breaking news
Shradha Prasad
-
పితృ తర్పణాలకు ప్రసిద్ధి.. ఈ ఏడు ప్రముఖ ప్రాంతాలు
Pitru Paksha: ప్రస్తుతం దేశంలోని హిందువులు తమ పెద్దలకు తలచుకుని వారికి తర్పణాలు అందించే పితృపక్షం రోజులు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 21న అమావాస్యతో ఇవి ముగియనున్నాయి. పితృ పక్షం చివరి రోజున చాలామంది తమ పూర్వీకులకు పిండ ప్రదానం చేస్తుంటారు. దేశం నలుమూలలా పిండ ప్రదానాలు చేసేందుకు ప్రసిద్ధి చెందిన కొన్ని ప్రాంతాలు ఉన్నాయి.ఫాల్గు నది, గయ (బీహార్)గయ.. పిండ ప్రదానాలకు ప్రసిద్ధి చెందిన ప్రదేశంగా పరిగణిస్తుంటారు. ఇక్కడ పిండ ప్రదానాన్ని సమర్పించడం వలన పూర్వీకుల ఆత్మలకు మోక్షం లభిస్తుందని నమ్ముతారు. గయలోని ఫాల్గు నది ఒడ్డున వేలాది మంది పిండ ప్రదానాన్ని నిర్వహిస్తారు. స్కంద పురాణం, విష్ణు పురాణంలో ఈ ప్రదేశం ప్రస్తావన కనిపిస్తుంది.బ్రహ్మకపాల్, బద్రీనాథ్ (ఉత్తరాఖండ్)ఉత్తరాఖండ్‌లోని నాలుగు పవిత్ర స్థలాలలో ఒకటైన బద్రీనాథ్ ధామ్ సమీపంలోని బ్రహ్మకపాల్ ఘాట్.. పూర్వీకులకు పిండ ప్రదానాన్ని అందించేందుకు ఉత్తమ ప్రదేశంగా భావిస్తారు.సిద్ధవట్, ఉజ్జయిని (మధ్యప్రదేశ్)ఉజ్జయినిలోని సిద్ధవట్ మందిరం పిండ ప్రదానంతో పాటు శార్ద కర్మలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. దాని కింద పిండ ప్రదానం చేయడం పూర్వీకుల ఆత్మలను సంతృప్తిపరుస్తుందంటారు. ఇక్కడి మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని సందర్శించడంతో పాటు సిద్ధవత్లో పిండ ప్రదానం చేయడం పుణ్యప్రదమని భక్తులు భావిస్తారు.త్రయంబకేశ్వర్, నాసిక్ (మహారాష్ట్ర)మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉన్న త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం పితృ కర్మలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి గోదావరి నది ఒడ్డున పెద్దలకు తర్పణాలివ్వడం వలన వారి ఆత్మలు మోక్షాన్ని పొందుతాయని చెబుతారు.ప్రయాగ్‌రాజ్ (ఉత్తరప్రదేశ్)గంగా, యమున, సరస్వతి నదుల సంగమ స్థలమైన ప్రయాగ్‌రాజ్.. పూర్వీకులకు పిండ ప్రదానాలు ఆచరించే పవిత్ర స్థలంగా పేరొందింది. ఈ సంగమంలో పిండ ప్రదానం చేయడం వల్ల పూర్వీకుల ఆత్మలు శాంతించి, కుటుంబం బాధలు తొలగిపోతాయని పలువురు నమ్ముతారు.రామేశ్వరం (తమిళనాడు)రామేశ్వరం.. దక్షిణ భారతదేశంలో ఈ పవిత్ర ప్రాంతంలో పిండ ప్రదానం సమర్పించడం అనేది ఆచారంగా కొనసాగుతోంది. ఇక్కడ పిండ ప్రదానం చేయడం వలన పూర్వీకుల శాపాలు ఏవైనా ఉంటే తొలగిపోతాయని చెబుతారు.హుగ్లీ నది ఘాట్లు (పశ్చిమ బెంగాల్)పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని హుగ్లీ నది వెంబడి ఉన్న ఘాట్లు పిండ ప్రదానాలకు ప్రసిద్ధి చెందినవి. పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడికి వచ్చి, తమ పూర్వీకులకు తర్పణాలు విడుస్తారు. -
మార్స్ యాత్రకు అడుగు దూరంలో శ్రద్ధా ప్రసాద్
ముంబయి: ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న గ్రహం మార్స్. అంగారక గ్రహంపై అడుగుపెట్టడానికి కేరళకు చెందిన శ్రద్ధా ప్రసాద్ తహతహలాడుతోంది. నెదర్లాండ్‌కు చెందిన ఓ ప్రైవేటు సంస్థ 2024లో అంగారక యాత్ర నిర్వహించనుంది. ఈ యాత్రలో పాల్గొనేందుకు నిర్వహించిన కార్యక్రమంలో ముగ్గురు భారతీయులు ...చివరి నాలుగో రౌండ్‌కు ఎంపికయ్యారు. జీవితంలో ఒకసారి మాత్రమే చేయగలిగే ఈ యాత్రకి అతి పిన్న వయస్కురాలైన ఓ భారతీయురాలు సెలక్ట్ అవడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వివరాల్లోకి వెళితే నెదర్లాండ్స్ కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ మార్స్ యాత్రను చేపట్టనుంది. అరుణ గ్రహంపైకి పంపిస్తున్న ఈ యాత్రకు ప్రపంచ వ్యాప్తంగా 705 మందిని పంపిస్తున్నారు. యాత్రలో పాల్గొనేందుకు సుమారు 2,02,586 దరఖాస్తులు వచ్చాయి. కాగా అంగారక యాత్ర చేపట్టేందుకు ఎంపిక చేసిన వంద మంది జాబితాలో ముగ్గురు భారతీయులు చోటు దక్కించుకోవడం విశేషం. వీరిలో కేరళకు చెందిన 19 ఏళ్ల శ్రద్ధా ప్రసాద్ ఒక్కరే ప్రస్తుతం భారత్ (కేరళ) లో ఉంటున్నారు. ఎంపికైన తరన్ జీత్ సింగ్, రితికా సింగ్ ఇద్దరు ప్రవాస భారతీయులు. తరన్ జీత్ సింగ్ భాటియా సెంట్రల్ ఫ్లోరిడా యూనివర్సిటీలో డాక్టరేట్ చేస్తుండగా, రితికా సింగ్ ప్రస్తుతం దుబాయ్‌లో స్ధిరపడ్డారు. అంగారకుడిపై శాశ్వతంగా మానవ ఆవాసాన్ని ఏర్పాటు చేసే దిశగా వీరు ప్రయత్నాలు చేయడం కోసం తలపెట్టినదే ఈ యాత్ర. మొత్తంగా 40 మందిని అంగారక గ్రహంపైకి పంపించాలన్నది ఈ మిషన్ ఉద్దేశం. ప్రతి రెండేళ్లకు నలుగురిని మార్స్ యాత్రకి పంపుతారు. అన్ని రౌండ్ లను విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్ధులకు శిక్షణ ఇచ్చి ఈ యాత్రకు పంపిస్తారు. ప్రస్తుతం 3 రౌండ్లు పూర్తయ్యేసరికి 100 మంది సెలక్ట్ కాగా వీరిలో మహిళలు 50, పురుషులు 50 మంది ఉండటం విశేషం. జీవితంలో ఒకేసారి చేసే యాత్ర 'కుటుంబాన్ని, స్నేహితులను, సన్నిహితులను వదిలి వెళ్లడం చాలా బాధగా ఉంది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి.. జీవితంలో ఒకసారి మాత్రమే వచ్చే సదవకాశమని నేను మరిచిపోకూడదు' అని శ్రద్ధా ప్రసాద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే తనకు చాలా ఇష్టమని, రిస్క్‌తో పాటు యాత్రను ఎంజాయ్ చేయాలనుకుంటున్నానని కోయంబత్తూరు లోని అమృత యూనివర్సిటీకి చెందిన శ్రద్ధా చెప్పారు. మూడవ రౌండ్ అయిన తర్వాత చివరి రౌండ్ విజయవంతంగా పూర్తిచేస్తానన్న నమ్మకం ఏర్పడిందని ఆమె దీమా వ్యక్తం చేశారు.