breaking news
Research sector
-
భారత పరిశోధనా రంగంలో కొత్త అధ్యాయం
భారతదేశ పరిశోధనా రంగంలో ఒక కొత్త అధ్యాయం ‘నూతన విద్యా విధానం– 2020’. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రకారం భారతదేశంలోని విద్యా, పరిశోధన రంగాలను బలోపేతం చేయడానికి ఇది కృషి చేస్తుంది. ఈ దిశలోనే ‘వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్’ (ఓఎన్ఓఎస్) పథకం ఒక ముఖ్యమైన అడుగుగా చెప్పవచ్చు. భారతదేశ పరిశోధనా రంగాన్ని బలోపేతం చేయడంలో నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 కీలక పాత్ర పోషిస్తోంది. ఈ దిశలో, అనుసంధాన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఏఎన్ఆర్ఎఫ్) ఆధ్వర్యంలో ప్రారంభించబడిన ఓఎన్ఓఎస్ దేశవ్యాప్తంగా విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులకు నాణ్యమైన శాస్త్రీయ సమాచారాన్ని అందించే దిశగా పనిచేస్తోంది.భారతీయ విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులకు అంతర్జాతీయ స్థాయి పత్రికలను డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇవ్వడం ద్వారా పరిశోధన ప్రమాణాలను మెరుగుపరుస్తోంది. ‘ఆత్మనిర్భర భారత్’ కల సాకారం కావడానికి అవసరమైన దేశీయ పరిశోధనలకు ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. దేశంలోని అట్టడుగు స్థాయి విద్యా సంస్థ నుండి ఉన్నత స్థాయి విద్యా సంస్థ వరకు సమాచారాన్ని సమానంగా అందిస్తుంది. ఓఎన్ఓఎస్ కింద 2025 జనవరి 1 నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ జర్నల్స్‌లో ప్రచు రితమైన పరిశోధనా పత్రాలను మన విద్యార్థులు, పరిశోధకులూ పొందనున్నారు. మొదటి దశ కింద 13,400 కంటే ఎక్కువ అంతర్జాతీయ పత్రికలు అందుబాటులో ఉంటాయి. ఈ పథకం కింద, 451 రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, 4,864 కళాశాలలు; అలాగే జాతీయ ప్రాముఖ్యం కలిగిన 172 సంస్థలూ, 6,380 ఉన్నత విద్య, పరిశోధనా సంస్థలూ వీటిని ఉపయోగించుకోనున్నాయి. ఇవి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పబ్లిషర్స్ (ఎల్సెవియర్, స్ప్రింగర్ నేచర్, వైలి తదితర)తో సహా 30 ప్రచురణ సంస్థలు ప్రచురించే అగ్ర జర్నల్స్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. రాబోయే మూడేళ్లపాటు ఇలా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది.రెండవ, మూడవ దశల్లో ప్రభుత్వ–ప్రైవేట్ నమూనా ద్వారా చొరవను ప్రైవేట్ విద్యా సంస్థలకు విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మూడవ దశలో పబ్లిక్ లైబ్రరీలలో ఏర్పాటు చేసిన యాక్సెస్ పాయింట్ల ద్వారా అంతర్జాతీయ పత్రికలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.