అర్థరాత్రి రోడ్డుపై పడిగాపులు | technical problem in SL travels | Sakshi
Sakshi News home page

అర్థరాత్రి రోడ్డుపై పడిగాపులు

Apr 7 2016 8:49 AM | Updated on Sep 3 2017 9:25 PM

ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయించి ప్రయాణం సాగిస్తున్న వారి కష్టాలు చెప్పనలవి కాని విధంగా మారుతున్నాయి.

- చెడిపోయిన ఎస్ఎల్ ట్రావెల్స్
- ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు


గుత్తి: ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయించి ప్రయాణం సాగిస్తున్న వారి కష్టాలు చెప్పనలవి కాని విధంగా మారుతున్నాయి. అకస్మాత్తుగా బస్సు రిపేరుకు వస్తే.. గంటల తరబడి రోడ్డుపై నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఎస్ ఎల్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అనంతపురం జిల్లా గుత్తి మండలం రామరాజుపల్లి టోల్‌ప్లాజా సమీపంలో చెడిపోయింది. అయితే ట్రావెల్స్ యాజమాన్యం బస్సును రిపేర్ చేయించడం గానీ, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు గానీ చేయలేదు.

దీంతో బస్సులో ఉన్న 22 మంది ప్రయాణికులు రోడ్డుపై అక్కడే పడిగాపులు కాస్తున్నారు. ట్రావెల్స్ యాజమాన్యం స్పందించడం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. ప్రత్యామ్నాయం చూపక పోవడంతో వారంత గత అర్థరాత్రి నుంచి రహదారిపై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణీకులు రహదారిపై ఆందోళనకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement