breaking news
Sacred Space
-
పెయింటింగ్ వర్క్‌షాప్
ఆలోచనలకు రంగులద్ది, చక్కటి పెయింటింగ్స్ వేయాలని అనుకునే వారికోసం సికింద్రాబాద్‌లోని అవర్ సాక్రెడ్ స్పేస్‌లో వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. ఈనెల 16, 17 తేదీల్లో జరిగే వర్క్‌షాప్ చిత్రలేఖనంలో బేసిక్స్ తెలుసుకోవాలనుకునే వారికి చక్కటి అవకాశం. వాటర్ కలర్స్‌ను వాడుతూ అందమైన ఊహలకు రూపమివ్వడానికి ఉపకరించేలా ఇది కొనసాగుతుంది. -
వెరైటీ అంగడి
ఆదివారం కాస్త డిఫరెంట్‌గా హెల్దీగా సాగాలంటే అవర్ సాక్రెడ్ స్పేస్‌కి వెళ్లాల్సిందే. ఆరోగ్యాన్నిచ్చే కాయగూరలే కాదు... అల్లికలు, పెయింటింగ్‌స వంటివి నేర్చుకోవాలన్నా... చక్కని కథలు వినాలన్నా అక్కడికి వెళ్లవచ్చు. ఇంటర్నెట్లో క్రోషియా నేర్చుకున్న కావ్య ఇక్కడికి వచ్చిన వారికి శిక్షణ ఇస్తుంది. డిగ్రీ చదువుతున్న కావ్య సెలవుల్లో సరదాగా ఇక్కడ క్రోషియా నేర్పిస్తుంది. పండ్లు, కూరగాయలే కాదు, హెల్దీ కేక్స్ కూడా ఉన్నాయి. లక్ష్మీ చేసే గ్లూటెన్ ఫ్రీ కేకులు ఎంతో రుచిగా ఉంటాయి. మైదా, ఎగ్ లేకుండా పూర్తి వీగన్ తరహా కేకులు ఈవిడ ప్రత్యేకత.