breaking news
sun temple
-
తవ్వకాల్లో బయటపడ్డ 4500 ఏళ్ల నాటి సూర్యదేవాలయం.. ఎక్కడంటే?
సుమారు 4500 ఏళ్ల క్రితం నాటి సూర్య దేవాలయాన్ని బయట పడింది. ఈ విషయన్ని ఈజిప్ట్ పురావస్తుశాఖ అధికారులు ధృవీకరించారు. 4,500 సంవత్సరాల క్రితం 25వ శతాబ్దం బీసీఈ మధ్యకాలం నాటి పురాతన సూర్య దేవాలయమని అధికారులు విశ్వసిస్తున్నారు. కాగా ఈజిప్ట్‌ను ఒకప్పుడు ఫారోహ్ అనే రాజులు పాలించేవారు. వాళ్ల హయాంలోనే ఈజిప్ట్‌లో మొత్తం ఆరు దేవాలయాలను నిర్మించారు. దీనిపై పురావస్తుశాఖ అధికారి మాట్లాడుతూ.. కనిపించకుండా పోయిన ఆరు ఫారో సూర్య దేవాలయంలో ఇది ఒకటని, తాము తవ్వి తీస్తున్నామని చెప్పడానికి బలమైన రుజువు తమకు దొరికిందని పేర్కొన్నారు. నివేదిక ప్రకారం, అబూ ఘురాబ్‌లోని మరొక ఆలయంలో ఖననం చేయబడిన అవశేషాలను ఆ బృందం కనుగొంది. పురావస్తుశాఖ అధికారులు జరిపిన పరిశోధనలో ఇది మూడవ సూర్య దేవాలయమని, గత 50 సంవత్సరాలలో ఇదే మొదటిదని తెలిపారు. ఫారోలు సజీవంగా ఉన్నప్పుడే ఆరు సూర్య దేవాలయాలను నిర్మించారని, ఇప్పటి వరకు ఆరు దేవాలయాలలో రెండు మాత్రమే కనుగొన్నారు. సూర్య దేవాలయం అవశేషాల క్రింద త్రవ్వినప్పుడు మట్టి ఇటుకలతో చేసిన పాత స్థావరంతో పాటు మరొక భవనం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 1898 లో ఒకసారి సూర్యదేవాలయాన్ని అధికారులు కనిపెట్టగా.. తాజాగా రెండో సూర్యదేవాలయాన్ని గుర్తించారు. చదవండి: నిప్పుతో చెలగాటలొద్దు! బైడెన్‌కు వార్నింగ్ ఇచ్చిన జిన్‌పింగ్.. -
అది సూర్యుడు సూర్యుడిని పలకరించే రోజు..
మార్చి 21... సూర్యుడు సూర్యుడిని పలకరించే రోజు. సెప్టెంబర్ 21... సూర్యుడు సూర్యుడిని పలకరించే మరో రోజు. సూర్య కిరణాలు సూర్యుడి విగ్రహాన్ని తాకే రోజులివి. మొధేరా సూర్యదేవాలయం విశిష్టత ఇది. సూర్యదేవాలయంలోని సూర్యుడు... ఉదయించే సూర్యుడిని చూడడానికా ఉన్నట్లు తూర్పు దిక్కును చూస్తూ ఉంటాడు. ఆలయానికి ఎదురుగా విశాలమైన ఒక దిగుడు బావి. అది పేరుకే బావి, చెరువంత ఉంటుంది. ఆ బావి మెట్ల మీద నూట ఎనిమిది చిన్న చిన్న దేవాలయాలు, అందులో విగ్రహాలుంటాయి. ఉదయించే సూర్యుడి ప్రతిబింబం ఈ బావిలో నుంచి పైకి వస్తున్నట్లు భ్రమను కల్పిస్తుంది. ఈ బావిలో తాబేళ్లు ఉండడంతో నీరు పరిశుభ్రంగా ఉంటుంది. సూర్యమండపంలో మొత్తం 52 స్తంభాలుంటాయి. ఇవి ఏడాదిలో 52 వారాలకు ప్రతీకలు. ఈ స్తంభాల మీద రామాయణ, మహాభారత, కృష్ణ లీలలను కళ్లకు కట్టే శిల్పాలున్నాయి. ఆ గ్రంథాలు చదవడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి శిల్పకారులు గ్రంథాలను గోడల మీదకు తెచ్చారు. ఈ విగ్రహాలను చూస్తే రాతిని చెక్కారా లేక మైనాన్ని కరిగించి మూసలో పోశారా అనిపిస్తుంది. గుజరాత్, మొధేరాలోని సూర్యదేవాలయంలో స్వయంగా వీక్షించి పరవశించాల్సిన శిల్పచాతుర్యం ఇది. ఊరంత ఆలయం మనకు బాగా తెలిసిన సూర్యదేవాలయం ఉత్తరాంధ్రలో ఉన్న