breaking news
September 22
-
మాల్యా కేసు మరోసారి వాయిదా
హైదరాబాద్: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా చెక్ బౌన్స్ కేసు విచారణను ఎర్రమంజిల్ కోర్టు వాయిదా వేసింది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ జీఆర్ కిచ్చిన 50 లక్షల విలువచేసే రెండు చెల్లని చెక్కుల కేసును మంగళవారం విచారించిన స్పెషల్ కోర్టు మాజిస్ట్రేట్ ఎం కృష్ణారావు కేసు తదుపరి విరాణను సెప్టెంబర్ 22కి వాయిదా వేశారు. అలాగే జీఎంఆర్ కు చెందిన లీగల్ టీం మాల్యా కొత్త చిరునామాను ఈ రోజు కోర్టు ముందుంచింది. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ లిమిటెడ్ సీనియర్ అధికారి రఘునందన్ పై జారీ నాన్ బెయిలబుల్ వారెంట్ ను హౌకోర్టులో రీకాల్ చేసుకున్నారు. అయితే ఈ రీకాల్ చెల్లదని చెప్పిన కోర్టు ఇదే కోర్టు ఆవరణలో హాజరు కావాలని స్పష్టం చేసింది. అనంతరం విచారణను వాయిదా వేసింది. దీంతో రఘునాథన్ వ్యతిరేకంగా జారీ చేసిన వారంట్ ఇప్పటికీ పెండింగ్ లో ఉన్న కారణంగా శిక్ష ఖరారు మరోసారి వాయిదా పడింది. కాగా బ్యాంకులకే కాకుండా మాల్యా జీఎంఆర్ సంస్థకూ టోకరా వేశాడు. శంషాబాదు ఎయిర్ పోర్టులో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ విమానాల రాకపోకలకు సంబంధించి విజయ్ మాల్యా సంస్థ జీఎంఆర్ బకాయిల చెల్లింపుల పేరిట ఇచ్చిన రెండు చెక్కులు బౌన్సయ్యాయి. దీంతో జీఎంఆర్ సంస్థ హైదరాబాదు ఎర్రమంజిల్లోని ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేసింది. కేసును విచారించిన కోర్టు కింగ్ ఫిషర్ మాజీ అధినేత విజయ మాల్యా, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ లిమిటెడ్ సీనియర్ అధికారి రఘునాథన్ ఏప్రిల్ 20 న దోషిగా తేల్చిల్చింది. కానీ విజయ్ మాల్యా గైర్హాజరుతో మాల్యా పరోక్షంలో శిక్షను ఖరారు చేయలేమని చెప్పిన సంగతి తెలిసిందే. -
రోజా రాజా
శ్రీకాకుళం కల్చరల్:అలసిన మనసుకు ఉల్లాసం, వ్యాధి గ్రస్తుల్లో స్వస్థత, మగువల్లో ఉత్సాహాన్ని నింపేవి పువ్వులే. పూలన్నింటిలోకి రారాజుగా రోజాపువ్వు పేరు పొందింది. దీనిని ఇష్టపడని మగువ ఉండదు. ప్రేమను వ్యక్తపరిచేందుకు ప్రియుడుకి రోజా పువ్వు ఒక మంచి సాధనం. చారడేసి కళ్లతో అరవిరసిన గులాబీ పువ్వు అందానికి ప్రియురాలు దాసోహం కావాల్సిందే. కవులు కవిత్వాలు రాయూల్సిందే. అందుకే రోజా పువ్వుకు ఓ ప్రత్యేకమైన రోజును కేటయించారు. గులాబీల రోజు ఇలా.. క్యాన్సర్ రోగులు త్వరగా కోలుకోవాలని కోరుతూ కెనడాలో మొదటిసారిగా సెప్టెంబర్ 22న గులాబీ పూలను అందజేశారు. రోగుల్లో స్వస్థత చేకూరేందుకు సాధనంగా వినియోగించేవారు. అది క్రమేపీ అన్ని దేశాలకు పాకింది. దీంతో ఏటా సెప్టెంబర్ 22న గులాబీ దినోత్సవం నిర్వహించుకోవడం ఆనవాయితీగా మారింది. చరిత్ర, సాహిత్యం, కవిత్వం, సంగీతం ఇలా చెప్పుకుంటూ పోతే ఏ ప్రక్రియలోనైనా గులాబీదే అగ్రస్థానం. 