Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Police Have Registered Case Against Ys Jagan
వైఎస్‌ జగన్‌పై చంద్రబాబు సర్కార్‌ కక్ష సాధింపు

సాక్షి, విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై చంద్రబాబు సర్కార్‌ కక్ష సాధింపు చర్యలకు దిగింది. రఘురామకృష్ణం రాజు ఫిర్యాదును అడ్డం పెట్టుకుని వైఎస్‌ జగన్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. పోలీసులు కొట్టారంటూ ఫిర్యాదు చేస్తే.. మాజీ ముఖ్యమంత్రిపై కేసు నమోదు చేశారు. పోలీసులు వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.మాజీ సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు సీఐడీ మాజీ డీజీ సునీల్‌కుమార్‌పై కూడా కేసు నమోదైంది. రఘురామ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కస్టడీలో తనపై హత్యాయత్నం చేశారని రఘురామకృష్ణం రాజు ఫిర్యాదు చేశారు. కేసులో ఏ3గా వైఎస్‌ జగన్ పేరును పోలీసులు నమోదు చేశారు.ఏ1గా సీఐడీ మాజీ డీజీ సునీల్‌కుమార్, ఏ2గా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, ఏ4గా విజయ్‌పాల్, ఏ5గా డాక్టర్‌ ప్రభావతి పేరును పోలీసులు చేర్చారు. మే 14న జరిగిన ఘటనపై.. నిన్న సాయంత్రం ఈ-మెయిల్ ద్వారా రఘురామకృష్ణ ఫిర్యాదు చేశారు. గతంలో సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసుకు సంబంధించి రఘురామ మళ్లీ ఫిర్యాదు చేయడం.. ఆపై కేసు నమోదు చేయించడం ద్వారా.. టీడీపీ ప్రభుత్వం కుట్రలకు తెరలేపుతోంది.వారి విజ్ఞతకే వదిలేస్తున్నా.. సీఐడీ మాజీ డీజీ ట్వీట్‌తనపై కేసు నమోదు చేయడంపై సీఐడీ మాజీ డీజీ స్పందించారు. సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్‌ఐఆర్‌ వేయడాన్ని ఏమనాలో వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ సునీల్‌ ట్వీట్‌ చేశారు.సుప్రీం కోర్టులో మూడేళ్ళు నడిచి … సాక్షాత్తూ సుప్రీమ్ కోర్ట్ తిరస్కరించిన కేసులో కొత్తగా FIR వేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను— PV Sunil Kumar (@PV_Sunil_Kumar) July 12, 2024

Indian 2: Bharateeyudu 2 Movie Review And Rating In Telugu
‘భారతీయుడు 2’ మూవీ రివ్యూ

