breaking news
Telugu Talli Statue
-
HYD: తెలుగుతల్లి, పొట్టిశ్రీరాములు విగ్రహల తొలగింపు
సాక్షి, హైదరాబాద్: నగరంలో తెలుగుతల్లి, పొట్టిశ్రీరాములు విగ్రహల తొలగింపు వివాదాస్పదంగా మారింది. నూతన సచివాలయం ముందున్న విగ్రహాలను అధికారులు తొలగించడంతో వివాదం చోటుచేసుకుంది. కాగా, కొత్త సచివాలయం ఏర్పాటు సందర్భంగా రోడ్డు వెడెల్పులో భాగంగా విగ్రహాలను తొలగించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా, తెలుగుతల్లి, పొట్టిశ్రీరాములు విగ్రహల తొలగించడంపై పలువురు భాషాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, అధికారులు విగ్రహాలను మరోచోట ప్రతిష్టిస్తామని చెప్పారు. అయితే, విగ్రహాలను ఎక్కడ పెడతారనే దానిపై మాత్రం అధికారులు క్లారిటీ ఇవ్వలేదు. -
తెలుగుతల్లి విగ్రహం ఎదుట ఎన్జీవోల నిరసన
శ్రీనగర్, న్యూస్‌లైన్: రాష్ట్ర సమైక్యంగా ఉంటుందని కేంద్రం ప్రకటించే వరకూ సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిరసనలు తెలుపుతామని ఏపీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు టి.వి.రామిరెడ్డి చెప్పారు. శనివారం సాయంత్రం 6 గంటలకు కలెక్టరేట్ ఆవరణలోని తెలుగుతల్లి విగ్రహం ఎదుట సమైక్య నినాదాలుచేసి నిరసనలు తెలిపారు. అనంతరం కలెక్టరేట్ నుంచి హిందూ కళాశాల కూడలి మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఏపీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి పి.ప్రభాకర్, జిల్లా జాయింట్ సెక్రటరీలు షేక్ బాజిత్, దరియావలి, నగర అధ్యక్షుడు దయానందరాజు, కార్యదర్శి సుకుమార్, వివిధ శాఖల ఉద్యోగ నాయకులు ప్రసాద్లింగం, మూర్తి, మస్తాన్, వెంకటరెడ్డి, అనిల్, ఫణీంద్ర, విజయ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.