breaking news
State Division Act -2014
-
విభజన చట్టం అమల్లో కేసీఆర్ విఫలం
సాక్షి, హైదరాబాద్: విభజన చట్టం–2014 ప్రకారం రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని, విభజన హామీలను కేంద్రం పట్టించుకోవడం లేదని మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ గురువారం ఆరోపించారు. గత ప్రభుత్వం విభజన హామీలను అమలు చేస్తామంటే ఈ ప్రభుత్వం కాదనడం ఏంటని ప్రశ్నించారు. కోర్టుకు వెళ్లిన తర్వాత అమలు సాధ్యంకాదని కేంద్రం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తెలుగు ప్రజలను కేంద్రం మోసం చేస్తుంటే కేసీఆర్ ప్రగతిభవన్‌లో కూర్చుని అదే ప్రపంచం అనుకుంటున్నారని ఎద్దేవా చేశా రు. సీఎం శుక్రవారం ప్రధాని మోదీని కలుస్తున్న నేపథ్యంలో విభజన హామీలు ఎప్పుడు అమలు చేస్తారో మోదీని అడగాలని షబ్బీర్ డిమాండ్ చేశారు. ముస్లింలకు కేసీఆర్ ఇచ్చిన 12 శాతం రిజర్వేషన్లను మోదీతో ఇప్పించాలని కోరారు. రాష్ట్ర విభజన హామీలను కేంద్రం ఒక్క శాతం కూడా అమలు చేయనందునే తాను సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. మోదీతో కేసీఆర్‌కు ఉన్న రహస్య ఎజెండా ఏంటో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. -
86 సార్లు కలిశాం
* ‘విభజన’ హామీల అమలుపై కేంద్రంతో రాష్ట్రం సంప్రదింపులపై కంభంపాటి * ఈ విషయాలన్నీ పవన్‌కల్యాణ్‌కు తెలిసి ఉండకపోవచ్చు సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన చట్టం-2014లో పొందుపరిచిన హామీలు, ఇతరత్రా సమస్యలపై రాష్ట్రప్రభుత్వం కేంద్రంతో వందలాదిసార్లు సంప్రదింపులు జరిపిందని, ఇందులో 86 సార్లు ప్రత్యక్షంగా వివిధ కేంద్రమంత్రులను కలిశామని ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు చెప్పారు. బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంతో టీడీపీ ప్రభుత్వం ఎలా సంప్రదింపులు జరిపింది? ఏమేం సాధించిందీ ఏకరువు పెట్టారు. ఢిల్లీలో రాష్ట్రప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా తాను బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రగతిని వివరిస్తున్నానని చెప్పినా.. టీడీపీ ఎంపీలు ఏంచేశారంటూ సినీనటుడు పవన్‌కల్యాణ్ చేసిన విమర్శలకు కౌంటర్‌గానే ఈ వివరాలు వెల్లడించినట్టు అవగతమైంది. ప్రత్యేకహోదా అంశాన్ని ప్రస్తావించగా.. ప్రత్యేకహోదా ఇవ్వబోమని కేంద్రం అనలేదని, ఇస్తామనే చెబుతోందని, బహుశా బిహార్ ఎన్నికల అనంతరం ఇస్తారేమోనని ఆయన బదులిచ్చారు. టీడీపీ ఎంపీల పనితీరును పవన్‌కల్యాణ్ తప్పుబట్టడాన్ని ప్రస్తావించగా.. ‘అది తప్పుపట్టడమని ఎందుకనుకోవాలి. ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు (ఆయన నోటీసులో ఉండకపోవచ్చు)’ అని కంభంపాటి అన్నారు.