అరసవెల్లిలో ఉంది. మరొకటి పేరులోనే సూర్యుడిని నింపుకున్న కోణార్క సూర్యదేవాలయం బంగాళాఖాతం తీరాన ఒడిషాలో ఉంది. వీటికి దీటుగా పశ్చిమాన అరేబియా సముద్రానికి సమీపంలో కూడా అంతకంటే గొప్ప నిర్మాణ కౌశలం ఉంది. అది మొధేరా సూర్యదేవాలయం. దేవాలయం అంటే ఊరిలో ఉండే ఒక ప్రదేశం. అయితే మొధేరా సూర్యదేవాలయం అలా కాదు. ఆలయమే ఒక ఊరంత ఉంటుంది. దీనిని పదకొండవ శతాబ్దంలో సోలంకి రాజవంశానికి చెందిన మొదటి భీమదేవుడు నిర్మించాడు. సోలంకి రాజులు సూర్యవంశీకులు. తమ వంశీకుడి గౌరవార్ధం చిరస్థాయిగా నిలిచిపోయే నిర్మాణం చేపట్టాలనే ఆకాంక్షతో ఈ దేవాలయాన్ని నిర్మించాడు భీమదేవుడు. ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి మహమ్మద్ గజనీ, అల్లావుద్దీన్ ఖిల్జీలు తీవ్రంగా ప్రయత్నించారు. వారి దాడిలో ధ్వంసమైన వాటిని పునరుద్ధరించి పూర్వ రూపం తీసుకురావడంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తీవ్రంగా శ్రమించింది. రేఖామార్గం కర్కాటక రేఖ మనదేశంలో ఈ పశ్చిమం నుంచి ఈ తూర్పు వరకు మొత్తం ఎనిమిది రాష్ట్రాలను పలకరిస్తూ సాగిపోతోంది. పశ్చిమాన గుజరాత్‌తో మొదలై రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల మీదుగా కర్కాటక రేఖ వెళ్తుంది. గుజరాత్‌లోని మొధేరా సూర్యదేవాలయం కర్కాటక రేఖ ప్రయాణమార్గంలో నిర్మించారు. సూర్యయానం ఇలా సూరుడు ఏడాదిలో ఒకసారి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి, అలాగే ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం లోకి మారుతుంటాడు. సంక్రాంతి రోజు మకర సంక్రమణంతో ఉత్తరాయణం మొదలవుతుంది. తొలి ఏకాదశి రోజు నుంచి దక్షిణాయనం మొదలవుతుంది. ఈ ప్రయాణంలో సూర్యుడు కచ్చితంగా తూర్పు దిక్కున ఉండేది ఏడాదిలో రెండు రోజులు మాత్రమే. ఆ రెండు రోజుల్లో ఒకటి మార్చి 21, మరొకటి సెప్టెంబరు 21. ఆ రోజుల్లో సూర్యుడి కిరణాల ప్రసారదిశకు అనుగుణంగా ఆలయాలను నిర్మించారు. ఇది మాటల్లో వివరించడానికి సాధ్యం కానంత గొప్ప ఖగోళ పరిజ్ఞానం. ఎంత పెద్ద భూకంపం వచ్చినా సరే ఇక్కడ నేల కంపనానికి గురి కాదు. రిక్టర్ స్కేలు మీద సాధారణ స్థాయులు దాటి తీవ్రత పెరిగినప్పటికీ ఇక్కడ భూమి అతి స్వల్పంగా కొద్దిపాటి ప్రకంపనలకు మాత్రమే గురవుతుంది. నేల కుంగిపోవడం, కట్టడాలు నేల కూలడం వంటి విలయాలుండవు. ఆ పేరు ఇలా వచ్చింది! రాముడు మొధేరాలో యజ్ఞం చేశాడని స్కంద పురాణం చెబుతోంది. రామరావణ యుద్ధం ముగిసింది. రాముడు పరివారంతోపాటు అయోధ్యకు ప్రయాణమయ్యాడు. రామదండు విజయోత్సాహంతో గెంతులు వేస్తోంది. కానీ రాముడికి మనసు మనసులో లేదు. ‘ఇది నిజంగా విజయమేనా’ అనే సందేహం బాధించసాగింది. రావణుడు పరమ నిష్ఠాగరిష్టుడైన బ్రాహ్మణోత్తముడు. అలాంటి రావణుడిని సంహరించడం ధర్మమేనా అనే శంకను వశిష్ఠునితో చెప్పాడు. ఆ పాప నివారణ కోసం ఒక యజ్ఞం చేయమని సూచించాడు వశిష్ఠుడు. ధర్మారణ్యంలో ఒక ప్రదేశాన్ని ఎంచుకుని యజ్ఞం చేశాడు. యజ్ఞ నిర్వహణ కోసం ఆ ప్రదేశంలో చిన్న గ్రామం వెలిసింది. ఆ గ్రామానికి సీతాపూర్ అని పేరు పెట్టాడు రాముడు. ఆ గ్రామంలో రాముడు చేసిన యజ్ఞంలో పాలుపంచుకున్న మో«ద్ బ్రాహ్మణులు స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. తర్వాత ఆ ఊరికి మొధేరా అనే పేరు స్థిరపడింది. -
ఆదిత్యుని పాదాలను ‘తాకని’ సూర్యకిరణాలు
అరసవల్లి (శ్రీకాకుళం జిల్లా): అరసవల్లి సూర్యదేవాలయంలో గురువారం ఉదయం సూర్యకిరణాలు ఆదిత్యుని పాదాలను తాకలేదు. ప్రతి యేటా మార్చి 8,9,10 తేదీలలో సూర్యోదయంలో కనిపించే సూర్యకిరణ దర్శనం బుధ,గురువారాల్లో మేఘాల కారణంగా సాధ్యపడలేదు. సూర్య కిరణాలు ఆదిత్యుడి పాదాలను తాకే తరుణాన్ని వీక్షిద్దామని వచ్చిన భక్తులకు నిరాశ ఎదురైంది. పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్న భక్తులంతా నిరాశతో వెనుదిరిగారు.ఈ ఆలయం లో సూర్యని కిరణాలు నేరుగా సూర్యదేవుని అరుణశిల విగ్రహం పై పడి దేవదేవుడు బంగారు వర్ణంలో మెరిసిపోతాడు. ప్రతి ఏటా మార్చి నెలలో మూడు రోజులు, అక్టోబరు నెలలో మూడు రోజులు ఇలా కిరణాలు దేవుని విగ్రహాన్ని తాకుతాయి. ఈ సమయంలో దేవుని దర్శనం చేసుకుంటే ఆరోగ్యప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. రేపు కిరణాలు పడే అవకాశం ఉండటంతో ఇతరప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఆదిత్యుని దర్శనం కోసం నిరీక్షించనున్నారు. -
కటార్మల్ సూర్య దేవాలయం
సందర్శనీయం మన దేశంలో సూర్య దేవాలయాలు చాలా అరుదు. వాటిలో కూడా కొద్ది ఆలయాల గురించి మాత్రమే అందరికీ తెలుసు. తెలియని వాటిలో ఉత్తరాఖండ్‌లోని ఆల్మోరా జిల్లా మారుమూల గ్రామమైన కటార్మల్లో ఉన్న పురాతన సూర్య దేవాలయం ఒకటి. సముద్ర మట్టానికి ఏకంగా 2,116 మీటర్ల ఎత్తులో వెలసిన ఆలయం ఇది. అల్మోరాకు 12 కిలోమీటర్ల దూరంలో, ప్రఖ్యాత పర్యాటక కేంద్రం నైనితాల్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. కటారమల్లుడనే రాజు ఈ ఆలయాన్ని క్రీస్తుశకం తొమ్మిదో శతాబ్దిలో నిర్మించాడు. ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల ఆలయం, లక్ష్మీనారాయణుల ఆలయం సహా 44 చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలోని ఒక పురాతన విగ్రహం చోరీకి గురి కావడంతో ఆలయానికి గల కలప ద్వారబంధాలు, ఇతర ముఖ్యమైన నిర్మాణాలను, శిల్పాలను ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంకు తరలించారు. -
వైఎస్ జగన్ సూర్య దేవుని సందర్శన
శ్రీకాకుళం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని సందర్శించారు. ఆయన ఈరోజు కూడా శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉత్తరాంధ్ర తుపాను బాధిత ప్రాంతాల్లో 8 రోజుల నుంచి ఆయన పర్యటిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని బాధితులను ఆయన పరామర్శించారు. **