టైటిల్‌: భారతీయుడు 2(ఇండియన్‌ 2)నటీనటులు: క‌మ‌ల్ హాస‌న్‌, ఎస్‌.జె.సూర్య‌, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సిద్ధార్థ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్,స‌ముద్ర‌ఖ‌ని, బాబీ సింహ‌, బ్ర‌హ్మానందం తదితరులునిర్మాణ సంస్థ: లైకా ప్రొడ‌క్ష‌న్స్, రెడ్ జెయింట్నిర్మాత: సుభాస్క‌ర‌న్ క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: ఎస్‌.శంక‌ర్‌సంగీతం: అనిరుధ్ రవిచందర్ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌సినిమాటోగ్రఫీ: రవి వర్మన్‌విడుదల తేది: జులై 12, 2024కమల్‌ హాసన్‌ నటించిన బెస్ట్‌ చిత్రాల్లో ‘భారతీయుడు’ ఒకటి. శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ 1996లో విడుదలై బాక్సాఫీస్‌ని షేక్‌ చేసింది. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో ‘భారతీయుడు 2’(Bharateeyudu 2 Review) పై భారీ హైప్‌ క్రియేట్‌ అయింది.భారీ అంచనాల మధ్య నేడు(జులై 12) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. భారతీయుడు 2 కథేంటంటే..చిత్ర అరవిందన్‌(సిద్దార్థ్‌), హారతి(ప్రియాభవాని శంకర్‌) ఇంకో ఇద్దరు స్నేహితులు కలిసి సోషల్‌ మీడియా వేదికగా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు చేసే అన్యాయాలపై వీడియోలు చేసి బార్కింగ్‌ డాగ్స్‌ అనే పేరుతో య్యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ ఇతర సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో షేర్‌ చేస్తుంటారు. వారి చుట్టు జరిగిన కొన్ని సంఘటనలు చూసి చలించిపోయిన అరవిందన్‌.. మళ్లీ భారతీయుడు వస్తే బాగుంటుందని భావిస్తాడు. కమ్‌బ్యాక్‌ ఇండియా(Comeback India) హ్యాష్‌ట్యాగ్‌తో సేనాపతి(కమల్‌ హాసన్‌) మళ్లీ ఇండియా రావాలని పోస్టులు పెడతారు. అవికాస్త వైరల్‌ అయి.. చైనీస్ తైపీలో ఉన్న సేనాపతి అలియాస్‌ భారతీయుడుకి చేరతాయి. దీంతో సేనాపతి తిరిగి ఇండియా వస్తాడు. ఈ విషయం తెలుసుకున్న సీబీఐ అధికారి ప్రమోద్‌(బాబీ సింహా).. అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. కానీ భారతీయుడు గెటప్స్‌ మారుస్తూ అవినీతికి పాల్పడిన వారిని దారుణంగా హత్య చేస్తుంటారు. భారతీయుడు ఇచ్చిన పిలుపుతో దేశంలోని యువత కూడా అవితీనికి వ్యతిరేకంగా పని చేస్తుంటుంది. ఈ క్రమంలో అరవిందన్‌ ఫ్యామిలీలో ఓ విషాదం చోటు చేసుకుంటుంది. దానికి కారణంగా భారతీయుడే అని అరవిందన్‌తో సహా అందరూ నిందిస్తారు. అసలు అరవిందన్‌ ఇంట్లో చోటు చేసుకున్న ఆ విషాదం ఏంటి? దానికి భారతీయుడు ఎలా కారణం అయ్యాడు? కమ్‌బ్యాక్‌ ఇండియా అని భారతీయుడిని ఆహ్వానించిన యువతే.. గోబ్యాక్‌ ఇండియా అని ఎందుకు నినదించారు? సామాన్యులకు సైతం భారతీయుడుపై ఎందుకు కోపం పెరిగింది? రియల్‌ ఎస్టేట్‌ పేరుతో అ‍క్రమంగా భూములను స్వాధీనం చేసుకుంటూ వేలకోట్లు సంపాదించిన సద్గుణ పాండ్యన్(ఎస్‌ జే సూర్య)..సేనాపతిని చంపేందుకు వేసిన ప్లాన్‌ వర్కౌంట్‌ అయిందా? సీబీఐ అధికారులకు దొరికిన సేనాపతి..వారి నుంచి ఎలా తప్పించుకున్నాడు? అసలు సేనాపతి టార్గెట్‌ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే అంటెండర్‌ దగ్గర నుంచి ఆర్డర్ లిచ్చే అధికారుల వరకు లంచం అనే మాట ఎలా నాటుకుపోయిందో ‘భారతీయుడు’లో కళ్లకు కట్టినట్లు చూపించాడు శంకర్‌. ఆ సినిమా విడుదలై ఏళ్లు గడుస్తున్నా.. ఆ కథ, అందులోని పాత్రలు మనకు అలా గుర్తిండిపోతాయి. అలాంటి సూపర్‌ హిట్‌ సినిమాకు సీక్వెల్‌ అంటే..కచ్చితంగా అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. అయితే ఆ అంచనాలకు తగ్గట్లుగా భారతీయుడు 2ని తీర్చిదిద్దలేకపోయాడు శంకర్‌. స్టోరీ లైన్‌ మాత్రమే కాదు చాలా సన్నివేశాలు ‘భారతీయుడు’చిత్రాన్నే గుర్తు చేస్తాయి. అయితే అందులో వర్కౌట్‌ అయిన ఎమోషన్ ఇందులో మిస్‌ అయింది. ప్రతి సీన్‌ సినిమాటిక్‌గానే అనిపిస్తుంది కానీ.. ఎక్కడ కూడా రియాల్టీగా దగ్గరగా ఉండదు. స్క్రీన్‌ప్లే కూడా చాలా రొటీన్‌గా ఉంటుంది. పార్ట్‌ 3 కోసమే అన్నట్లుగా కథను సాగదీశారు. కొన్ని సీన్లు చూస్తే నిజంగానే ఈ చిత్రానికి శంకర్‌ దర్శకత్వం వహించారా అనే అనుమానం కలుగుతుంది. భారతీయుడులో అవినీతికి పాల్పడిన వారిని సేనాపతి చంపుతుంటే మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కానీ ఇందులో మాత్రం అలాంటి సీన్లను కూడా చాలా చప్పగా తీసేశాడు. సినిమా నిడివి( 3 గంటలు) కూడా మైనస్సే. కొన్ని సీన్లను తొలగించి.. నిడివిని తగ్గిస్తే బాగుండేది (తొలగించడానికి ఒక్క సీన్‌ లేదనే పార్ట్‌ 3 ప్లాన్‌ చేశామని ఓ ఇంటర్వ్యూలో శంకర్‌ చెప్పారు..కానీ సినిమా చూస్తే సాధారణ ప్రేక్షకుడు సైతం కట్‌ చేయాల్సిన సీన్ల గురించి చెప్పగలడు). ఫ్యామిలీ ఎమోషన్స్‌ కూడా అంతగా ఆకట్టుకోలేదు. భారతీయుడు సినిమాలాగే ఈ కథ కూడా మొత్తం లంచం చుట్టే తిరుగుతుంది. సినిమా ప్రారంభ సీన్‌తోనే ఆ విషయం అర్థమైపోతుంది. అవినీతికి వ్యతిరేకంగా చిత్ర అరవిందన్‌ గ్యాంగ్‌ చేసే పోరాటం కాస్త ఆసక్తికరంగా అనిపించినప్పటికీ.. అవినీతి జరిగే సీన్లను బలంగా చూపించలేకపోయాడు. ఇక సేనాపతి ఎంట్రీ సీన్‌తో కథపై ఆసక్తి పెరుగుతుంది. కానీ ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత..కథనం రొటీన్‌గా సా..గూ..తూ.. చిరాకు తెప్పిస్తుంది. తరువాత ఏం జరుగుతందనే విషయం ముందే తెలిసిపోవడంతో.. కథపై అంత ఆసక్తి కలగదు. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ కూడా సింపుల్‌గానే ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో కథ మరింత సాగదీతగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో మర్మకళను ఉపయోగించి సీక్స్‌ ఫ్యాక్‌తో కమల్‌ చేసే యాక్షన్‌ సీన్‌ బాగుంటుంది. కానీ ఆ తర్వాత వచ్చే ఛేజింగ్‌ సీన్‌ అయితే సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ముగింపులో పార్ట్‌ 3 స్టోరీ ఎలా ఉంటుందో చూపించారు. అది కాస్త ఆసక్తికరంగానే అనిపిస్తుంది. అవినీతిని అంతం చేయాలంటే అది మొదట మన ఇంటి నుంచే ప్రారంభించాలని యూత్‌కి ఇచ్చిన మెసేజ్‌ మాత్రం బాగుంది. ఎవరెలా చేశారంటే..వైవిధ్యమైన పాత్రలు పోషించడం కమల్‌ హాసన్‌కు కొత్తేమి కాదు. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోతుంటాడు. సేనాపతి పాత్రలో కమల్‌ ఒదిగిపోయాడు. రకరకాల గెటప్స్‌లో కనిపిస్తూ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. యాక్షన్‌ సీన్స్‌ కూడా అదరగొట్టేశాడు. అయితే ఆయన గొంతే ఒక్కో చోట ఒక్కోలా వచ్చింది. సిక్స్‌ ఫ్యాక్స్‌తో కమల్‌ చేసే యాక్షన్‌ సీన్‌కి థియేటర్‌లో ఈళలు పడతాయి.ఇక హీరో సిద్ధార్థ్‌కి మంచి పాత్ర దక్కింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసే చిత్ర అరవిందన్‌ పాత్రకు న్యాయం చేశాడు. ఎమోషన్‌ సీన్లలో అదరగొట్టేశాడు. సిద్ధార్థ్‌ స్నేహితురాలికిగా ప్రియా భవానీ శంకర్‌ ఆకట్టుకుంది. సిద్ధార్థ్‌ ప్రియురాలు దిశగా నటించిన రకుల్‌కి ఈ చిత్రంలో ఎక్కువగా స్క్రీన్‌ స్పేస్‌ లభించలేదు. సినిమా మొత్తంలో రకుల్‌ మూడు, నాలుగు సీన్లలో మాత్రమే కనిపిస్తుంది. సీబీఐ అధికారి ప్రమోద్‌గా బాబీ సింహా ఉన్నంతగా బాగానే నటించాడు. వ్యాపారీ సద్గుణ పాండ్యన్‌గా ఎస్‌ జే సూర్యకి పార్ట్‌ 3లోనే ఎక్కువ నిడివి ఉన్నట్లు ఉంది. ఇందులో కేవలం మూడు సీన్లలో కనిపించి వెళ్తాడు. ఏసీబీ అధికారిగా సముద్రఖనితో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. టెక్నికల్‌గా సినిమా పర్వాలేదు.అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతం యావరేజ్‌గా ఉంది. ఇక పాటలు గురించి మాట్లాడుకోవద్దు. ఒక్కటి కూడా గుర్తుంచుకునే విధంగా లేవు. రవి వర్మన్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమాలో సాగదీత సన్నివేశాలు చాలా ఉన్నాయి. వాటిని మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Ksr Comments On Attack On Deccan Chronicles In AP, And Nara Lokesh's Behavior
యూటర్న్‌ బాబు.. ఎందుకంత ఉలికిపాటు?

