నయనతార ఫ్రెష్ లవ్... | seenugadi love story Release on Friday | Sakshi
Sakshi News home page

నయనతార ఫ్రెష్ లవ్...

Jun 30 2015 10:28 PM | Updated on Sep 3 2017 4:38 AM

నయనతార ఫ్రెష్ లవ్...

నయనతార ఫ్రెష్ లవ్...

తెలుగులో ఇటీవలే సూర్య సరసన ‘రాక్షసుడు’ చిత్రంలో కనిపించి కనువిందు చేసిన నయనతార ‘శీనుగాడి లవ్‌స్టోరీ

తెలుగులో ఇటీవలే సూర్య సరసన ‘రాక్షసుడు’ చిత్రంలో  కనిపించి కనువిందు చేసిన నయనతార ‘శీనుగాడి లవ్‌స్టోరీ’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తమిళంలో ఉదయనిధి స్టాలిన్, నయనతార నాయికగా నటించిన ‘ఇదు కదిర్‌వేలన్ కాదల్’  చిత్రాన్ని భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలుగులో ‘శీనుగాడి లవ్ స్టోరీ’గా శుక్రవారం విడుదల చేయనున్నారు. ఎస్.ఆర్. ప్రభాకరన్ దర్శకుడు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఓ యువకుడు తన ప్రేమను గెలుచుకోవడంతో పాటు తన కుటుంబంలో ఎదురైన సమస్యలను ఎలా పరిష్కరించాడన్న కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. నయనతార గ్లామర్ ప్రేక్షకులకు నయనానందం కలిగిస్తుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: బాలసుబ్రమణియన్, సంగీతం: హ్యారిస్ జయరాజ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement