breaking news
SP MLA
-
ఎమ్మెల్యేను పరారీలో ఉన్న నేరగాడిగా ప్రకటించిన యూపీ కోర్టు
మౌ: ఉత్తరప్రదేశ్‌లోని ఎంపీ/ఎమ్మెల్యేల కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానం సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను పరారీలో ఉన్న నేరగాడిగా ప్రకటించింది. ఘోసి ఎమ్మెల్యే సుధాకర్ సింగ్‌పై దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం నమోదైన కేసుపై గురువారం మౌలో ప్రత్యేక న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దొహారీఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ విద్యుత్ ఉప కేంద్రం వద్ద 1986లో విద్యుత్ కోతలకు నిరసనగా ఆందోళన జరిగింది. ఈ సమయంలో సుధాకర్ సింగ్ అధికారుల అనుచితంగా ప్రవర్తించడంతోపాటు విధ్వంసానికి పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదైంది. అప్పట్లో ఈ ప్రాంతం ఆజంగఢ్ జిల్లా పరిధిలో ఉండటంతో విచారణ చేపట్టిన ఆజంగఢ్ కోర్టు సింగ్‌కు బెయిలిచ్చింది. అనంతరం, ప్రత్యేక జిల్లాగా మారడంతో కేసు ఆజంగఢ్ నుంచి మౌకు మారింది. కేసు విచారణకు హాజరు కావడం లేదంటూ మౌ కోర్టు 2023లో సింగ్‌ను పరారీలో ఉన్న నేరగాడి ప్రకటించింది. తాజాగా, ఈ కేసును విచారించిన న్యాయస్థానం మరోసారి సింగ్‌ను పరారీలో ఉన్నట్లు ప్రకటించింది. -
పోలీసుల ముందే ఫైటింగ్..!
-
Sakshi Cartoon: ముందు ప్రత్యుర్థుల పని పడతాడట!
ముందు ప్రత్యుర్థుల పని పడతాడట! -
ఒకరు పోతే.. ఐదుగురు వచ్చారు
లక్నో: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. పార్టీ ఫిరాయింపులు జోరందుకుంటున్నాయి. బీఎస్పీ మాజీ నేత స్వామి ప్రసాద్ మౌర్య బీజేపీలో చేరిన మరుసటి రోజే.. ఇతర పార్టీలకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, మరో మాజీ మంత్రి బీఎస్పీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, అధికార సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే బుధవారం బీఎస్పీలో చేరినట్టు ఆ పార్టీ నేత నసీముద్దీన్ చెప్పారు. బీఎస్పీలో చేరినవారిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నవాబ్ ఖాజిం (రాంపూర్ జిల్లా స్వర్), మహ్మద్ ముస్లిం (అమేథిలోని టిలోయి), దిల్నావాజ్ ఖాన్ (బులంద్షార్), ఎస్పీ ఎమ్మెల్యే నవాజిష్ అలాం ఖాన్ (ముజఫర్ నగర్ జిల్లా బుధాన) ఉన్నారు. అలాగే బీజేపీకి చెందిన మాజీ మంత్రి అవదేష్ వర్మ కూడా బీఎస్పీలో చేరారు. వీరు ఎలాంటి షరతులు లేకుండా పార్టీలో చేరారని నసీముద్దీన్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో వీరికి బీఎస్పీ తరఫున టికెట్లు దక్కవచ్చని భావిస్తున్నారు.