breaking news
Union minister for environment and forests
-
గిర్‌లో సింహగర్జన
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే ప్రసిద్ధి చెందిన గిర్ అడవుల్లో ఆసియాటిక్ సింహాల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. 2020లో 674గా ఉన్న ఈ సింహాల సంఖ్య 2025 నాటికి 891కి పెరిగింది. కేవలం ఐదేళ్లలో 32 శాతం వృద్ధి సాధ్యమైంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈ వృద్ధిని ‘ప్రాజెక్ట్ లయన్’విజయానికి నిదర్శనంగా అభివరి్ణంచారు. గుజరాత్‌లోని దేవభూమి ద్వారక జిల్లాలోని బర్డా వన్యప్రాణి అభయారణ్యంలో జరిగిన ప్రపంచ సింహ దినోత్సవ వేడుకల్లో భూపేందర్ యాదవ్ మాట్లాడారు. సింహాల సంరక్షణపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గానూ, అంతకుముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ ప్రత్యేక శ్రద్ధ చూపారని మంత్రి యాదవ్ గుర్తు చేశారు. 1990లో 284 మాత్రమే ఉన్న సింహాల సంఖ్య 2025లో 891కి చేరడం ప్రపంచ వన్యప్రాణి సంరక్షణలో అరుదైన ఘనత అని చెప్పారు. ‘సింహం గిర్లోనే ఉంది. ఇది గుజరాత్ గౌరవం, భారత పర్యావరణ బలానికి ప్రతీక’అన్నారు. బర్డాలో రూ.180 కోట్ల ప్రాజెక్టులు గుజరాత్‌లోని బర్డా ప్రాంతంలో 143 ఏళ్ల తర్వాత మళ్లీ సింహాల నివాసం ఏర్పడిందని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. బర్దా వన్యప్రాణి అభయారణ్యం పోర్ బందర్, దేవభూమి ద్వారకా జిల్లాల్లో 192.31 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. 2023లో సింహం ఈ ప్రాంతానికి సహజంగా వలస వచి్చన తరువాత, సింహాల సంఖ్య 17కు పెరిగింది. అందులో 6 పెద్దవి, 11 పిల్లలు ఉన్నాయని వెల్లడించారు. అంతేగాక› సుమారు 248 హెక్టార్ల విస్తీర్ణంలో సఫారీ పార్కును ప్రారంభించాలని యోచిస్తున్నారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించింది. సింహాల వెటర్నరీ కేర్, నూతన హాబిటాట్స్, ఇకోటూరిజం మౌలిక సదుపాయాల కోసం రూ.180 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించనున్నట్లు తెలిపారు.ప్రాజెక్ట్ లయన్2020 ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ప్రకటించిన ప్రాజెక్ట్ లయన్‌కు 10 ఏళ్ల కాలానికి రూ.2,927.71 కోట్ల నిధులు కేటాయించారు. గుజరాత్‌లోని 11 జిల్లాల్లో సుమారు 35 వేల చదరపు కి.మీ. విస్తీర్ణంలో సింహాల ఉనికి విస్తరించి ఉంది. బర్డా వన్యప్రాణి అభయారణ్యంను రెండో సింహ నివాసంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. -
కేంద్రమంత్రి పదవికి జయంతి నటరాజన్ రాజీనామా
-
కేంద్రమంత్రి పదవికి జయంతి నటరాజన్ రాజీనామా
అడవులు, పర్యావరణ శాఖ మంత్రి జయంతి నటరాజన్ తన మంత్రి పదవికి శనివారం రాజీనామా చేశారు. 2014 సాధారణ ఎన్నికల్లో పార్టీ కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషించేందుకే జయంతి రాజీనామా చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా జయంతి వ్యవహరించారు. కాంగ్రెస్‌పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆదేశానుసారం తిరిగి పూర్తీస్థాయిలో పార్టీ వ్యవహారాల్లో పాల్గొనేందుకే ఆమె కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. దేశంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు.. యూపీఏ-2 హయాంలో.. చివరిసారి కేంద్రమంత్రివర్గంలో మరిన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశాలున్నాయని సమాచారం. ఎన్నికల సమయానికి.. పార్టీని బలోపేతం చేసేందుకు 10 జన్‌పథ్ కసరత్తుచేయడంలో భాగంగా.. మరికొంతమంది సీనియర్లు కేంద్ర కేబినెట్ వదిలి.. పార్టీ వ్యవహారాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. అయితే జయంతి నటరాజన్ రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. అడవులు, పర్యావరణ శాఖలను ఇకపై కేంద్ర చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ పర్యవేక్షించనున్నారని రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.