breaking news
shaik mohammad rafi
-
నందలూరు వాసి కువైట్‌లో మృతి
కడప కార్పొరేషన్: జిల్లాలోని రాజంపేట నియోజకవర్గంలోని నందలూరుకు చెందిన షేక్ మహమ్మద్ రఫీ(34) ప్రమాదవశాత్తు మృతిచెందినట్లు వైఎస్ఆర్సీపీ గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్, ముమ్మడి బాలిరెడ్డి ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. వారు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. నందలూరుకు చెందిన షేక్ మహమ్మద్ రఫీ కొన్నేళ్లుగా కువైట్‌లో సీసీ కెమెరాల టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అక్టోబర్ 19వ తేది జాబిరియా ప్రాంతంలోని హాస్పిటల్లో కెమెరా అమర్చుతూ ప్రమాదవశాత్తు నిచ్చెన నుంచి కిందపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్టోబర్ 28వ తేది మరణించాడు. మృతునికి భార్య, ఐదేళ్ల బాబు ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ కన్వీనర్లు సేవాదళ్ ఇన్చార్జి గోవిందు రాజు ద్వారా భారత రాయబార కార్యాలయంలో ఇమ్మిగ్రేషన్ పనులన్నీ పూర్తి చేశారు. బాడీ బాక్స్‌కు అయిన రూ.14వేలు బాలిరెడ్డి భరించగా, చెన్నై విమానాశ్రయం నుంచి నందలూరు వరకూ రాష్ట్ర ప్రభుత్వ ఏపీ ఎన్ఆర్టీ కార్పొరేషన్ వారు ఉచితంగా అంబులెన్స్ సౌకర్యం కల్పించారు. మృతుని కుటుంబాన్ని ఆదుకుంటామని ఇలియాస్, బాలిరెడ్డి తెలిపారు. -
శ్రీశైలం వద్ద ప్రమాదం: వ్యక్తి మృతి
ఈగలపెంట (కర్నూలు): శ్రీశైలం ప్రాజెక్టు వజ్రాలమడుగు వద్ద వంతెన నిర్మాణం పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. బుధవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తూ ఒక లారీ డ్రైవర్ చనిపోయాడు. ఈగలపెంట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా సుండిపెంట మండల కేంద్రానికి చెందిన షేక్ మహ్మద్ రఫీ కొంత కాలంగా డ్యాం నిర్మాణ పనుల్లో భాగంగా కంపెనీకి చెందిన టిప్పర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రోజు మాదిరిగానే కంకర లోడుతో డ్యాం వద్దకు రాగానే లారీ ప్రమాదవశాత్తు అదుపు తప్పి ప్రాజెక్టు దిగువ భాగంలో నిల్వ ఉంచిన నీటిలో పడిపోయింది. ప్రమాదం నుంచి తప్పించుకునే మార్గం లేకపోవడంతో టిప్పర్ డ్రైవర్ లారీతో పాటు నీటిలో మునిగిపోయి మృతి చెందాడు. రఫీకి తల్లిదండ్రులతో పాటూ ముగ్గురు అన్నలు, ఒక తమ్ముడు ఉన్నారు.