breaking news
	
		
	
  Sanremo
- 
  
    
                
      ఇటలీలో టోర్నడో విధ్వంసం
 - 
      
                   
                               
                   
            ఆకాశగంగలా మొదలై.. విధ్వంసం
శాన్రెమో : ఇటలీలోని శాన్రెమో ప్రజలు ఈ నెల 1వ తేదీన ఆకాశంలో అద్భుతాన్ని చూశారు. మేఘాల నుంచి జీవధారలా సముద్రంలో పడుతుండటాన్ని దృశ్యాన్ని చూసిన శాన్రెమో ప్రజలు తొలుత ఆశ్చర్యానికి గురయ్యారు. అంతలోనే టోర్నడోగా మారిన మధుర క్షణం నగరంలో విధ్వంసం సృష్టించింది. భీకర గాలులతో విరుచుకుపడింది. దీంతో భవనాలు, ఇతర నిర్మాణాలు, వాహనాలు దెబ్బతిన్నాయి. ఆకాశగంగలా వచ్చిన టోర్నడోకు సంబంధించిన దృశ్యాలను శాన్రెమో ప్రజలు ఫోన్లలో చిత్రీకరించి సోషల్మీడియాలో పోస్టు చేయడంతో వైరల్గా మారింది. 


