breaking news
sl travels
-
అర్థరాత్రి రోడ్డుపై పడిగాపులు
- చెడిపోయిన ఎస్ఎల్ ట్రావెల్స్ - ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు గుత్తి: ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయించి ప్రయాణం సాగిస్తున్న వారి కష్టాలు చెప్పనలవి కాని విధంగా మారుతున్నాయి. అకస్మాత్తుగా బస్సు రిపేరుకు వస్తే.. గంటల తరబడి రోడ్డుపై నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఎస్ ఎల్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అనంతపురం జిల్లా గుత్తి మండలం రామరాజుపల్లి టోల్‌ప్లాజా సమీపంలో చెడిపోయింది. అయితే ట్రావెల్స్ యాజమాన్యం బస్సును రిపేర్ చేయించడం గానీ, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు గానీ చేయలేదు. దీంతో బస్సులో ఉన్న 22 మంది ప్రయాణికులు రోడ్డుపై అక్కడే పడిగాపులు కాస్తున్నారు. ట్రావెల్స్ యాజమాన్యం స్పందించడం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. ప్రత్యామ్నాయం చూపక పోవడంతో వారంత గత అర్థరాత్రి నుంచి రహదారిపై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణీకులు రహదారిపై ఆందోళనకు దిగారు. -
ట్రావెల్స్ బస్సు బోల్తా: ఒకరు మృతి
అనంతపురం: అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో గురువారం వేకువజామున జరిగిన బస్సు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన ఎస్ఎల్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో బోల్తాపడింది. ఈప్రమాదంలో ఒక యువతి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇరవై మంది గాయాలపాలయ్యారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.