Shakeel Ammad Butt
-
పాక్ కెప్టెన్‌పై నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వం
పాకిస్తాన్ హాకీ జట్టు కెప్టెన్ షకీల్ అమ్మాద్ బట్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అతడి పట్ల పాకిస్తాన్ హాకీ సమాఖ్య (PHF) మాజీ అధ్యక్షుడు వ్యవహరించిన తీరు అక్రమమని.. ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమని ఆగ్రహం వ్యక్తం చేసింది.ఒకప్పుడు తోపుకాగా పాక్ హాకీ పురుషుల జట్టుకు ఘనమైన చరిత్ర ఉంది. నాలుగుసార్లు ప్రపంచ కప్ విజేత, మూడు ఒలింపిక్ స్వర్ణాలు సహా ఎన్నో ప్రతిష్టాత్మక విజయాలు సాధించింది ఆ జట్టు. అయితే, గత కొన్నేళ్లుగా రోజురోజుకీ దిగజారి పోతోంది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రొ లీగ్‌లో భాగంగా పాక్ జట్టు ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో వరుస ఓటములతో చతికిలపడింది. దీంతో తాజా ఎడిషన్‌లో ఆడిన మ్యాచ్‌లన్నీ ఓడి పాయింట్ల పట్టికన అట్టడుగున నిలిచింది.ప్లేట్లు కడిగి మ్యాచ్‌కు వెళ్లాంఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో తమకు ఎదురైన చేదు అనుభవాల ఫలితమే వరుస ఓటములకు కారణమంటూ కెప్టెన్ అమ్మాద్ బట్ సంచలన ఆరోపణలు చేశాడు. హోటల్లో తమకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని తెలిపాడు. కిచెన్‌ను తామే శుభ్రపర్చుకున్న తర్వాతే మ్యాచ్ ఆడేందుకు వెళ్లాల్సి వచ్చిందని వాపోయాడు.స్వదేశానికి తిరిగి రాగానే పాకిస్తాన్ హాకీ సమాఖ్య (పీహెచ్ఎఫ్)పై అమ్మాద్ తీవ్ర విమర్శలు చేశాడు. ‘ప్రస్తుత పీహెచ్ఎఫ్ మేనేజ్మెంట్ ఇంకా కొనసాగితే మేం ఆడటం కష్టం. ప్లేట్లు కడిగి కిచెన్‌ను శుభ్రం చేసుకున్న తర్వాతే మ్యాచ్ ఆడేందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే ఇంకా మా వైపు నుంచి ఎలాంటి ఫలితాలు ఆశిస్తారు.బహిరంగంగా చెప్పాల్సి వస్తోందిదాదాపు 13–14 గంటల పాటు రోడ్డుపై వేచి చూసిన తర్వాత మాకు హోటల్లో బస ఏర్పాటు చేశారు. మేం టోర్నీ కోసం అక్కడ 13 రోజులు ఉండాల్సి ఉంటే 10 రోజుల కోసమే హోటల్‌ను బుక్ చేశారు. దాంతో తర్వాతి మూడు రోజుల కోసం చవకైన మరో హోటల్‌కు మారాల్సి వచింది. ఎంతో ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాం కాబట్టే ఇప్పుడు బహిరంగంగా చెప్పాల్సి వస్తోంది’ అని షకీబ్ బట్ ఆవేదన వ్యక్తం చేశాడు.రెండేళ్ల నిషేధం విధిస్తూ నిర్ణయంఈ పరిణామాలపై దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్‌కు పాకిస్తాన్ స్పోర్ట్స్ బోర్డు ప్రత్యేక నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో PHF అధ్యక్షుడు తారిఖ్ బుగ్టీ గురువారం తన పదవికి రాజీనామా చేశాడు. అయితే, అంతకంటే ముందు అమ్మాద్‌పై రెండేళ్ల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో మరోసారి పాక్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వంఈ క్రమంలో పాక్ ప్రభుత్వం వేగంగా స్పందించింది. PHF తాత్కాలిక అధ్యక్షుడిగా సీనియర్ బ్యూరోక్రాట్ ముహుయుదీన్ వనీని నియమించింది. ఈ నేపథ్యంలో పగ్గాలు చేపట్టగానే ముహుయుదీన్ తొలుత అమ్మాద్ గురించే ప్రకటన చేశారు. అమ్మాద్‌పై నిషేధం విధిస్తూ బుగ్టీ తీసుకున్న నిర్ణయం అక్రమం, రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొన్నారు. వెంటనే అతడిపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. పాకిస్తాన్ హాకీకి జరిగిన నష్టాన్ని పూడ్చి.. త్వరలోనే పరిస్థితులు చక్కదిద్దుతామని తెలిపారు.చదవండి: T20 WC: ‘పీసీబీ చీఫ్ రెచ్చగొట్టడం వల్లే.. నష్టపోయాము’ -
