breaking news
Six farmers
-
ఆరుగురు రైతుల ఆత్మహత్య
సాక్షి నెట్వర్క్: అప్పుల బాధతో వేర్వేరు జిల్లాల్లో బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి వరకు ఆరుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం భూతాయి(కే) పరిధి మాన్కపూర్‌కు చెందిన రైతు బాంద్రే అమర్‌సింగ్(20) వర్షాలు లేక సాగు చేసిన సోయ పంట వాడిపోయింది. రూ. 2 లక్షల వరకు అప్పులు తీర్చలేక బుధవారం పురుగుల మందు తాగాడు. నిజామాబాద్ జిల్లా వెల్కటూర్ జీపీ పరిధిలోని నడిమితండాకు చెందిన రైతు నూనవత్ అమర్‌సింగ్ (37) వర్షాలు లేక పంటలు గట్టెక్కే పరిస్థితి లేదని కుంగి బుధవారం ఉరివేసుకున్నాడు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలానికి చెందిన రైతు బడుగుల వీరస్వామి(36) వ్యవసాయ పెట్టుబడులకు రూ.5.50 లక్షల వరకు అప్పులు చేశాడు. సరిగా దిగుబడి రాకపోవడంతో గురువారం ఉరి వేసుకున్నాడు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం తిప్పనగుల్లకు చెందిన బొమ్మ బాలమల్లు(45) కూతురు వివాహానికి, ఇంటి నిర్మాణానికి అప్పు చేశాడు. పంటల దిగుబడి తగ్గడంతో అప్పు తీరే మార్గం కనిపించక గురువారం ఉరి వేసుకున్నాడు. వికారాబాద్ జిల్లాలోని బూర్గుపల్లికి చెందిన గంగారం నర్సింలు(28) సాగుచేసిన పత్తి, మొక్కజొన్న వర్షాలు లేక ఎండిపోయాయి. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు రూ. 3 లక్షలకు చేరాయి. అప్పు తీరే మార్గం కనిపించక గురు వారం పురుగుల మందు తాగాడు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం జాఫర్‌గూడెం శివారు రామన్న గూడెంకు చెందిన రైతు పేరబోయిన వీరస్వామి(35) సాగుకోసం చేసిన రూ. 3 లక్షల అప్పు తీరే మార్గం కనిపించక గురువారం పురుగుల మందు తాగాడు. -
అప్పుల బాధతో ఆరుగురు రైతుల ఆత్మహత్య
సాక్షి, నెట్వర్క్: వరంగల్, ఆదిలాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అప్పుల బాధతో ఆరుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు.. వరంగల్ జిల్లా గూడూరు మండలంలోని రాములుతండాకు చెందిన గిరిజన రైతు బానోతు ఈర్యా (42)కు రెండు ఎకరాల పొలం ఉంది. పంట సరిగా పండలేదు. అప్పుల బాధతోపాటు కూతురు పెళ్లి ఎలా చేయాలన్న మనోవేదనతో ఆదివారం పురుగుల మందు తాగాడు. ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం ఎగ్గాం గ్రామానికి చెందిన రైతు చిన్నగంగన్న(45) తన భూమిలో పత్తి సరిగా మొలకెత్తలేదు. దీంతో రెండోసారి విత్తి, డీజిల్ ఇంజిన్ తెచ్చి వాగు నీటిని పంటకు పారించాడు. రూ.2 లక్షలు అప్పు తెచ్చాడు. పెట్టుబడి తిరి గొచ్చే పరిస్థితి లేకపోవడం.. అప్పులు తీర్చే మార్గం కని పించకపోవడంతో శనివారం విషం తాగాడు. మహబూబ్‌నగర్ జిల్లా కొందుర్గు మండలం శ్రీరంగాపూర్‌కి చెందిన చిటికెల నర్సింహులు(30) పురుగుమందు తాగి ఉస్మాని యా ఆస్పత్రి శనివారంరాత్రి మృతి చెందాడు. మిడ్జిల్ మం డలం బైరంపల్లికిచెందిన గోపాల్జీ(60) సాగు చేసిన వరి, పత్తి ఎండిపోవడంతో ఆదివారం కరెంటు తీగలను పట్టుకుని మృతి చెందాడు. చిన్నఎల్కిచర్ల పంచాయతీ పరిధిలోని పుల్లప్పగూడకి చెందిన గొల్ల (చక్కని) నర్సింహులు(30) పదెకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పత్తి, మొక్కజొన్న పంటలు వేశాడు. రూ.రెండులక్షలకు పైగా అప్పులు చేశాడు. పంటచేతికి రాకపోవడంతో శనివారం రాత్రి ఉరేసుకున్నాడు. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మం డలం పాశంవారిగూడేనికి చెందిన మారెడ్డి వెంకట్‌రెడ్డి (44) తన 15 ఎకరాల భూమితోపాటు మరో 15 ఎకరాలు కౌలు కు తీసుకుని పత్తి సాగు చేశాడు. రూ.5 లక్షల పెట్టుబడి పెట్టాడు. వర్షాభావం, తెగుళ్లతో పెట్టుబడి వచ్చే పరిస్థితి లేకపోవడంతో పురుగుల మందు తాగాడు.