breaking news
suicide in India
-
అయ్యో అమైరా..! వినిపించని చిట్టితల్లి ఆర్తనాదం
తోటి విద్యార్థుల వేధింపుల మధ్య ఓ చిన్నారి చేసిన పోరాటం.. చివరకు విషాదంగా ముగిసిన ఘటన ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. సహాయం కోసం ఆమె చేసిన ప్రయత్నం.. తన బాధను ఎవరికైనా చెప్పుకోవాలన్న ఆరాటం.. టీచర్లు సైతం పట్టించుకోలేదనే చిట్టితల్లి అసహనం.. తాజాగా వెలుగులోకి వచ్చిన సీసీటీవీ దృశ్యాలతో మరోసారి తెరపైకి వచ్చాయి. చిన్నారి అమైరా చివరి క్షణాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.రాజస్థాన్‌లోని జైపూర్‌లో గత ఏడాది సంచలనం సృష్టించిన తొమ్మిదేళ్ల అమైరా మీనా మృతి కేసు తాజాగా విడుదలైన తరగతి గది సీసీటీవీ వీడియోతో మరోసారి వార్తల్లోకి వచ్చింది. చిన్నారి తల్లిదండ్రులు విడుదల చేసిన ఈ దృశ్యాల్లో.. అమైరా ఆందోళనకు గురైనట్లు, పలుమార్లు క్లాస్ టీచర్‌ను ఆశ్రయించే ప్రయత్నం చేసినట్లు స్పష్టంగా కనిపించింది.వీడియోలో కనిపించిన ఆ రోజు దృశ్యాలు2025 నవంబర్ 1న జైపూర్‌లోని నీర్జా మోడీ స్కూల్లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. నాలుగో తరగతి చదువుతున్న అమైరా పాఠశాల నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి ప్రాణాలు కోల్పోయింది. ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అప్పటి నుంచే అమైరా తల్లిదండ్రులు.. తమ కుమార్తె వేధింపులకు గురైందని, పాఠశాల నుంచి తగిన స్పందన లభించలేదని ఆరోపిస్తూ న్యాయం కోసం పోరాడుతున్నారు.సీసీటీవీలో కనిపించిన ఆ క్షణాలుతాజాగా బయటకు వచ్చిన వీడియోలో అమైరా మొదట సాధారణంగానే తరగతి గదిలో ఉన్నట్లు కనిపిస్తోంది. సహ విద్యార్థులతో మాట్లాడుతున్న చిన్నారి.. కొంతసేపటి తర్వాత అసౌకర్యంగా, ఆందోళనగా కనిపించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కొంతమంది విద్యార్థులు ఆమెకు ఓ డిజిటల్ స్లేట్ చూపించిన తర్వాత అమైరా ప్రవర్తనలో మార్పు కనిపించిందని వారు పేర్కొన్నారు. అనంతరం ఆమె క్లాస్ టీచర్ వద్దకు వెళ్లి తన సమస్యను వివరించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు.చేతులు జోడించడం, ఆందోళనగా కనిపించడం, ఏడుపును ఆపుకునే ప్రయత్నం చేయడం వంటి దృశ్యాలు వీడియోలో ఉన్నాయని, అవి ఆమె ఎదుర్కొన్న మానసిక ఒత్తిడిని తెలియజేస్తున్నాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.On Nov 1, 2025, Amaira, a Class 4 student, died by suicide after jumping from the fourth floor of the Neerja Modi School in Jaipur.She had been bullied for 18 months, with classmates targeting her using "bad words," many of which carried sexual undertones. However, her class… pic.twitter.com/iiS4J6UFwm— THE SKIN DOCTOR (@theskindoctor13) July 9, 2026సహాయం కోరింది.. స్పందన రాలేదా?