breaking news
Vice President elect
-
ఓ ప్రత్యేక ప్రక్రియ
సాక్షి, న్యూఢిల్లీ: కేవలం పార్లమెంటు సభ్యులు మాత్రమే పాల్గొనే ఉప రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ అత్యంత ప్రత్యేకమైనది. ’నైష్పత్తిక ప్రాతినిధ్య విధానం’లో ’ఏక బదిలీ ఓటు’ పద్ధతి ద్వారా ఉప రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. అంటే ప్రతి ఎంపీ బ్యాలెట్ పత్రంపై ఉన్న అభ్యర్థులకు తమ ప్రాధాన్యత క్రమాన్ని కేటాయించాల్సి ఉంటుంది. బ్యాలెట్ పత్రాలపై ఇద్దరు అభ్యర్థుల పేర్లు ఉంటాయి. ఎంపీలు తమకు ఇష్టమైన అభ్యర్థి పేరు పక్కన ’1’ అని రాయడం ద్వారా తమ మొదటి ప్రాధాన్యతను సూచించాలి. ఈ అంకెను భారతీయ సంఖ్యలలో, రోమన్ సంఖ్యలలో లేదా ఏదైనా భారతీయ భాషలోని సంఖ్యలలో రాయవచ్చు, కానీ అక్షర రూపంలో రాయకూడదు. సంక్లిష్టమైన లెక్కింపులు ఉండవు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రపతి ఎన్నికల్లా ఓటు విలువలో సంక్లిష్టమైన లెక్కింపులు ఉండవు. ఈ ఎన్నికల్లో పాల్గొనే ప్రతి ఎంపీ ఓటు విలువ ’ఒకటి’ (1) గానే పరిగణిస్తారు. గెలవడానికి అభ్యర్థి మొత్తం చెల్లుబాటైన ఓట్లలో 50% కంటే ఎక్కువగా (కోటా) మొదటి ప్రాధాన్యత ఓట్లను సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ మొదటి రౌండ్లో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోతే, తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని పోటీ నుంచి తొలగించి, వారి రెండవ ప్రాధాన్యత ఓట్లను మిగతా అభ్యర్థులకు బదిలీ చేస్తారు. పోటీ ఉంటేనే పోలింగ్ భారత రాజ్యాంగం ప్రకారం, ఉప రాష్ట్రపతి పదవీకాలం ఐదేళ్లు. ప్రస్తుత ఉప రాష్ట్రపతి పదవీకాలం ముగిసేలోపు కొత్తవారిని ఎన్నుకోవడం రాజ్యాంగ బద్ధమైన విధి. ఒకవేళ అధికార, విపక్ష కూటముల మధ్య ఏకాభిప్రాయం కుదిరి, ఒక్కరే అభ్యర్థి బరిలో ఉంటే ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. కానీ ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పుడు విజేతను నిర్ణయించడానికి పోలింగ్ తప్పనిసరి. రహస్య పద్ధతిలో ఎందుకు? ఉప రాష్ట్రపతి ఎన్నికను రహస్య బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించడానికి బలమైన రాజ్యాంగ పరమైన కారణాలు ఉన్నాయి. ఎంపీలు ఎలాంటి ఒత్తిడికి, ప్రలోభాలకు, పార్టీ విప్‌లకు లొంగకుండా తమ అంతరాత్మ ప్రబోధం మేరకు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు ఇది వీలు కలి్పస్తుంది. రాజకీయాలకు అతీతంగా సభ్యులు తమ ప్రతినిధిని ఎన్నుకోవాలన్నదే రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశం. ఓటు వేసిన తర్వాత బ్యాలెట్ పత్రాన్ని పార్టీ ఏజెంట్లతో సహా ఎవరికీ చూపించడానికి వీల్లేదు. -
సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక, షెడ్యూల్ ఇదే..
