breaking news
register voters
-
మళ్లీ ఓటరు నమోదు
ఆదిలాబాద్‌అర్బన్: రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త ఓటర్ల నమోదు, బోగస్ ఓటర్ల ఏరివేత కార్యక్రమాలపై దృష్టి సారించింది. ఓటర్ల తుది జాబితా తయారీకి ఈసీ కసరత్తు మొదలు పెట్టింది. 2019 జనవరి ఒకటో తేదీ నాటికి పద్దెనిమిదేళ్లు నిండే యువత ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకునేందుకు మరోసారి అవకాశం కల్పించింది. ఇందులో భాగంగానే అర్హులైన యువతను ఓటరు జాబితాలో చేర్చేందుకు ఈ నెల 1 నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కొత్త ఓటరు నమోదుతోపాటు ఇంతకుముందున్న ఓటరు కార్డుల్లో మార్పులు, చేర్పులు, చిరునామాలు, పోలింగ్ కేంద్రాలు మార్చుకునేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ దరఖాస్తు ఫారాలు ఆయా మండలాల తహసీల్దార్లు, ఆర్డీవోల, బూత్ స్థాయి అధికారి(బీఎల్వో)ల వద్ద అందుబాటులో ఉన్నా యి. ఓటు నమోదుకు యువత ముందుకు రా వాలని, అర్హులు జాబితాలో పేర్లను నమోదు చేసుకోవాలని గ్రామాలు, మండలాలు, కళాశాలల్లో ఓటరు నమోదుపై అధికారులు త్వరలో అవగాహ న కార్యక్రమాలు నిర్వహించనున్న సమాచారం. జిల్లాలో ఇలా.. జిల్లాలో గతేడాది నవంబర్ నుంచి డిసెంబర్ చివ రి వరకు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఐఆర్‌ఈఆర్(ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్ట్రోరల్ రోల్) పేరిట చేపడితే, బోథ్ నియోజకవర్గంలో స్పెషల్ సమ్మరి రివిజన్ పేరిట చేపట్టారు. ఈ కార్యక్రమాల ద్వారా ఓటరు కార్డుల్లో మార్పులు, చేర్పులు, తొలగింపులతోపాటు కొత్త ఓటరు నమోదుకు దరఖాస్తులు స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలన చేసిన అధికారులు 2018 జనవరిలో ఓటరు తుది జాబితాను విడుదల చేశారు. 2014 సాధారణ ఎన్నిలకు ముందు రాష్ట్రంలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనాభా ప్రకారం చూస్తే ఓటర్లు ఎక్కువగా ఉన్నారని భావించిన ఈసీ ఈ ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా ఎన్నికల అధికారులు, సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ నెల రోజులపాటు సర్వే చేశారు. ఈ సర్వేలో కొత్త ఓటర్లను నమోదు చేస్తూ, ఓటరు కార్డుల్లో తప్పులు, చిరునామాలు మార్పులు, చేర్పులు చేశారు. చనిపోయిన, వలస వెళ్లిన వారిని ఓటరు జాబితా నుంచి తొలగించారు. ఇలా ఆదిలాబాద్ నియోజకవర్గంలోనే సుమారు 50 వేల ఓటర్లు తొలగిపోయాయి. చనిపోయిన వారి పేర్లు జాబితాలో ఉంచారని, అర్హులైన ఓటర్లను తొలగించారని అప్పట్లో కలెక్టర్‌కు, ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో 2018 ఫిబ్రవరి నుంచి ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి మేలో ఓటర్ల తుది జాబితాను విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా ఎన్నికల సంఘం సెప్టెంబర్ 1 నుంచి ఓటర్ల నమోదు చేపట్టాలని ఆదేశించగా ఈ యేడాదిలోనే రెండోసారి ఓటర్ల నమోదు చేపట్టాల్సి వచ్చిందని చెప్పవచ్చు. మే నెలలో విడుదల చేసిన ఓటర్ల తుది జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం 3,52,666 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,76,214 మంది ఓటర్లు ఉండగా, 1,76,391 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 61 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. జిల్లాలో సెప్టెంబర్ ఒకటిన ప్రకటిం చాల్సిన ఓటర్ల ముసాయిదా జాబితాను కొన్ని అనివార్య కారణాల వల్ల 2019 జనవరి ఒకటో తేదిన, జనవరి 4న ఓటర్ల తుది జాబితాను విడుదల చేయనున్నట్లు జిల్లా ఎన్నికల సంఘం అధికా రులు ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అవగాహనేది..? ఓటు హక్కుపై అవగాహన కల్పించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. యువత ముందుకు రాకపోవడానికి ఇదే కారణమని అధికారులు సైతం భావిస్తున్నారు. ఓటర్ల దినోత్సవం రోజు, ఎన్నికల సమయంలో మాత్రమే హడావుడి చేయడం తప్ప ఇతర సమయాల్లో నమోదుపై కల్పిస్తున్న దాఖాలాలు తక్కువ. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమ సమయాల్లో విద్యాసంస్థలు, గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల్లోని వార్డుల్లో అవగాహన కల్పిస్తే నమోదుకు, మార్పులు, చేర్పులకు ముందుకు వచ్చే ఆస్కారం ఉంది. రాబోయే రోజుల్లో సాధారణ ఎన్నికలు ఉన్నందున ఈ కార్యక్రమాలను అర్హత గల వారు సద్వినియోగం చేసుకోవచ్చు. ఓటు హక్కు కోసం ఆన్లైన్లో తప్పా నేరుగా తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్ కార్యాలయాలకు వచ్చి దరఖాస్తులు చేసుకున్న సంఘటనలు తక్కువే. దీంతో ఆశించిన స్థాయిలో ఓటు నమోదు కావడం లేదని సమాచారం. అవగాహన దిశగా చర్యలు చేపట్టి కరపత్రాలు, బ్యానర్లు, పోస్టర్లు ప్రదర్శిస్తే కొందరైనా ముందుకు వచ్చే ఆస్కారం ఉంది. క్షేత్రస్థాయిలో బీఎల్వోలను ఎప్పటికప్పుడు ఓటు హక్కు నమోదు చేసుకునేలా యువతను ప్రోత్సహిస్తే ఓటరు నమోదు లక్ష్యం కొంతమేరకైనా సాధించవచ్చు. అక్టోబర్ 31 వరకు నమోదు కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు ఇప్పటి నుంచి అక్టోబర్ 31 వరకు అవకాశం ఉంది. ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కాకపోయినా తప్పులు, సవరణలు, పేర్లు, చిరునామాల్లో మార్పులు, తొలగింపులు ఉంటే దరఖాస్తులు చేసుకోవచ్చు. జిల్లాలోని మొత్తం 518 పోలింగ్ కేంద్రాల పరిధిలో కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంది. బూత్ స్థాయి అధికారులు ప్రత్యేక ఓటరు నమోదుకు అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని 18 ఏళ్లు నిండిన ప్రతి యువత సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. -
పోలింగ్ 90 శాతానికి తగ్గొద్దు
అర్హులైన ప్రతి ఓటరుపేరుజాబితాలో ఉండాలి అధికారులకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ సూచన బీఎల్ఓలు ఇంటింటికి పోల్ చీటీలు పంచుతారు ఓటర్ల నమోదుకు రాజకీయ పక్షాలు సహకరించాలని విజ్ఞప్తి కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో 2009 సాధారణ ఎన్నికల్లో 72శాతం పోలింగ్ నమోదయిందని, ప్రస్తుత సాధారణ ఎన్నికల్లో పోలింగ్ 90 శాతానికి తగ్గకుండా చూడాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ జిల్లా అధికారులకు సూచించారు. ఓటర్ల నమోదులో అధికారులతో పాటు రాజకీయ పక్షాలు కూడా సహకరించాలని కోరారు. జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించేందుకు రెండు రోజుల పర్యటనలో భాగంగా జిల్లాకు వచ్చిన ఆయన సోమవారం సాయంత్రం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, పోలీస్ అధికారులతో విడివిడిగా సమావేశ మయ్యారు. కలెక్టర్ జి.