breaking news
thimmareddy
-
కార్మికుడిపై దుండగుల దాడి
హిందూపురం అర్బన్ : హిందూపురం రైల్వే రోడ్డులోని పల్లా లాడ్జి వద్ద ఎం.బీరేపల్లికి చెందిన తిమ్మారెడ్డిపై ఇద్దరు దుండగులు శనివారం కత్తితో దాడి చేశారని స్థానికులు తెలిపారు. సూపర్ మిల్లు.బిలో కార్మికుడిగా పని చేసే అతను సెలవు తీసుకుని హిందూపురం వచ్చాడు. రైల్వేరోడ్డులో బైక్ స్టార్ట్ చేస్తుండగా ఇద్దరు అపరిచితులు వచ్చి కత్తితో అతని గొంతుపై దాడి చేశారు. దీంతో గడ్డం, చెవికి గాయాలయ్యాయి. బాధితుడు కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారని స్థానికులు వివరించారు. అతన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
తిమ్మారెడ్డిగూడెం(మునగాల) : విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందాడు. ఈ ఘటన మునగాల మండలం తిమ్మారెడ్డిగూడెంలో మంగళవారం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బారెడ్డి వెంకట్‌రెడ్డి(45) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మధ్యాహ్నం తన పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. విద్యుత్ సరఫరా ఉన్నప్పటీకీ మోటారు నడవక పోవడంతో సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి చూడగా ఎల్టీ లైన్ తెగి పడి ఉండడాన్ని గమనించాడు. తెగిన విద్యుత్ వైరును అమర్చేందుకు పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ను ఆపేందుకు ప్రయిత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాన్స్ఫార్మర్ పైన ఉన్న హెవీలైన్‌ను నుంచి విద్యుత్ సరఫరా కావడంతో వెంకట్‌రెడ్డి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెం దాడు. ఈ లోగా పక్కనే ఉన్న ఇద్దరు రైతులు వచ్చి వెంకట్‌రెడ్డిని కిందకు దించారు. ఎల్‌టీలైన్‌కు ఆనుకొని హెవీలైన్ ఉండడం మూలంగానే ఈ ప్రమాదం సంభవించిందని రైతులు తెలిపారు. మృతుడికి భార్య కుమారుడు, కుమార్తె ఉన్నారు. గ్రామ రెవెన్యూ అధికారి వారణాసి ఉషారాణి ఫిర్యాదు మేరకు మునగాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బంపర్ ఆఫర్..!
డోన్ : అర్టీసీ అధికారులు.. వ్యాపారులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఏకంగా మూడేళ్ల పాటు ఎలాంటి అద్దెలు లేకుండా ప్యాపిలి బస్టాండ్‌లో దుకాణాలను కేటాయించారు. ఇదే అదునుగా చేసుకొని మరి కొందరు అనుమతి లేకుండా ఇక్కడ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. ఫలితంగా ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. మూడేళ్లుగా సుమారు రూ.5 లక్షల వరకు ఆర్టీసీ నష్టపోయినట్లు తెలుస్తోంది. ప్యాపిలి బస్టాండులో 15 దుకాణాలు ఉన్నాయి. ఇందులో బస్టాండ్‌లో ఉన్న రెండు దుకాణాలతోపాటు 14, 12, 10వ నంబర్ల షాపులు అద్దెలు చెల్లిస్తున్నాయి. ఇక మిగిలిన తొమ్మిది దుకాణాలు బస్టాండుకు ఎదురుగా ఏర్పాటు చేశారు. ఇవి రోడ్డు ముఖానికి ఉన్నాయని, వ్యాపారాలు జరగడం లేదని తాము అద్దెలు చెల్లించలేమని వ్యాపారులు చెప్పడంతో ఆర్టీసీ అధికారులు గుడ్డిగా తల ఊపారు. అనధికార షాపులకు అధికారుల అండ: టెండర్లలో షాపులు దక్కించుకున్న వారిలో ప్యాపిలికి చెందిన వెంకటేశ్వర్లకు 0.65 సెంట్ల స్థలాన్ని కేటాయిస్తూ 18.07.2013న ఆదేశాలుజారీ చేశారు. అదే విధంగా వెంకటరమణకు, తిమ్మారెడ్డి అనే వ్యక్తికి కూడా దుకాణాలు కేటాయించారు. వీరు తమ సొంత ఆదాయం కోసం కేటాయించిన స్థలంలోనే మరిన్ని షాపులను నిర్మించి సబ్‌లీజుదారులకు ఇచ్చారు. నిబంధనలకు మేరకు సబ్‌లీజ్ ఇవ్వడం సరికాదంటూ కొందరు ఫిర్యాదు చేయడంతో 02.06.14వ తేదీన లెసైన్సు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా వెంకటరమణ, తిమ్మారెడ్డికి చెందిన షాపులను కూడా రద్దు చేశారు. దీంతో తమకు అన్యాయం జరిగిందని ఆయా దుకాణదారులు కోర్టును ఆశ్రయించడంతో వాటినన్నంటినీ సీజ్ చేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ అనధికార షాపులను నడుపుతున్నారు. వీటి నిర్వాహకులకు డోన్ ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి అండ ఉన్నట్లు తెలుస్తోంది. సదరు ఉద్యోగి తన భార్యను పోస్టల్ ఆర్డీ ఏజెంటుగా నియమించుకొని.. వ్యాపారుల వద్ద నుంచి వేలకువేల రూపాయలు డిపాజిట్ల రూపంలో వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఉద్యోగి ప్యాపిలి బస్టాండులో బినామీ పేరుతో ఒక దుకాణాన్ని దక్కించుకొని సబ్లీజుకు ఇచ్చాడు. ఆ దుకాణం లెసైన్సు రద్దు అయినప్పటికీ నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై స్థానిక డిపో మేనేజర్ జయచంద్రను సంప్రదించేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు.