Ribbon Cutting
-
మువ్వన్నెల రిబ్బన్ కత్తిరిస్తారా ఎవరైనా: ఒమర్
శ్రీనగర్: రాష్ట్ర వేసవికాల రాజధాని శ్రీనగర్‌లో బుధవారం ఒక ఎగ్జిబిషన్‌ను ప్రారంభించేందుకు వచ్చిన జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అక్కడి ముఖద్వారానికి అడ్డంగా పెట్టిన ప్రారంభోత్సవ రిబ్బన్‌ను చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ఇదేం రిబ్బన్? త్రివర్ణ పతాక రంగుల్లో ఎవరైనా రిబ్బన్‌ను సిద్ధంచేస్తారా? నేను అస్సలు దీనిని కత్తిరించబోను. వెంటనే దీనిని జాగ్రత్తగా పక్కకు తీసేయండి. పడేయకుండా మడతపెట్టి జాగ్రత్తపరచండి’’అని అధికారులకు సూచించారు. అసలు ఈ ఐడియా ఎవరిది? అని ఆరాతీశారు. దీంతో కంగుతిన్న అక్కడి ఎగ్జిబిషన్ నిర్వహకులు మాకు తెలియదు, మాకు తెలియదు అంటూ నీళ్లు నమిలారు. ఘటన జరిగినప్పుడు సీఎంతోపాటు డెప్యూటీ సీఎం సురీందర్ చౌదరి, సలహాదారు నసీర్ ఆలం తదితరులు ఉన్నారు. శ్రీనగర్‌లోని కశ్మీర్ హాత్ ప్రాంతంలోని ‘నో యువర్ ఆర్టిసాన్’ఎగ్జిబిషన్ ఈ ఘటనకు వేదికైంది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ముఖ్యమంత్రి దేశభక్తి, సమయస్ఫూర్తిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ‘‘జాతీయజెండాకు నిజమైన గౌరవం ఇవ్వడమంటే ఇదే. చవకబారు టీవీ చర్చలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సీఎం సమయస్ఫూర్తితో వ్యవహరించారు. మన మాటలకంటే చేతలే శక్తివంతంగా ప్రజల్లోకి వెళ్తాయి’’అని నేషనల్ కాన్ఫెరెన్స్ పార్టీ నేత గగన్ భగత్ అన్నారు. -
చూసి చూసి.. రిబ్బన్ తీసిపడేసిన సీఎం కేసీఆర్
-
'కాంగ్రెస్ చేసిన పనులకు మోడీ రిబ్బన్ కటింగ్'
ఇబ్రహీంపట్నం: సోషల్ మీడియాను బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుంటుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. తప్పుడు పోస్ట్‌లతో మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలని బీజేపీ ప్రయత్నం చేసిందని ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయామని వాపోయారు. పనులు చేయడం.. ప్రచారం చేసుకోకపోవడం కాంగ్రెస్ బలహీనత అని, ఆ లోపం వల్లే కాంగ్రెస్ ఓటమిపాలయిందన్నారు. మోడీ స్పీచ్‌లు బాగా ఇస్తారని, తప్పుడు హామీలివ్వడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. తాము చేసిన పనులకు మోడీ రిబ్బన్ కటింగ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్దార్ పటేల్, జవహర్లాల్ నెహ్రూలు సోదరభావంతో ఉండేవారని గుర్తు చేశారు. కొన్ని రాజకీయ శక్తులు సర్దార్ పటేల్ కంటే నెహ్రూను తక్కువ చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ సహించదని స్పష్టం చేశారు. ప్రజలు కాంగ్రెస్‌ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని, ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ సదస్సులో అన్నారు. ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ కార్యకర్తలకు దిగ్విజయ్ సూచించారు.


