breaking news
tribal languages
-
‘ఆది వాణి’ ఏఐతో భాష పదిలం
దేశవ్యాప్తంగా గిరిజన తెగల భాషా వారసత్వాన్ని పెంపొందించడానికి, దాన్ని పరిరక్షించడానికి భారత ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. భాషాపరమైన అంతరాన్ని పూడ్చే ప్రయత్నంలో భాగంగా భిలి, ముండారి, సంతాలి, గోండితో సహా అనేక దేశీయ గిరిజన భాషల్లో అనువాదం, అభ్యాసం కోసం కృత్రిమ మేధ ఆధారిత అప్లికేషన్ ‘ఆది వాణి’(Aadi Vaani)ని కేంద్రం ఆవిష్కరించనుంది.సాంకేతికతతో సాధికారతఆది వాణిని అభివృద్ధి చేయడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) వంటి ప్రముఖ సంస్థల సాయం తీసుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గిరిజన భాషల్లో ప్రత్యేకత కలిగిన భాషావేత్తలు, పరిశోధకుల సహకారం కోరినట్లు చెప్పాయి. అనువాదం, విద్యా ప్రయోజనాల కోసం ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడేలా ఈ యాప్‌ను రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గిరిజన విద్యార్థులు వారి మాతృభాషలో చదువు నేర్చుకోవడానికి ఇది ఎంతో సహాయపడుతుందని చెప్పారు. అదే సమయంలో అంతరించిపోతున్న కొన్ని అరుదైన భాషలను కాపాడుకునేందుకు తోడ్పడుతుందని పేర్కొన్నారు.భాష పరిరక్షణకు..భారతదేశంలో 700కి పైగా విభిన్న గిరిజన సమాజాలున్నాయి. ప్రతి ఒక్కటి దాని సొంత ప్రత్యేకమైన భాష, మాండలికాలు, సంప్రదాయాలను కలిగి ఉంది. కారణాలు ఏవైనా ఈ భాషల్లో అనేకం అంతరించిపోతున్నాయి. కొన్ని తెగలు వారి భాషా గుర్తింపునే కోల్పోతున్నాయి. ఆది వాణితో ఈ సమస్యను కొంతవరకు పరిష్కరించే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. భాషలను పరిరక్షించడమే కాకుండా దైనందిన జీవితంలో దీన్ని చురుగ్గా ఉపయోగించే వాతావరణాన్ని సృష్టించాలని కేంద్రం భావిస్తోంది.ఇదీ చదవండి: రోజూ 2 జీబీ డేటాతో బీఎస్ఎన్ఎల్ 365 రోజుల ప్లాన్విద్యార్థులకు ఎంతో మేలు..ఆది వాణి యాప్‌లో గిరిజన భాషా అనువాదాలను అందించనున్నారు. దీని ద్వారా విద్యార్థులు ఏ భాషలో కంటెంట్ ఇచ్చినా అది తాము కోరుకున్న గిరిజన భాషలోకి మారుతుంది. తమ మాతృభాషలో పాఠ్యపుస్తకాలు, ఆడియో, విజువల్ కంటెంట్ పాఠాలను యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ ప్రయత్నం వల్ల విద్యార్థులకు కష్టంగా ఉండే గణితం, సైన్స్, చరిత్ర వంటి సబ్జెక్టులను అర్థం చేసుకోవడానికి, అందులో రాణించడానికి వీలవుతుంది. దాంతోపాటు ఈ యాప్ ఉపాధ్యాయులకు విలువైన వనరుగా ఉంటుందని, భాషా అవసరాలను అర్థం చేసుకోవడానికి, తదనుగుణంగా బోధనా పద్ధతులను మార్చుకోవడానికి సహాయపడుతుందని భావిస్తున్నారు. సాంస్కృతిక, భాషా నేపథ్యాలతో సంబంధం లేకుండా పిల్లలందరికీ నాణ్యమైన విద్యను అందించాలన్న కేంద్రం విస్తృత లక్ష్యానికి ఇది తోడ్పడుతుంది. -
తెలంగాణ భాషా కేతనం ఎగరాలి
తెలుగు భాషకు విశిష్ట భాషా హోదా లభించింది. అంతలోనే భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయింది. అటు సంస్కృతం ఇటు ఆంగ్లం దేశభాషల మీద సవారీ చేస్తున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో భాషా భవిష్యత్తు ఏమిటో, ఎలా ఉంటుందో తెలియకున్నది. విద్యాబోధన ఆంగ్ల మాధ్యమంలోకి చేజారిపోతున్నది. ఇంజనీరిం గ్, వైద్య విద్య మినహా మిగతా పెద్ద బడుల (విశ్వవిద్యాలయాల)లో తెలుగులో పీజీని చదివే, రాసే అవకాశం ఉంది. కానీ ప్రైవేట్ కళా శాలలు, విద్యాసంస్థలు అందుకు ప్రోత్సహించ డం లేదు. తెలుగులో నేర్పడం, నేర్వడం చిన్న తనమైంది. దీంతో తెలుగు భాష బోధన పరం గా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నది. దీని కి తోడుగా తెలంగాణలో వలస తెలుగు ప్రభావం ఎక్కువై అసలు తెలంగాణ భాషకు అన్యా యం జరుగుతున్నది. అందువల్లే ప్రత్యేక రా ష్ట్రం డిమాండ్‌కు భాషకూడా ఒక కారణమైంది. ఐతే తెలంగాణ భాష స్వరూపం, స్వభా వం ఏమిటి? దానిని ఎలా రూపొందించాలి? పాలన, బోధన, పాత్రి కేయ రంగాలలో దానికి సముచిత స్థానం ఇవ్వ డం ఎలా? ఒక సమాన రూపం ఏర్పరచగల మా? ఏర్పరిస్తే దాని స్వ రూపం ఏమిటి? ఎలా ఉండాలి? ఉంటుంది? అనే అంశాలను చర్చించుకోవడం అవసరం. పాలన, బోధన, రచన, న్యాయ వ్యవస్థలలో తెలంగాణ భాషని ప్రజల భాషగా తీర్చిదిద్దాలి. ప్రాథమిక పాఠశాల పాఠ్య పుస్తకాలు, వాచ కాలు ఆయా పరిసరాలకు, ప్రాంతాలకు, భాషలకు విడి విడిగా వేయాలి. వాచక ప్రచురణ కేంద్రీకరణని దెబ్బకొట్టాలి. వివిధ జిల్లాలకు పాఠ్యపుస్తకా లను తయారు చేసుకునే వెసులుబాటు కలిగించాలి. పరభాషల ప్రభావం నుండి బయటపడాలి. ముఖ్యంగా గొట్టు పదాలైన సంస్కృత పదాలను వీలైనంతవరకు పరిహ రించాలి. ప్రాథమిక విద్యను ఆదివాసులకు ఆయా భాషలలో, ఇత రులకు తెలుగులో బోధించాలి. తెలంగాణ భాషకు ఒక సమగ్ర నిఘం టువు అవసరం. అందులో వివిధ ప్రాంతాల, జిల్లాల పదాలు, ప్రాచీన, ఆధునిక పదాలు రావాలి. ఇతర భాషల పదజాలం తప్పనిసరి. వృత్తుల, శ్రమ సంబంధాల భాష ప్రధానంగా చేరాలి. సుమారు రెండున్నర లక్షల పదాలతో సమగ్ర నిఘంటువు జరూరుగా తయారు చేయ వలసి ఉంది. అప్పుడే తెలంగాణ భాష విశ్వ రూపం తెలియవస్తుంది. ఈ నిఘంటువులో తెలంగాణ భాషకు మూలమైన కోయ, గోండి ఇత్యాది ఆదివాసీ భాషలపై ప్రత్యేక దృష్టి సారించాలి. వివిధ ప్రాకృత భాషల నిలయంగా తెలంగాణ తెలుగు ఎన్నో పదాలను ఇచ్చింది. మరికొన్ని పదాలను గ్రహించి తనలో సంలీనం చేసుకున్నది. తెలంగాణ ఉపకులాల కేంద్రం. సుమారు 150 ఉపకులాలలో 100 కులాలకి ప్రత్యేక భాష ఉంది. ఒక్కో కులానికి సంకేత భాష, ప్రత్యేక పదజాలం ఉన్నాయి. వాటిని ఈ నిఘంటువులో చేర్చాలి. ఆర్థిక హార్ధిక సహకా రం ఉంటే రెండేళ్లలో మెగా డిక్షనరీని తయారు చేయవచ్చు. తెలంగాణ బహుభాషల నిలయం. ఎన్నో భాషల పదాలు ఇక్కడ సజీవంగా ఉన్నా యి. అంతరించిపోతున్న వృత్తులు, పనులు, వైద్య, విజ్ఞాన ధారల పదజాలం విలక్షణమై నది. ఇందుకోసం ఒక పద సేకరణ విభాగం అవసరం. కొత్త పదాల రూపకల్పన కోసం నూతన పద పరికల్పన కమిటీని ఎంపిక చేయా లి. తిరిపమెత్తి అయినా తెలంగాణ భాష ఔన్న త్యకేతనాన్ని ఎగరవేయడం తల్లి తెలంగాణకు కీర్తి కిరీటమే అవుతుంది. అది అందరి బాధ్యత. సమష్టిగా ఆలోచిద్దాం. నిర్మాణాత్మకంగా తెలం గాణ భాషా కేంద్రం ఏర్పాటు చేద్దాం. (వ్యాసకర్త తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు)