్... కొంచెం ఇష్టం కొంచెం కష్టం. స్క్రీన్‌ప్లే ఆసక్తికరంగా ఉండటంతో సీరియల్‌ని ఇష్టపడినా... అత్యంత పాత కథాంశం కావడంతో ఇష్టపడటానికి కాస్త కష్టపడాల్సి వస్తోంది. హీరోయిన్ చలాకీదనం ఆకట్టుకున్నా, హీరో ఎక్స్ప్రెషన్స్లోని లోపం ప్రేక్షకులను కాస్త ఇబ్బంది పెడుతోంది. కొద్దిపాటి మార్పులు చేస్తే కష్టం తగ్గి ఇష్టం పెరిగే అవకాశం లేకపోలేదు!