అమైరా తల్లి శివానీ మీనా మాట్లాడుతూ.. తమ కుమార్తె పలుమార్లు సహాయం కోసం ప్రయత్నించినా సరైన స్పందన రాలేదని ఆరోపించారు. “ఓ తొమ్మిదేళ్ల చిన్నారి తన బాధను చెప్పుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఆమెకు అండగా ఎవరూ నిలబడలేదు. తరగతి గది నుంచి నాలుగో అంతస్తు వరకు వెళ్లేంతవరకు ఎవరూ గమనించకపోవడం ఎలా?” అని ఆమె ప్రశ్నించారు. పాఠశాలలో భద్రతా లోపాలు ఉన్నాయని, వేధింపులపై ఫిర్యాదులు చేసినా తగిన చర్యలు తీసుకోలేదని కుటుంబం ఆరోపిస్తోంది.మరీ ఇంత నిర్లక్ష్యమా?ఈ ఘటనపై నిర్వహించిన తనిఖీల్లో పాఠశాలలో కొన్ని భద్రతా లోపాలు గుర్తించినట్లు సమాచారం. సీసీటీవీ పర్యవేక్షణ, భద్రతా కమిటీ ఏర్పాటు, పై అంతస్తుల్లో రక్షణ ఏర్పాట్లపై అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అమైరా చాలా కాలంగా వేధింపులకు గురవుతోందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పటికీ.. వాటిపై తగిన స్పందన లేదన్న ఆరోపణలు కూడా తెరపైకి వచ్చాయి.కన్నీటి ప్రశ్నతాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోతో అమైరా కేసులో న్యాయం కోసం కుటుంబం చేస్తున్న పోరాటం మరింత బలపడింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అమైరా ఘటన మరోసారి పాఠశాలల్లో విద్యార్థుల భద్రత, బుల్లీయింగ్ నియంత్రణ వ్యవస్థలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. అమైరా ఎదుర్కొన్న బాధను సకాలంలో ఎవరైనా గుర్తించి ఉంటే.. ఈ విషాదం జరిగేదా? అన్న ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
ఇల్లు ఊడ్చా.. అంట్లు తోమా.. అయినా కొట్టేవారు!
ప్రేమించాడు.. పెళ్లి చేసుకున్నాడు. భార్య చెప్పిందని తల్లిదండ్రుల్ని వదిలేసి.. వేరు కాపురం పెట్టాడు. అత్తింటి వారినే తన సొంత తల్లిదండ్రులుగా భావించాడు. వాళ్లు చెప్పిన ప్రతి మాటను కాదనకుండా పాటించాడు. ఆ కుటుంబం కోసం తనను తాను మార్చుకున్నాడు. కానీ చివరికి అతని జీవితమే విషాదాంతమైంది. మరణానికి ముందు విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. అసలేం జరిగిందంటే..దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అతుల్ సుభాష్ కేసు గుర్తుందా?. మరణానికి ముందు ఆయన విడుదల చేసిన దాదాపు 81 నిమిషాల వీడియో, 24 పేజీల సూసైడ్ నోట్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. భార్య, అత్తింటి వేధింపుల ఆరోపణలతో ఆ వీడియోలో చేసిన వ్యాఖ్యలు, ఆయన రాసిన లేఖలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీశాయి. సరిగ్గా అలాంటి ఘటనే ఇది కూడా. భార్య, అత్తింటి వాళ్ల వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడ్డ మరో భర్త దీనగాథే ఇది.హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన 28 ఏళ్ల వ్యాపారి రాహుల్.. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే తన దుకాణంలో ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్యతో పాటు అత్తింటి కుటుంబ సభ్యుల వేధింపులే ఈ నిర్ణయానికి కారణమని వీడియోలో ఆరోపించాడు.బల్లభ్‌గఢ్‌లో నివసించే రాహుల్‌కు రెండేళ్ల క్రితం జ్యోతితో ప్రేమ వివాహం జరిగింది. పెళ్లి తర్వాత భార్య ఒత్తిడితో.. తల్లిదండ్రుల నుంచి దూరంగా వేరు కాపురం పెట్టాడు. ఆమె అమ్మానాన్నల బాగోగులు కూడా అతనే చూసుకుంటున్నాడు. అయితేవలే గార్మెంట్స్ షాపు ప్రారంభించిన రాహుల్ కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నాడని బంధువులు చెబుతున్నారు.