breaking news
selfie trend
-
సెల్ఫీ సరదాకు రెండు ప్రాణాలు బలి!
ఘట్కేసర్: సెల్ఫీ సరదా ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు బలి తీసుకుంది. హైదరాబాద్ తార్నాకకు చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న అవినాశ్, పీడీఎస్ చరణ్, భరత్, వంశీలు గణతంత్ర దినోత్సవం కావడంతో కళాశాలకు సెలవు ఇచ్చారని బయటకు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో విద్యార్థులు వరంగల్ జాతీయ రహదారి ఘట్ కేసర్ సమీపంలో ఉన్న సత్యాపాల్ క్రషర్ లో ఉన్న నీటి గుంత వద్ద కొద్ది సమయం గడిపారు. అక్కడ అవినాశ్, పీడీఎస్ చరణ్‌లు సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడిపోయారు. వారిని తోటి విద్యార్థులు రక్షించే లోగానే మృతిచెందారు. విషయాన్ని మృతుల కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు ప్రమాద స్థలికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. -
షార్క్‌తో సెల్ఫీ...
ఈరోజుల్లో సెల్ఫీల ట్రెండ్ అంతా ఇంతా కాదు.. సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్యుల వరకు సెల్ఫీ క్లిక్కులతో హోరెత్తిస్తున్నారు. ఇందులోనూ ఎవరి పంథా వారిది. కొందరైతే వినూత్న సెల్ఫీల కోసం సాహసాలకూ వెనకాడటంలేదు. ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు పీటర్ వెర్హూగ్. వయసు 59 ఏళ్లు. ఈయన చాలా రిస్క్ చేసి మరీ ఈ సెల్ఫీ తీసుకున్నారు. మెక్సికోలోని గౌడేలూప్ సముద్రంలో తనవైపు ఓ తెల్ల షార్క్ వస్తుండగా వెంటనే ఇలా క్లిక్‌మనిపించారు!