breaking news
vasupalli
-
బ్రహ్మపుత్ర మెచ్చిన సాహస పుత్రిక
సాహసం సైలెంట్‌గా ఉండదు. కంచుకంఠంతో మనలోని ఆత్మవిశ్వాసాన్ని తట్టి లేపుతుంది. ఆ పిలుపును కాలేజీ రోజుల్లోనే అందుకుంది శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతానికి చెందిన వాసుపల్లి కవిత. సాహసంతో చెలిమి చేసిన కవిత బ్రహ్మపుత్రలో రివర్ రాఫ్టింగ్ విజయవంతంగా పూర్తి చేసిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. ఆర్మీ వైద్యాధికారి అయిన కవిత అరుణాచల్‌ప్రదేశ్‌లో అత్యంత ఎత్తయిన గోరీచెన్ పర్వతాన్ని ఐదుసార్లు అధిరోహించింది. మరెన్నో సాహసయాత్రలకు సిద్ధం అవుతోంది.ఉద్దానం ప్రాంతమైన వజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామంలోని సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వాసుపల్లి కవితకు చిన్నప్పటి నుంచి క్రీడలు, స్విమ్మింగ్ అంటే ఇష్టం. చదువులోనూ ముందుండేది. కష్టపడి చదివి ఎంబీబీఎస్ సీటు సాధించింది. శ్రీకాకుళంలోని రిమ్స్ వైద్య కళాశాలలో సమయంలో ట్రెక్కింగ్ చేసేది.సైన్యంలోకి....సైన్యంలో పనిచేయాలనే ఆసక్తి కవితలో ఉండేది. 2021లో ఆర్మీ వైద్యాధికారిగా కెప్టెన్ హోదాలో ΄ోస్టింగ్ పొందిన కవిత మేజర్ స్థాయికి చేరింది. అరుణాచల్ ప్రదేశ్‌లో పనిచేస్తున్నప్పుడు సాహస క్రీడలపై ఇష్టంతో ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్’లో చేరి పర్వతారోహణకు సంబంధించి రెండు కోర్సులు, రివర్ రాఫ్టింగ్‌లో ఒక ప్రత్యేక కోర్సు చేసింది.ప్రాణదాతపర్వతారోహణలో శిక్షణ తీసుకున్న కవిత అరుణాచల్‌ప్రదేశ్‌లో అత్యంత ఎత్తయిన గోరీచెన్ పర్వతాన్ని ఐదుసార్లు అధిరోహించింది. కల్నల్ రణవీర్‌సింగ్ జమ్నాల ఆధ్వర్యంలో గోరీచెన్ అధిరోహించి కిందికి వస్తున్న సమయంలో బృందంలోని ఒక యువ సభ్యురాలు ఊపిరి అందక ప్రమాదంలో పడింది. కవిత ఆమెకు తక్షణ వైద్యం అందించి ప్రాణపాయం నుంచి తప్పించింది.బ్రహ్మపుత్రలో సాహస యాత్రఅత్యంత క్లిష్టమైన బ్రహ్మపుత్ర నదిలో 1040 కిలోమీటర్ల మేరకు విజయవంతంగా రివర్ రాఫ్టింగ్ పూర్తి చేసింది కవిత. కల్నల్ రణవీర్‌సింగ్ నేతృత్వంలోని పన్నెండు మంది సభ్యుల బృందంలో ఆమె ఏకైక మహిళ. బ్రహ్మపుత్రలో రివర్ రాఫ్టింగ్ విజయవంతంగా పూర్తి చేసిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. భారత–టిబెట్ సరిహద్దులోని గెల్లింగ్ గ్రామం నుంచి బ్రహ్మపుత్రలో ప్రయాణం ప్రారంభించి, ఏకధాటిగా 28 రోజులపాటు రివర్ రాఫ్టింగ్ చేశారు. ఇండో–బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న హాట్సింగిమారి దగ్గర తమ సాహసయాత్ర ముగించారు.ప్రాణం మీదికి వచ్చినా సరే...బ్రహ్మపుత్రలో రాఫ్టింగ్ సజావుగా ఏమీ సాగలేదు. ప్రాణం మీదికి తెచ్చిన ప్రమాదాలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. నది ΄÷డవునా ప్రవాహ తీవ్రత, 11 అడుగుల ఎత్తులో ఎగిసిపడే అలల ఉధృతి కారణంగా ఏర్పడిన సుడిగుండంలో చిక్కుకుని బృందం ప్రమాదంలో పడింది. కాస్త ఓపిక పడితే ప్రమాదం నుంచి బయటపడొచ్చు అనుకున్నారు. ధైర్యం కోల్పోలేదు. పెద్ద అల నుంచి తప్పించుకుని, ఈదుకుంటూ రాఫ్ట్‌ను చేరుకున్నారు. ఇలా నాలుగుసార్లు రాఫ్ట్ నుంచి పడి΄ోయినా ముందుకే సాగారు. యాత్రలో రోజుకు 12 గంటలపాటు 70 కిలోమీటర్ల మేరకు ప్రయాణించి రాత్రివేళల్లో విశ్రాంతి తీసుకునేవారు.వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో... సైన్యంలో చేసిన సేవలకు గుర్తింపుగా ‘చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్’ అవార్డు అందుకుంది కవిత. గోరీచెన్ పర్వతారోహణ సందర్భంగా తోటి పర్వతారోహకురాలికి చికిత్స చేసినందుకు రాష్ట్రపతి విశిష్ట సేవా మెడల్‌కు ఎంపికైంది. బ్రహ్మపుత్రలో రివర్ రాఫ్టింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసినందుకు ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సాధించింది.– కందుల శివశంకర్, సాక్షి, శ్రీకాకుళం -
వాసుపల్లి.. వేషం వెర్రి!
హోదా గోదాలో సానుభూతి పాట్లు పీఠాధిపతి వేషధారణతో విన్యాసాలు ఎమ్మెల్యే వికారపు చేష్టలపై జనం అభ్యంతరాలు స్వామీజీలను అవమానించడంపై ఆక్షేపణ నిరసన అంటూనే పూలు చల్లించుకోవడం.. జేజేలు కొట్టించుకోవడం బీజీపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మిన్నకుండటంపై విమర్శలు ప్రతిపక్షంలో ఉన్న ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని గోల చేసిన బీజేపీ నాలుక ఇప్పుడు మడతపడింది.. దానికి మద్దతిస్తున్న టీడీపీ వ్యతిరేకంగా గొంతెత్తితే ఏమవుతుందోన్న భయంతో సన్నాయి నొక్కులు నొక్కుతోంది.. దిల్లీలో సాగుతున్న రాజకీయ డ్రామాను తలన్నేలా.. విశాఖలో సోమవారం ఓ వీధి నాటకం విస్తుగొలిపింది.. వినూత్న నిరసన పేరుతో టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ వేసిన వేషం వికటించింది.. ధర్మపరిరక్షణ కోసం జీవితాలను త్యాగం చేసిన పీఠాధిపతులను అనకరిస్తూ ఆయన వేసిన వేషం.. చేసిన చేష్టలు.. హోదా ఇచ్చేది లేదని తేల్చేసిన బీజేపీకే చెందిన ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇవ్వడం వంటి విన్యాసాలు.. సానుభూతికి బదులు విమర్శలు కురిపించాయి. ఇదేం వేషాల వెర్రి.. అని జనం ఏవగించుకునేలా చేశాయి.. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చేసిన నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి వినూత్నంగా భావించి చేపట్టిన నిరసన చూసి విశాఖ జనం విస్తుపోయారు. తొండ ముదిరి ఊసరవెల్లి అయిన చందంగా ప్రచారం కోసం ఇప్పటికే ఎన్నెన్నో వేషాలు, మరెన్నో విన్యాసాలు చేసిన వాసుపల్లి సోమవారం వేసిన పీఠాధిపతి వేషం మాత్రం ప్రజలకు ఏవగింపు కలిగించింది. –ప్రత్యేక హోదాపై ఎన్డీయే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు ఆ కూటమిలోని టీడీపీ ప్రజాప్రతినిధులు చేస్తున్న ధర్నాలు ఇప్పటికే విమర్శలపాలవుతున్నాయి. దొంగతనం చేసిన దొంగే.. దొంగా.. దొంగా అని అరిచినట్టు టీడీపీ డ్రామాలాడుతోందన్న వాదనలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సహజంగానే ప్రచారం కోసం రకరకాల విన్యాసాలు చేసే దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి సోమవారం పీఠాధిపతి అవతారం ఎత్తడం వివాదాస్పదమైంది. తొండ ముదిరి ఊసరవెల్లి అయిన చందంగా ఆయన ప్రచార వికారం పరాకాష్టకు చేరిందన్న వ్యాఖ్యలు వినిపించాయి. పీఠాధిపతులను అవమానించే విధంగా వ్యవహరించారని జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారపు చేష్టలు – వాసుపల్లి కరాసలోని తన స్వగహం నుంచి హిందూ పీఠాధిపతి వేషధారణలో భజన బందం వెంటరాగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఇంటికి వెళ్లి ఆయనకు వినతి పత్రం సమర్పించారు. వాసుపల్లితో పాటు తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకష్ణబాబు కూడా ఉన్నారు. నిరసన ప్రదర్శనకు వెళ్తున్నానన్న పెద్దమనిషి దారిపొడవునా పీఠాధిపతి వేషంలో ఉన్న తనపై తెలుగు మహిళలతో పూలు చల్లించుకోవడం, జేజేలు పలికించుకోవడం.. వంటి చేష్టలకు పాల్పడటం ప్రజలకు ఏవగింపును కలిగించాయి. పైగా మీడియాకు స్వయంగా తన లెటర్‌హెడ్‌తో పంపిన లేఖలో కూడా ‘పీఠాధిపతి వాసుపల్లి’ అని తనను తాను సంభోదించుకోవడం విమర్శలపాలవుతోంది. విష్ణుకుమార్‌రాజుకు ఏమైంది? పబ్లిసిటీ కోసం చీప్ ట్రిక్కులకు పాల్పడ్డ వాసుపల్లి వ్యవహారం అటుంచితే.. ఆయన్ను స్వాగతించి, అతని తలపై పూలు చల్లిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు వైఖరి కూడా వివాదాస్పదమవుతోంది. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడి హోదాలో ఉన్న ఆయన.. పీఠాధిపతిలను అనుకరిస్తూ టీడీపీ ఎమ్మెల్యే చేసిన విన్యాసాలపై కనీసమాత్రంగా కూడా అభ్యంతరం చెప్పకపోవడంపై కమలనాధుల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది. ప్రధాని నరేంద్రమోదీపై ధ్వజమెత్తుతూ వాసుపల్లి స్వామీజీ వేస్తే... విష్ణుకుమార్ రాజు కుటుంబ సభ్యులతో సహా సవినయంగా స్వాగతం పలకడం, పూలు చల్లడం ప్రజల్లో చర్చకు దారి తీసింది. పైగా విషయాన్ని మోదీ దష్టికి తీసుకువెళ్తానని అభినవ పీఠాధిపతికి ఆయన సెలవివ్వడం ఇక్కడ కొసమెరుపు. పీఠాధిపతి వేషం ఎందుకంటే.. వాసుపల్లి వివరణ ప్రధాని నరేంద్రమోదీ పీఠాధిపతులకు, కార్పొరేట్ శక్తులకు ఇచ్చిన గౌరవం ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు ఇవ్వడం లేదని వాసుపల్లి పేర్కొన్నారు. అందుకే పీఠాధిపతిగా విష్ణుకుమార్‌రాజు వద్దకు వెళ్లానని వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఆయన సోమవారం సాయంత్రం పీఠాధిపతి, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ పేరిట ఓ ప్రకటన విడుదల చేశారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు సానుకూలంగానే స్పందించారని, ప్రజాప్రతినిధుల మనోభావాలను కేంద్ర పెద్దలకు తెలియజేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. వారంరోజుల్లో దిల్లీ వెళ్లి ఎమ్మెల్యేలు వాసుపల్లి, వెలగపూడి ఇచ్చిన వినతి పత్రాలను పెద్దలకు అందజేస్తానని విష్ణుకుమార్‌రాజు చెప్పినట్టు వాసుపల్లి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.