breaking news
stalin udhayanidhi
-
యంగ్ హీరోయిన్లపై కన్నేసిన ఉదయనిధి
యువ నటుడు ఉదమనిధి స్టాలిన్ ఆరంభంలో టాప్ హీరోయిన్లతో నటించిన విషయం తెలిసిందే. తొలి చిత్రం ఒరుకల్ ఒరుకన్నాడి చిత్రంలో బొద్దుగుమ్మ హన్సికను తనకు జతగా ఎంచుకున్నారు. ఆ తరువాత వరుసగా నయనతార, ఎమీజాక్సన్ వంటి టాప్ హీరోయిన్లతో నటించారు. ఇటీవల మంచి విజయాన్ని సాధించిన మనిదన్ చిత్రంలో నాయకి హన్సికనే నన్నది గమనార్హం. ఇలా క్రేజీ హీరోయిన్లతోనే నటించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్న ఉదయనిధి స్టాలిన్ నిర్ణయంలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రాల్లో యంగ్ నాయికలతో రొమాన్స్ చేస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ ప్రస్తుతం రెండు చిత్రాలు చేస్తున్నారు. అందులో ఎళిల్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రంలో నటి రెజీనా నాయకిగా నటిస్తున్నారు. ఆయన నటిస్తున్న మరో చిత్రానికి గౌరవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మలయాళ బ్యూటీ మంజిమా మోహన్ నాయకిగా నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలతో పాటు ఉదయనిధి తాజాగా మరో చిత్రానికి సైన్ చేశారు. శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రంలో హీరోగా నటించనున్నారు. దళపతి ప్రభు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో ఒరునాళ్ కూత్తు చిత్రం ఫేమ్ నివేదా పేతురాజ్ ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఉదయనిధి ఇలా టాప్ నాయికలను పక్కన పెట్టి యువ నాయికలపై కన్నేయడానికి కారణం ఏమిటబ్బా అని ఆరా తీసేపనిలో పడింది కోలీవుడ్. -
నయనతార ఫ్రెష్ లవ్...
తెలుగులో ఇటీవలే సూర్య సరసన ‘రాక్షసుడు’ చిత్రంలో కనిపించి కనువిందు చేసిన నయనతార ‘శీనుగాడి లవ్‌స్టోరీ’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తమిళంలో ఉదయనిధి స్టాలిన్, నయనతార నాయికగా నటించిన ‘ఇదు కదిర్వేలన్ కాదల్’ చిత్రాన్ని భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలుగులో ‘శీనుగాడి లవ్ స్టోరీ’గా శుక్రవారం విడుదల చేయనున్నారు. ఎస్.ఆర్. ప్రభాకరన్ దర్శకుడు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఓ యువకుడు తన ప్రేమను గెలుచుకోవడంతో పాటు తన కుటుంబంలో ఎదురైన సమస్యలను ఎలా పరిష్కరించాడన్న కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. నయనతార గ్లామర్ ప్రేక్షకులకు నయనానందం కలిగిస్తుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: బాలసుబ్రమణియన్, సంగీతం: హ్యారిస్ జయరాజ్.