breaking news
vadluru bypass road
-
పశ్చిమలో సెల్ఫీ వీడియో కలకలం
ఉండ్రాజవరం: పశ్చిమ గోదావరి జిల్లాలో సెల్ఫీ వీడియో కలకలం రేపింది. తాను ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఆత్మహత్య చేసుకుంటున్నాని ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ఈ విషయం పోలీసులకు చేరడంతో విచారణ చేపట్టారు. సెల్ఫీ వీడియో విడుదల చేసిన వ్యక్తి ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామానికి చెందిన గొరిల్లా శివరావుగా గుర్తించారు. శివరావు ఎక్కడున్నాడో తెలియక కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. శివరావు వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు. టీడీపీ నేతల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వెల్లడించారు. గ్రామ సమస్యలపై ఫిర్యాదు చేస్తే కక్ష గట్టారని శివరావు వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రైవేట్ టూరిస్ట్ బోల్తా: 35 మందికి గాయాలు
కామారెడ్డి : ఓ ప్రైవేట్ టూరిస్టు బోల్తా పడటంతో 35 మంది గాయపడ్డారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కామారెడ్డి శివారు వడ్లూరు బైపాస్ రోడ్డు వద్ద గురువారం ఉదయం జరిగింది. అతివేగంగా ప్రయాణిస్తున్న టూరిస్టు అదుపుతప్పి బోల్తాపడినట్లు సమాచారం. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.