breaking news
singer ramakrishna passed away
-
రామకృష్ణకు సినీ, రాజకీయ ప్రముఖుల నివాళి
-
ప్రముఖ గాయకుడు రామకృష్ణ కన్నుమూత
హైదరాబాద్ : ప్రముఖ గాయకుడు రామకృష్ణ గత రాత్రి కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రామకృష్ణ జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరి కాలనీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. రామకృష్ణ 1947 ఆగస్ట్ 20న విజయనగరంలో జన్మించారు. ఆకాశవాణి యువవాణి కార్యక్రమంలో లలితగీతాలతో తన కెరీర్ ప్రారంభించిన ఆయన 'ముత్యాల ముగ్గు, అందాలరాముడు, భక్త కన్నప్ప, శ్రీ వీరబ్రహ్మంగారి జీవిత చరిత్ర, దానవీరశూర కర్ణతాతా మనవడు, అల్లూరి సీతారామరాజు చిత్రాలతో పాడిన పాటలు రామకృష్ణకు మంచి పేరు తెచ్చాయి. సుమారు 200 సినిమాలలోనూ, అలాగే 5వేలకు పైగా భక్తిగీతాలు ఆలపించారు. ఆయనకు కుమారుడు సాయికిరణ్, కుమార్తె లేఖ ఉన్నారు. రామకృష్ణ మృతిపట్ల తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు. కాగా రామకృష్ణ కుమారుడు సాయికిరణ్...'నువ్వే కావాలి' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తరువాత పలు చిత్రాలతో పాటు పలు టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నారు. అలాగే ప్రముఖ గాయని పి.సుశీల...ఆయనకు మేనత్త.