breaking news
Sour Throat
-
ఫారింజైటిస్...
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 32 ఏళ్లు. నాకు గత కొంతకాలంగా గొంతు పచ్చి చేసి పుండులా ఏర్పడటంతో తీవ్రమైన గొంతునొప్పి వస్తోంది. ఆహారం మింగే సమయంలో ఇబ్బందిగా ఉంటోంది. మందులు వాడినప్పుడు సమస్య తగ్గినా జలుబు చేసినప్పుడు, తెల్లవారుజామున చల్లటి వాతావరణాన్ని ఎదుర్కొన్న ప్రతిసారీ సమస్య తిరగబెడుతోంది. గత చలికాలంలో నాకు ఈ సమస్య మరీ ఎక్కువగా ఉండేది. అయితే పగటివేళ ఎండ ఎక్కువగానే ఉంటున్నా... ఇప్పుడు ఉదయం పూట చలికి తిరిగినప్పుడు సమస్య మళ్లీ మళ్లీ వస్తోంది. హోమియో చికిత్స ద్వారా మళ్లీ తిరగబెట్ట విధంగా పూర్తిగా నయం చేసేలా సలహా ఇవ్వగలరు. – సంతోష్మోహన్, నిజామాబాద్ మీరు తెలిపిన వివరాలను బట్టి మీరు ఫ్యారింజైటిస్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. గొంతు వెనక భాగాన్ని ఫ్యారింగ్స్ అంటారు. ఈ భాగానికి ఇన్ఫెక్షన్ రావడాన్ని ఫ్యారింజైటిస్ లేదా సోర్ థ్రోట్ అంటారు. సాధారణంగా ఈ వ్యాధి ఒక వారం రోజలలో తగిపోతుంది. కానీ సరైన చికిత్స అందించకుండా తరచూ ఈ వ్యాధికి గురవుతున్నట్లయితే చెవి ఇన్ఫెక్షన్లు, సైనసైటిస్, కిడ్నీ సంబంధింత వ్యాధులు (గ్లోమరులోనెఫ్రైటిస్), రుమాటిక్ ఫీవర్ వంటి వాటికి దారితీయవచ్చు ఒక్కోసారి శరీరమంతా ఇన్ఫెక్షన్ వ్యాపించే అవకాశం కూడా ఉంది. కారణాలు: ►ఈ వ్యాధి 90 శాతం కేసుల్లో వైరస్ వల్ల కలుగుతుంది. జలుబు, ఫ్లూ, మీజిల్స్, మోనోనూక్లియోసిస్, చికన్పాక్స్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఈ సమస్యకు కారణం కావచ్చు. ►మరికొంత మందిలో ఇది బ్యాక్టీరియా వల్ల కూడా కావచ్చు. కోరింతదగ్గు, కొన్ని స్టెఫలోకోకస్ సూక్ష్మజీవులు, డిఫ్తీరియా వంటి బ్యాక్టీరియా వల్ల కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. ►ఈ ఇన్ఫెక్షన్కు గురైన వ్యక్తి దగ్గడం లేదా తుమ్ముడం చేసినప్పుడు ఆ తుంపిర్ల ద్వారా వైరస్ లేదా బ్యాక్టీరియా గాల్లోకి చేరి, తద్వారా ఇతర వ్యక్తులకు వ్యాపించే అవకాశం ఉంది. ►పొగతాగడం, పరిశుభ్రత పాటించకపోవడం, వ్యాధికి గురైన వ్యక్తితో సన్నిహితంగా ఉండటం వంటి అంశాల వల్ల ఈ వ్యాధికి గురయ్యే అవకాశం ఉంటుంది. ► కొన్ని అలర్జీలు, గొంతుకండరాలు ఒత్తిడికి గురికావడం, గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ), హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లు, గొంతు, నాలుక లేదా లారింగ్స్లో కణుతులు ఏర్పడటం వల్ల కూడా గొంతు నొప్పి కలుగుతుంది. లక్షణాలు: ► ఫ్యారింజైటిస్ ముఖ్యలక్షణాల్లో గొంతునొప్పి, మింగేటప్పుడు నొప్పిగా ఉండటం చాలా ముఖ్యమైనవి. మిగతా లక్షణాలు ఇన్ఫెక్షన్కు కారణమైన బ్యాక్టీరియా లేదా వైరస్ మీద ఆధారపడి ఉంటాయి. ► వైరల్ ఫ్యారంజైటిస్ : గొంతునొప్పితో పాటు గొంతులోపలి భాగం ఎర్రగా మారడం, ముక్కు కారణం లేదా ముక్కుదిబ్బడ, పొడిదగ్గు, గొంతు బొంగురుపోవడం, కళ్లు ఎర్రబారడం, చిన్న పిల్లల్లో విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్లలో నోటిలో, పెదవులపై పుండ్లలా ఏర్పడటం కూడా సంభవిస్తుంది. ► బ్యాక్టీరియల్ ఫ్యారంజైటిస్ : దీనిలో కూడా గొంతు పచ్చిగా ఉండటం, మింగే సమయంలో నొప్పి కలగడం, గొంతు ఎర్రగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్లతో పోలిస్తే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లలో లక్షణాల తీవ్రత ఎక్కువ. ► పైన పేర్కొన్న లక్షణాలతో పాటు జ్వరం, ఒంటినొప్పులు, తలనొప్పి, టాన్సిల్స్ వాపు, వాటి చుట్టూ తెల్లటి పొర ఏర్పడటం, గొంతుకు ముందుభాగంలోని లింఫ్గ్రంథుల వాపు వంటి లక్షణాలు గమనించవచ్చు. ► ఇదే సమస్య పిల్లల్లో వస్తే... కొంతమంది చిన్నపిల్లల్లో వికారం, వాంతులు, కడుపునొప్పి వంటి లక్షణాలూ కనిపించవచ్చు. చికిత్స: ఒంట్లోని రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు సూక్ష్మజీవుల వల్ల ఫ్యారింజైటిస్ వస్తుంది. జెనెటిక్ కన్స్టిట్యూషన్ పద్ధతిలో రోగి శరీర తత్వాన్ని బట్టి, వ్యాధి లక్షణాలు, కారణాలు, వాతావరణంలోని మార్పుల ఆధారంగా చికిత్స చేయవచ్చు. హోమియో విధానంలో చికిత్సతో ఈ వ్యాధిని సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఈ సమస్యకు దీర్ఘకాలికంగా యాంటీబయాటిక్స్ వాడితే కొన్ని దుష్ప్రభావాలు ఉండవచ్చు. కానీ హోమియో విధానంలో సమస్య మళ్లీ తిరగబెట్టకుండా చికిత్స చేయడం సాధ్యమే. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్డి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ -
మోదీకి గొంతు నొప్పి.. ప్రసంగంలో కోత!
గొంతునొప్పితో తీవ్రంగా బాధపడుతున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. తన ప్రసంగాన్ని తొమ్మిది నిమిషాలకు పరిమితం చేశారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. అక్కడ ఎక్కువసేపు మాట్లాడలేకపోయారు. వాస్తవానికి గురువారం నాడు జమ్ము కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ సైనికుల విషయంలో తాను మాట్లాడాల్సిన అవసరం లేదని, జవాన్ల చూపుడువేళ్లే మాట్లాడతాయంటూ ట్రిగ్గర్ నొక్కినట్లు చూపించే సమయంలో కూడా ఆయన తన సహజశైలికి భిన్నంగా.. చాలా లోగొంతుకతో మాట్లాడారు. గతరాత్రి వరకు తన పరిస్థితి బాగానే ఉందని, తెల్లవారుజామున ఉన్నట్లుండి బాగా ఇబ్బంది అయ్యిందని అంటున్నారు. భారీస్థాయిలో వచ్చిన ప్రజలకు, బీజేపీ కార్యకర్తలకు ప్రధాని క్షమాపణలు చెప్పారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మరోసారి తప్పనిసరిగా వచ్చి అందరితో మాట్లాడతానని వాళ్లకు హామీ ఇచ్చారు.