breaking news
Rs.90 lakhs
-
ఎయిర్ ఇండియాకు రూ.90 లక్షల జరిమానా: కారణం ఇదే
అర్హత లేని సిబ్బందితో విమానాన్ని నడిపించినందుకు ఎయిర్ ఇండియాపై ఏవియేషన్ రెగ్యులేటర్ 'డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్' (డీజీసీఏ) రూ. 90 లక్షల జరిమానా విధించింది. అంతేకాకుండా, ఎయిర్ ఇండియా ఆపరేషన్స్ డైరెక్టర్‌కు రూ. 6 లక్షలు, ట్రైనింగ్ డైరెక్టర్‌కు రూ. 3 లక్షల జరిమానా విధించింది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా జాగ్రత్త వహించాలని సంబంధిత పైలట్లను హెచ్చరించినట్లు డీజీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది.జూలై 9న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ముంబై నుంచి రియాద్‌కు విమానాన్ని నడపాల్సి సమయంలో ఓ ట్రైనింగ్ కెప్టెన్‌తో కలిసి ట్రైనీ పైలట్ విధులు నిర్వహించాల్సి ఉంది. కానీ ట్రైనింగ్ కెప్టెన్ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల, విమానాన్ని ట్రైనీ పైలట్ నడిపారు.ట్రైనీ పైలట్ శిక్షణ కెప్టెన్‌తో ముంబై-రియాద్ విమానాన్ని నడపాల్సి ఉంది. అయితే, శిక్షణ కెప్టెన్ అనారోగ్యం పాలయ్యాడు మరియు అతని స్థానంలో శిక్షణ లేని కెప్టెన్‌ని నియమించారు. నిర్వహణ వ్యవస్థలోని లోపాల కారణంగా ఈ సంఘటన జరిగింది. జూలై 10న ఎయిర్‌లైన్ సమర్పించిన నివేదిక ద్వారా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. -
శాంతారావు ఇంట్లో ఏసీబీ సోదాలు
సీతమ్మదార (విశాఖపట్టణం): లంచం తీసుకుంటూ ఇటీవల ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఉద్యోగి శాంతారావు ఇంట్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దాదాపు రూ.90 లక్షల ఆస్తులను గుర్తించిన ఏసీబీ అధికారులు వాటిని సీజ్ చేశారు. శ్రీకాకుళం, బొబ్బిలి, విశాఖపట్టణంలో ఏసీబీ ఏకకాలంలో బుధవారం దాడులు చేసింది. దీంతో శాంతారావుకు చెందిన పలు ఆస్తులు వెలుగులోకి వచ్చాయి.