breaking news
United Nations High Commissioner for Refugees
-
బతుకు చితికి.. గూడు చెదిరి... వలస బాట
పుట్టిన నేల.. పెరిగిన ఊరు.. ఇవే మనిషి అస్తిత్వం. కానీ యుద్ధం, హింస ప్రజలను నిరాశ్రయులను చేస్తోంది. అధికార దాహం, అహంకార ధోరణి కోట్ల మందిని సొంత నేలకే పరాయివాళ్లుగా మారుస్తోంది. గత పదేళ్లలో ప్రపంచ జనాభాలో ప్రతి 69 మందిలో ఒకరు చొప్పున ఏకంగా 12 కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. వీరిలో చాలామంది తలదాచుకునేందుకు కూడా దిక్కులేక శరణార్థులుగా మారాల్సి వస్తోంది. ప్రాణాలను చేతబట్టుకుని విదేశాల బాట పట్టాల్సిన దుస్థితి దాపురిస్తోంది...! – సాక్షి, నేషనల్ డెస్క్సంఘర్షణ, హింస, మానవ హక్కుల ఉల్లంఘనల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 11.7 కోట్ల మందికి పైగా నిరాశ్రయులైనట్టు ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషన్ (యూఎన్‌హెచ్‌సీఆర్) వెల్లడించింది. వీరిలో 6.83 కోట్ల మంది సంఘర్షణలు, ఇతర సంక్షోభాల కారణంగా సొంత దేశాల్లోనే ఇతర ప్రాంతాలకు చెదిరిపోయారు. దాదాపు 4.5 కోట్ల మంది పొట్ట చేత పట్టుకుని శరణార్థులుగా విదేశాలకు వలస వెళ్లారు. 2024 తొలి నాలుగు నెలల్లో ఇది మరింత పెరిగింది.పదేళ్లకోసారి రెట్టింపు.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1951లో ఐరోపాలోని శరణార్థుల హక్కులను పరిరక్షించేందుకు ఐక్యరాజ్యసమితి శరణార్థుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. 1967లో శరణార్థుల కన్వెన్షన్ ఆవిర్భవించినప్పుడు 20 లక్షల మంది శరణార్థులున్నారు. ⇒ 1980 నాటికి కోటికి చేరిన శరణార్థులు ⇒ 1990 నాటికి రెండు కోట్లకు చేరిన సంఖ్య⇒ 2021 చివరి నాటికి 3 కోట్లను మించిన శరణార్థులు⇒ తాజాగా 11 కోట్లు దాటేసిన వైనం2020 నుంచి వేగంగా...⇒ 2022లో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక 2023 చివరి నాటికి 60 లక్షల మంది ఉక్రేనియన్లు నిరాశ్రయులయ్యారు. వీరిలో చాలామంది దేశం విడిచి వెళ్లారు. ⇒ 2023లో సుడాన్లో సైన్యం, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య ఘర్షణలు శరణార్థుల సంఖ్యను 10.5 లక్షలు పెంచాయి. ⇒ ఇక ఇజ్రాయెల్ దాడులతో గాజాలో గతేడాది చివరి మూడు నెలల్లో 10.7 లక్షల మంది నిరాశ్రయులై వలస వెళ్లారు.ఎక్కడి నుంచి వస్తున్నారు?⇒ ప్రపంచవ్యాప్తంగా నమోదైన దాదాపు 4.5 కోట్ల మంది శరణార్థులలో దాదాపు మూడొంతులు (72 శాతం) ఐదు దేశాల నుంచే వచ్చారు.అఫ్గానిస్తాన్ 64 లక్షలు సిరియా 64 లక్షలు వెనెజులా 61 లక్షలు ఉక్రెయిన్ 60 లక్షలు పాలస్తీనా 60 లక్షలుఆశ్రయమిస్తున్న దేశాలు?⇒ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 శాతం మంది శరణార్థులు తమ స మీప పొరుగు దేశాల్లోనే బతుకీడుస్తున్నారు. ⇒ ఇరాన్, పాకిస్తాన్‌లోని శరణార్థులందరూ అఫ్గాన్లే. ⇒ టర్కీలో ఎక్కువ మంది శరణార్థులు సిరియన్లు.దేశం శరణార్థులు ఇరాన్ 38 లక్షలు తుర్కియే 33 లక్షలు కొలంబియా 29 లక్షలు జర్మనీ 26 లక్షలు పాకిస్తాన్ 20 లక్షలు -
ఐక్యరాజ్య సమితి గుర్తింపు ఉన్నా కూడా...
న్యూఢిల్లీ: రొహింగ్య ముస్లిం ప్రజల విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అక్రమ చొరబాటుదారులుగా పేర్కొంటూ సుమారు 40,000 మందిని తక్షణమే దేశం నుంచి పంపించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కేంద్రహోంశాఖ కసరత్తులు ప్రారంభించగా, రంగంలోకి దిగిన ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గట్టర్స్ భారత ప్రతినిధులతో చర్చిస్తున్నారు. మయన్మార్ కు చెందిన రొహింగ్య ప్రజలు అక్కడ జరుగుతున్న దాడుల నేపథ్యంలో పొరుగున ఉన్న బంగ్లాదేశ్, భారత్ లకు వలసలగా వెళ్తున్నారు. వారి కోసం రంగంలోకి దిగిన ఐక్యరాజ్య సమితి శరణార్థుల విభాగం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయించి ఆశ్రయం కల్పించింది. భారత్ లో సుమారు 16,500 మంది పౌరులకు గుర్తింపు కార్డులను కూడా మంజూరు చేసింది. అయితే హోంశాఖ సహోయమంత్రి కిరెన్ రిజ్జూ మాత్రం అవి చెల్లవని తేల్చేశారు. "శరణార్థుల విషయంలో ఐక్యరాజ్య సమితి చొరవను మేము అడ్డుకోబోం. అలాగని అక్రమచొరబాటుదారులను ఇక్కడ జీవించేందుకు ఒప్పుకోలేం. అలాగని వాళ్లనేం బంగాళాఖాతంలో పడేయట్లేదు. చట్టం ప్రకారమే తిరిగి వాళ్లను స్వదేశానికి పంపించేస్తాం. ఇప్పటికే మయన్మార్, బంగ్లాదేశ్ లతో సంపద్రింపులు చేపట్టాం" అని రిజ్జూ పేర్కొన్నారు. మయన్మార్ రఖీనే రాష్ట్రంలో స్థిరపడిన రొహింగ్య ముస్లిం ప్రజలపై గత కొన్నేళ్లుగా చొరబాటుదారుల ముద్ర వేయటమే కాదు, అల్లర్లకు కారణమౌతున్నారని పేర్కొంటూ సైన్యం వారిపై దాడులకు పాల్పడుతోంది. రొహింగ్య యువకులను కాల్చి చంపటం, మహిళలపై అకృత్యాలు పెరిగిపోవటంతో వారంతా పొరుగు దేశాలకు పరుగులు తీస్తున్నారు. గత అక్టోబర్‌లో సుమారు 75,000 మంది బంగ్లాదేశ్ లోకి ప్రవేశించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే అక్కడ రక్షణ కరువైందన్న ప్రజలను తిరిగి అదే ప్రాంతానికి పంపటం సరికాదన్న అభిప్రాయం ఐక్యరాజ్యసమితి వ్యక్తం చేస్తోంది.