breaking news
seemandhra congress leaders deeksha
-
'సమైక్యం మినహా మరో ప్రత్యామ్నయం లేదు'
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ శాసనసభ ప్రాంగణంలో సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు చేపట్టిన దీక్ష ముగిసింది. ఈ సందర్భంగా మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటం మినహా మరో ప్రత్యామ్నయం లేదని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని అందరం నిర్ణయించుకున్నామని మరో మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి తెలిపారు. మరోవైపు ఈనెల 7న ఏపీ ఎన్జీవోల సభకు సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నేతలు ఈరోజు ఉదయం దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. మూడు గంటల పాటు ఈ దీక్ష నిర్వహించారు. సమైక్య రాష్ట్రం కోసం తాము 48 గంటలు నిరాహార దీక్ష చేస్తామని ఈ సందర్భంగా శైలజానాథ్ ప్రకటించారు. ఈ దీక్షకు దాదాపు 16 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు హాజరయ్యారు. -
మా పదవులు ప్రజలిచ్చినవే: శైలజానాథ్
-
మా పదవులు ప్రజలిచ్చినవే: శైలజానాథ్
హైదరాబాద్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు దీక్ష ప్రారంభమైంది. శాసనసభ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద వారు మంగళవారం దీక్ష చేపట్టారు. ముందుగా సీమాంధ్ర నేతలు గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించి దీక్ష ఆరంభించారు. ఈ సందర్భంగా సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల ఫోరం చైర్మన్, మంత్రి సాకే శైలజానాథ్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు కేంద్రానికి లేఖ రాయాలని కోరారు. తమ పదవులు ప్రజలు ఇచ్చినవేనని... వారి డిమాండ్‌లో న్యాయం ఉందని అన్నారు. రాజీనామాలపై వెనకాడే ప్రసక్తే లేదని.... సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. సమైక్య రాష్ట్రం కోసం హైదరాబాద్ కేంద్రంగా మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. సమైక్యాంధ్ర, ప్రజా ఉద్యమాలకు మద్దతుగా నిరసన దీక్ష చేపట్టినట్లు తెలిపారు. ఈ దీక్షలు 12మంది మంత్రులు, 39మంది ఎమ్మెల్యేలు, 15మంది ఎమ్మెల్సీలు ఇప్పటివరకూ పాల్గొన్నారు. ఇక సీమాంధ్ర నేతల దీక్ష నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాహనాలను తనిఖీలు చేసిన తర్వాతే లోనికి అనుమతి ఇస్తున్నారు. మరోవైపు 108 అంబులెన్స్‌లను అధికారులు సిద్ధంగా ఉంచారు.