అంట్లు తోముకోవాల్సి వచ్చింది: మండిపడ్డ పాక్ కెప్టెన్
పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్ (పీహెచ్ఎఫ్) తీరుపై ఆ దేశ హాకీ జట్టు కెప్టెన్ షకీల్ అమ్మద్ బట్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. PHF ప్రస్తుత యాజమాన్యంతో కలిసి తాము పనిచేయలేమని తేల్చిచెప్పాడు. దేశం కాని దేశంలో తమను రోడ్ల వెంట పరిగెత్తించి.. ఆఖరికి అంట్లు తోముకునేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.అసలేం జరిగిందంటే.. FIH Pro Leagueలో భాగంగా తమ మ్యాచ్‌లు ఆడేందుకు పాక్ జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లింది. అయితే, వారి వసతికి సంబంధించి సరైన ఏర్పాట్లు చేయడంలో PHF విఫలమైంది. కాన్బెర్రా వెళ్లేందుకు పాక్ జట్టు సిడ్నీ విమానాశ్రయంలో దాదాపు 13-14 గంటల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది.అనంతరం హోటల్‌కు వెళ్లిన తర్వాత పాక్ హాకీ జట్టుకు మరో ఘోర అవమానం ఎదురైంది. వారి పేరిట అడ్వాన్స్ బుకింగ్ లేకపోవడంతో హోటల్ మేనేజ్మెంట్ అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించింది. దీంతో గంటల పాటు పాక్ హాకీ ఆటగాళ్లు రోడ్ల మీద తిరగాల్సి వచ్చింది. ఆ మరుసటి రోజు మధ్యాహ్నమే మ్యాచ్ ఆడాల్సి ఉండగా.. ఆసీస్ చేతిలో పాక్ ఓడిపోయింది. అనంతరం జర్మనీ చేతిలోనూ ఓటమిపాలైంది.మా అంట్లు మేమే తోముకోవాల్సి వచ్చిందిఈ నేపథ్యంలో తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి పాకిస్తాన్ హాకీ జట్టు కెప్టెన్ షకీల్ అహ్మద్ బట్ స్వదేశానికి వచ్చిన తర్వాత లాహోర్ ఎయిర్‌పోర్టులో మీడియాకు వెల్లడించాడు. ‘‘ప్రస్తుత హాకీ ఫెడరేషన్ యాజమాన్యంతో కలిసి మేము పనిచేయలేము.మ్యాచ్ ఆడేందుకు వెళ్లే ముందు మా అంట్లు మేమే తోముకోవాల్సి వచ్చింది. అలాంటపుడు మ్యాచ్ ఫలితం గురించి ఆలోచించే సమయం మాకు ఎక్కడ ఉంటుంది?.. అసలు మ్యాచ్ ఆడతామో లేదో తెలియని పరిస్థితి. ఇక ఫలితం గురించి అడగటం ఎందుకు?మాకు విదేశీ కోచ్ కావాలిమేము పది రోజుల పాటు చీప్ ఏరియాలో ఉండాల్సి వచ్చింది. ఇంతకంటే ఘోరం ఏముంటుంది? ఈ విషయాల గురించి మీడియాతో మాట్లాడవద్దని మా ఫెడరేషన్ హెచ్చరికలు జారీ చేసింది. అయితే, ఆస్ట్రేలియాలో మాకు ఏం జరిగిందో అందరికీ తెలియాలి కాబట్టే నేను మాట్లాడుతున్నాను.మాకు విదేశీ కోచ్ కావాలి. అప్పుడే అనుకున్న ఫలితాలు రాబట్టగలము. యాజమాన్యం కూడా మంచిగా ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది’’ అని షకీల్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా పాక్ హాకీ ఫెడరేషన్‌కు ప్రాటన్-ఇన్-చీఫ్‌గా ప్రధాని షెబాజ్ షరీఫ్ ఉంటారు.ప్రధాని దృష్టికి తీసుకువెళ్తాముఈ నేపథ్యంలో పీఎస్బీ డైరెక్టర్- జరనల్ నూర్ సభా స్పందిస్తూ.. ఆటగాళ్ల ఆరోపణలపై విచారణ చేస్తున్నామని.. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్తామని చెప్పుకొచ్చాడు. కాగా FIH Pro Leagueలో పాకిస్తాన్ ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో ఎనిమిది ఓడిపోయి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి స్థానం (తొమ్మిది)లో ఉంది. మరోవైపు.. బెల్జియం ఎనిమిదింట ఏడు గెలిచి అగ్రస్థానంలో ఉండగా.. భారత్ నాలుగింటికి నాలుగు ఓడి ఎనిమిదో స్థానంలో ఉంది.చదవండి: IND vs PAK: అసలైన హీరో మీరే: పీసీబీ చైర్మన్