మరణానికి ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన వీడియోలో భార్య జ్యోతి, అత్త వీణ, మామ బిట్టు, భార్య సోదరి నీతూ పేర్లను ప్రస్తావించిన రాహుల్.. దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించాడు. వాళ్ల కోసం తాను అడ్డమైన పనులు చేసేవాడినని చెప్పాడా భర్త. ఇల్లు ఊడ్చడం, తుడవడం, పాత్రలు తోమడం, బట్టలు ఉతకడం వంటి పనులన్నీ చేసేవాడినని.. అయినా వాళ్లు తనను శారీరకంగా, మానసికంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశాడు.ఆపై సొంతంగా వ్యాపారం పెట్టుకుంటే.. డబ్బు కోసం, అందులో భాగస్వామ్యం కోసం వేధించడం మొదలుపెట్టారని చెప్పాడు. తప్పుడు కేసులతో ఇబ్బందులకు గురి చేశారని, తన మరణానికి వారే బాధ్యులని పేర్కొంటూ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరాడు. తన ఆస్తిని తల్లి, సోదరులు, సోదరికి ఇవ్వాలని కూడా వీడియోలో విజ్ఞప్తి చేశాడు.ఆదివారం ఉదయం ఇంటి నుంచి తన దుకాణానికి వెళ్లిన రాహుల్.. కొద్దిసేపటికే అక్కడ మృతిగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కొడుకు మృతదేహం చూసి రాహుల్ తల్లిదండ్రులు కంటతడి పెట్టిన తీరు పలువురిని కదిలించింది.Faridabad News: सेक्टर-3 फरीदाबाद में राहुल की मौत के बाद मर्चरी के बाहर पिता का दर्द छलक पड़ा। परिजनों ने निष्पक्ष जांच और न्याय की मांग की। पुलिस पूरे मामले की जांच में जुटी है।#FaridabadNews #BreakingNews #HaryanaNews #CrimeNews #ViralNews #HindiNews #HindustanTehelka pic.twitter.com/XWn71XZ7FO— Hindustan Tehelka News (@htehelkanews) June 28, 2026అయితే వైరల్ అవుతున్న ఇన్స్టాగ్రామ్ వీడియోను పోలీసులు పరిశీలిస్తున్నారు. దర్యాప్తు జరపకుండా.. ఆ ఆరోపణలు నిజమని చెప్పలేమని అంటున్నారు. దర్యాప్తులో భాగంగా ఆ వీడియోను పరిశీలిస్తున్నామని, అన్ని కోణాల్లో విచారణ పూర్తయ్యాకే వాస్తవాలు వెల్లడిస్తామని తెలిపారు. మరోవైపు.. భర్త మృతి, కేసు గురించి స్పందించేందుకు జ్యోతి కుటుంబం మీడియాకు అందుబాటులో లేకపోవడం గమనార్హం.మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
చివరి క్షణాల్లో.. ‘అన్నీ సర్దేసి’ వెళ్లిపోతున్నారు!
ఆత్మహత్యకు ముందు ఆస్తుల పంపకం, అప్పుల వివరాలు, బ్యాంక్ ఖాతాల వివరాలు.. అంతెందుకు ఏటీఎం, ఫోన్‌పే పిన్ల సమాచారం.. డెత్‌నోట్‌లో రాసేసి మరీ వెళ్లిపోతున్న ఘటనలు ఇటీవల తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. ఆఖరికి అంత్యక్రియల ఖర్చులు కూడా కుటుంబమో, బంధువులకు భారం కాకూడదనే ఆలోచనతో చివరి క్షణాలకు ముందే అన్నీ ముందుగానే సర్దేసి వెళ్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈ తరహా కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి!. ఎందుకిలా?.. మానసిక నిపుణులు ఏమంటున్నారంటే..