breaking news
Tiger Kcr Movie
-
వారికి వ్యతిరేకంగానే ‘టైగర్ కేసీఆర్’ : ఆర్జీవీ
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే రామ్‌గోపాల్ వర్మ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఓ చిత్రాన్ని తీయబోతోన్నట్లు ప్రకటించాడు. టైటిల్‌ను ఫిక్స్ చేయడమే.. కాకుండా ఓ సాంగ్‌ను పాడుతూ వీడియో కూడా విడుదల చేశారు. అయితే ఈ పాటపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఆంధ్రోడా అంటూ కాస్త పరుష పదాలను వాడుతూ రిలీజ్ చేసిన ఈ పాటపై ఆర్జీవీ వివరణ ఇచ్చుకున్నాడు. తాను తీయబోయే సినిమా ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా ఉండదని, తెలంగాణ ప్రజలను అవమానపరిచిన కొంతమంది ఆంధ్ర నాయకులకు వ్యతిరేకంగా మాత్రమే ‘టైగర్ కేసీఆర్’ ఉంటుందని తెలిపారు. తెలుగు ప్రజలందర్నీ కేసీఆర్ ప్రేమించారని, ఆయన యుద్దం తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఆంధ్ర నాయకుల మీదేనని అన్నారు. ఈ మేరకు ఆర్జీవీ ట్వీట్ చేశారు. The film #TIGERKCR is not going to be against Andhra People .It will be against only a few Andhra leaders who created humiliating situations for Telangana people KCR loved all telugu people and his war was only with those Andhra Leaders who were back stabbing Telangana people pic.twitter.com/gdjXzzpMm7 — Ram Gopal Varma (@RGVzoomin) 22 April 2019 -
‘నీ తాట తీయనీకి వస్తున్నా’
లక్ష్మీస్ ఎన్టీఆర్ సక్సెస్‌తో తిరిగి ఫాంలోకి వచ్చిన రామ్ గోపాల్ వర్మ మరో బయోపిక్ తెరకెక్కిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బయోపిక్‌ను రూపొందిస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించాడు వర్మ. ఈ సినిమాను టైగర్ కేసీఆర్ పేరుతో తెరకెక్కిస్తున్నట్టుగా వెల్లడించాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా కేసీఆర్ బయోపిక్ ‘టైగర్ కేసీఆర్’ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు వర్మ. అంతేకాదు వర్మ స్వయంగా సినిమాకు సంబంధించిన పాటను ఆలపిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఈ వీడియోతో తనదైన స్టైల్లో వివాదాలకు తెరతీశాడు వర్మ. ఈ సినిమాలో ఏ ఏ పాత్రలు కనిపించబోతున్నాయో కూడా వెల్లడించారు. కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా ఉన్న సమయంలో రాష్ట్రరాజకీయాల్లోని కీలక వ్యక్తులంతా ఈ బయోపిక్‌లో కనిపించనున్నారు. కేసీఆర్ తనయుడు తారకరామారావు (కేటీఆర్), కూతురు కవిత, హరీష్ రావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు, లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, రామోజీ రావులతో పాటు నారా లోకేష్ పాత్ర కూడా ఈ సినిమాలో ఉంటుందని ప్రకటించాడు వర్మ. On the eve of Andhra Pradesh Chief Minister @ncbn ‘s birthday , I am releasing this first look of Telangana Chief Minister KCR ‘s biopic #TIGERKCR pic.twitter.com/0uvX5f49KT — Ram Gopal Varma (@RGVzoomin) 20 April 2019