breaking news
Subsidy is lifted
-
ఎలక్ట్రిక్ టూ–వీలర్ సంస్థలకు భారీ నష్టం
న్యూఢిల్లీ: పేరుకుపోయిన బాకీలు, గతేడాది సబ్సిడీల నిలిపివేత వల్ల మార్కెట్ వాటాను కోల్పోవడం తదితర కారణాలతో విద్యుత్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలు (ఓఈఎం) నానా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ కారణంగా ఏడు సంస్థలు ఏకంగా రూ. 9,000 కోట్ల మేర నష్టపోయాయి. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ (ఎంహెచ్ఐ) మంత్రి మహేంద్ర నాథ్ పాండేకి రాసిన లేఖలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థల సమాఖ్య (ఎస్ఎంఈవీ) చీఫ్ ఎవాంజెలిస్ట్ సంజయ్ కౌల్ ఈ విషయాలు తెలిపారు. అసలే కష్టకాలంలో ఉంటే.. ఆయా సంస్థలు పొందిన సబ్సిడీ మొత్తాలను వాపసు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించడం మరో సమస్యగా మారిందని పేర్కొన్నారు. 2022లో సదరు సంస్థలకు భారీ పరిశ్రమల శాఖ (ఎంహెచ్ఐ) సబ్సిడీలను నిలిపివేసినప్పటి నుంచి పేరుకుపోయిన బకాయిలు, వడ్డీ, రుణం, మార్కెట్ వాటాపరమైన నష్టం, ప్రతిష్టకు భంగం కలగడం, పెట్టుబడి వ్యయాలపరంగా కంపెనీలకు రూ. 9,075 కోట్ల మేర నష్టం వాటిల్లి ఉంటుందని ఎస్ఎంఈవీ ఆడిట్లో తేలినట్లు కౌల్ తెలిపారు. ఫలితంగా కొన్ని కంపెనీలు ఎప్పటికీ కోలుకోకపోవచ్చని, కొన్ని మూతబడవచ్చని పేర్కొన్నారు. దేశీ ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో 1 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇన్వెస్టర్లతో పరిశ్రమ చర్చలు జరుపుతున్న తరుణంలో దాదాపు దానికి సరిసమానమైన స్థాయిలో నష్టాలు నమోదవడం చిత్రమైన పరిస్థితి అని కౌల్ వ్యాఖ్యానించారు. రోజూ పెరిగిపోతున్న నష్టాల కారణంగా తయారీ సంస్థలు తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆదుకునేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయండి.. ఓఈఎంలకు గత 18–22 నెలల సబ్సిడీ బాకీలు రావాల్సి ఉందని కౌల్ తెలిపారు. పైపెచ్చు పాత సబ్సిడీలను తిరిగి ఇచ్చేయాలని ఆదేశించడం, కొత్త మోడల్స్‌ను ఎన్ఏబీ పోర్టల్‌లో అప్లోడ్ చేయడానికి అనుమతించకపోవడం వంటివి ఆయా సంస్థల వ్యాపారాలను దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యల ప్రధాన ఉద్దేశం సదరు సంస్థలను శిక్షించడం మాత్రమే అయితే, ఇలా సమస్య పరిష్కారం కాకుండా జాప్యం జరుగుతూ ఉండటం వల్ల అవి పూర్తిగా మూతబడే పరిస్థితి వస్తోందని కౌల్ తెలిపారు. ఇలాంటి శిక్ష సరికాదని పేర్కొన్నారు. మూసివేత అంచుల్లో ఉన్న ఓఈఎంలకు ఊపిరి పోసేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని కోరారు. తక్కువ వడ్డీపై రుణాలు, గ్రాంట్లు లేదా ఆ తరహా సహాయాన్ని అందించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. నిర్దిష్ట స్కీము నిబంధనలకు విరుద్ధంగా సబ్సిడీలు పొందాయంటూ హీరో ఎలక్ట్రిక్ సహా ఒకినావా ఆటోటెక్, యాంపియర్ ఈవీ, రివోల్ట్ మోటర్స్, బెన్లింగ్ ఇండియా, ఎమో మొబిలిటీ, లోహియా ఆటోపై ప్రభుత్వం విచారణ జరుపుతోన్న సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం ఎలక్ట్రిక్ వాహనాల సంస్థలు మేడిన్ ఇండియా పరికరాలను ఉపయోగించాలి. అయితే, ఈ ఏడు సంస్థలు దిగుమతి చేసుకున్న పరికరాలను వినియోగించడం ద్వారా నిబంధనలను ఉల్లంగించాయని ఆరోపణలు ఉన్నాయి. -
పేదలపై ‘గ్యాస్’ భారం
♦ మార్చి నాటికి సబ్సిడీ పూర్తిగా ఎత్తివేత ♦ బీపీఎల్ కుటుంబాల్లో ఆరిపోనున్న గ్యాస్ వెలుగులు సాక్షి, హైదరాబాద్: పేదలకు వంట గ్యాస్ ఇక భారం కానుంది. గృహోపయోగ గ్యాస్ సిలిండర్‌పై ప్రతినెలా రూ. 4 చొప్పున ధర పెంచి, వచ్చే మార్చి నాటికి సబ్సిడీని పూర్తిగా ఎత్తివేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో పేదల ఇళ్లల్లో గ్యాస్ వెలుగు ఆరిపోయే పరిస్థితికి దారి తీయనుంది. సంపన్న వర్గాలు గ్యాస్ సబ్సిడీని వదులుకొనేందుకు ముందుకు రాకపోవడమే ప్రభుత్వం సబ్సిడీని పూర్తిగా ఎత్తివేసే పరిస్థితులకు దారితీసిందనే వాదనలు వినబడుతున్నాయి. సంపన్న వర్గాలకు సబ్సిడీ.. గ్రేటర్ హైదరాబాద్‌లో సగానికి పైగా సంపన్న, అధిక ఆదాయ వర్గ కుటుంబాలు గృహోపయోగ వంట గ్యాస్‌పై సబ్సిడీ పొందుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద మహానగరంలో సుమారు 25 లక్షల వరకు కుటుంబాలు ఉండగా, అందులో వంట గ్యాస్ కనెక్షన్లు వినియోగిస్తున్న కుటుంబాలు 22 లక్షల వరకు ఉన్నాయి. మరో 3 లక్షల కుటుంబాలు కిరోసిన్, వంట చెరుకు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా వంట గ్యాస్ వినియోగిస్తున్న బీపీఎల్ కుటుంబాలు తొమ్మిది లక్షలకు మంచి లేవని పౌరసరఫరాల శాఖ‡ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. మిగిలిన 13 లక్షల కుటుంబాలు ఆదాయ వర్గాలుగా స్పష్టమవుతోంది. వదులుకుంది 90 వేల కుటుంబాలే... వంట గ్యాస్‌పై సబ్సిడీ వదులు కున్న కుటుంబాల సంఖ్య వెళ్లపై లెక్కించవచ్చు. సరిగ్గా రెండేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ ఆర్ధిక సంస్కరణల్లో భాగంగా సంపన్న వర్గాలు స్వచ్ఛందంగా సబ్సిడీ వదులుకోవాలని (గివ్ ఇట్ ఆప్) పిలుపు ఇచ్చారు. సెలబెట్రీలు రంగంలోకి దిగి విస్తృత ప్రచారం చేశారు. ప్రధాన ఆయిల్ కంపెనీలు మొబైల్ ద్వారా సంక్షిప్త సమాచారాలు పంపాయి. అయితే, వీటికి సంపన్న, అధిక ఆదాయ వర్గాల నుంచి వచ్చిన స్పందన మాత్రం అంతంతే. కేవలం 90 వేల కుటుంబాలు మాత్రమే సబ్సిడీని వదులుకున్నట్టు ఆయిల్ కంపెనీల రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఏడాదికి సబ్సిడీ రూ.1056.. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్‌పై అందించే సబ్సిడీ సొమ్ము ఏడాదికి రూ. 1056 మాత్రమే. ఈ మొత్తాన్ని వదులుకునేందుకు సంపన్నులు ముందుకు రాకపోడం గమనార్హం.