మూడు సంవత్సరాల కాలానికి 6,000 కోట్ల రూపాయల వ్యయంతో ఈ కార్యక్రమం సెంట్రల్ సెక్టార్ స్కీమ్‌గా ప్రారంభించబడుతుంది. ప్రపంచంలో జర్మనీ, చెకోస్లోవేకియా వంటి దేశాల్లో ఇప్పటికే ఇటువంటి వ్యవస్థ దిగ్విజయంగా నడుస్తోంది. ఈ పథకం పరిశోధనలు కేంద్రీకృతం కాకుండా అన్ని రాష్ట్రాలలో, అన్ని పరిశోధనా సంస్థలలో, రాష్ట్రస్థాయి విశ్వవిద్యాలయాల్లో ఆవిష్కరణాత్మక పరిశో ధనలను ప్రోత్సహిస్తుంది. పట్టణ – గ్రామీణ పరిశోధనా సంస్థల మధ్య డిజిటల్ అంతరాన్ని తగ్గిస్తుంది. అయితే ఈ పథకం అమలులో పలు సవాళ్ళూ ఎదురు కానున్నాయి. ప్రధానంగా, అంతర్జాతీయ పత్రికల చందా ఖర్చులు సంవత్సరానికొకసారి పెరుగుతుండడం కీలక సమస్య. రూ. 6,000 కోట్ల భారీ బడ్జెట్ ఉన్నప్పటికీ, అన్ని ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థాయి విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థల అవస రాలను తీర్చడం సవాలుగా మారవచ్చు. అలాగే సంపాదకీయ హక్కులు, మేధా సంపత్తి సమస్యలు ముందుకు రావచ్చు. ఈ తరహా అంత ర్జాతీయ ఒప్పందాలు చాలాసార్లు సాంకేతికత, భాష, మరియు అవసరాల ఆధారంగా వివిధ సంస్థలకు అసమాన అనుభవాలను కలిగించ వచ్చు. అనేక స్థాయుల్లో సమాచార కొరత వల్ల పథకం గురించి అవగాహన లేని పరిస్థితి తలెత్తవచ్చు. ప్రత్యేకించి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోవసతుల కొరత వల్ల వనరులను పూర్తిగా ఉపయోగించుకోలేని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. మొత్తం మీద వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ పథకం భారతదేశంలోని విద్య– పరిశోధన రంగాలకు ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తుంది. ఈ పథకం ద్వారా భారతదేశం త్వరలోనే ప్రపంచంలోనే అగ్ర పరిశోధనా కేంద్రంగా మారే అవకాశం ఉంది. డా‘‘ రవి కుమార్ చేగోని వ్యాసకర్త తెలంగాణ గ్రంథాలయ సంఘం ప్రధాన కార్యదర్శి -
చైనా కవ్వింపులు.. మాల్లీవుల్లోకి డ్రాగన్ పరిశోధన నౌక
మాలె: భారత్ పొరుగు దేశం మాల్దీవుల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. భారత్‌తో దౌత్యపరంగా వివాదం కొనసాగుతున్న వేళ.. చైనా భారీ నౌక మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించింది. దీంతో, ఈ పరిణామం రాజకీయంగా ప్రాధానత్యను సంతరించుకుంది. మరోవైపు.. భారత్‌ను కవ్వించేందుకే డ్రాగన్ కంట్రీ ఈ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. చైనాకు చెందిన పరిశోధక నౌక షియాంగ్ యాంగ్ హాంగ్-03 తాజాగా మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించింది. రాజధాని మాలె తీరంలో ఇది లంగరు వేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కాగా, 4,300 టన్నుల బరువున్న ఈ నౌక హిందూ మహాసముద్రం అడుగు భాగంలోని ఉపరితలంపై పరిశోధన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పరిశోధనల్లో భాగంగా ఇక్కడి సముద్ర జలాల్లో జలాంతర్గాముల సంచారానికి అవసరమైన మార్గాలను గుర్తించే అవకాశం బీజింగ్‌కు లభిస్తుందని నావికాదళ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. ఇదిలా ఉండగా.. గతంలో చైనా ఇదే తరహాలో శ్రీలంకలో ఓడలను నిలిపింది. అయితే, ఈసారి మాత్రం కొలంబో ఇందుకు అంగీకరించలేదు. దీంతో, చైనా ప్లాన్ ప్రకారం మాల్దీవుల్లో మకాం వేసింది. ఇక, ఈ నౌకలు సైనిక-పౌర ప్రయోజనాలకు సంబంధించనవని భారత అధికారులు ఆరోపిస్తున్నారు. వాటిలోని టెక్నాలజీ.. భారత్‌కు చెందిన నిఘా సమాచారాన్ని సేకరిస్తాయని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఇవి భారత్‌లో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలు , గగన తలంపై నిఘా ఉంచగలవు. మన పోర్టులు, అణు కేంద్రాలపై కూడా ఇవి ఫోకస్ పెట్టే అవకాశం కూడా ఉందని వారు చెబుతున్నారు. 