35 మిలియన్ సంవత్సరాల కిందటే పుట్టిన రోజా సౌందర్యానికి, సౌకుమార్యానికి సన్నితమైన దర్పణంగా గులాబీ నిలుస్తోంది. సాహిత్యంలో ప్రత్యేకం... గులాబీలకు సంస్కృతి, సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. గులాబీలను శమంతిక, అతి మంజుల, తరుణి తదితర పేర్లతో పూర్వం పిలిచే వారు. ఈజిప్టు రాణి క్లియోపాత్ర కాలం నుంచి ప్రేమకు చిహ్నంగా గులాబీలను వాడుతున్నారు. తన ప్రియుడైన ఆంధోనిని స్వాగతించేందుకు మోకాళ్ల ఎత్తు మేర గులాబీ రేకుల్ని పరిచిందట క్లియోపాత్ర. ఆధునికంలో ఎన్నో రంగులు పెరుగుతున్న టెక్నాలజీతో గులాబీలలో కూడా రంగులు పెరుగుతున్నాయి. పర్యాటకులను ఆకర్షించేందుకు గులాబీల తోటలను పెద్ద ఎత్తున సాగుచేస్తున్నారు. బెంగుళూరు, ఊటీ తదితర ప్రాంతాల్లోని ‘రోజ్ గార్డెన్’లకు ఎంతో పేరు ఉంది. అక్కడ సేదతీరేందుకు పర్యాకులు చాలా ఇష్టపడతారు. ఎన్నో ప్రయోజనాలు వైద్యపరంగా గులాబీకి చాలా ప్రాముఖ్యం ఉంది. పంచధార, గులాబీ రేకులు కలిపి చేసిన గుల్ఖండ్ మంచి విరోచన కారిగా పనిచేస్తుంది. గులాబీ పూసి, వాడి రాలిపోయిన పిదప చిన్న బుడిపెలా మిగిలిపపోయే కాయల్లో(హిప్లు) నిమ్మ, నారింజ కంటే కనీసం పదిరెట్లు ఎక్కువ ‘విటమిన్ సి’ ఉంటుంది. ముఖాన్ని కాంతివంతంగా చేస్తూ మచ్చల్ని తొలగించేందుకు గులాబీ వాడుతున్నారు. గులాబీ రేకులతో టీ చేసుకుని తాగితే జలుబుకు ఉపశమనం లభిస్తుంది. గులాబీ తైలం మర్దన చేయించుకుంటే మనోల్లాసం చేకూరుతుంది. గులాబీలను సౌందర్య సాధనాలుగా కూడా వాడుతుంటారు. శరీరాన్ని మృదువుగా, తేమగా ఉంచుంది. వీటితో పేస్ప్యాక్ తయారుచేస్తున్నారు. గులాబీ రేకుల క్రీమ్తో మసాజ్ చేస్తున్నారు. గులాబీ రేకుల్ని వేడి నీటిలోనాలుగు గంటలు ఉంచి, వాటితో స్నానం చేస్తే మెరుపు, మృదుత్వం వస్తుంది. సంఖ్యకో సంకేతం గులాబీల సంఖ్యను బట్టి కొన్ని భావాలకు సంకేతాలుగా మారారుు. 12 గులాబీల గుచ్చం కృతజ్ఞత తెలిపేందుకు, 25 గులాబీలతో కూడిన గుచ్చం శుభాకాంక్షలు చెప్పేందుకు, 50 గులాబీలతో కూడిన గుచ్చం గాఢమైన, పరిపూర్ణమైన ప్రేమను వ్యక్తం చేసేందుకు సంకేతాలుగా భావిస్తారు. రంగుకో అర్ధం ఎరుపు : నిజమైన ప్రేమ పసుపు : ఆనందం, స్నేహం, సంతోషం, జ్ఞాపకం, అసూయ గులాబీ : ఆనందం, దయ, నమ్మకం తెలుపు : స్వచ్ఛత, పవిత్రత ముదురుగులాబీ : కృతజ్ఞత నారింజ : ఉత్సుకత, ఊహ ఎరుపు-పసుపు మిశ్రమం : సంతోషం ముధుర గోధుమ-ఎరుపు : ఆనందం ఎరుపు-తెలుపు : ఐకమత్యం లేత పసుపుపచ్చ : కోరిక