breaking news
time extented
-
Travancore Devaswom Board: శబరిమలలో భారీ రద్దీ.. దర్శన సమయం గంట పెంపు
పత్తనంతిట్ట: కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి మాలధారుల తాకిడి పెరిగింది. దీంతో దర్శన సమయాన్ని గంట పొడిగించినట్లు ట్రావెన్కోర్ దేవస్వోమ్ బోర్డు(టీడీబీ)ఆదివారం ప్రకటించింది. సాయంత్రం దర్శనం 4 బదులు 3 గంటల నుంచే మొదలవనుంది. రోజూ వర్చువల్ క్యూ ద్వారా 90 వేల బుకింగ్‌లు, 30 వేల స్పాట్లో బుకింగ్స్ ఉంటున్నాయని ఆలయ ఏర్పాట్లను చూసే ఐజీ స్పర్జన్ కుమార్ చెప్పారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో దర్శనాలను త్వరత్వరగా సాఫీగా సాగేలా చూడాలన్న ప్రయత్నాలకు విఘాతం కలుగుతోందని వివరించారు. దర్శనానికి 15 నుంచి 20 గంటల వరకు భక్తులు ఎదురుచూపులు చూడాల్సి వస్తోందని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ పేర్కొన్నారు. -
టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్షా సమయం 30 నిమిషాలు పొడిగిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది మాదిరిగానే పరీక్షా సమయం పొడిగించారు. 2 గంటల 45 నిమిషాలు ఉన్న పరీక్ష సమయాన్ని 3 గంటల 15 నిమిషాలకు పొడిగించినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 5 లక్షలకుపైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. 70 శాతం సిలబస్‌నే అమలు చేస్తున్నామన్నారు. ప్రశ్నపత్రంలో అధిక చాయిస్ ఇస్తున్నామని మంత్రి వెల్లడించారు. చదవండి: గ్రూప్–1, 2 ఇంటర్వ్యూలకు గుడ్‌బై? -
యూఏఈకి వెళ్లే వారికి ఊరట
మోర్తాడ్ (బాల్కొండ): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) నుంచి సెలవులపై ఇంటికి వచ్చి, ఇక్కడే చిక్కుకుపోయిన వారికి వీసాల గడువును నవంబర్ 10 వరకు పెంచుతూ అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 20 నుంచి నవంబర్ 9 లోపు గడువు ముగిసే వీసాలను పొడిగించింది. ఈ మేరకు దుబాయ్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్స్, ఫారెన్ ఎఫైర్స్ తీసుకున్న ఈ నిర్ణయంతో మన దేశంతో పాటు పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక తదితర దేశాల వలస కార్మీకులకు ఎంతో మేలు కలుగనుంది. యూఏఈలోని దుబాయ్, అబుదాబి, షార్జా తదితర ప్రాంతాల్లోని వాణిజ్య సంస్థలు, కంపెనీల్లో పనిచేస్తున్న వారు గతంలో సెలవులపై సొంతూళ్లకు చేరుకున్నారు. -
గడువు పొడిగిస్తున్నా స్పందన కరువు
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : రేషన్ డీలర్ల సమ్మె నేపథ్యంలో గ్రామాల్లో పేదలకు ప్రజాపంపిణీ సరుకులు పంపిణీ చేయడం అధికారులకు తలకు మించిన భారంగా మారింది. గడువు పొడిగిస్తున్నా రేషన్ డీలర్లు డీడీలు కట్టేందుకు ముందుకు రాకపోవడంతో ఈ నెలలో ఇబ్బందులు తప్పేలా లేవు. డీలర్లు సమ్మె ఆలోచన విరమించి డీడీలు కట్టాలని పలు పర్యాయాలు కోరినా, గడువు పొడిగించినా ఫలితం లేకపోవడంతో ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లే దిక్కుగా మారాయి. పేదలకు అసౌకర్యం కలుగకుండా చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు సఫలీకృమవుతాయోననే ఆందోళన అధికారులను వెంటాడుతోంది. నేటి నుంచి సమ్మె ప్రజాపంపిణీలో భాగమైన రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్లతో రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘాల పిలుపు మేరకు జూలై 1 నుండి రేషన్ డీలర్లు నిరవధిక సమ్మెకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం పలుమార్లు హెచ్చరికలు జారీ చేస్తూ గడువులు ఇస్తున్నా రేషన్ డీలర్లు మెట్టు దిగకపోవడం, ప్రజాపంపిణీ సరుకులకు డీడీలు చెల్లించకపోవడంతో ఐకేపీ సంఘాలను అప్రమత్తం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే ప్రజాపంపిణీపై శిక్షణ ఇవ్వడం, పంపిణీకి గ్రామాల్లో ప్రదేశాలను గుర్తించే పనిలో రెవెన్యూ అధికారులు గత మూడు రోజులుగా బిజీబిజీగా ఉన్నారు. ఐకేపీ సంఘాలకు ఆర్వోలు జారీ చేయాలని సంబంధిత తహసీల్దార్లకు జాయింట్ కలెక్టర్ వెంకట్రావు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం నుండి ఈ నెల 5వ తేదీ వరకు గ్రామాలకు సరుకులు చేరవేస్తామని తెలిపారు. అయితే ప్రజాపంపిణీ సరుకులను ఈ నెల ఈ–పాస్ ద్వారా కాకుండా మ్యాన్యువల్‌గానే పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ ప్రక్రియ అధికారులకు తలకు మించిన భారంగా మారుతోంది. ముందుగా నిర్దేశించిన ప్రకారం కాకుండా డీలర్లపై చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు డీడీలు చెల్లించేందుకు గడువు ఇస్తూ మీ–సేవా కేంద్రాల ద్వారా డీడీలు చెల్లించి ఆర్వోలు పొందేలా డీలర్లకు అవకాశం కల్పించింది. కాగా, జిల్లా వ్యాప్తంగా 804 రేషన్ షాపులకు గాను శనివారం సాయంత్రం వరకు 27 మంది డీలర్లు డీడీలు చెల్లించారు. కాగా, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు డీలర్లకు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయొద్దని జేసీ తహసీల్దార్లకు సూచించారు. మట్టి తిని బతకాలా? జడ్చర్ల: ‘ప్రజలు భోజనం చేసేలా బియ్యం అందజేసే చేతులకే అన్నం కరువైతే ఎలా.. తాము మట్టి తిని బతకాలా.. ఇదేనా బంగారు తెలంగాణ?’ అంటూ రేషన్ డీలర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో సమ్మె నోటీసు ఇవ్వగా.. పరిష్కరించాల్సింది పోయి షోకాజ్ నోటీసులు, సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ శనివారం జడ్చర్ల రేషన్ డీలర్లు తహసీల్దార్ కార్యాలయం ఎదుట వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ప్లేట్లలో మట్టి పోసుకుని భోజనం చేస్తున్న మాదిరిగా కూర్చున్నారు. న్యాయమైన సమస్యలు పరిశ్కరించాలని కోరితే సస్పెండ్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకం కూలీలకు రోజుకు రూ.250 పైగా ఇస్తున్నారని.. అంతకంటే అధ్వానంగా తమ పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆత్మహత్యలే శరణ్యమని డీలర్లు వాపోయారు. కార్యక్రమంలో రేషన్ డీలర్ల సమస్యల సాధన సమితి అధ్యక్షులు పాలాది రమేశ్, బాధ్యులు కొంగలి నాగరాజు, శ్రీనువాసులు, కృష్ణయ్య, నగేశ్, చెన్నయ్య ,తుంగ రఘు, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. ఇక డీలర్ల ఆందోళనకు కాంగ్రెస్ నాయకులు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాలిక్ షాకీర్, పరమటయ్య, ఎంపీటీసీ సభ్యులు బాలవర్దన్‌గౌడ్ తదితరులు మద్దతు తెలిపిన వారిలో ఉన్నారు. -
నుమాయిష్ ఎగ్జిబిషన్ గడువు పొడిగింపు
హైదరాబాద్ సిటీ : నెల రోజులుగా నగర వాసులకు ఆనందాన్ని, అహ్లాదాన్ని పంచిన నుమాయిష్ ఎగ్జిబిషన్‌ను మరో వారం రోజుల పాటు పొడిగించారు. ఈ మేరకు మేనేజింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. స్టాల్ హోల్డర్ల విజ్ఞప్తి మేరకు ఎగ్జిబీషన్‌ను పోడిగిస్తున్నట్లు ఎగ్జిబిషన్ గౌరవ కార్యదర్శి పి.నరోథామ్ రెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ నిర్ణయం ప్రకారం పిబ్రవరి 15న ముగియాల్సిన ఎగ్జిబిషన్ మరో వారం పాటు అంటే ఈ నెల 22 వరకు కొనసాగనుంది. నుమాయిష్ అబిడ్స్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే.