sri lalitha
-
నా పెంపకంలో ఈ స్థాయికి ఎదిగింది
విజయవాడ దుర్గమ్మపై ‘కనకదుర్గా మహా ప్రభావిత మదనజనక సోదరీ..’ అంటూ గాయని శ్రీలలిత పాడిన పాటను ప్రధాని నరేంద్ర మోదీ ట్యాగ్ చేయడంతో వైరల్‌గా మారింది. శ్రీలలిత తల్లి భమిడిపాటి సత్యవాణి ఈ సంతోషాన్ని పంచుకుంటూ, శ్రీలలిత చిన్ననాటి నుంచి తను తీసుకున్న జాగ్రత్తలను వివరించారు.‘‘పాప పుట్టినప్పుడు తను ఏ స్థాయికి వెళ్లాలి అనుకున్నానో, ఆమె ఈ రోజు ఆ స్థాయికి చేరుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. నాకు ఇద్దరు పిల్లలు. బాబు శ్రీనికేత్, తర్వాత శ్రీలలిత. మావారు భమిడిపాటి రాజశేఖర్ బ్యాంకు ఉద్యోగి. ఆయన ఉద్యోగరీత్యా కొన్నాళ్లు బిహార్‌లో ఉన్నాం. నాకు మా పిల్లల నెలల వయసు నుంచే వారిని సంగీతంలో తీర్చిదిద్దాలనే ఆలోచన ఉండేది. మా పుట్టిల్లు, మెట్టిల్లు వైపు పాతికమంది వరకు సంగీత విద్వాంసులు ఉన్నారు. నేనూ సంగీతం క్లాసులు తీసుకుంటాను. పిల్లలు స్టేజీపైన ప్రదర్శన ఇవ్వడానికి వారిలో భయం ఉండకూడదు. అందుకని, చిన్నప్పుడే బేబీ షోలలో పాల్గొనేలా చేసేదాన్ని. లలితకు ఎనిమిది నెలల వయసులో చీరకట్టి, పెళ్లికూతురులా రెడీ చేసి, బేబీ షోలో స్టేజీపైన నిలబెట్టాను. ఆ వయసులోనే తనకు ఫస్ట్ ఫ్రైజ్ వచ్చింది. కూరగాయలతోనూ డ్రెస్సులు కుట్టి, వేసి, షోలకు తీసుకెళ్లేదాన్ని. నాకు మిషన్ కుట్టడం వచ్చు కాబట్టి పాప డ్రెస్సులన్నీ నేనే కుట్టేదాన్ని. బొమ్మలను తయారుచేసి ఇచ్చేదాన్ని. పాప రెండేళ్ల వయసులో తణుకు ట్రాన్స్ఫర్ అయ్యింది. ఉద్యోగరీత్యా ఎటు మారినా, ఎక్కడ పిల్లల ప్రదర్శన జరిగినా, అక్కడకు శ్రీలలితను తీసుకెళ్లేదాన్ని. View this post on Instagram A post shared by Srilalitha Gudipati (@srilalithagudipati) ఒడిలో కూర్చోబెట్టుకొని...పాప మూడేళ్ల వయసులో ఓ షోలో పాల్గొనడానికి ఇంగ్లిష్ రైమ్ నేర్పించాను. కాని, అక్కడకు వెళ్లాక లింగాష్టకం పాడింది. ‘మూడేళ్ల వయసులో ఎలా పాడింది’ అంటూ అందరితో సహా నేనూ ఆశ్చర్యపోయాను. అప్పుడు నాకు అనిపించింది. ఉదయాన్నే పూజ చేసేటప్పుడు పాప అటూ ఇటూ వెళ్లకుండా ఒడిలో కూర్చోబెట్టుకొని, శ్లోకాలు, స్తోత్రాలు చదువుతుండేదాన్ని. తను కూడా వాటిని వింటూ, పాడుతూ అమ్మవారికి పూలు పెడుతూ అలాగే కూర్చొనేది. ఒడిలో కూర్చోబెట్టుకొని రోజూ స్తోత్రాలు చదవడం వల్ల, అవన్నీ గుర్తుపెట్టుకుని, అలవోకగా పాడేసిందని అర్థమైంది. ఇక ఆ రోజు నుంచి ‘పాట’ తన చెవిన పడాలి అని తపించేదాన్ని. మూడేళ్ల వయసులోనే...మూడేళ్ల వయసులో నేను తీసుకునే మ్యూజిక్ క్లాస్ తను తీసుకుంటాననేది. నా పని ముగించుకొని, క్లాస్‌కు వచ్చేసరికి పిల్లలందరినీ కూర్చోబెట్టి, పాడుతుండేది. ఒక సిరీస్ అంతా ఘంటసాల పాటలు పాడించాం. ఇంట్లో ఓ మైకు ఏర్పాటు చేసుకున్నాం. సాయంత్రం అయ్యిందంటే మా అందరి ప్రోగ్రామ్ పాటలే! View this post on Instagram A post shared by Srilalitha Gudipati (@srilalithagudipati)దీక్ష తీసుకునేవాళ్లం..మా బంధువుల్లో చాలా మంది నన్ను కొంచెం విసుక్కునేవారు ‘ఏంటో నువ్వు, పిల్లకు పాత తరంలోలాగా లంగా జాకెట్టు, పెద్ద బొట్టు.. అమ్మాయిని ట్రెండ్‌కు తగినట్టుగా పెంచడం లేదు..’ అనేవారు. వాటిని పట్టించుకునేదాన్ని కాదు. లలిత అంటే నాకు అమ్మవారు. అలాగే ఉండాలనుకునేదాన్ని. బాలసుబ్రహ్మణ్యం, కోటిగారు ‘లలిత పాడుతుంటే అమ్మవారే పాడుతున్నట్టు’ ఉంది అనేవారు. ఎక్కడ ప్రోగ్రామ్ జరుగుతున్నా, అక్కడకు నేను, మావారు వెళ్లిపోయి, ఓ పక్కన కాళ్లు లాగేస్తున్నా నిల్చుండేవాళ్లం. తను ఎక్కడెక్కడ పాడింది, ఎవరితో పాడింది, ఎవరెవరు తనను ప్రోత్సహించారు– అవన్నీ ఫొటో ఆల్బమ్‌గా చేసి, తనతో పాటు తీసుకెళ్లి, అక్కడున్నవారికి చూపించేవాళ్లం. సంగీతంలో లలిత ఉన్నత దశకు చేరుకోవాలనే తపన తప్ప మరింకేమీ లేదు. ఇన్నేళ్లలో మేం ఒక్క సినిమాకి వెళ్లింది లేదు, టీవీ చూసింది లేదు, ఒక యాత్రకు వెళ్లింది లేదు. సాధన మానకూడదు..ఏ రియాల్టి షో అయినా నేను, లలితనే వెళ్లేవాళ్లం. షో ముగించుకొని బయల్దేరేసరికి చాలాసార్లు అర్ధరాత్రి దాటిపోయేది. విదేశాలకు, ఏ ఊరు వెళ్లాలన్నా మా వారు వెంట వెళ్లేవారు. ఇంటి దగ్గరే ఉండి, టెన్త్ క్లాస్ పరీక్షలు రాసి, 90 శాతం మార్కులు తెచ్చుకుంది. సంగీతంలో డిప్లొమా చేసింది. లలిత పుట్టకముందు మా ప్రపంచం సంగీతం. పుట్టాక మా ప్రపంచం అంతా లలితనే అయిపోయింది. తను ఎక్కడా డల్ అవకుండా చూసేవాళ్లం. ఎవరో ప్రోత్సహించడం లేదనో, ప్రైజు రాలేదనో ఆలోచన పెట్టుకోవద్దని, ప్రాక్టీస్ ఎప్పుడూ మానద్దని చెప్పేవాళ్లం. ఆరేళ్లపాటు యూ ట్యూబ్‌లో..దసరా రోజుల్లో అమ్మవారి దీక్ష తీసుకుంటాను. నాతో పాటు శ్రీలలిత కూడా దీక్ష తీసుకుంటుంది. కరోనా సమయంలో మా అబ్బాయి చెల్లెలి కోసం యూట్యూబ్ చానెల్ ఓపెన్ చేశాడు. ఆరేళ్లపాటు వరుసగా శ్రీలలితతో సాంగ్స్ చేయించాం. దుర్గా నవరాత్రుల సందర్భంగా చేసిన పాటలకు మంచి పేరొచ్చింది. కాంతారా పాటకు అన్నాచెల్లెళ్లిద్దరూ చాలా కష్టపడ్డారు. View this post on Instagram A post shared by Srilalitha Gudipati (@srilalithagudipati) మా అబ్బాయి మంగళూరులో ధార్మిక పాఠశాలను ప్రారంభించాడు. అమ్మాయి పెళ్లి చేసి, అత్తగారింటికి పంపించాక ఇప్పుడు మా జర్నీని మళ్లీ కొత్తగా మొదలుపెట్టాం. పిల్లలకు సంగీతం క్లాసులు చెబుతుంటాను. బొమ్మలు చేస్తుంటాను.’’ అని చెప్పారు సత్యవాణి.∙ నిర్మలారెడ్డి -
అన్నీ అమ్మ ఆకృతులే
‘అమ్మవారి తొమ్మిది అలంకారాలు, కృతులు స్త్రీ శక్తి గురించి తెలియజేసేవే. మనలోని శక్తిని ఎలా జాగృతం చేస్తామో అదే మనం’ అంటూ నవరాత్రుల సందర్భంగా చేస్తున్న సాధన, అమ్మవారి కృపతో మొదలైన తన ప్రయాణం గురించి తెలియజేశారు గాయని భమిడి పాటి శ్రీలలిత (Bhamidipati Srilalitha). విజయవాడ వాసి, గాయని, అమ్మవారి పాటలకు ప్రత్యేకంగా నిలిచిన శ్రీలలిత చెప్పిన విశేషాలు నవశక్తిలో.‘‘నవరాత్రి సిరీస్ ఆరేళ్లుగా చేస్తున్నాను. బెజవాడ కనకదుర్గమ్మ అలంకరణ ఎలా ఉంటుందో అలాంటి అలంకరణల సెట్ వేసి, షూట్ చేసి, వీడియో ద్వారా చూపించాం. ఈ నవరాత్రుల్లో కనకదుర్గమ్మను నేరుగా దర్శించుకోలేనివారు సోషల్ మీడియాలో తొమ్మిది పాటలుగా విడుదల చేసిన వీడియోలు చూడవచ్చు. అమ్మవారి ప్రతి అలంకరణకు తగ్గట్టుగా పాట ఎంపిక, విజువల్స్ డిజైన్ చేశాం. ప్రతియేటా కొత్తదనం ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాం. అమ్మవారి కృతులు అందరిళ్లలో పాడుకునే విధంగా ఆడియోను తీసుకువచ్చాం. పరంపరంగా వచ్చిన కృతులనే తీసుకున్నాం. ఈసారి మాత్రం రెండు భజనలు కూడా వీడియోలో ఉండేలా ప్లాన్ చేశాం. ఈ నవరాత్రి వీడియోకు నెల రోజుల టైమ్ పట్టింది. రోజుకు మూడు అలంకారాల చొప్పున షూట్ చేశాం.కృతులను నేర్చుకుంటూ ..చిన్నప్పటి నుంచి ఇంట్లో భక్తి గీతాలు వింటూ ఉండేదాన్ని. మా ఇంట్లో అందరూ అమ్మవారి ఆరాధకులే. అమ్మవారి దీక్ష చేసేవారు. ఇంట్లో అందరూ ఆమె కృతులను పాడుతుంటారు. ఆ విధంగా అమ్మవారి కృతులు వినడం, నేర్చుకోవడం ప్రారంభించాను. మా అత్తింట్లోనూ అమ్మవారి ఆరాధకులే. మా మామగారు నలభై ఏళ్లుగా దుర్గమ్మవారి ఉత్సవాలు జరుపుతున్నారు. దీంతో నేనూ ఆ ఉత్సవాల్లో పాల్గొంటూ, ప్రదర్శన ఇస్తూ వస్తున్నాను. అన్ని పుణ్యక్షేత్రాలూ దర్శించి, అక్కడ ప్రదర్శనలో పాడే అవకాశమూ లభించింది.చదవండి: సెంటర్‌స్టోన్ డైమండ్‌రింగ్, లగ్జరీ గౌనులో ఇషా అంబానీ : ధర ఎంతో తెలుసా? పరీక్షలను తట్టుకుంటూ...అమ్మవారి ఉత్సవాలు, గ్రామదేవతా ఉత్సవాలు, మొన్న జరిగిన తిరుపతి బ్రహ్మోత్సవాల్లోనూ పాల్గొన్నాను. పాట ఎంపిక నుంచి అమ్మవారే ఈ కార్యక్రమం నా చేత చేయిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ కృతులు పాడుతున్నా, వింటున్నా ఒక ఆధ్యాత్మిక భావనకు లోనవుతుంటాను. ఉదాహరణకు.. ఒక కృతిలో 13 చరణాలు ఉంటే.. 9 లేదా 11 చరణాలు పాడుదాం, అంత సమయం ఉండడదు కదా అని ముందు అనుకుంటాను. కానీ, ప్రదర్శనలో నాకు తెలియకుండానే 13 చరణాలనూ పూర్తి చేస్తాను. ఇటువంటి అనుభూతులెన్నో.సినిమాలోనూ...ఇటీవలే ఒక సినిమాకు పాటలు పాడాను. ఆరేళ్ల వయసు నుంచి 20 వరకు రియాలిటీ షోలలో పాల్గొన్నాను. బయట మూడు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాను. మన దేశంలోనే కాకుండా విదేశాలలోనూ ప్రదర్శనలు ఇవ్వడం నిజంగా అదృష్టం. సంగీత కళానిధులైన బాలసుబ్రహ్మమణ్యం, చిత్ర, కోటి, ఉషా ఉతుప్.. వంటి పెద్దవారిని కలిశాను. వారితో కలిసి పాడుతూ, ప్రయాణించాను. ఒకసారి రియాలిటీ షో ఫైనల్స్‌లో పాడుతున్నప్పుడు బాలు గారు ‘నీ వెనక ఏదో దైవశక్తి ఉంది...’ అన్నారు. అదంతా అమ్మవారి ఆశీర్వాదంగా భావిస్తుంటాను.వదలని సాధన...ఈ సీరీస్‌లో నాకు చాలా ఇష్టమైనది మహాకవి కాళిదాసు ‘దేవీ అశ్వధాటి’ స్తోత్రం. ప్రవాహంలా సాగే ఆ స్తోత్రాన్ని అమ్మవారి మీద రాశారు. అశ్వధాటి అంటే.. ఒక గుర్రం పరుగెడుతూ ఉంటే ఆ వేగం, శబ్దం ఎలా ఉంటుందో .. ఆ స్తోత్రం కూడా అలాగే ఉంటుంది. 13 చరణాలు ఉండే ఆ స్తోత్రం పాడటం చాలా కష్టం. కానీ, నాకు అది చాలా ఇష్టమైనది. ఏదైనా స్తోత్రం మొదలుపెట్టినప్పుడు దోషాలు లేకుండా జాగ్రత్త పడుతూ, ప్రజల ముందుకు తీసుకువస్తాను. కరెక్ట్‌గా వచ్చేంతవరకు సాధన చేస్తూ ఉంటాను. ఇదీ చదవండి: పారిస్ ఫ్యాషన్ వీక్ : ఐశ్వర్యా డాజ్లింగ్ లుక్ వెనుకున్న సీక్రెట్ ఇదే!మహిళలు జన్మతః శక్తిమంతుఉ కాబటి వారు ఎక్కడినుంచో స్ఫూర్తి పొందడం ఏమీ ఉండదు. మనలోని శక్తి ఏ రూపంలో ఉందో దానిని వెలికి తీసి, ప్రయత్నించడమే. నా కార్యక్రమాలన్నింటా మా అమ్మానాన్నలు, అన్నయ్య, అత్తమామలు, మా వారు.. ఇలా అందరి సపోర్ట్ ఉంది. ఆడియో, వీడియో టీమ్ సంగతి సరే సరి! ’ అంటూ వివరించారు ఈ శాస్త్రీయ సంగీతకారిణి.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఇంద్రకీలాద్రి: శ్రీలలితా త్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మ దర్శనం (ఫొటోలు)
-
శ్రీవారితో అందమైన జర్నీకి ఏడాది! వరాహరూపం సింగర్ శ్రీలలిత (ఫొటోలు)
-
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం-విశిష్ఠత
శ్రీ మహా విష్ణువు అవతారమైన శ్రీ హయగ్రీవుడిని రహస్యంగా భావించే సహస్రనామాలను తనకు ఉపదేశించమని అగస్త్య మహర్షి అభ్యర్థిస్తాడు. హయగ్రీవుడు శ్రీ లలితా సహస్రనామాలకు గల అనంత శక్తి కారణంగా దానిని యోగ్యులైన పుణ్యాత్ములకు మాత్రమే తెలియజేయ వలసి ఉంటుందని, అతనికి శ్రీ లలితా సహస్రనామ మూలాన్ని ఉపదేశిస్తాడు.దీనికి స్వరకర్తలు వసిని మొదలైన వాగ్దేవతలు. శ్రీ లలితా దేవి ఆజ్ఞపై వసినీ మొదలైన వాక్ దేవతలు శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రాన్ని రచించారు. వారు రహస్య మంత్రాలతో కూడిన వేయి నామాలను కూర్చారు. శ్రీ లలితా దేవి ఆస్థానంలో మొదటి సారిగా వాక్ దేవతలు సకల దేవతలు మంత్రిణి, దండిని ఇతర శ్రీ మాత అనుచరుల సమక్షంలో ఈ సహస్రనామాన్ని పఠించారు.శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం విని ముగ్ధురాలైన అమ్మ వారు తన భక్తులను అనుగ్రహించేందుకు ఈ విధముగా ప్రకటించింది ‘ఈ నామాలను ఎవరు అనుసరిస్తారో/ ఆచరిస్తారో.. ఎవరు ప్రతిరోజు ఈ లలిత సహస్ర నామ స్తోత్రాన్ని చదువుతూ ఉంటారో, వారి యందు నాకు ప్రీతి కలిగి వారికి సంబంధించిన సమస్త యోగ క్షేమాలను నేనే స్వయంగా చూసుకుంటాను‘ అని. కాబట్టి ఈ స్తోత్రం అమ్మ వారి పూర్ణానుగ్రహం తప్ప మరొకటి కాదు.శ్రీ మాత స్వయంగా చెప్పినట్లు, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం అన్ని రకాల సమస్యలను నయం చేసే శక్తివంతమైన పరిష్కారం.ఈ స్తోత్రం చివరలో బ్రహ్మాండ పురాణంలో స్తోత్రం ఉనికి గురించిన ప్రకటన ఉంది. ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే, ఉత్తరఖండే, శ్రీ హయగ్రీవాగస్త్య సంవాదే, శ్రీలలితా రహస్య నామ సాహస్ర స్తోత్ర కథనం నామ ద్వితీయోధ్యాయః శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం బ్రహ్మాండ పురాణం 36వ అధ్యాయం ‘లలితోపాఖ్యానం‘లో ఉంది. ఇందులో శ్రీ లలితాదేవిని సకల శక్తిస్వరూపిణిగాను, సృష్టిస్థితిలయాధికారిణిగాను వర్ణించారు. ఈ స్తోత్రం గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. నిత్యం ఈ స్తోత్రాన్ని పారాయణం చేసేవారు చాలా మంది ఉంటారు. అయితే ఇందులో ఉన్న అమ్మవారి నామాలను అర్థం చేసుకొని వాటిని ధ్యానంలో ప్రత్యక్షంగా అనుభూతి చెందుతూ అనన్యమైన భక్తి శ్రద్ధలతో పారాయణం చేసేవారు చాలా తక్కువ మంది ఉంటారు.మీరు జాగ్రత్తగా గమనిస్తే శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో మన సూక్ష్మ శరీరంలో ఉన్న వివిధ శక్తి కేంద్రములు లేదా చక్రముల వద్ద శక్తి స్వరూపిణి అయిన అమ్మ వారు ఏ విధంగా విరాజిల్లుతుంటారో వర్ణించబడి ఉంటుంది. ఈ చక్రములన్నీ మన శరీరంలోనే ఉంటాయి. అంటే అర్థము మన దేహము లోనే విభిన్న చక్రాలలో విభిన్న రూపాలలో అమ్మవారు కొలువై ఉంటారు.ఇప్పుడు విద్యుత్ శక్తి వలన ఎలాగయితే మన చుట్టూ ఉన్న ఫ్యాన్ లు, లైట్ లు, ఎ.సి.లు వంటి అనేక విద్యుత్ ఉపకరణాలు పని చేస్తూ ఉంటాయో, అదే విధంగా శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి శక్తి వలన మానవుని సూక్ష్మ శరీరంతో పాటు అండ పిండ బ్రహ్మాండముతో నిండిన ఈ చరాచర జగత్తు మొత్తం నడుస్తుంది.– డా. పి. రాకేష్(సహజ యోగ సంస్థాపకురాలు, శ్రీ మాతాజీ నిర్మలా దేవి ప్రవచనాల ఆధారంగా) -
పెళ్లి ఫోటోలు షేర్ చేసిన వరాహరూపం సింగర్ శ్రీలలిత (ఫోటోలు)
-
నిశ్చితార్థం చేసుకుని సర్ప్రైజ్ ఇచ్చిన 'వరహారూపం' సింగర్
ఒక్క పాటతో ఫేమస్ అయిన సింగర్స్ చాలామంది ఉన్నారు. వాళ్లలో శ్రీ లలిత కూడా ఒకరు. 'వరహారూపం' పాటతో యూట్యూబ్‌లో సెన్సేషన్ సృష్టించిన ఈమె.. ఇప్పుడు నిశ్చితార్థం చేసుకుని సర్ప్రైజ్ చేశారు. తనకు కాబోయే వ్యక్తిని కాస్త డిఫరెంట్‌గా అందరికీ పరిచయం చేశారు. ఓ పాటతో వెల్కమ్ చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.'కాంతార' సినిమా పేరు చెప్పగానే క్లైమాక్స్‌లో వచ్చే 'వరహారూపం' పాటనే గుర్తొస్తుంది. ఒరిజినల్‌గా పాడిన సింగర్ ఎవరో మనకు పెద్దగా తెలియదు గానీ ఇదే గీతాన్ని తనదైన శైలిలో పాడి ఆకట్టుకుంది సింగర్ శ్రీ లలిత. దాదాపు ఏడాది క్రితం యూట్యూబ్‌లో వీడియో పోస్ట్ చేయగా.. దాదాపు 8.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇలా ఒక్క పాటతో ఈమె తెలుగులో చాలా ఫేమ్ సంపాదించారు. ఇప్పుడు ఈమెనే సీతారామ్ అనే వ్యక్తితో నిశ్చితార్థం చేసుకుంది.(ఇదీ చదవండి: వీడియో: గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్)'జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడురాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడుఆనాడు ఎవరూ.. అనుకోనిది..ఇనాడు మనకు.. నిజమైనది..ఆ రామాయణం...మన జీవన పారాయణం' అని చెబుతూ తనకు కాబోయే వాడిని నెటిజన్లకు శ్రీ లలిత పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ ఆమె ఫాలోవర్స్‌ని ఆకట్టుకుంటోంది.ఇకపోతే శ్రీ లలిత కుటుంబానికి సంగీత నేపథ్యమే. తాత ముత్తాతలు సంగీత విద్వాంసులే. ఈమె తల్లిదండ్రులు కూడా గాయకులే. మూడున్నరేళ్ల వయసులోనే ఓ స్టేజీ మీద పద్యం చెప్పమని అడిగితే.. 'లింగాష్టకం' పాడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. లిటిల్ చాంప్స్, పాడుతా తీయగా, బోల్ బేబీ బోల్, స్వరాభిషేకం.. ఇలా 15కి పైగా రియాలిటీ షోల్లో శ్రీ లలిత పాల్గొంది. ఎంఏ మ్యూజిక్ పూర్తి చేసిన ఈమె... తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ పాటలు పాడటం విశేషం. (ఇదీ చదవండి: చిరు, పవన్ సినిమాల వల్ల అన్యాయం.. ప్రముఖ నటుడు ఆవేదన) View this post on Instagram A post shared by Srilalitha Bhamidipati (@srilalithabhamidipati) -
భర్త ఫోన్లో మెసేజ్ చూసినందుకు..
సాక్షి, రాజమండ్రి : అనుమతి లేకుండా ఫోన్లో మెసేజ్ చూసినందుకు భర్త తనను ఇంట్లోంచి గెంటేశాడని ఓ వివాహిత అత్తింటి ముందు ధర్నాకు దిగిన ఘటన పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన శ్రీలలితకు రాజమండ్రికి చెందిన రవీంద్రతో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. పెళ్లైన కొద్దిరోజులకే ఇరువురి మధ్య మనస్పర్దలు వచ్చాయి. ఆదివారం అనుమతి లేకుండా తన ఫోన్‌కు వచ్చిన ఓ మెసేజ్‌ను లలిత ఓపెన్ చేసి చూడటంతో రవీంద్ర కోపోద్రేకుడయ్యాడు. లలితను ఇంట్లోంచి బయటకు గెంటేశాడు. దీంతో తనను ఇంట్లోకి రానివ్వడం లేదంటూ లలిత తల్లిదండ్రులతో కలసి అత్తింటి ముందు నిరాహార దీక్షకు దిగారు. మనస్పర్దలు వస్తే సర్ది చెప్పి కలపాల్సిన పెద్ద మనుషులే తమను దూరం చేస్తున్నారని లలిత ఆరోపించారు. -
రాణించిన శ్రీలలిత్
సాక్షి, హైదరాబాద్: బౌలింగ్‌లో శ్రీలలిత్ (4/25), బ్యాటింగ్‌లో శ్రీకాంత్ (70) రాణించడంతో ఇక్బాల్ సీఏ జట్టు 207 పరుగుల భారీ తేడాతో వీపీ రాజు క్లబ్‌పై జయభేరీ మోగించింది. క్రికెట్ అకాడమీల సమాఖ్య (ఎఫ్సీఏ) నిర్వహిస్తున్న ఈ అండర్-19 ఇంటర్ అకాడమీ టోర్నమెంట్లో మొదట ఇక్బాల్ జట్టు 7 వికెట్లకు 265 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వీపీ రాజు క్లబ్ జట్టు 58 పరుగులకే కుప్పకూలింది. శ్రీలలిత్తో పాటు శివ (3/16), శ్రీకాంత్ (2/11) వీపీ రాజు క్లబ్ బ్యాట్స్‌మెన్ ముప్పుతిప్పలు పెట్టారు. మరో మ్యాచ్‌లో అర్షద్ ఆల్‌రౌండ్ మెరుపులతో ఉడిత్యాల్ క్రికెట్ అకాడమీ 33 పరుగుల తేడాతో ఏఏసీఏ (రెడ్) జట్టుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఉడిత్యాల్ జట్టు 40 ఓవర్లలో 227 పరుగుల వద్ద ఆలౌటైంది. అర్షద్ (54) అర్ధసెంచరీతో రాణించగా, రాజ్‌ఠాకూర్ 44 పరుగులు చేశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఏఏసీఏ 39.4 ఓవర్లలో 194 పరుగుల వద్ద ఆలౌటైంది. అరుణ్ దేవ (73) పోరాడినా ఫలితం దక్కలేదు. బౌలింగ్‌లోనూ రాణించిన ఉడిత్యాల్ ఆటగాడు అర్షద్ 3, అబ్రార్ 3 వికెట్లు తీశారు. అండర్-16 విభాగంలో సెయింట్ జాన్స్ స్పోర్ట్స్ ఫౌండేషన్‌కు చెందిన గ్రీన్, రెడ్ జట్ల మధ్య గురువారం బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ గ్రౌండ్స్‌లో ఫైనల్ పోరు జరుగనుంది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు స్పోర్ట్స్ సెంటర్: 155 (యశ్ గుప్తా 35, అహన్ రెడ్డి 31; కమల్ 3/13), ఎవర్గ్రీన్ సీఏ: 157/7 (నాగరాజు గౌడ్ 35; సూర్యమల్లు 4/42) ఇక్బాల్ సీఏ: 265/7 (వికాస్ 62, శ్రీకాంత్ 70; ప్రశాంత్ 3/35), వీపీ రాజు: 58 (శ్రీలలిత్ 4/25, శివ 2/16) చార్మినార్ సీఏ: 218/7 (జైన్ 88, అబ్దుల్ రెహ్మాన్ 37) అశ్విన్ సీఏ: 180/9 (ప్రజ్వల్ మనోత్ 74)