విశాఖపట్నంలోని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై తెలుగుదేశం గూండాలు దాడి చేశారు. విధ్వంసం సృష్టించారు. విలువైన ప్రింటింగ్ యంత్ర సామాగ్రిని నాశనం చేయాలని చూశారు.. ఇది డెక్కన్ క్రానికల్ అధికారికంగా ఇచ్చిన కథనం. మరో విషయం చూద్దాం. ఏపీ మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ దీనిపై ఒక ప్రకటన చేశారు. 'డెక్కన్ క్రానికల్ డిస్ ప్లే బోర్డుపై జరిగిన దాడిని ఖండిస్తున్నాను. టీడీపీ నేతలు, కార్యకర్తలు తమ భావోద్వేగాలను ఇలా చూపరాదు'.ఈ రెండు ప్రకటనల మధ్య తేడాను గమనించారా? తెలుగుదేశం కార్యకర్తలు కేవలం బోర్డును తగులపెట్టారు తప్ప ఇంకేమీ జరగలేదన్నట్లుగా లోకేష్ ప్రకటన ఉంటే, తమ కార్యాలయంపై టీడీపీ గూండాలు ఏ రకంగా దాడి చేసింది, ఫర్నిచర్ తదితర సామాగ్రిని ధ్వంసం చేసింది. మహిళా ఉద్యోగుల పట్ల ఎలా అసభ్యంగా వ్యవహరించింది. ఆఫీస్‌పై రాళ్లు విసిరిన వైనం మొదలైనవాటి గురించి క్రానికల్ సవివరంగా రాసింది. అంటే ఈ ఘటన తీవ్రత కనిపంచకుండా ఉండడానికి లోకేష్ యత్నిస్తూ, ఒక విషయాన్ని మాత్రం అంగీకరించారు. క్రానికల్ ఆఫీస్‌పై దాడి చేసింది టీడీపీ కార్యకర్తలేనని. క్రానికల్ పత్రిక మాత్రం వారంతా టీడీపీ గూండాలని స్పష్టంగా ప్రకటించింది. వారిలో కొందరు మహిళలు కూడా ఉండడం మరో ప్రత్యేకత. తదుపరి రెండు రోజులకు విశాఖ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘటనపై పెద్దగా స్పందించకుండా కార్యకర్తలు ఆఫీస్‌ల వద్ద నిరసనలు చెప్పవద్దని సలహా ఇచ్చారు. అంతే తప్ప ఇలాంటి దాడులు తప్పు అని చెప్పినట్లు కనిపించలేదు.ఏపీలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంభవించిన విధ్వంస కాండ గతంలో ఎన్నడూ జరగనిది. టీడీపీ గూండాలు, సంఘ వ్యతిరేక శక్తులు వైఎస్పార్‌సీపీ అనుకూలరులపై దారుణమైన రీతిలో దాడులు చేశారు. విధ్వంసాలకు పాల్పడ్డారు. వైఎస్సార్‌ విగ్రహాలను దగ్దం చేశారు. కొంతమందిని కత్తులతో పొడిచారు. కర్రలతో కొట్టారు. ప్రభుత్వ కార్యాలయాలపై దాడి చేసి బోర్డులు పీకేశారు. ఇంత జరుగుతున్నా చేష్టలుడిగిన పోలీస్ యంత్రాంగం, మానసికంగా పైశాచికానందం పొందుతున్న టీడీపీ నాయకత్వం కారణంగా టీడీపీ గుండాలు తమ ఇష్టారాజ్యంగా అరాచకాలను కొనసాగిస్తున్నారు. వాటికి పరాకాష్టగా ఇప్పుడు మీడియాపై కూడా దాడి చేశారు.ఇలాంటి ఘటనే కనుక వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగి ఉంటే మొత్తం దేశం అంతా ఈనాడు, జ్యోతి వంటి టీడీపీ మీడియా హోరెత్తించేవి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మొత్తం రాష్ట్రం అంతా తిరిగి గగ్గోలు పెట్టేవారు. వీలైతే ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, హోం మంత్రి.. ఇలా ఎవరు కలిస్తే వారిదగ్గర ఏపీ అంతా అట్టుడికిపోతోందని చెప్పేవారు. పత్రికా స్వేచ్చ కనుమరుగు అవుతున్నా జర్నలిస్టులకు చీమ కుట్టినట్లు లేదని చంద్రబాబు ప్రచారం చేసేవారు. కానీ ఇప్పుడు స్వయంగా టీడీపీ గూండాలు చేస్తున్న ఈ అరాచకాన్ని ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు స్పష్టంగా ఖండించలేదు. డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై దాడి చేసినవారిని పట్టుకుని కేసు పెట్టాలని, వెంటనే అరెస్టు చేయాలని ఆదేశాలు ఇవ్వలేదు. ఆయనే మాట్లాడనప్పుడు హోం మంత్రి అనిత వంటివారు ఎందుకు పట్టించుకుంటారు!టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు తర్వాత అత్యంత కీలక వ్యక్తిగా ఉన్న లోకేష్ కూడా ఎక్కడా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పలేదు. క్రానికల్ ఆఫీస్‌పై దాడి గురించి సిబ్బంది ఫోన్ చేస్తే పోలీసులు వచ్చారు. కానీ వారిని చూసి టీడీపీ గూండాలు పారిపోయారని క్రానికల్ తెలిపింది. మరి ఈ దాడులు చేసినవారిని ఎప్పటికి పట్టుకుంటారో, ఎప్పటికి కేసులు పెడతారో తెలియదు. అరెస్టులు చేయకుండా నోటీసులు ఇవ్వడం విశేషం. ఏపీ వ్యాప్తంగా వందలాది చోట్ల టీడీపీ గూండాలు అకృత్యాలకు పాల్పడినా కేసులు పెట్టని పోలీసు యంత్రాంగం విశాఖలో మీడియా ఆఫీస్ మీద జరిగిన దాడి మీద మాత్రం గట్టిగా స్పందిస్తుందా అనేది అనుమానమే. ఒకవేళ పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి దాడికి వచ్చినవారిని అదుపులోకి తీసుకుంటే మాత్రం అభినందించవచ్చు.మరో విషయం చెప్పాలి. గత ఐదేళ్లపాటు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వంపై రంకెలు వేస్తూ, పచ్చి అబద్దాలను ప్రచారం చేసి, రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఏదో ప్రమాదం జరిగిపోయినట్లు ఉపన్యాసాలు ఇచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసంపైన, మీడియాపై జరిగిన దాడి మీద కనీసం స్పందించలేదు. అది ఆయన నిజాయితి, చిత్తశుద్ది. ఇప్పటికే సాక్షితో సహా పలు మీడియా సంస్థలపై అనధికార ఆంక్షలు పెట్టి వేధిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఇక ప్రత్యక్ష దాడులకు తెగబడడం అత్యంత దురదృష్టకరం.ఇక సంగతి ఏమిటి?విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయడానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం సుముఖంగా ఉందన్నది క్రానికల్ రాసిన వార్త సారాంశం. నిజానికి క్రానికల్ ఈ వార్తను ముందుగా వెలుగులోకి తేలేదు. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌ అనే పత్రిక ఈ విషయాన్ని వెల్లడించి, టీడీపీ, జనసేనలు విశాఖ ఉక్కు విషయంలో యు టర్న్ తీసుకుంటున్నాయని తెలిపింది. ఒక టాప్ టీడీపీ లీడర్ ఈ విషయం చెప్పినట్లు కూడా ఆ పత్రిక రాసింది. అదృష్టవశాత్తు ఆ పత్రిక కార్యాలయం విశాఖలో లేదు కాబట్టి సరిపోయింది. ఉండి ఉంటే ఆ పత్రిక ఆఫీస్‌పై కూడా ఇలాగే దాడి చేసి బీభత్సం సృష్టించి ఉండేవారేమో!ఆ తర్వాత రోజు క్రానికల్ పత్రిక అదే వార్తను కొందరు దీనిపై గతంలో చేసిన వ్యాఖ్యలు, ప్రస్తుతం కేంద్రంలో మంత్రులుగా ఉన్న కొందరు ప్రైవేటైజేషన్‌కు అనుకూలంగా వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలతో కథనాన్ని ఇచ్చింది. అదే ఆ మీడియా చేసిన తప్పట. ఉన్న మాట అంటే ఉలికిపడినట్లుగా, టీడీపీ కూటమి యుటర్న్ తీసుకుంటోందని చెప్పడం వారికి ఆగ్రహం కలిగించింది. నిజానికి తెలుగుదేశంకు, ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు యూటర్న్‌లు తీసుకోవడం వెన్నతో పెట్టిన విద్య. ఆ సంగతి దేశ ప్రధాని నరేంద్ర మోదీనే గతంలో ఒకసారి చెప్పి యుటర్న్ బాబు అని పేరు పెట్టారు.నిజంగా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశంలో టీడీపీ, జనసేనల వైఖరి మారకపోతే అదే విషయాన్ని స్పష్టం చేసి ఉండవచ్చు. ఖండన ఇవ్వవచ్చు. లేదా ఆ పత్రిక అసత్యం రాసిందని వారు భావిస్తే శాంతియుతంగా నిరసన తెలపవచ్చు. అలాకాకుండా ఇలా దహనకాండకు పాల్పడ్డారంటే ఏమని అనుకోవాలి. ఏపీలో శాంతిభద్రతలు ఇంత ఘోరంగా ఉన్నాయని అర్ధం అవడం లేదా?తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, పవన్ కల్యాణ్ కానీ ఎవరూ ఎందుకు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై నిర్దిష్టంగా మాట్లాడడం లేదు. విశాఖ టూర్‌లో చంద్రబాబు తాము ప్రైవేటైజేషన్‌కు వ్యతిరేకమని మొక్కుబడిగా చెప్పినట్లు ఉంది తప్ప, దానికి కట్టుబడి ఉంటే ఏ రకంగా కేంద్రాన్ని ఒప్పిస్తామో చెప్పి ఉంటే కొంత విశ్వాసం ఏర్పడేది.కేంద్ర మంత్రి కుమారస్వామి ప్లాంట్ మూతపడకుండా చూస్తామని అంటున్నారు తప్ప ప్రైవేటైజేషన్ జరగదని స్పష్టంగా చెప్పినట్లు అనిపించదు. నిజమైన టీడీపీ, జనసేన కార్యకర్తలైతే ముందుగా తమ నాయకులను దీనిపై నిలదీయాలి! కనీసం వాస్తవమా? కాదా?అన్నది తెలుసుకోవాలి. అలాకాకుండా దహనకాండకు తెగబడడం అంటే వారి అరాచక స్వభావాన్ని నగ్నంగా ప్రదర్శించినట్లు అనుకోవాలి! చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు విశాఖ స్టీల్‌పై తమ కార్యాచరణను స్పష్టం చేస్తే సరే! లేకుంటే మీడియాలో వచ్చిన కథనాలన్ని వాస్తవమేనని భవిష్యత్తులో తేలుతుంది కదా! అప్పుడు అలవాటు ప్రకారం టీడీపీ కూటమి యూ టర్న్ తీసుకున్నట్లే కదా! దాని గురించి మీడియా రాస్తే మాత్రం దహనకాండకు పాల్పడతారా!– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు

Aalim Hakim Hairdresser Makeover To  Ambanis And Their Guests
అనంత్‌ అంబానీ గ్రాండ్‌ వెడ్డింగ్‌ : ఆలిమ్ హకీం స్టయిల్స్‌ మామూలుగా లేవుగా!

హెయిర్ డ్రెస్సర్ అనగానే సెలబ్రిటీలకు గుర్తొచ్చే పేరు ఆలిమ్ హకీమ్. ఆలీం చెయ్యేస్తే మాస్‌.. క్లాస్‌ ..అదిరే లుక్స్‌.. గుర్తు పట్టలేనంత అందంగా తీర్చిదిద్దేంత ప్రతిభ అతని సొంతం. అందుకే సెలబ్రిటీలు, స్టార్లు, గొప్ప గొప్ప బిజినెస్‌ మేన్‌లు సెలబ్రిటీ హెయిర్ స్టయిలిష్ట్‌ ఆలిమ్ హకీమ్. తాజాగా అంబానీ పెళ్లి ఇంట సందడిలో మేజిక్‌ చేస్తున్నాడు.బాలీవుడ్ ,టాలీవుడ్ , క్రికెట్, బిజినెస్ ఇలా రంగం ఏదైనా టాప్‌ సెలబ్రిటీలు ఆలిమ్ హకీమ్ కస్టమర్లు. తన హెయిర్ స్టైల్‌తో స్టైలిష్ లుక్స్‌ ఇచ్చి అందర్నీ ఆకట్టుకుంటాడు. మహేష్ బాబు,రణవీర్‌ సింగ్‌, ధోని, కోహ్లీ లాంటి స్టార్ల లుక్‌ను అదుర్స్‌ అనిపించేలా తీర్చిదిద్దిన ఘన ఆయ సొంతం. తాజాగా రిలయన్స్‌ కుచెందిన కాబోయే వరుడు అనంత్‌ అంబానీకి రూపును అందంగా తీర్చిదిద్ది మరోసారి వార్తల్లోకి వచ్చాడు.రిలయన్స్‌ ఫ్యామిలీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అనంత్‌-రాధిక మర్చంట్‌ వివాహ వేడుకల్లో ఆలిమ్ హకీమ్ హెయిర్‌ స్టయిలిస్ట్‌గా తన సత్తా చాటాడు. వరుడు అనంత్‌ అంబానీ, అలాగే ముఖేష్‌ అంబానీ పెద్దకుమారుడు ఆకాష్‌ లుక్‌ను అద్భుతంగా మార్చేశాడు. ఈ సందర్భంగా ఇన్‌స్టాలో ఆలిమ్ హకీమ్‌ అంబానీకి ఫేడ్ కట్‌తో ఎలా సరికొత్త రూపాన్ని ఇచ్చాడో షేర్‌ చేశాడు.అంతేనా కాబోయే వరుడు అనంత్ అంబానీకి కూడా అలీమ్ అద్భుతమైన మేకోవర్ ఇచ్చాడు. అనంత్ పొడవాటి గిరజాల జుట్టును కత్తిరించకుండా మేకోవర్‌ చేయడం హైలైట్‌గా నిలిచింది. అలాగే పెళ్లికి వచ్చిన అతిథుల కేశాలను అందంగా తీర్చిదిద్దుతున్నాడు. View this post on Instagram A post shared by Eka (@ekalakhani)

Virat Will Forget Love He Received in India When He Would Play in Pak: Shahid Afridi
విరాట్‌ పాకిస్తాన్‌కు వస్తే ఆ ప్రేమను మర్చిపోతాడు: ఆఫ్రిది

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్తుందా? లేదంటే హైబ్రిడ్‌ విధానంలో ఈ టోర్నీ నిర్వహిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో పాక్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ ఆఫ్రిది కీలక వ్యాఖ్యలు చేశాడు.భారత క్రికెట్‌ జట్టు తప్పకుండా తమ దేశంలో పర్యటించాలని విజ్ఞప్తి చేశాడు. టీమిండియా పాక్‌ గడ్డ మీద ఆడితే చూడాలని తామంతా కోరుకుంటున్నట్లు తెలిపాడు. కాగా చాంపియన్స్‌ ట్రోఫీ-2025 నిర్వహణ హక్కులను పాకిస్తాన్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే.అయితే, భారత క్రికెట్‌ నియంత్రణ మండలి మాత్రం టీమిండియాను అక్కడికి పంపేందుకు సుముఖంగా లేనట్లు సమాచారం. ఆసియా వన్డే కప్‌-2023 మాదిరిగానే హైబ్రిడ్‌ విధానం(టీమిండియా మ్యాచ్‌లకు వేరే వేదిక)లో ముందుకు వెళ్లాలని ఐసీసీని డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది.టీమిండియా ఇక్కడకు రావాలిఈ నేపథ్యంలో షాహిద్‌ ఆఫ్రిది మాట్లాడుతూ.. రోహిత్‌ సేన పాకిస్తాన్‌ పర్యటనకు వస్తే చూడాలని ఉందన్నాడు. రాజకీయాలతో ఆటను ముడిపెట్టకుండా టీమిండియాను పాకిస్తాన్‌కు పంపించాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు.ముఖ్యంగా విరాట్‌ కోహ్లికి తమ దేశంలో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందని.. అతడిని చూడాలని ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారని ఆఫ్రిది తెలిపాడు. భారత్‌లోని అభిమానుల ప్రేమను మరిపించేలా అతడిని తమ ప్రేమలో ముంచెత్తుత్తామని పేర్కొన్నాడు.‘‘భారత క్రికెట్‌ జట్టు తప్పకుండా ఇక్కడికి రావాలి. మేము ఇండియాలో పర్యటించినపుడు మాకెంతో ఘనంగా స్వాగతం పలకడం పాటు గౌరవమర్యాదలు ఇచ్చారు.ఆ ప్రేమను మరచిపోతాడుఅదే విధంగా మా దేశంలో టీమిండియాను 2005లో ఇలాగే సాదరంగా ఆహ్వానించాం. రాజకీయాలకు అతీతంగా క్రికెట్‌ను చూడాలి. ఒక్కసారి విరాట్‌ ఇక్కడికి వచ్చాడంటే భారత్‌లో తనకు దొరికే ప్రేమను కూడా మరిచిపోతాడు.పాకిస్తాన్‌లో అతడికి అంతటి క్రేజ్‌ఉంది. ఇక్కడి ప్రజలకు అతడంటే ఎంతో ఇష్టం’’ అని షాహిద్‌ ఆఫ్రిది ఓ యూట్యూబ్‌ చానెల్‌తో పేర్కొన్నాడు. కాగా వన్డే, టీ20లలో కోహ్లికి పాక్‌పై మెరుగైన రికార్డు ఉంది. వన్డే, టీ20లలో పాక్‌పై అతడి పరుగుల సగటు 52.15, 70.29. చదవండి: మిస్టరీ గర్ల్‌తో హార్దిక్‌ పాండ్యా.. ప్రేమ గురించి నటాషా పోస్ట్‌

Ias Officer Puja Khedkar Audi Has 21 Pending Traffic Violations
పూజా ఖేడ్కర్‌ ఉక్కిరిబిక్కిరి.. మరో వివాదంలో ట్రైనీ ఐఏఎస్‌

పూణే: ట్రైనీ ఐఎఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. వరుస ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఇటీవల మహరాష్ట్ర పూణే జిల్లాలో ట్రైనీ ఐఏఎస్‌ అధికారికగా పనిచేస్తున్న పూజా ఖేడ్కర్‌ తాను వినియోగించే ఆడికారుకు అనధికారికంగా రెడ్ బీకాన్ లైట్ల వినియోగం,గవర్నమెంట్‌ ఆఫ్‌ మహరాష్ట్ర అని స్కిక్కర్లు అంటించడంతో పాటు పై అధికారులు లేని సమయంలో వారి ఛాంబర్‌లను అనుమతి లేకుండా ఉపయోగించుకోవడంపై వివాదం తలెత్తింది. అందుకు సంబంధించి కలెక్టర్‌ కార్యాలయంలో ఉన్నతాధికారులు జరుపుకున్న వాట్సప్‌ చాటింగ్‌ వెలుగులోకి వచ్చింది. నాటి నుంచి పూజా ఖేడ్కర్‌ వివాదాలతో కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తూ వస్తున్నారు. తాజాగా ఖేడ్కర్‌ వినియోగిస్తున్న ఆడికారు 21 సార్లు ట్రాఫిక్స్‌ నిబంధనల్ని ఉల్లంఘించినట్లు ట్రాఫిక్‌ పోలీసులు నోటీసులు ఆమె ఇంటికి నోటీసులు పంపించడం చర్చనీయాంశంగా మారింది. ఆ నోటీసుల్లో ఆడికారును నిర్లక్ష్యంగా డ్రైవ్‌ చేయడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. వాటిపై రూ.27వేలు జరిమానా చెల్లించాలని పూజా ఖేడ్కర్‌కు అధికారులు నోటీసు జారీ చేశారు .నిబంధనల్ని ఉల్లంఘించి ‘మీ ప్రైవేట్ వాహనం ముందు,వెనుక భాగంలో ‘మహారాష్ట్ర గవర్నమెంట్’ స్కిక్కర్లు అంటించడం,రెడ్ బీక‌న్ లైట్‌ను కూడా ఫిక్స్ చేశారు. . అందుకు నోటీసులు ఇచ్చేందుకు ట్రాఫిక్‌ అధికారులు ఆమె ఇంటికి వెళ్లారు. ఆసమయంలో ఎవరూ లేరని అధికారులు అన్నట్లు తెలుస్తోంది. అనేక ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగినా పూణే పోలీసులు ముందస్తుగా ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. మరి దీనిపై ఖేడ్కర్‌ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. కాగా, వరుసగా వస్తున్న ఆరోపణలపై విలేకరులు ఆమె స్పందన కోరగా..‘ఈ అంశంపై మాట్లాడే అధికారం నాకు లేదు. ప్రభుత్వ నియమాలు నాకు దీనిపై మాట్లాడేందుకు అనుమతించవు’అని అన్నారు.

