breaking news
Travers Beynon
-
మా ఆయన గర్ల్‌ఫ్రెండ్స్ లిస్ట్ చాలా పెద్దదే!
సిడ్నీ: ప్రపంచంలో విలాస పురుషుడు ఎవరంటే ఆస్ట్రేలియాకు చెందిన వ్యాపారవేత్త ట్రేవర్స్ బేనన్(44) అని చెప్పవచ్చు. అతడికి ఉన్న గర్ల్ ఫ్రెండ్స్ జాబితా చెప్పడమూ కష్టమేనని స్వయంగా అతడి భార్య తాయేశానే వెల్లడించడం గమనార్హం. క్వీన్స్లాండ్ కుబేరుడు ట్రేవర్స్ బేనన్కు తాయేశా రెండో భార్య. దాదాపు రెండేళ్ల పాటు డేటింగ్ చేసిన అనంతరం 2011లో తాయేశాను వివాహం చేసుకున్నాడు. తనను తాను కింగ్ ఆఫ్ ఇన్‌స్టాగ్రామ్‌గా చెప్పుకునే బేనన్కు అమ్మాయిలంటే విపరీతమైన పిచ్చి. ఓసియన్ రోడ్ మ్యాగజైన్‌కు తాయేశా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆశ్చర్యకర విషయాలు చెప్పింది. తన భర్తకు లెక్కలేనంత మంది మహిళలతో సంబంధాలున్నాయని, అతడికి ఎంతమంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నా నాకేంటి.. భార్యను మాత్రం నేనొక్కదాన్నే అని సంబరపడింది తాయేశా. సక్సెస్ఫుల్ బిజినెస్‌మ్యాన్‌గా పేరున్న బేనన్ రోజూ రాత్రి నలుగురు మహిళలతో గడుపుతాడని అక్కడ ప్రచారంలో ఉంది. బేనన్ విచ్చలవిడి వ్యవహారం తెలిసిన తాయేశా వాళ్ల పెద్దలు అతడితో పెళ్లికి నిరాకరించారు. 'పెద్దల అనుమతించకపోయినా బేనన్ నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత నా వివరాలపై మా పెద్దలు వాకబు చేయలేదు. నా భర్త బేనన్ నా జీవితం నాశనం చేసి ఉంటాడని వారు భావిస్తుంటారు' అని తాయేశా చెప్పుకొచ్చింది. బేనన్ తొలి వివాహం 1991లో నినిబెత్ బిట్రీజ్ జిమినెజ్ లీయల్ తో జరిగింది. ఆమె ఏ అనామకురాలో కాదు. 1991లో ప్రపంచ సుందరి టైటిల్ నెగ్గిన మహిళ. దాదాపు 17 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం 2008లో జిమినెజ్ లీయల్ కు విడాకులిచ్చాడు. తొలి భార్యతో కలిసి ఉన్నప్పుడే తాయేశాతో వివాహేతర సంబంధం కొనసాగించాడు బేనన్. తాయేశాతో వివాహం జరిగిన తర్వాత అతడి చేష్టలు మరింత ఎక్కువయ్యాయి. ఎప్పుడూ అందగత్తెలతో తిరుగుతూ వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూ ఉండేవాడు. రెండో భార్య బేనన్ పనులకు అడ్డు చెప్పకపోగా.. భార్యగా మాత్రం తనను బాగా చూసుకుంటాడంటూ వెనకేసుకొస్తోంది. -
బికినీ భామలతో ఐదుకోట్ల పార్టీ
సిడ్నీ: కుప్పలుతెప్పలుగా డబ్బు వచ్చిపడుతుంటే విలాసవంతులు తమ కులాసా జీవితాల్లో ఆడంబరంగా, అంగరంగ వైభవంగా విందు వినోదాల్లో మునిగితేలుతారని తెలుసు. ఆస్ట్రేలియాకు చెందిన టుబాకో దిగ్గజం ట్రావెర్స్ బెనాన్ స్టైలే డిఫరెంట్. వివిధ రకాల థీమ్‌లతో విచిత్ర రీతుల్లో పార్టీలు ఇవ్వడంలో ఆయనకు ఆయనే సాటి. తనకు తాను ‘క్యాండీమేన్(అక్రమ మాదకద్రవ్యాల వ్యాపారి. ఈ పేరుతో హాలివుడ్లో ఓ సినిమా కూడా వచ్చింది)’గా పిలుచుకునే ట్రావర్స్ అడపాదడపా విలాసవంతంగా పార్టీలు ఇవ్వడం, వాటిని ఎప్పటికప్పుడు వాటిని సోషల్ వెబ్సైట్ ‘ఇన్స్టాగ్రామ్’లో పోస్ట్ చేయడం ఆయనకు అలవాటు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనకు దాదాపు మూడు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈసారి ‘అన్లీష్ యువర్ ఇన్నర్ బీస్ట్’ అన్న థీమ్‌తో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది. ఆదివారం తెల్లవారుజాము వరకు ఈ పార్టీ కొనసాగుతుంది. విచిత్ర వేషధారణలతో అతిథులు హాజరయ్యారు. ఎక్కువ మంది జంతు చర్మలతో కూడిన దుస్తులతో వచ్చారు. ఆయన ఇచ్చే ఏ పార్టీలోనైనా కామన్‌గా కనిపించేది ఒక్కటే. అదే బికినీ భామల ప్రత్యేక ఆకర్షణ. ఈసారి కూడా వారు ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చి స్మిమ్మింగ్ పూల్స్‌లోకి దిగి జలకాలాడారు. వయ్యారాలు వొలకబోసారు. మరికొందరు నడుం వరకు మత్స్యకన్నెలుగా దుస్తులు ధరించి ఆహూతులను అలరించారు. ఇప్పటికే ఈ పార్టీకి ఐదు కోట్ల రూపాయలు ఖర్చయిందని ఈవెంట్ మేనేజర్లు తెలియజేశారు. సరిగ్గా 12 గంటలకు 'బ్యాట్‌మేన్' రూపంలో ట్రావర్స్ గాలిలో తేలుతూ వచ్చారు. దీని కోసం స్టంట్ మాస్టర్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పాశ్చాత్య సంగీత హోరులో అతిథులంతా మద్యం సేవిస్తూ తూలిపోతుండగా, అందమైన భామలు తమ మత్స్యకంటి చూపులతో పార్టీని మరింత కెపైక్కించారు. ఏనుగు, మొసలి, కొండముచ్చులను కూడా అతిథులను ఆకట్టుకునేందుకు ఏర్పాటు చేశారు. ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్‌లోని తన విలాసవంతమైన భవనంలో ఏర్పాటు చేసిన ఈ పార్టీలో ట్రావర్స్ ప్రతి ఈవెంట్ వద్దకు వెళ్లి కెమేరాలను ఫోజులిచ్చారు. ఆ ఫొటోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ వచ్చారు. ఓ ఫొటోలో తన భార్య టయేషా, మరికొంత మంది ప్రియురాళ్ల మెడలకు పగ్గాల్లాగా తాళ్లు వేసి జంతువుల్లా వారిని లాగుతున్న దృశ్యాన్ని సోషల్ మీడియా తీవ్రంగా విమర్శించింది. అయితే తన పార్టీ థీమ్‌లోనే జంతువు ఉందంటూ ఆయన సమర్ధించుకుంటున్నారు.