🚨Maldives' Chinese Ship Visit Raises India's Ocean Security Concerns The Indian Ocean, the Chinese research ship Xiang Yang Hong 03 is scheduled to arrive in the Maldives on Thursday. Over three weeks, the research institute-owned vessel surveyed waters beyond the exclusive… pic.twitter.com/iZ2I5tKVkR — CRUXX | News App (@CRUXX_Ind) February 22, 2024 మరోవైపు.. ఇటీవలే భారత్, మాల్దీవుల మధ్య దౌత్యపరంగా పలు విబేధాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ.. లక్షద్వీప్‌కు వెళ్లి పర్యాటకాన్ని ప్రోత్సహించేలా పలు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో పలు మాల్దీవుల ఎంపీలు.. భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో రాజకీయంగా ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో, భారత పర్యాటకులు మాల్దీవుల ట్రిప్స్‌ను రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మాల్దీవులకు ఆర్థికపరంగా నష్టం కలుగుతోంది. -
ఉద్యాన పంటలకు.. హార్టికల్చరిస్ట్
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా కార్యాలయంలో కూర్చొని చేసే డెస్క్ జాబ్ మీకిష్టం లేదా? నిత్యం ప్రకృతి ఒడిలో ఉంటూ, పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ పనిచేసుకోవాలనుకుంటున్నారా? అయితే, మీలాంటి వారికి సరిగ్గా సరిపోయే కెరీర్.. హార్టికల్చరిస్ట్. ప్రస్తుతం హార్టికల్చరిస్ట్లకు లెక్కలేనన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. దీన్ని కెరీర్‌గా ఎంచుకుంటే ప్రకృతిని కాపాడుతూ, ప్రజల ఆహార అవసరాలను తీరుస్తూ సమాజానికి సేవ చేస్తున్నామన్న వృత్తిపరమైన సంతృప్తి దక్కుతుంది. ఉద్యోగాలు, పరిశోధనలు : హార్టికల్చరిస్ట్‌లు ప్రధానంగా సుందరమైన ఉద్యాన వనాల పెంపకంతోపాటు పండ్లు, కూరగాయలు, పూల ఉత్పత్తిని చేపట్టాల్సి ఉంటుంది. క్రాప్ ప్రొడక్షన్, ప్లాంట్ బ్రీడింగ్, క్రాస్-బ్రీడింగ్, ప్లాంట్ బయోకెమిస్ట్రీ, ప్లాంట్ ఫిజియాలజీ తదితర రంగాల్లో పరిశోధనలు చేయాలి. నాణ్యమైన, అధిక పోషకాలతో కూడిన ఫలసాయమిచ్చే మొక్కలను సృష్టించాలి. ఉద్యాన పంటలన్నీ హార్టికల్చరిస్ట్ పరిధిలో ఉంటాయి. హార్టికల్చర్‌లో వెజిటెబుల్ సైన్స్, ఫ్రూట్ టెక్నాలజీ, ఫ్లోరికల్చర్ అనే స్పెషలైజేషన్లు ఉన్నాయి. హార్టికల్చరిస్ట్లకు ప్రస్తుతం ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగాల్లో ఎన్నో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. కార్పొరేట్ సంస్థలు, ఫామ్‌హౌస్‌లు వీరికి స్వాగతం పలుకుతున్నాయి. రహదారుల పక్కన పచ్చదనాన్ని అభివృద్ధి చేసేందుకు హైవే అథారిటీలు వీరిని నియమించుకుంటున్నాయి. ఇక సొంతంగా నర్సరీని ఏర్పాటు చేసుకొని అగ్రిప్రెన్యూర్‌గా ఉపాధి పొందొచ్చు. పరిశోధనా రంగంలో చేరితే అధిక వేతనాలు అందుకోవచ్చు. ఆసక్తి ఉంటే కన్సల్టెంట్‌గా కూడా ప్రజలకు సేవలందించొచ్చు. కావాల్సిన స్కిల్స్: ఈ రంగంలో శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. హార్టికల్చరిస్ట్కు ప్రకృతిపై ఇష్టం, క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే తత్వం ఉండాలి. కొత్త వంగడాల అభివృద్ధికి, నాణ్యమైన పండ్లు, కూరగాయలను ఉత్పత్తి చేసేందుకు శాస్త్రీయ దృక్పథం అవసరం. ఈ రంగంపై ఎప్పటికప్పుడు పరిజ్ఞానం పెంచుకోవాలి. అందమైన వనాలను పెంచేందుకు సృజనాత్మకత ఉండాలి. అర్హతలు: భారత్‌లో అగ్రికల్చర్ సైన్స్‌లో వివిధ కోర్సులున్నాయి. గ్రాడ్యుయేషన్ తర్వాత రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ హార్టికల్చర్ కోర్సుల్లో చేరొచ్చు. పరిశోధనా రంగంలో అడుగుపెట్టాలంటే డాక్టరేట్ పూర్తిచేయాలి. హార్టికల్చరిస్ట్గా కెరీర్‌ను ప్రారంభించాలంటే పీజీ చేస్తే సరిపోతుంది. వేతనాలు: హార్టికల్చరిస్ట్/సూపర్వైజర్కు ప్రారంభంలో నెలకు రూ.12 వేల వేతనం అందుతుంది. తర్వాత సీనియారిటీని బట్టి మేనేజర్/సీనియర్ మేనేజర్‌కు నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు లభిస్తుంది. ఇక డెరైక్టర్ స్థాయికి చేరుకుంటే నెలకు రూ.లక్షకు పైగానే అందుకోవచ్చు. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం-హైదరాబాద్ వెబ్సైట్: www.angrau.ac.in డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ వెబ్సైట్: www.drysrhu.edu.in ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ టెక్నాలజీ వెబ్సైట్: www.iht.edu.in ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్-ఢిల్లీ వెబ్సైట్: www.iari.res.in ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో స్థిరపడొచ్చు ‘‘దైనందిన కార్యకలాపాలకు అవసరమైన కోర్సులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. వ్యవసాయ ప్రధానమైన భారతదేశంలో అగ్రికల్చర్, అనుబంధ విద్యకు గిరాకీ తగ్గదు. హార్టికల్చర్‌లో గ్రాడ్యుయేషన్, పీజీ, డిప్లొమా కోర్సులను పూర్తిచేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో అవకాశాలున్నాయి. ఉద్యానవన, విత్తనాభివృద్ధి సంస్థల్లో పనిచేయవచ్చు. స్వయం ఉపాధి పొందుతూ మరికొందరికి మార్గం చూపాలంటే నర్సరీలు, సీడ్ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు. విద్యా సంస్థల్లో ఫ్యాకల్టీగానూ పనిచేయొచ్చు’’ - డాక్టర్ బి.ఎం.సి.రెడ్డి, వైస్‌ఛాన్సలర్, డాక్టర్ వై.ఎస్.ఆర్.