breaking news
Tribal Girls Hostel
-
మా సార్ మాకే కావాలి..
జనగామ జిల్లా: ‘మా సార్‌ను అనవసరంగా డిప్యుటేషన్‌పై పంపించారు. మా సార్ మాకే కావాలి’.. అంటూ జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మున్సి పాలిటీ పరిధిలోని శివునిపల్లిలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశా లలో విద్యార్థినులు శనివారం పాఠశాల గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. స్థానిక గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల ఇన్చార్జి హెడ్ మాస్టర్‌గా ధరావత్ రాజు నాలుగేళ్లుగా పనిచేస్తున్నారు. ఇటీవల పాఠశాలలో జరిగిన పరిణామాల నేపథ్యంలో.. ఉన్నతాధికారులు రాజును హనుమకొండ జిల్లా ఆరెపల్లి ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలకు డిప్యుటేషన్‌పై బదిలీ చేశారు. రాజు శనివారం పాఠశాల నుంచి కారులో వెళ్తుండగా.. పలు వురు విద్యార్థులు ‘సార్.. వెళ్ళొద్దంటూ’ కన్నీరు పెట్టుకున్నారు. పాఠశాల గేటు వద్ద దాదాపు ఐదు గంటల పాటు నిరసన తెలిపారు. రాజు సార్ తమపై ప్రత్యేక శ్రద్ధ చూపేవారని, పదో తరగతిలో 100 ఉత్తీర్ణత కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. ఆర్డీవో డీఎస్ వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, సీఐ జి.వేణు, ఎస్ఐ వినయ్‌కుమార్ పాఠశాలకు చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. విద్యార్థినులు వినకపోవడంతో కలెక్టర్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఫోన్లో కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ ఆదేశాల మేరకు.. నెల రోజుల్లో రాజు సార్‌ను పాఠశాలకు రప్పిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు. -
హాస్టల్ నుంచి వ్యభిచార గృహానికి..
♦ నాలుగు నెలల క్రితం ♦ ఇద్దరు బాలికల అదృశ్యం ♦ పోలీసుల అదుపులో నిందితులు ఇల్లెందు: ఖమ్మం జిల్లా గుండాల గిరిజన బాలికల హాస్టల్ నుంచి అదృశ్యమైన బాలికలు నాలుగు నెలల తర్వాత ఓ వ్యభిచార గృహంలో తేలారు. మంగళవారం ఖమ్మం జిల్లా ఇల్లెందులో డీఎస్పీ ఆర్. వీరేశ్వరరావు వివరాలు వెల్లడిం చారు. గుండాల గిరిజన బాలికల హాస్టల్లో చదివే ఓ బాలి కకు ఇల్లెందు మండలం పోలారం గ్రామానికి చెందిన ఇస్లావత్ కిషోర్‌తో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో కిషో ర్ ఆ బాలికకు మోసం చేశాడు. ఆ తర్వాత అతడు ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. కిషోర్‌పై కోపంతో ఆ విద్యార్థిని తన స్నేహితురాలిని తీసుకొని గత డిసెంబర్ 16న హాస్టల్ నుంచి వెళ్లిపోయింది. వారు వరంగల్ జిల్లా మహబూబాబాద్‌కు, అక్కడి నుంచి సికింద్రాబాద్‌కు వచ్చారు. అక్కడ వారికి పరిచయమైన ఇద్దరు మహిళలు పని కల్పిస్తామని ఖమ్మం జిల్లా కొత్తగూడెం తీసుకెళ్లారు. అక్కడి నుంచి పార్వతి అనే మహిళ ఇంటికి తీసుకెళ్లి వ్యభిచార ఊబిలో దింపాలని ప్రయత్నించగా వారు నిరాకరించారు. దీంతో వారిని నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట సమీపంలోని కందుకూరుకు చెందిన వ్యభిచార గృహ నిర్వాహకుడు యాదగిరికి అమ్మేశారు. యాదగిరి వారిని బలవంతంగా వ్యభిచార రొంపిలో దింపాడు. విటుడిగా వచ్చిన ఓ వ్యక్తి వద్ద నున్న ఫోన్ సహాయం తో తన సోదరికి జరిగిన విష యం.. తాము ఎక్కడున్నది చెప్పింది. భయపడిన యాదగిరి ఆమెను పంపించి వేశాడు. దీంతో ఆమె నేరుగా మహబూబాద్ సమీపంలో ఉంటున్న తన సోదరి వద్దకు వచ్చి గుండాల సీఐని ఆశ్రయించింది. ఖమ్మం పోలీసులు కందుకూరులోని వ్యభిచార గృహంపై దాడి చేసి మరో విద్యార్థిని విడిపించి యాదగిరిని అదుపులోకి తీసుకున్నారు.