చిత్తూరు జిల్లాలోని బంగారెడ్డి పల్లి ప్రాంతంలో దాము అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. భార్య అనారోగ్యం కారణంగా కుటుంబం ఆర్థికంగా కుంగిపోయిన పరిస్థితుల్లో ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మరణానికి ముందు ఆయన ఆస్తులు, అప్పుల వివరాలతో పాటు ఏటీఎం పిన్ నెంబర్ వంటి వ్యక్తిగత ఆర్థిక సమాచారాన్ని కూడా డెత్‌నోట్‌లో నమోదు చేసినట్లు సమాచారం. దానిని టీవీ స్క్రీన్కు అంటించారాయన.ఇలాంటి ఘటన ఒక్కటే కాదు. ఇటీవల నెల్లూరు జిల్లాలో రిటైర్డ్ టీచర్ దంపతులు కొడుకుతో సహా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కూడా చర్చనీయాంశమైంది. తాము లేకుండా చెట్టంత కొడుకు బతకలేడనే ఉద్దేశంతో అతన్ని కూడా వాళ్లు తమ వెంట తీసుకెళ్లారు. కుటుంబానికి భారంగా మారకూడదనే ఆలోచనతో వారు అంత్యక్రియల ఖర్చుల కోసం ముందుగానే ఏర్పాట్లు చేయడం, కొంత ఆస్తిని దానం చేయడం, బ్యాంక్ లావాదేవీల వివరాలు సైతం రాసి పెట్టడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి.విజయవాడ సహా కొన్ని ఇతర ప్రాంతాల్లోనూ గతంలో ఇలాంటి కేసులు వెలుగులోకి వచ్చాయి. నార్త్ ఇండియాలోనూ ఈ తరహా ఘటనలు నమోదవుతుండటంతో ఇది ఒక “కొత్త ధోరణి”గా మారుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది.ఈ ఘటనల్లో ఒక సాధారణ మానసిక నమూనా కనిపిస్తోంది.. తాము లేకపోయినా కుటుంబం/తమకు మేలు చేసిన వాళ్లు ఇబ్బంది పడకూడదు అనే భావన. ఇదే ఆలోచనలో వ్యక్తులు తమ ఆర్థిక వ్యవహారాలను చివరి క్షణాల్లో పూర్తిగా క్రమబద్ధం చేసి వెళ్తున్నారు. ఇది బయటకు చూసేందుకు బాధ్యతగా కనిపించినా, నిపుణులు మాత్రం దీన్ని తీవ్రమైన మానసిక ఒత్తిడికి సంకేతంగా భావిస్తున్నారు.ఈ తరహా ధోరణిపై మానసిక నిపుణులు స్పందిస్తూ.. ఇలాంటి పరిస్థితులు సాధారణంగా దీర్ఘకాలిక నిరాశ (depression), తీవ్ర ఆందోళన (anxiety), “నిరాశాత్మక ఆలోచనా విధానం” (hopeless thinking pattern) వల్ల వస్తాయి. సమస్యలకు పరిష్కారం కనిపించకపోవడం, అప్పుల భారం, అనారోగ్యం, కుటుంబ బాధ్యతల ఒత్తిడి.. ఇవన్నీ కలిసి వ్యక్తిని “తప్పించుకోవడమే మార్గం” అనే భావన వైపు నెట్టేస్తాయని హెచ్చరిస్తున్నారు.ఇది ఒక రకమైన కాగ్నిటివ్ టన్నెల్ విజన్ అని నిపుణులు చెబుతున్నారు. అంటే వ్యక్తి తన సమస్యలకు ఒక్కటే పరిష్కారం కనిపించడం, ఇతర సహాయ మార్గాలు కనిపించకపోవడం. ఈ దశలో సహాయం కోరే అవకాశం ఉన్నా, దాన్ని ఉపయోగించలేని స్థితి ఏర్పడుతుందని వారు వివరిస్తున్నారు.నిపుణుల హెచ్చరిక ఏంటంటే.. ఆత్మహత్యకు ముందు ఇలా అన్ని ఏర్పాట్లు చేసి వెళ్లిపోవడం బయటకు బాధ్యతగా కనిపించినా, వాస్తవానికి అది తీవ్రమైన మానసిక సంక్షోభానికి చివరి సంకేతమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఈ దశలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, సమాజం త్వరగా స్పందించడం చాలా కీలకమని సూచిస్తున్నారు.ఆర్థిక సమస్యలు, అనారోగ్యం, జీవన ఒత్తిడులు ఏవైనా కావొచ్చు. కానీ, వాటికి పరిష్కారం జీవితం ముగించడం కాదు. “అన్నీ సర్దేసి వెళ్లిపోవడం” వెనుక కనిపించని మానసిక పోరాటం ఉంటుంది. ఆ సంకేతాలను ముందుగానే గుర్తించి సహాయం అందిస్తే అనేక ప్రాణాలను కాపాడవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
Hyderabad: మహానగరంలో మానసిక కల్లోలం!
