breaking news
Tunda
-
ఉగ్రవాది తుండా కేసు విచారణ వాయిదా
-
టుండా రైలుపై మావోయిస్టుల దాడి
సాక్షి, సిటీబ్యూరో: ‘1987 ఏప్రిల్‌లో ఆజం ఘోరీని కలవడానికి హైదరాబాద్ వచ్చా... అది సాధ్యం కాకపోవడంతో రైలులో తిరిగి వెళ్తుండగా ఆదిలాబాద్జిల్లా కాగజ్‌నగర్ వద్ద నేను ప్రయాణిస్తున్న రైలుపై మావోయిస్టులు దాడి చేశారు. త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డా’ హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ఆధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో లష్కరే తొయిబా ఉగ్రవాది అబ్దుల్ కరీం టుండా బయటపెట్టిన విషయమిది. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఆగస్టులో అరెస్టు చేసిన టుండాను సిట్ అధికారులు ఈ నెల 10న పీటీ వారెంట్‌పై నగరానికి తీసుకొచ్చారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ 1998లో సిటీ పోలీసులకు చిక్కిన పాకిస్తాన్ జాతీయుడు సలీం జునైద్ కేసులో టుండా నిందితుడు. సిట్ విచారణలో టుండా వెల్లడించిన అంశాలివి... ఆ తరవాత కొన్నాళ్లకు ఢిల్లీలో ఆజం ఘోరీని కలి సినప్పుడు ఈ అనుభవా న్ని అతడితో పంచుకున్నా డు. ఆ తర్వాతే 1994లో దేశం దాటడం, బంగ్లాదేశ్‌లో సలీం జునైద్‌కు శిక్షణ ఇవ్వడం వంటివి చేశాడు. సిట్ పోలీసుల కస్టడీ గడువు పూర్తికావడంతో పోలీసులు టుండాను శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. ఉగ్ర బాటపట్టిన తరవాత టుండా తొలిసారిగా 1986లో నగరానికి వచ్చాడు. అప్పుడే వరంగల్‌కు చెందిన ఆజం ఘోరీతో పరిచయం ఏర్పడింది. ఇతడి ద్వారానే టుండాకు తన్జీమ్ ఇస్లా ఉల్ ముస్లమీన్ (టీఐఎం) సహా మరికొన్ని ఉగ్రవాద సంస్థలకు చెందిన అబ్దుల్ బారి, ఫసీయుద్దీన్, నజీర్ పరిచయమయ్యారు. టుండా రెండోసారి 1987 ఏప్రిల్‌లో సిటీకి వచ్చేప్పటికీ ఆజం ఘోరీ వ్యవహారాలు పోలీసులకు తెలియడంతో అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. దీంతో పరారీలో ఉండిపోవడంతో అతడిని కలుసుకోవడం టుండాకు సాధ్యం కాలేదు. అలాంటి పరిస్థితుల్లో టుండా నగరంలో ఉండటం క్షేమం కాదని భావించిన నజీర్, ఫసీయుద్దీన్లు హైదరాబాద్ రైల్వేస్టేషన్ (నాంపల్లి)కు తీసుకువెళ్లి రైలు ఎక్కించారు. టుండా ప్రయాణిస్తున్న ఈ రైలుపై కాగ జ్నగర్ ప్రాంతంలో నక్సలైట్లు దాడి చేశారు. రైలు పట్టాలను పేల్చేయడంతో పాటు తుపాకులతోనూ విరుచుకుపడ్డారు. అనేక బోగీల్లో ఉన్న ప్రయాణికులు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. అయితే, టుండా ప్రయాణిస్తున్న బోగీకి ఎలాంటి నష్టం జరగకపోవడంతో క్షేమంగా బయటపడ్డాడు. -
పోలీసు కస్టడీకి టుండా
న్యూఢిల్లీ: లష్కర్-ఏ-తోయిబా బాంబుల తయారీ నిపుణుడు, తీవ్రవాది అయిన అబ్దుల్ కరీం టుండాకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఐదు రోజుల పోలీసు కస్టడీకి అంగీకరించింది. ఈ నెల 8వ తేదీ వరకు పోలీసు కస్టడీకి తరలిస్తూ అదనపు సెషన్స్ జడ్జి(ఏఎస్‌జె) ధర్మేష్ శర్మ తీర్పునిచ్చారు. తీవ్రవాద కార్యకలాపాల్లో తనకున్న సంబంధాల సమాచారం సేకరించేందుకు తమ కస్టడీకి టుండాను అనుమతించాలని ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కోర్టును కోరింది. గత విచారణలో తాను బాంబుల తయారీకి వినియోగించే సామగ్రిని పాతఢిల్లీలోని తిలక్బజార్లోని ఒక షాపునుంచి సేకరించినట్లు టుండా అంగీకరించాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. బాంబుల తయారీలో ఉపయోగించే ఆయిల్ ఎక్కడనుంచి సేకరించాడనేది తెలుసుకోవాల్సి ఉందని, అందువల్ల అతడిని ఐదురోజులపాటు తమ కస్టడీకి అనుమతించాలని కోర్టుకు విన్నవించడంతో జడ్జి అంగీకరించారు.