హార్టికల్చరల్ యూనివర్సిటీ జాబ్స్ అలర్ట్స్: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ఆఫ్ ఇండియా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. విభాగాలు: కంప్యూటర్ సైన్స్, సివిల్ ఇంజనీరింగ్. అర్హత: కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజనీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ సివిల్ ఇంజనీరింగ్‌లో కనీసం 65 శాతం మార్కులతో బీఈ/ బీటెక్/ బీఎస్సీ (ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంత్సరం చదువుతున్న విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక: గేట్-2015 స్కోర్ ఆధారంగా గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. గేట్-2015 రిజిస్ట్రేషన్‌కు చివరితేది: అక్టోబరు 1 పీజీసీఐఎల్ రిజిస్ట్రేషన్: జనవరి 15 - ఫిబ్రవరి 27, 2015 వెబ్సైట్: www.powergridindia.com ముగిసిన ‘ఐఈ-ఫెస్ట్’ గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఇన్నోవేషన్ ఇంజనీరింగ్(ఐఈ) ఫెస్ట్-2014 సోమవారం ముగిసింది. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖు లు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. 3డీ స్కానింగ్, 3డీ ప్రింటింగ్ వంటి సాంకేతిక పరికరాల రూపకల్పనను ప్రాక్టికల్‌గా చేసి చూపారు. క్రాంతి విస్తాకుల రూపొందించిన ‘బ్లో హాట్, బ్లో కోల్డ్’ సూట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక్కడే ఇంజనీరింగ్ పూర్తిచేసిన క్రాంతి ఉన్నత విద్యను అమెరికాలోని ప్రతిష్టాత్మక మిట్లో పూర్తి చేశార ు. అనంతరం దామా ఇన్నోవేషన్స్ సంస్థను నెలకొల్పారు. హైదరాబాద్‌లో స్టార్టఅప్లకు అందుబాటులోని అవకాశాలపై నిపుణులు అవగాహన కల్పించారు. అనంతరం మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని ‘ఇంజనీర్స్ డే’ను క్యాంపస్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. కాంపిటీటివ్ కౌన్సెలింగ్ కానిస్టేబుల్ పరీక్షలో విటమిన్లు, హార్మోన్లపై ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? వీటిని ఏ విధంగా చదవాలి? - ఎస్.అశోక్, బొల్లారం అన్ని రకాల పోటీ పరీక్షల్లో హర్మోన్లు, విటమిన్లపై సర్వసాధారణంగా ప్రశ్నలు అడుగుతారు. ఈ రెండు అంశాల్లో ప్రతి దాని నుంచి రెండు లేదా మూడు ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉంది. విటమిన్లు, వాటి చారిత్రక అంశాలు, గుర్తించిన వారు, వాటి రకాలు, ఉనికి, విధులు మొదలైన విషయాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. అదే విధంగా వివిధ రకాల హార్మోన్లు, వాటిని ఉత్పత్తి చేసే గ్రంథులు, ఉత్పత్తికి అవస రమైన మూలకా లు, వాటి లోపం వల్ల వచ్చే వ్యాధులు/ ప్రభావం గురించి చదవాలి. మొక్కలకు సంబంధించిన హార్మోన్లపై ముఖ్యంగా వాటి ప్రభావం వల్ల కలిగే ఫలితాల గురించి అడుగుతారు. ప్రశ్నలో కొద్ది మార్పుతో భిన్న సమాధానాలున్న ప్రశ్నలను కూడా అడగవచ్చు. విటమిన్ల రకాలు, అవి లభించే పదార్థాలు, వాటి లోపం వల్ల వచ్చే వ్యాధులు మొదలైన అంశాలకు సంబంధించి ప్రశ్నలు వస్తాయి. ఆయా అంశాల్లో వివిధ రకాలను గుర్తుంచుకోవడంలో జాగ్రత్త వహించాలి. ఏదైనా కోడ్‌ను రాసుకోవడం ద్వారా వీటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. దీంతో గందరగోళానికి గురయ్యేందుకు ఆస్కారం ఉండదు. సరైన సమాధానాన్ని గుర్తించవచ్చు. ఇన్పుట్స్: టి. సుధాకర్‌రెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