సాక్షి, హైదరాబాద్ : ఇతర నగరాలతో పోలిస్తే భాగ్యనగరంలో చాలా మందిలో వయసులకు అతీతంగా ఆత్మహత్య ధోరణులు ఎక్కువగా ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. మానసిక ఆరోగ్యంలో వచ్చి న మార్పులపై ఇప్పటివరకు సుమారు 2,500 మంది నగరవాసుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ విషయం వెలుగులోకి వచ్చి నట్లు పేర్కొంది. అయితే సర్వే ఇంకా కొనసాగుతోందని... మరో నెల తర్వాత ఈ అంశంపై పూర్తిస్థాయిలో స్పష్టత రానుందని సర్వే బృందానికి నేతృత్వం వహిస్తున్న వారిలో ఒకరైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మెడికల్ సైన్సెస్ స్కూల్ ప్రొఫెసర్ బి.ఆర్.షమన్నా తెలిపారు. దేశంలో కోవిడ్ విజృంభణకు ముందు, తర్వాత అర్బన్ ప్రాంతాల ప్రజల మానసిక ఆరోగ్య పరిస్థితుల్లో అనూహ్య మార్పులు వచ్చి న నేపథ్యంలో కేంద్రం దేశవ్యాప్తంగా ఈ సర్వే నిర్వహిస్తోంది. నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే–పార్ట్ 2 పేరిట హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలలో ఈ అధ్యయనం చేపడుతోంది. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ అధ్యయనానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఎర్రగడ్డలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్‌లు ఇన్వెస్టిగేటర్లుగా వ్యవహరిస్తున్నాయి. అన్నింటినీ టచ్ చేస్తూ... సాధారణ సర్వేల రీతిలో ఇందులోనూ 75 ప్రశ్నలు ఉన్నప్పటికీ పరిస్థితినిబట్టి మార్పుచేర్పులకు అవకాశం ఇస్తూ మొత్తం 300 ప్రశ్నలు ఉన్నాయి. లాటరీ వ్యసనం, గుర్రపు పందేలు, స్ట్రీమింగ్ వీడియోలతోపాటు ఇంటర్నెట్, మొబైల్ వ్యసనం వంటి అంశాలపై ప్రశ్నలను కూడా చేర్చారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఎలాంటి మానసిక స్థితిని ఎదుర్కొన్నారు వంటి ప్రశ్నలు పొందుపరిచారు. కోవిడ్ తర్వాత ప్రజల మానసిక ఆరోగ్య భారాన్ని అర్థం చేసుకోవడానికి దోహదపడుతుందని పరిశోధకులు అంటున్నారు. బస్తీల్లో సై...కాలనీల్లో నై.. సర్వే కోసం నగరంలో 60 క్లస్టర్లను గుర్తించగా అందులో 20 మురికివాడల్లోనే ఉన్నాయి. మురికివాడల నివాసితులు అనేక వ్యసనాలతోపాటు ఇతర సమస్యలతో సతమతమవుతున్నా సర్వే ప్రశ్నలకు తక్షణమే సమాధానాలిస్తున్నారని బృంద సభ్యులు అంటున్నారు. అదే సమయంలో కాలనీల్లో నివసించే ప్రజల నుంచి సమాధానాలు పొందడం కఠినంగా ఉందని... తమ ప్రశ్నలకు చాలా మంది ఎదురుప్రశ్నలు వేస్తున్నారని వివరిస్తున్నారు. తమ కోసం సమయం వెచ్చి ంచడానికి తేలికగా ఒప్పుకోవడం లేదని చెబుతున్నారు. టీనేజర్ల నుంచి... సర్వే బృందాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3,600గా తీసుకున్న శాంపిల్ సైజ్‌లో టీనేజర్లు సహా ఆపై వయసుగల వారు ఉన్నారు. వారందరినీ ముఖాముఖి ప్రశ్నించి సమాధానాలు సేకరిస్తున్నారు. ఆ సమాచారాన్ని సర్వేకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (నిమ్హాన్స్)కు ఏ రోజుకారోజు అప్లోడ్ చేస్తున్నారు. ఈ సర్వే జూన్ నెలాఖరులోపే పూర్తవుతుందంటున్న పరిశోధకులు... నగరంలో రోహింగ్యాలు, ట్రాన్స్జెండర్ల వంటి వారిని కూడా ప్రత్యేక కేటగిరీగా చేర్చి సర్వే చేయవచ్చా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అన్ని చోట్లా పూర్తయ్యాకే స్పష్టత... అన్ని నగరాల్లో పూర్తి సర్వే ఫలితాలు వచ్చాకే స్పష్టత వస్తుంది.బెంగళూరు, ముంబైలలో అధ్యయనాలు పూర్తి కావచ్చాయి. చెన్నై, హైదరాబాద్‌లలో దాదాపుగా ఒకేస్థాయిలో ఉన్నాయి. ఢిల్లీ, కోల్‌కతాలలో సర్వేలు కాస్త నెమ్మదిగా సాగుతున్నాయి. ఆయా నగరాలకు చెందిన అధ్యయన ఫలితాలు కూడా వచ్చాక ‘నిమ్హాన్స్’వాటిని విశ్లేషించి మరో నెల రోజుల్లోపూర్తి వివరాలు వెల్లడిస్తుందని భావిస్తున్నాం. - ప్రొ. బి.ఆర్.షమన్నా మెడికల్ సైన్సెస్ స్కూల్, హెచ్‌సీయూ -
ఆత్మహత్యల్లో మహారాష్ట్ర టాప్
సాక్షి,న్యూఢిల్లీ: బలవన్మరణాల సంఖ్యపరంగా దేశవ్యాప్తంగా చూస్తే మహారాష్ట్రలో వీటి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. జాతీయ నేర గణాంకాల బ్యూరో తాజా నివేదికలో పలు విషయాలను ప్రస్తావించింది. 2021 ఏడాదిలో దేశవ్యాప్తంగా 1,64,033 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. వృత్తి సమస్యలు, ఒంటరితనం, హింస, కుటుంబ, మానసిక సమస్యలు, మద్యానికి బానిసకావడం, ఆర్థికంగా కుంగుబాటు, అనారోగ్యం ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణాలని నేర గణాంకాల బ్యూరో తెలిపింది. మహారాష్ట్రలో అత్యధికంగా 22,207 మంది, కర్ణాటకలో 13,056 మంది సూసైడ్ చేసుకున్నారు. దేశంలోని మొత్తం ఆత్మహత్యల్లో సగానికిపైగా సూసైడ్లు మహారాష్ట్ర తమిళనాడు, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, కర్ణాటకలోనే జరిగాయి. 53 నగరాల్లో మొత్తంగా 25వేలకుపైగా సూసైడ్ చేసుకున్నారు. 1.73 లక్షల యాక్సిడెంట్ మరణాలు గత ఏడాది దేశవ్యాప్తంగా జరిగిన 4.22 లక్షల ట్రాఫిక్ ప్రమాదాల్లో 1.73 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని జాతీయ నేర గణాంకాల బ్యూరో తెలిపింది. యూపీలో ఎక్కువ మరణాలు సంభవించాయి. 2020తో పోలిస్తే 2021లో మరణాలు 18.8 శాతం పెరగడం ఆందోళనకరం. చదవండి: గణపతి మండపానికి రూ. 316 కోట్ల బీమా -
24 వేల మంది బాలలు బలవన్మరణం
న్యూఢిల్లీ: దేశంలో 2017–19 సంవత్సరాల మధ్య 14–18 ఏళ్ల వయస్సున్న బాలలు 24 వేల మందికి పైగా బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇందులోని 4 వేల కేసులకు పరీక్షల్లో ఫెయిల్ కావడమే ప్రధాన కారణమని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. నేషనల్ క్రైం రికార్డ్స్బ్యూరో(ఎన్సీఆర్బీ) నివేదికను ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్‌కు సమర్పించింది. 2017–19 సంవత్సరాల మధ్య ఆత్మహత్యకు పాల్పడిన 24,568 మంది 14–18 ఏళ్ల గ్రూపులో 13,325 మంది బాలికలున్నట్లు ఆ డేటా పేర్కొంది. ఈ గ్రూపులో.. 2017లో 8,029 మంది, 2018లో 8,162 మంది చనిపోగా 2019 నాటికి వీరి సంఖ్య 8,377కు పెరిగింది. ఈ కాలంలో అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 3,115 మంది తనువు చాలించగా బెంగాల్లో 2,802 మంది, మహారాష్ట్రలో 2,527 మంది, తమిళనాడులో 2,035 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ప్రధానంగా పరీక్షల్లో ఫెయిలవ్వడం కారణంగా 4,046 మంది, వివాహ సంబంధ విషయాలతో 639 మంది చనిపోగా వీరిలో 411 మంది బాలికలున్నారు. ప్రేమ వైఫల్యంతో 3,315 మంది, అనారోగ్యంతో 2,567 మంది, భౌతిక దాడుల కారణంగా 81 మంది బాలలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవికాకుండా, ఆత్మీయులను కోల్పోవడం, మద్యం, డ్రగ్స్ వ్యసనం, అక్రమ గర్భం, మనస్తాపం, నిరుద్యోగం, పేదరికం వంటి కారణాలు కూడా ఉన్నట్లు ఆ డేటా వెల్లడించింది. -
మరో విషాదం : ప్రముఖ టీవీ నటుడు ఆత్మహత్య
సాక్షి, చెన్నై: తమిళ టెలివిజన్ పరిశ్రమ మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ టీవీ నటుడు ఇంద్ర కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. తమిళనాడులోని పెరంబలూర్‌లో ఆయన స్నేహితుని నివాసంలో ఉరివేసుకుని ఉసురు తీసుకున్నారు. వరుస ఆత్మహత్యలతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. (హీరో వీరాభిమాని ఆత్మహత్య : ఆఖరి కోరిక) చెన్నైలోని శ్రీలంక శరణార్థి శిబిరంలో నివాసం ఉంటున్న ఇంద్ర కుమార్ తమిళ డైలీ సీరియల్స్ ద్వారా ఫ్యామస్ అయ్యారు. అయితే గురువారం రాత్రి తన స్నేహితులతో కలిసి సినిమా చూసి వచ్చిన కొన్ని గంటల్లోనే కుమార్ విగతజీవిగా మారడంతో అతని స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయారు స్నేహితుల సమాచారం మేరకు కుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు పోలీసులు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అయితే అవకాశాలు రావడంలేదనే ఆందోళనతోనే ఇంద్ర కుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. మరోవైపు వివాహ జీవితంలో సమస్యలు, భార్యతో విభేదాలు కారణంగానే చనిపోయాడనే మరో వాదన కూడా వినిపిస్తోంది. కాగా కరోనా సంక్షోభ కాలంలో ఫిలిం ఇండస్ట్రీ కూడా కష్టాల్లో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో అవకాశాలు లేక చాలామంది నటీనటులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం ఆందోళన రేపుతోంది. ఈ వారంలో సినీ పరిశ్రమకు సంబంధించి ఇది రెండవ ఘటన. కేసరి, ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ వంటి సినిమాల్లో నటించిన బాలీవుడ్ నటుడు సందీప్ నహర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంతకుముందు ప్రముఖ నటి, వీజే చిత్ర ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. -
భర్తగా మారకు బ్యాచిలరు...
భద్రం బీకేర్ ఫుల్ బ్రదరు భర్తగా మారకు బ్యాచిలరు... అన్నాడో సినిమా కవి. పెళ్లేంటే నూరేళ్ల మంట అని కూడా అన్నారండోయ్. పెళ్లైన తర్వాత బాధ్యతలు పెరిగి స్వేచ్ఛ హరించుకుపోతుందనే ఉద్దేశంతో ఇలా ఆట పట్టిస్తుంటారు. గృహస్థు జీవితంలోకి అడుగుపెట్టగానే బాధ్యతలు పెరగడం సహజం. బాధ్యతల బరువు మోయలేక చాలా మంది నిరాశ, నిస్పృశలకు గురవుతున్నారు. సహనం కోల్పోయి చావును కొనితెచ్చుకుంటున్నారు. పెళ్లనే కాదు- ఉరుకుల పరుగుల జీవితంలో ఆధునిక మానవుడు ప్రతి దశలోనూ మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు. ఒక్కోసారి ఒత్తిడికి తలవంచి తనువు చాలిస్తున్నాడు. విచిత్రమైన విషయం ఏమిటంటే పెళ్లైన వాళ్లే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని జాతీయ నేర నమోదు సంస్థ(ఎన్సీఆర్బీ) వెల్లడించింది. 2013లో ఆత్మహత్యలు చేసుకున్న వారిలో 69.4 శాతం వివాహితులుండగా, 23.6 శాతం మంది అవివాహితులని ఎన్సీఆర్బీ తాజా నివేదిక తేటతెల్లం చేసింది. గతేడాది 1,34,799 మంది బలవన్మరణాలకు పాల్పడగా అందులో 64,098 మంది పురుషులు, 29,491 మంది మహిళలు ఉన్నారు. ఒంటరిగా ఉంటున్న వారిలో 21,062 మంది పురుషులు, 10,766 మంది స్ర్రీలు ప్రాణాలు తీసుకున్నారు. సామాజిక, ఆర్థికపరమైన సమస్యలే వివాహితుల ఆత్మహత్యలు పెరగడానికి కారణమంటున్నారు నిపుణులు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కరుమరుగు కావడం మరో కారణమంటున్నారు. భార్యాభర్తల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తినప్పుడు సర్దిచెప్పేందుకు చిన్న కుటుంబాల్లో పెద్దలుండరు. దీంతో క్షణికావేశంలో వివాహితులు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.