సాక్షి, న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల అయ్యింది. సెప్టెంబర్ 9వ తేదీన ఎన్నిక జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. జగ్దీప్ ధన్‌ఖడ్ అనూహ్య రాజీనామాతో ఈ పదవి ఖాళీ అయిన సంగతి తెలిసిందే.ఆగస్టు 7వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ కానుంది. నామినేషన్ల స్వీకరణకు ఆగస్టు 21వ తేదీ ఆఖరు. నామినేషన్ పరిశీలన 22వ తేదీన జరుగుతుంది. ఆగస్టు 25వ తేదీలోపు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. సెప్టెంబర్ 9వ తేదీన ఉదయం 10గం. నుంచి సాయంత్రం 5గం. దాకా పోలింగ్ జరుగుతుంది. అదే రోజు కౌంటింగ్ జరగనుంది.భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం నిర్వహించబడే ఒక ప్రత్యేక ఎన్నిక. రాష్ట్రపతి ఎన్నికలతో పోలిస్తే కొంత భిన్నంగా ఉంటుంది. ఈ ఎన్నికలో ఎలక్టోరల్ కాలేజీ తరఫున లోక్‌సభ, రాజ్యసభకు ఎన్నికైన, నామినేట్ అయిన సభ్యులు మాత్రమే ఓటు వేస్తారు. రాష్ట్ర శాసనసభ సభ్యులకు ఓటు హక్కు ఉండదు.పరోక్ష ఓటింగ్ (Indirect Election).. ఏక బదిలీ ఓటు పద్ధతి.. ఓటర్లు ఎన్నికలో నిల్చున్న అభ్యర్థులను ప్రాధాన్యత క్రమంలో (1, 2, 3...) గుర్తిస్తారు. రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరుగుతుందిఅర్హతలుభారతీయ పౌరుడై ఉండాలికనీసం 35 సంవత్సరాల వయస్సురాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యే అర్హత ఉండాలిలాభదాయక పదవిలో ఉండకూడదురిటర్నింగ్ అధికారిగా.. లోక్‌సభ లేదంటే రాజ్యసభ సెక్రటరీ జనరల్ రొటేషన్ పద్ధతిలో నియమించబడతారునామినేషన్, పరిశీలన, ఉపసంహరణ, పోలింగ్, లెక్కింపు — మొత్తం ప్రక్రియను 32 రోజుల్లో పూర్తి చేయాలని ఆర్టికల్ 66 స్పష్టం చేస్తోంది. -
‘ఇండియా’ కూటమి ఉమ్మడి అభ్యర్థి!
న్యూఢిల్లీ: జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవికి త్వరలో ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఎన్నికల సంఘం ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలో అధికార ఎన్డీయే అభ్యరి్థపై తమ ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని విపక్ష ‘ఇండియా’కూటమి నిర్ణయించినట్లు తెలిసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ పోటీ పడడమే సరైన వ్యూహమని భావిస్తున్నట్లు సమాచారం. ఫలితంతో సంబంధం లేకుండా అధికార కూటమికి బలమైన సందేశం ఇవ్వదలిచామని ఇండియా కూటమి నేతలు గురువారం వెల్లడించారు. పార్లమెంట్లో మొత్తం ఓట్లు 782 కాగా, ఉప రాష్ట్రపతి ఎన్నికలో నెగ్గాలంటే 392 ఓట్లు అవసరం. ప్రస్తుతం ఎన్డీయేకు 423 ఓట్ల బలం ఉంది. ఇండియా కూటమికి సానుకూలంగా 313 ఓట్లు ఉన్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికలో పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు పాల్గొంటారు. -
అమెరికా ఎన్నికలు.. అరుదైన దృశ్యం!
వాషింగ్టన్: అదో అరుదైన దృశ్యం.. చరిత్ర సృష్టించిన అపురూపమైన సందర్భం. అగ్రరాజ్యానికి తొలి మహిళా ఉపాధ్యక్షురాలు, తొలి నల్లజాతీయురాలు, తొలి ప్రవాస భారతీయురాలు ఇలా ఎన్నో ప్రత్యేకతల్ని సొంతం చేసుకున్న కమలా హ్యారిస్ జాతినుద్దేశించి ప్రసంగించినప్పుడు వెన్నెల కాంతులతో పోటీ పడే తెల్ల రంగు దుస్తుల్లో మెరిసిపోయారు. మహిళా హక్కుల కోసం ఉద్యమించడమే తన లక్ష్యమని చెప్పడానికే ఆ రంగు దుస్తులు వేసుకున్నారు. అమెరికాలో 1913లో ఏర్పాటైన రాజకీయ సంస్థ ది నేషనల్ వుమెన్ పార్టీ తెలుపు, వంగపండు, బంగారం రంగుల్ని మహిళా ఉద్యమానికి ప్రతీకగా ఎంచుకుంది. అందులో తెలుపురంగు స్వచ్ఛతకి ప్రతిబింబంగా నిలుస్తుంది. అలా తెల్లరంగులో రాజహంసలా ఈ దేశానికి తాను తొలి మహిళా అధ్యక్షురాలిని అని, కానీ తాను చివరి మహిళని కాదు అంటూ ఉద్వేగ భరిత ప్రసంగాన్ని చేశారు. స్ఫూర్తిని నింపే వీడియో అగ్రరాజ్యానికి ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ ఇటీవల తన మేనకోడలిని ఒళ్లో కూర్చోబెట్టుకొని ముచ్చటించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో నాలుగేళ్ల చిన్నారి అమరా అజాగు తనకు అమెరికాకు అధ్యక్షురాలు కావాలని చెప్పింది. దానికి కమల నువ్వు కూడా అధ్యక్షురాలివి కావొచ్చని అయితే దానికి చాలా కష్టపడాలని, 35 సంవత్సరాలు నిండాలని చెప్పి ఆ చిన్నారిలో స్ఫూర్తిని నింపారు. అదే స్ఫూర్తిని కమల తనలో తాను చాలా ఏళ్లుగా నింపుకుంటూ వస్తున్నారు. ఆ కష్టపడే తత్వం, తల్లి చెప్పిన మాటల్ని జీవితంలో తుచ తప్పకుండా ఆచరించడం, అంతులేని ఆత్మవిశ్వాసం ఆమెని ఉపాధ్యక్ష పీఠానికి దగ్గర చేశాయి. నల్ల జాతీయురాలినని చెప్పడానికి గర్వపడతా కమల తండ్రి డేవిడ్ హ్యారిస్ జమైకా దేశస్తుడు. తల్లి శ్యామలా గోపాలన్ భారతీయురాలు. చెన్నైకి చెందిన కేన్సర్ పరిశోధకురాలు, పౌరహక్కుల ఉద్యమకారిణి. చిన్నతనంలో తల్లిదండ్రులు విడిపోవడంతో తల్లి సంరక్షణలోనే పెరిగారు. ఆమె గుణాలు పుణికిపుచ్చుకొని జాతి వివక్షపై ధిక్కార స్వరం, వలసవాదులపై ఉదారవాదం, చట్టసభల్లో ప్రశ్నించే తత్వం, అద్భుతమైన నాయకత్వ లక్షణాల్ని సొంతం చేసుకున్నారు. ‘‘అమెరికా మమ్మల్ని నల్లజాతివారిగానే చూస్తుందని మా అమ్మకి బాగా తెలుసు. అందుకే నన్ను, మా చెల్లెల్ని ఆత్మవిశ్వాసంతో పెంచారు. నల్లజాతీయురాలినని చెప్పుకోవడానికి నేను గర్వపడతాను’’అని కమలా హ్యారిస్ తన ఆటోబయోగ్రఫీ ది ట్రూత్స్ వి హోల్డ్‌లో రాసుకున్నారు. తన సహచర లాయర్ డగ్లస్ ఎమాఫ్‌ను పెళ్లాడారు. డగ్లస్‌కు మొదటి భార్య ద్వారా ఇద్దరు పిల్లలున్నారు. వారిని సొంత పిల్లల్లా పెంచారు. సమర్థవంతమైన నాయకురాలు న్యాయశాస్త్రంలో పట్టా తీసుకొని డిస్ట్రిక్ట్ అటార్నీగా. రాష్ట్ర అటార్నీ జనరల్‌గా తన సత్తా చాటారు. అద్భుతమైన వాక్పటిమతో మంచి లాయర్‌గా పేరు తెచ్చుకున్నారు. 2016లో డెమొక్రాటిక్ పార్టీ తరఫున సెనేట్‌కి ఎన్నికై జాతీయ రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత అమెరికాకి అధ్యక్షురాలు కావాలని కలలు కన్నారు. జో బైడెన్‌తో పోటీ పడి గత ఏడాది చివర్లో రేసు నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత కొద్ది నెలలకే బైడెన్‌కు మద్దతుగా నిలిచి ఉపాధ్యక్ష పదవిని చేజిక్కించుకున్నారు. ఒక సెనేటర్‌గా ఆమెలో నాయకత్వ లక్షణాలు ప్రపంచానికి ఎప్పుడో తెలిశాయి. ఇంటెలిజెన్స్, జ్యుడీషియరీ విభాగాల్లో మంచి పట్టున్న ఆమెకు మొదటి రోజు నుంచే ప్రభుత్వాన్ని నడిపించగల సామర్థ్యం ఉంది. నా ఫోన్ రింగ్ ఆగలేదు అగ్రరాజ్యం ఉపాధ్యక్షురాలిగా ఎన్నికై కమలా హ్యారిస్ చరిత్ర తిరగరాయడంతో భారత్‌లోని ఆమె స్వగ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి. ఢిల్లీలో ఉంటున్న ఆమె మేనమామ గోపాలన్ బాలచంద్రన్ కమల విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. కమల విజయం సాధించిన దగ్గర్నుంచి తన ఫోన్ రింగ్ అవుతూనే ఉందని ఆయన చెప్పారు. తొలి మహిళనే కానీ... మీరు ఆశను, ఐక్యతను, మర్యాదను, శాస్త్రీయతను, నిజాన్ని ఎన్నుకున్నారు. అమెరికా తదుపరి అధ్యక్షుడిగా జో బైడెన్‌ను ఎన్నుకున్నారు. ఆయన గాయాలను మాన్పే శక్తి ఉన్న వ్యక్తి. నేను ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిళనే కావచ్చు. కానీ చివరి స్త్రీని మాత్రం కాను. ఎందుకంటే ఈ ఎన్నికలను, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న చిన్నారులకు వారి ముందున్న అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. – కమలా హ్యారీస్ -
'నేనిక రాజకీయాలు మాట్లాడకూడదు'
హైదరాబాద్: ఇక తాను రాజకీయాల గురించి మాట్లాడకూడదని ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్య నాయుడు అన్నారు. తనకు కొత్తగా వచ్చిన బాధ్యతలు(ఉప రాష్ట్రపతి) ప్రకారం తాను రాజకీయాలకు అతీతం అని చెప్పారు. అయితే, ప్రజలకు సంబంధించిన అంశాలపై స్పందించకుండా ఉండటం మాత్రం దీని అర్థం కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను మరోసారి చదువులో నిమగ్నమైపోయానని, తనకంటే ముందు ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించిన మహనీయులు సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్ వంటి వారు చేసిన కార్యకలాపాలను గురించి అధ్యయనం చేస్తున్నానని తెలిపారు. కొత్త బాధ్యతలు తెలుసుకునేందుకు కొంతమంది అధికారులను కూడా సంప్రదించనున్నట్లు వివరించారు. రాజ్యసభ చైర్మన్ హోదాలో తాను అర్థవంతమైన చర్చ జరిగేలా చూస్తానని, ప్రతిపక్షాలు, అధికార పక్షము అని కాకుండా అందరికీ సమానంగా మాట్లాడే అవకాశం ఇస్తానని అన్నారు. పేదరికం, నిరక్షరాస్యత, ఆర్థిక తారతమ్యాలు, వివిధ వర్గాలపై ఉన్న వివక్షతలు, వాతావరణ నిర్లక్ష్యంలాంటి అంశాలను పరిశీలిస్తున్నానని ఈ అంశాల పరిష్కారమే దేశ ప్రధాన అజెండాగా ఉండాలని ఆయన తెలిపారు.