Lavanya Shocking Comments On Raj Tarun Relation With Ariyana Glory
'రాజ్‌ తరుణ్ ఫోన్ నుంచే కాల్‌ చేసింది'.. ఆమెపై లావణ్య షాకింగ్ కామెంట్స్!

ప్రస్తుతం టాలీవుడ్‌లో రాజ్ తరుణ్-లావణ్య టాపిక్‌ చర్చనీయాంశంగా మారింది. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడంతో ఈ వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే ఇరువురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లతో రాజ్‌ తరుణ్‌కు రిలేషన్‌ ఉందని ఆరోపించిన లావణ్య.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. బిగ్‌బాస్‌ బ్యూటీ అరియానా గ్లోరీతో రిలేషన్‌ ఉన్న మాట నిజమేనంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అరియానా గ్లోరీతో రాజ్‌తరుణ్‌కు ఎఫైర్‌ ఉందని మీకెలా తెలుసు? అన్న ప్రశ్నకు ఆమె స్పందించింది.లావణ్య మాట్లాడుతూ..' ఎందుకు నీ చట్టు తిప్పుకుంటున్నావ్ ఓ సారి నేను అరియానా గ్లోరీని అడిగా. ఒక అబ్బాయితో అమ్మాయి ఎలా ఉంటుందనేది నాకు తెలుసు. హీరోతో మామూలుగా మాట్లాడి ఉంటే నేను పట్టించుకునే దాన్ని కాదు. తనే రాజ్ తరుణ్‌ను బాయ్‌ఫ్రెండ్‌గా భావించింది. వాళ్లు దిగిన ఫోటోలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అంతే కాకుండా రాజ్ తరుణ్.. అరియానా గ్లోరీ ఇంటికి వస్తున్నాడని నాకు కొందరు చెప్పారు. ఆ తర్వాత నేను గోవాలో ఉండగా.. రాజ్ తరుణ్ ఫోన్ నుంచి కాల్‌ చేసి నాతో మాట్లాడింది. నువ్వు ఎంత సంపాదిస్తావ్ అని అడిగింది. నాకు రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు వస్తోందంటూ నాతో ఇన్సల్ట్‌గా మాట్లాడింది. ఆ తర్వాత అరియానా నాకు సారీ చెప్పింది. ఆ ఆడియో కూడా నా వద్ద ఉంది. ఇప్పుడైతే ఆమెతో నాకు ఎలాంటి విభేదాల్లేవ్' అని లావణ్య చెప్పుకొచ్చింది. కాగా.. రాజ్ తరుణ్ ప్రస్తుతం తిరగబడరా స్వామి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Union Budget 2024 Presentation Time Was Changed Check Here Time And Reason
బడ్జెట్‌.. 1999 ముందు వరకు ఒక లెక్క... తర్వాత ఒక లెక్క!

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024కి సంబంధించిన పూర్తి కేంద్ర బడ్జెట్‌ను జూలై 23న సమర్పించనున్నారు. మూడవసారి తిరిగి ఎన్నికైన తర్వాత బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం మొదటిసారి ప్రవేశపెడుతున్న బడ్జెట్‌ ఇదే. దేశ ఆర్థిక వృద్ధి, అభివృద్ధి, ఆర్థిక విధానాలపై ప్రభుత్వ విజన్‌ను బడ్జెట్‌లో వివిరించే అవకాశం ఉందని సమాచారం.లోక్‌సభలో ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ సమర్పణ ప్రారంభమవుతుంది. అయితే గతంలో బడ్జెట్‌ను ఉదయం 11 గంటలకు సమర్పించేవారు కాదు. 1999 వరకు బడ్జెట్‌ను సాయంత్రం 5 గంటలకు సమర్పించే ఆనవాయితీ ఉండేది. ఆ సమయంలో అన్నీ బ్రిటీష్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేవి. అప్పట్లో లండన్.. భారతదేశంలో ఏకకాలంలో బడ్జెట్ ప్రకటనలు ఉండేవని సమాచారం.భారతదేశం యూకే కంటే 5 గంటల 30 నిమిషాలు ముందున్నందున, భారతదేశంలో సాయంత్రం 5 గంటల సమయం GMT ఉదయం 11:30కి అనుగుణంగా ఉంది. దీని వలన బ్రిటిష్ ప్రభుత్వానికి బడ్జెట్ ప్రకటనలను సమన్వయం చేయడం సులభతరం అయ్యేది. ఇదే ప్రక్రియ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా కొనసాగింది.199లో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ప్రభుత్వంలో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా బడ్జెట్ సమర్పణకు సంబంధించిన సమయాన్ని ఉదయం 11 గంటలకు మార్చాలని నిర్ణయించారు. భారత్ బ్రిటీష్ వారి సొత్తు కాదు, కాబట్టి లండన్ టైమ్ జోన్‌ను అనుసరించాల్సిన అవసరం లేదని.. బడ్జెట్‌ను అధ్యయనం చేయడానికి, చర్చించడానికి చట్టసభ సభ్యులు & అధికారులకు మరింత సమయం ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నారు.ఫిబ్రవరి 27, 1999న యశ్వంత్ సిన్హా మొదటిసారిగా ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు. ఈ కొత్త సమయం శాశ్వత మార్పుగా మారింది. అప్పటి నుండి, అన్ని యూనియన్ బడ్జెట్‌లు ఉదయం 11 గంటలకు సమర్పించడం ఆనవాయితీగా మారింది.

