breaking news
Spanish dancer
-
వేదికపైనే గాయని సజీవ దహనం
-
వేదికపైనే గాయని సజీవ దహనం
ఒక సంగీత కార్యక్రమంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆదివారం జరిగిన మ్యూజికల్ షోలో ప్రముఖ స్పానిష్ పాప్‌స్టార్, డాన్సర్ జోయానా సెయిన్స్ దుర్మరణం పాలయ్యారు. సూపర్ హాలీవుడ్ ఆర్కెస్ట్రా బృందంతో కలిసి ప్రదర్శన ఇస్తుండగా బాణా సంచా పేలింది. దీంతో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రత్యక్ష సాక్షులు అందించిన సమాచారం ప్రకారం బాణాసంచా కాల్చుతున్న సందర్భంగా.. ప్రమాదవశాత్తూ రెండు రాకెట్లు వేదికపై దూసుకు వచ్చాయి. ఒకటి ఏకంగా ఆమె కడుపులోకి దూసుకుపోయింది. దీంతో వేదిక మీద ఒక్కసారిగా పేలుడు, సంభవించి మంటలంటుకోవడంతో ఆ మంటల్లో జోయానా చిక్కుకు పోయారు. అపస్మారక స్థితిలోకి జారుకున్న ఆమెను ఆసుపత్రికి తరలించే సమయానికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై కేస నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మరోవైపు జోయానా ఆకస్మిక మరణంపై గ్రూప్ ప్రమోటర్లు సంతాపం వెలిబుచ్చారు. -
ఆమె ఓ నడుస్తున్న భూకంపం
మాడ్రిడ్: ఆమె స్పానిష్ డాన్సర్ మూన్ రిబాస్. ఈ భూగోళంపై ఎక్కడ భూకంపం వచ్చిన అదే సమయంలో ఆమెకు తెలిసిపోతుంది. ఆమె భూకంపం తీవ్రత తక్కువ ఉందా, ఎక్కువ ఉందా ? అన్న విషయాన్ని కూడా ఇట్టే చెప్పగలరు. ఇందులో తాంత్రిక విద్యేమీ లేదు. యాంత్రిక విద్య తప్ప. ఆమె తన మోచేతి ప్రాంతంలో చర్మం కింద ఓ చిప్‌ను అమర్చుకున్నారు. దాన్ని ఆపిల్ యాప్‌కు అనుసంధానించారు. ఆ యాప్‌ను ప్రపంచంలోని అన్ని జియాలోజికల్ మానిటర్స్‌కు కనెక్ట్ చేశారు. ఆయా ప్రాంతాల్లో సంభవించిన భూప్రకంపనలను జియాలోజికల్ మానిటర్స్ గుర్తించి సకాలంలో ఆపిల్ యాప్‌కు వాటి డేటాను పంపిస్తుంది. డేటీను యాప్ రిసీవ్ చేసుకున్న క్షణంలోనే రిబాస్ చేతిలో దాగిన చిప్ గ్రహిస్తుంది. దాన్ని చిప్ వైబ్రేషన్ రూపంలో రిబాస్కు తెలిసేలా చేస్తోంది. భూ ప్రకంపనల స్థాయిని బట్టి వైబ్రేషన్స్ తీవ్రత ఉంటుంది. మూన్ రిబాస్ మూడేళ్ల క్రితం తన చర్మంలో భూప్రకంపనలను గుర్తించే చిప్‌ను అమర్చుకున్నారు. 2015, ఏప్రిల్ నెలలో నేపాల్‌లో భారీ భూకంపం సంభవించినప్పుడు ఆమె నిద్రపోతున్నారు. అక్కడ భూప్రకంపనలు వచ్చిన సమయంలోనే ఆమె చేతిలోని చిప్ బయ్..మంటూ వైబ్రేషన్స్‌ను పెద్ద ఎత్తున విడుదల చేసింది. దాని తీవ్రతకు ఆమె ఒక్కసారిగా ఉలిక్కి పడి నిద్ర లేచారు. ఆపిల్ యాప్ ద్వారా భూకంపం ఎక్కడ వచ్చిందో ఆసక్తికొద్దీ తెలుసుకున్నారు. ఆ క్షణం తాను భూకంపం వచ్చిన ప్రాంతంలోనే ఉన్నట్లు భ్రమపడ్డానని, భవనాలు పెళపెళమంటూ కూలుతున్న శబ్దాలను అనుభూతి చెందానని ఆమె తెలిపారు. నేపాల్‌లో 7.8 తీవ్రతతో వచ్చిన ఆ భూకంపంలో 8,000 మంది మరణించడం, దాదాపు 21,000 వేల మంది గాయపడడం తెల్సిందే. వృత్తిరీత్యా డాన్సర్ అయిన ఆమె ఎందుకు తన చేతిలో భూకంపాలను గుర్తించే చిప్‌ను పెట్టుకున్నారంటే డాన్స్‌లో ఓ వెరైటీని క్రియేట్ చేయడానికి మాత్రమే. ప్రపంచంలో ఎప్పుడూ ఏదో చోట భూ ప్రకంపనలు వస్తూనే ఉంటాయి. ఆ ప్రకంపనల తీవ్రతనుబట్టి చేతిలోని చిప్ వైబ్రేషన్స్‌ను విడుదల చేసినప్పుడు ఆమె వాటికి అనుగుణంగా డాన్స్ చేస్తారు. లైవ్ షో లేనప్పుడు డాన్స్‌ను కంపోజ్ కూడా చేసుకుంటారు. అన్ని భూకంపాలు చెడ్డవి కావని, భూకంపాల పట్ల మానవ దృక్పథం మారాలని, అవి రావడం ప్రకృతి సహజ ధర్మంగా భావిస్తే మంచిదని కూడా ఆమె చెప్పారు. మూన్ రిబాస్ ఎప్పుడు తనను తాను ‘సైబోర్గ్ ఆర్టిస్ట్’ అని చెప్పుకుంటారు గానీ మిత్రులు మాత్రం ఆమెను నడుస్తున్న భూకంపం అని పిలుస్తుంటారు.