breaking news
Shalibanda
-
హైదరాబాద్ శాలిబండలో భారీ అగ్ని ప్రమాదం
-
Hyderabad: శాలిబండలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ శాలిబండ క్లాక్ టవర్ పక్కనున్న గోమతి ఎల్రక్టానిక్ షాప్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం రాత్రి జరిగిన ఈ అగ్ని ప్రమాద సంఘటనలో ఒకరు మృతిచెందగా, ఆరుగురు గాయపడ్డారు. ఒక కారు, ఒక ద్విచక్ర వాహనం మంటలకు పూర్తిగా తగలబడిపోయాయి. మంటలకు తగలబడిన కారు సీఎన్జీ వాహనం కావడంతో అందులోని గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటల తీవ్రత మరింత పెరిగింది. గాయపడ్డ వారందరినీ చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.బాంబు పేలుడు మాదిరిగా... బాంబులు పేలిన శబ్దం రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో అటువైపు నుంచి రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు, పాదచారులు బెంబేలెత్తారు. మంటల ధాటికి దుకాణం షట్టర్ ఎగిరి 100 మీటర్ల దూరంలో పడిపోయింది. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఎల్రక్టానిక్ షోరూమ్ కావడంతో అందులోని ఏసీలు రిఫ్రిజిరేటర్లు వరుసగా పెద్ద పెట్టున శబ్దాలు చేసి పేలిపోయాయి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఐదు అగ్నిమాపక వాహనాలు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.మొగల్ పురా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. అటువైపు నుంచి రాకపోకలను నిలిపివేసి అగ్ని మాపక సిబ్బందికి సహకరించారు. భారీ అగ్ని ప్రమాదం కావడంతో గోమతి ఎలక్ట్రానిక్స్ షోరూం అనుకొని ఉన్న దుకాణాల సిబ్బందితోపాటు నివాస ప్రాంతాల్లోని ప్రజలను పోలీసులు అప్రమత్తం చేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటివరకు ఎంత నష్టం జరిగిందనే విషయం కూడా తెలియదని సంబంధిత దుకాణాల యజమానులు చెబుతున్నారు.షోరూం బంద్జేస్తున్న సమయంలో సరిగ్గా 10.28 గంటలకు ఈ ప్రమాదం సంభవించినట్లు పక్కనే ఉన్న శాలిబండ క్లాక్ టవర్ లోని సమయం తెలియజేస్తోంది. ప్రమాదం ధాటికి క్లాక్ టవర్లోని వాచీ ఆగిపోయింది. విషయం తెలిసిన వెంటనే దక్షిణ మండలం డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. రెండు గంటల అనంతరం మంటలు అదుపులోకి వచ్చాయి. మొగల్ పురా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
సూరజ్ ఖాన్ ఆసుపత్రి వద్ద కుప్పకూలిన భవనం గోడ
-
భారీ వర్షం.. క్షణాల్లో కుప్పకూలిన భవనం
సాక్షి, హైదరాబాద్ : ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగరం అల్లాడుతోంది. పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోకి వర్షపునీరు వచ్చి చేరడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే పాతబస్తీలో ఇల్లు కూలి 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా పాతబస్తీలో ఓ మహిళకు త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. (చదవండి : రోడ్లన్నీ జలమయం.. హై రెడ్ అలర్ట్) ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె పక్కనే శిథిలావస్థలో ఉన్న ఓ భవనం కుప్పకూలిపోయింది. ఒక్కసారిగా భవనం కుప్పకూలడంతో మహిళ భయంతో పక్కకి జరిగి పరుగులు తీసింది. లేదంటే ఇంటి గోడ కూలి ఆమె మృతి చెందేది. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. అనంతరం పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు అక్కడికి చేరుకొని పాత భవనాన్ని పరిశీలించారు. (చదవండి : వరద బీభత్సానికి అద్దం పడుతున్న దృశ్యం) -
పట్టుదలతో ఫలితాలు: నైనా
శాలిబండ, న్యూస్‌లైన్: విద్యార్థులు తమ విలువైన కాలాన్ని వృథా చేసుకోకుండా గుణాత్మకమైన విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ (టీటీ) క్రీడాకారిణి నైనా జైస్వాల్ సూచించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాల సందర్భంగా పాతబస్తీ హుస్సేనీఆలంలోని వెస్ట్రన్ ఇంటర్నేషనల్ స్కూల్లో హైదరాబాద్ మహిళ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని హైదరాబాద్ మహిళా మండలి ప్రతినిధులు నైనా జైస్వాల్‌ను ఘనంగా సన్మానించారు. సన్మాన గ్రహీత నైనా జైస్వాల్ మాట్లాడుతూ... విద్యార్థులు క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేస్తే ఆశించిన ఫలితాలు సాధిస్తారన్నారు. హైకోర్టు న్యాయవాదులు పుష్పేందర్ కౌర్, గమన్దీప్ కౌర్‌లతో పాటు హైదరాబాద్ మహిళా మండలి అసిస్టెంట్ డెరైక్టర్ డాక్టర్ మహమ్మదీ బేగంలు మాట్లాడుతూ... అతి చిన్న వయస్సులో నైనా జైస్వాల్ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారన్నారు. ఎనిమిదేళ్లకే ఎస్ఎస్సీ ఉత్తీర్ణత సాధించి... 13 ఏళ్లకే డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నైనా జైస్వాల్‌ను విద్యార్థినీలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండలి అధ్యక్షులు డాక్టర్ మునావర్ సుల్తానా, డెరైక్టర్ మహమ్మద్ ఇమామ్ తహసీన్ తదితరులు పాల్గొన్నారు. -
మైనర్ బాలిక అత్యాచారం కేసులో నిందితుడు అరెస్ట్
మైనర్ బాలిక కిడ్నాప్ అనంతరం అత్యాచారం జరిపిన నిందితుడు సులేమన్ బిన్ హస్సన్‌ను నిన్న అరెస్ట్ చేసినట్లు శాలిబండ పోలీసు ఇన్స్పెక్టర్ ఎస్.మహేశ్వర్ బుధవారం ఇక్కడ వెల్లడించారు. కిడ్నాప్, అత్యాచారం తదితర కేసులు అతడిపై నమోదు చేసినట్లు తెలిపారు. అనంతరం అతడిని జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. పోలీసుల కథనం మేరకు ఈ నెల 15వ తేదీన మైనర్ బాలిక కిడ్నాప్ అయింది. నగరంలోని పాత బస్తీలోని లాడ్జీలో ఆ బాలికపై సులేమన్ అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను కర్ణాటకలోని గుల్బర్గకు తరలించాలని అనుకున్నాడు. అయితే ఆ బాలిక మాయమైందని తమకు ఫిర్యాదు అందిందని, ఆ మేరకు తాము దర్యాప్తు చేపట్టామని పోలీసు అధికారి మహేశ్వర్ తెలిపారు. ఆ బాలికను ఇంటి సమీపంలో ఆడుకోవడం చూశామని చెప్పారు. అనంతరం ఆ బాలికను ఆమె తల్లితండ్రులకు అప్పగించామన్నారు. మైనర్ బాలిక, ఆమె తండ్రి నుంచి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నట్లు ఆయన వివరించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. అందులోభాగంగా అతడిని శాలిబండ పరిసర ప్రాంతాల్లో అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.