7 Indians killed as tourist buses fall into swollen river after landslide in Nepal
నేపాల్ బ‌స్సు ప్ర‌మాదం.. ఏడుగురు భార‌తీయుల మృతి

నేపాల్‌లో శుక్ర‌వారం తెల్లవారుజామున ఘోర బ‌స్సు ప్ర‌మాదం చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. నారాయ‌ణ‌ఘాట్‌-ముగ్‌లింగ్ జాతీయ ర‌హ‌దారిపై కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌టంతో రెండు బ‌స్సులు ప‌క్క‌నే ఉన్న న‌దిలో ప‌డ్డాయి. దీంతో దాదాపు 65 మంది ప్ర‌యాణికులు గ‌ల్లంత‌య్యారు.వారిలో ఏడుగురు భార‌తీయులు ఉండ‌గా.. తాజాగా ఆ ఏడుగురు భార‌తీయులు మ‌ర‌ణించిన‌ట్లు తేలింది. మృతుల వివ‌రాలు తెలియాల్సి ఉంది. కాగా నేపాల్‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ క్ర‌మంలో చిట్వాన్ జిల్లాలోని నారాయణ్‌ఘాట్-ముగ్లింగ్ రహదారి వెంబడి సిమల్తాల్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో రెండు బ‌స్సులు ప‌క్క‌నే ఉన్న త్రిశూలి నదిలో ప‌డిపోయాయి. 24 మంది ప్రయాణికులతో ఓ బస్సు కాఠ్మాండూ వెళుతోంది. మరో బస్సులో 41 మంది ఉన్నట్లు గుర్తించారు.రెండు బ‌స్సుల్లో దాదాపు 65 మంది ప్ర‌యాణికులు ఉండ‌గా.. వారంద‌రూ గ‌ల్లంత‌య్యారు. వారిలో ఏడుగురు భార‌తీయులు కూడా ఉన్నారు. సంఘ‌ట‌నా స్థ‌లంలో స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.. అదే మార్గంలో మరోచోట కూడా బస్సుపై కొండచరియ విరిగిపడటంతో దాని డ్రైవర్‌ తీవ్రంగా గాయపడి మృతి చెందారు. బ‌స్సు ప్ర‌మాదం, భార‌తీయులు మృతి, కొండ‌చ‌రియ‌లు, భారీ వ‌ర్షాలుఈ ఘటనపై నేపాల్‌ ప్రధాని పుష్పకమల్‌ దహల్‌ విచారం వ్యక్తంచేశారు. అధికారులు వెంట‌నే బాధితుల గాలింపునకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ దేశ సాయుధ దళాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.

If You Are Preparing For Neet Again Heres Why You Should Choose Aakashs Repeaterxii Passed Courses
మీరు మళ్లీ NEET లేదా JEE కోసం సిద్ధమవుతున్నట్లయితే, మీరు ఆకాష్ రిపీటర్/XII Passed కోర్సులను ఎందుకు ఎంచుకోవాలి?

NEET/JEE కోసం సన్నద్ధం కావడానికి ఒక సంవత్సరాన్ని వెచ్చించడం అనేది ఏడాది పొడవునా నిబద్ధత కలిగి మరియు మెడిసిన్ లేదా ఇంజినీరింగ్లో కెరీర్పై మీ కలను కొనసాగించడం పట్ల మీకు మక్కువ ఉంటే ఖచ్చితంగా విలువైనది. ఈ పరీక్షలు ఛేదించడానికి చాలా కఠినంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి హాజరైన లక్షలాది మంది విద్యార్థులలో మొదటి ప్రయత్నంలోనే కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికల కోసం వెతకని వారు లేదా తమకు పెద్దగా నచ్చని కాలేజీలలో స్థిరపడని వారు. అయినప్పటికీ, ఒక సంవత్సరం పునరావృతం చేయడానికి మరియు మళ్లీ సిద్ధం కావడానికి వెనుకాడని వారు కూడా చాలా మంది ఉన్నారు.మీరు మీ మొదటి ప్రయత్నంలో NEETని ఛేదించనట్లయితే మరియు మళ్లీ సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తాజాగా ప్రారంభించి సరైన మార్గ నిర్దేశం చేయడంలో సహాయపడే ఆకాష్ రిపీటర్/XII పాస్ కోర్సులను మీరు తీవ్రంగా పరిగణించాలి.NEET/ JEE 2025 కోసం మీరు ఆకాష్ రిపీటర్/ XII Passed కోర్సును ఎంచుకోవడానికి కారణాలు● ఆకాష్ రిపీటర్ కోర్సులు మీ స్కోర్ను మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి మరియు తద్వారా మీ కలల కళాశాలకు ఎంపికయ్యే అవకాశాలను పెంచుతాయిసూర్యాంశ్ K ఆర్యన్ ఆకాష్లో NEET రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి, అతను NEET 2023లో తన 2వ ప్రయత్నంలో తన స్కోర్లలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేసుకున్నాడు మరియు NEET 2022 (592 స్కోర్)లో తన మొదటి ప్రయత్నం కంటే 705 స్కోర్ సాధించగలిగాడు మరియు ప్రస్తుతం AIIMS భోపాల్లో చదువుతున్నాడు. అంజలి కథ కూడా అలాంటిదే. NEET 2022లో 622 స్కోర్ చేసిన తర్వాత, అంజలి ఆకాష్ NEET రిపీటర్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్లో చేరింది మరియు 706 స్కోర్ చేయగలిగింది మరియు NEET 2023లో అండమాన్ & నికోబార్ దీవుల టాపర్గా నిలిచింది. అంజలి ప్రస్తుతం MAMC, ఢిల్లీలో చదువుతోంది. ఆకాష్లోని రిపీటర్ సక్సెస్ స్టోరీలు ప్రోగ్రామ్ యొక్క దృఢత్వం మరియు తీవ్రతను తెలియజేస్తాయి, ఇది తమ కలలను సాధించుకోవడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించే విద్యార్థులకు ఆఫర్లో ఉత్తమమైన వాటి కంటే తక్కువ ఏమీ కాకుండా లభించేలా చేస్తుంది.● ఉత్తమ అధ్యాపకులతో అత్యుత్తమ ఫలితాలను అందించడం ద్వారా ఆకాష్ యొక్క 35 ఏళ్ల వారసత్వం నుండి ప్రయోజనం పొందండిఆకాష్ దానితో పాటు, దేశంలోని అత్యుత్తమ అధ్యాపకులలో ఒకరి ద్వారా ఫోకస్డ్ మరియు రిజల్ట్-ఓరియెంటెడ్ టెస్ట్ ప్రిపరేషన్ను అందించే 35 సంవత్సరాల శక్తివంతమైన చరిత్ర కలిగినదిగా పిలవబడింది.. ఆకాష్లోని ఉపాధ్యాయులు అధిక అర్హతలు మరియు అనుభవజ్ఞులు మాత్రమే కాకుండా కోచింగ్ మెథడాలజీలు మరియు విద్యార్థుల మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా వారికి సహాయపడే నైపుణ్యాలలో బాగా శిక్షణ పొందారు. ఆకాష్ రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో, రిపీటర్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు వారి ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగిన అత్యుత్తమ అధ్యాపకుల దగ్గర మీరు నేర్చుకుంటారు, తద్వారా వారి ఎంపిక అవకాశాలను మెరుగుపరుస్తారు.● నిపుణులచే రూపొందించబడిన అధిక నాణ్యత అధ్యయన సామగ్రిఆకాష్లోని ప్రతి అధ్యయన వనరు అన్ని అంశాల సమగ్ర విశ్లేషణను అందించడానికి రూపొందించబడింది, విద్యార్థులు NEET మరియు/లేదా JEEలో పరీక్షించిన కాన్సెప్ట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూసుకుంటారు. విద్యార్థులు కష్టమైన పాఠాలను సులభంగా గ్రహించడంలో సహాయపడేందుకు వివిధ రకాల అభ్యాస ప్రశ్నలు, ఉదాహరణలు మరియు దృష్టాంతాలను చేర్చడానికి మా నిపుణులు స్టడీ మెటీరియల్ను జాగ్రత్తగా డిజైన్ చేస్తారు.అంతేకాకుండా, తాజా పరీక్షల ట్రెండ్లు మరియు ప్యాటర్న్లకు అనుగుణంగా మా స్టడీ మెటీరియల్ కఠినమైన సమీక్ష మరియు అప్డేట్లను కలిగియున్నది. విద్యార్థులు తమ పరీక్షా సన్నాహక ప్రయాణంలో ముందుకు సాగడానికి అత్యంత సందర్భోచితమైన మరియు నవీనమైన కంటెంట్పై అవగాహణ కలిగి ఉండేలా ఇది దోహదపడుతుంది.● పూర్తి అభ్యాసం కోసం కఠినమైన పరీక్షలు మరియు మూల్యాంకన షెడ్యూల్ఆకాష్లో విద్యార్థులు తమ సన్నద్ధత సమయంలో వారి బలహీనమైన ప్రాంతాలలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించడంలో సహాయపడే నిర్దిష్టమైన పరీక్ష షెడ్యూల్ను అనుసరిస్తారు. ప్రస్తుతం భోపాల్లోని AIIMSలో ఉన్న ఆకాష్లోని రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి సూర్యాంశ్ మాటల్లో, “నేను ప్రతిరోజూ ఒక పరీక్ష రాశాను”, పరీక్షలు నా బలమైన మరియు బలహీనమైన ప్రాంతాలను గుర్తించడంలో నాకు సహాయపడాయి.● గరిష్టంగా 90% మొత్తం స్కాలర్షిప్ పొందండిమీ కల కోసం సిద్ధపడడం మరియు అది కూడా రెండవసారి, ఖచ్చింగా సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా. మేము, ఆకాష్ వద్ద, ఆకాష్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (iACST)తో మీ కలను సాకారం చేయడానికి మీకు అవకాశాన్ని అందిస్తున్నాము. iACST మీకు 90% మొత్తం స్కాలర్షిప్ను గెలుచుకోవడానికి మరియు ఆకాష్ యొక్క రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి తక్షణ అవకాశాన్ని మీకు అందిస్తుంది.మీరు 2025లో NEET లేదా JEEలో మరోసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుక్నుట్లయితే , మెడిసిన్/ఇంజినీరింగ్లో మీ కలల కెరీర్కు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్లగల సరైన మెంటర్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఆకాష్ రిపీటర్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజే నమోదు చేసుకోండి మరియు మొత్తం 90% స్కాలర్షిప్ పొందండి.ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement
Advertisement
Advertisement
International View all
Watch: మెలోనీకి విసుగు తెప్పించిన బైడెన్‌!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ గురించి వీడియోలు వైరల్‌ అవుతుండడం చూస్తున్నాం.

ఖతార్‌లో యూపీఐ సేవలు..!

దేశంలో డిజిటల్‌ చెల్లింపులకు కీలకంగా ఉన్న యూపీఐ సేవలను ఖతార్‌కు విస్తరిస్తున్నట్లు నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇం

నేపాల్ బ‌స్సు ప్ర‌మాదం.. ఏడుగురు భార‌తీయుల మృతి

నేపాల్‌లో శుక్ర‌వారం తెల్లవారుజామున ఘోర బ‌స్సు ప్ర‌మాదం చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే.

నదిలో పడ్డ బస్సులు.. 65 మంది గల్లంతు

ఖట్మాండు: నేపాల్‌లో కొండచరియలు విరిగిపడి ఘోర ప్రమాదం జరిగింద

మళ్లీ తడబడ్డ బైడెన్‌.. ట్రంప్‌కు వైస్‌ ప్రెసిడెంట్‌ పదవి

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నవంబర్‌లో జరగబోయే

National View all
Pooja khedkar: కూతురే కాదు త‌ల్లి కూడా అదే దందా.. వీడియో వైర‌ల్‌

ముంబై: ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేద్క‌ర్ లీల‌లు ఒక్కొక్క‌టిగా వెల

కేజ్రీవాల్‌కు మళ్లీ నిరాశే.. కస్టడీ పొడిగింపు

సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో మరో కీలక పరిణామ

Union Budget 2024 Presentation Time Was Changed Check Here Time And Reason

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024కి సంబంధించిన పూర్తి కేంద్ర బడ్జెట్‌ను జూలై 23న సమర్పించనున్నారు.

బడ్జెట్‌.. 1999 ముందు వరకు ఒక లెక్క... తర్వాత ఒక లెక్క!

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024కి సంబంధించిన పూర్తి కేంద్ర బడ్జెట్‌ను జూలై 23న సమర్పించనున్నారు.

పూజా ఖేడ్కర్‌ ఉక్కిరిబిక్కిరి.. మరో వివాదంలో ట్రైనీ ఐఏఎస్‌

పూణే: ట్రైనీ ఐఎఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్‌ మరో వివాదంలో చిక

NRI View all
Video: భగవద్గీత సాక్షిగా బ్రిటన్ ఎంపీగా శివాని ప్రమాణం

భారత సంతతికి చెందిన 29 ఏళ్ల శివాని రాజా యూకే పార్ల‌మెంటులో హిందువుల పవిత్ర‌గ్రంథం భ‌గ‌వ‌ద్గీత సాక్షిగా ఎంపీగా ప్ర‌మాణ స్

45 కిలోలు తగ్గిన భారత సంతతి సీఈవో..అతడి హెల్త్‌ సీక్రెట్‌ ఇదే..!

బరువు తగ్గడం అనేది శారీరక శ్రమకు మించిన కష్టమైన ప్రక్రియ.

అమెరికాలో నలుగురు తెలుగోళ్ల అరెస్టు!

సాక్షి, హైదరాబాద్‌: టెక్సాస్‌లో మానవ అక్రమ రవాణా రాకెట్‌ను నడుపుతున్న నలుగురు భారతీయులను అక్కడి పోలీసుల

డల్లాస్‌లో ఘనంగా మహానేత వైఎస్సార్ 75వ జయంతి వేడుకలు

దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్.

రష్యా కళాకారులపై మోదీ ప్రశంసలు : అక్కడి ఎన్‌ఆర్‌ఐలకు గుడ్‌ న్యూస్‌

ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలోని భారతీయులను కలిశారు. వారినుఉద్దేశించి ప్రసంగించారు.

Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all