కిషన్, జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, ఎస్పీలు వెంకటేశ్వర్రావు, కాళిదాసు పాల్గొన్నారు. ఈ సమావేశాలలో భన్వర్‌లాల్ మాట్లాడుతూ పోలింగ్ విషయంలో అధికారులు నిష్పాక్షికంగా వ్యవహరించాలన్నారు. ఓటరు నమోదుకు అవకాశం ఉన్నందున వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి పరిష్కరించాలని, అర్హులైన ఓటరు జాబితాలో తన పేరు లేదని ఆందోళన చేసే పరిస్థితి కల్పించవద్దని చెప్పారు. ఈవీఎంల వాడకంపై ప్రతి ఓటరుకు అవగాహన ఉండేలా ఛైతన్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలను భన్వర్‌లాల్ అభినందించారు. పోలింగ్ కేంద్రాల మార్పులు, మౌలిక సదుపాయాల కల్పన తదితర విషయాల్లో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. వారం ముందు పోల్‌చీటీల పంపిణీ ఓటరు జాబితాలో పేరు విషయంలో ప్రజలు ఆందోళన చెందకుండా ఉండేందుకు పోలింగ్‌కు వారం రోజుల ముందు బీల్వో(బూత్ లెవల్ ఆఫీసర్)లు ఇంటిం టికి వెళ్లి చీటీలు పంచుతారని, పంపిణీ క్రమంలో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు పార్టీల ప్రతినిధులు కూడా కార్యక్రమంలో పాల్గొనాలని భన్వర్‌లాల్ కోరారు. ఓటరు నమోదు శాతాన్ని పెంచేందుకు రాజకీ య పార్టీలు కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ పార్టీలకు సంబంధించిన కండువాలు, జెండాలు ఒకసారి కొనుగోలు చేసినవే ఎన్నికలు పూర్తయ్యేవరకు ఉపయోగస్తామని, వానిటి ప్రతిచోటా లెక్కించడం వల్ల ఇబ్బందిగా ఉంటుందని భన్వర్‌లాల్ దృష్టికి తెచ్చారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో టేబుల్, కుర్చీ ఏర్పాటు చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. సమావేశంలో కాగ్రెస్ పార్టీ నుంచి బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ నుంచి గుడిమల్ల రవికుమార్, టీడీపీ నుంచి ఎడబోయిన బస్వారెడ్డి, బీజేపీ నుంచి మురళీమనోహర్, సీపీఐ నుంచి టి.శ్రీనివాస్‌రావు, వీరగంటి సదానందం, బీఎస్పీ నుంచి కట్కం యాదగిరి పాల్గొన్నారు. నిట్‌లో భన్వర్‌లాల్.. నిట్ క్యాంపస్ : జిల్లా ఎన్నికల అధికారుల సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ సోమవారం నిట్ గెస్ట్‌హౌజ్‌లో కొంత సేపు విశ్రాంతి తీసుకున్నారు. భన్వర్‌లాల్‌ను కలెక్టరేట్లో జరిగే సమావేశానికి ఆహ్వానించడానికి జిల్లా కలెక్టర్ కిషన్, వరంగల్ రేంజ్ డీఐజీ కాంతారావు, అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు, రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసు, జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు వచ్చారు. ఈ సందర్బంగా భన్వర్‌లాల్ జిల్లా కలెక్టర్ కిషన్‌ను సాధారణ ఎన్నికలకు సంబంధించి చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్లో ఎన్నికల అధికారులతో సమావేశం కావడానికి భన్వర్‌లాల్ బయలుదేరి వెళ్లారు. -
మరో మూడు రోజులే..
=ఓటర్ల నమోదుకు గడువు =నేడు అన్ని పోలింగ్ కేంద్రాల్లో స్వీకరణ =బీఎల్ఓల వద్ద దరఖాస్తులు విశాఖపట్నం, న్యూస్‌లైన్ : ప్రజల చేతిలో పాశుపతాస్త్రం ఓటు హక్కు. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండేవారంతా ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇప్పుడు దరఖాస్తు చేసుకునేవారికి వచ్చే ఏడాది జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం నాడు కలర్ ఫొటోతో కూడిన గుర్తింపు కార్డు అందజేయనున్నారు. కొత్త ఓటర్ల నమోదుతోపాటు, చిరునామాలో మార్పులు, నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి ఓటు బదిలీ, ఓటరు గుర్తింపు కార్డులో తప్పుల సవరణకు నిర్ణీత దరఖాస్తు నింపి, అవసరమైన పత్రాలు జతచేయాల్సి ఉంటుంది. జీవీఎంసీ పరిధిలోని 72 వార్డు కార్యాలయాల్లో ఓటర్ల జాబితాలు అందుబాటులో ఉంచారు. ఓటరు గుర్తింపు కార్డు ఉండి, జాబితాలో పేరు గల్లంతయితే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటివరకు గుర్తించిన డూప్లికేట్ కార్డులను తొలగిస్తామని అధికారులు తెలిపారు. నేడు ప్రత్యేక డ్రైవ్ ఓటర్ల నమోదు, తప్పుల సవరణకు ఈనెల 17వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. వచ్చే ఏడాది జనవరి 16న తుది జాబితా ప్రకటిస్తారు. ఈ జాబితా ఆధారంగానే 2014 సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా ఆదివారం (15న) అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్ల నమోదు జరుగుతుంది. ఇంటర్నెట్ ద్వారా వివరాలు నమోదు చేసుకున్నవారు ప్రింటవుట్‌పై సంతకాలు చేసి, అవసరమైన పత్రాలు, ఫొటో జతచేసి దరఖాస్తులు అందజేయాలి. దేనికి ఏ దరఖాస్తు కొత్తగా ఓటర్ల నమోదు కోసం ఫారం-6, జాబితా నుంచి పేరు తొలగించాలనుకుంటే ఫారం-7, జాబితాలో తప్పుల సవరణకు ఫారం-8, అదే నియోజకవర్గం పరిధిలో నివాసం మారినపుడు ఫారం-8ఏ అందజేయాల్సి ఉంటుంది. వివరాలకు 1950 నంబర్‌కు ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటలలోపు సంప్రదించవచ్చు. నియోజకవర్గం మారితే.. అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి నివాసం మారితే సంబంధిత సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఓటర్ గుర్తింపు కార్డు అందజేసి, ఓటు రద్దు చేసుకోవాలి. తరువాత మారిన నియోజకవర్గంలో కొత్త ఓటరుగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో ఫొటో, నివాస ధృవీకరణపత్రం, వయసు ధృవీకరణపత్రం జతచేయాలి. ఇంటింటి సర్వేలో భాగంగా అద్దె ఇంట్లో ఉన్న వారు ఇల్లు మారితే వారి పేర్లను ఓటర్ల జాబితాలోంచి బీఎల్ఓలు తొలగించా రు. వీరు తాజాగా దరఖాస్తు చేసుకోవాల్సిందే. -
డిసెంబర్ 10 వరకు ఓటర్ల నమోదు
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఓటర్ల నమోదు కార్యక్రమం డిసెంబర్ 10వ తేదీ వరకు కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్ చెప్పారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం నుంచి నిర్వహించిన సెట్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నూత న ఓటర్ల నమోదుకు దరఖాస్తులతోపాటు మార్పులు చేర్పులకు 6, 7, 8, 8 ఏ దరఖాస్తు లు సమర్పించవచ్చని చెప్పారు. ముసాయిదా ఓటరు జాబితాను సోమవారం ప్రచురించామన్నారు. ఇందులో ఉన్న పొరపాట్లను సరి చేయాలన్నారు. ఈ నెల 24, డిసెంబర్ 1,8 తేదీల్లో రాజకీయ పార్టీల నుంచి బీఎల్వోలు క్లెయిమ్ లు స్వీకరిస్తారని చెప్పారు. ఆ క్లైయిమ్లతోపాటు ఇతర సమస్యలను డిసెంబర్ 28న పరిష్కరించాలన్నారు. 2014 జనవరి 10న మొత్తం వివరాలు అప్ లోడ్ చేసి సప్లిమెంటరీ జాబితా తయారు చేయాలని, 16న తుది జాబితా ప్రచురించాలని పేర్కొన్నారు. నియోజకవర్గాలకు సహాయ రిటర్నింగ్ అధికారులను నియమించామని వెల్లడించారు. పై-లీన్ తుపా ను, భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాల వివరాలను వెంటనే నమోదు చేయాలని ఆదేశించారు. రచ్చబండలో వచ్చే ఆర్జీల వివరాలను ప్రజావాణిలో నమోదు చేయాల న్నారు. 7వ విడత భూ పంపిణీని సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. పట్టాతోపాటు టైటిల్ డీడ్, కంప్యూటరైజ్డ్ అడంగల్, వెబ్ అడంగల్, ఎఫ్ఎంబీ కాపీ అందించాలని స్పష్టం చేశారు. బంగారు తల్లి పథకం వర్తింపజేసేందుకు ఈ ఏడాది మే 1వ తేదీ తర్వాత జన్మించిన బాలికల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఈ తేదీ తర్వాత జిల్లాలో 16 వేల మంది జన్మించగా 3 వేల మంది మాత్రమే నమోదు చేసుకున్నారని, వచ్చే సోమవారం నాటికి కనీసం 5 వేల మంది వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. నేడు టాయిలెట్ దినోత్సవం మంగళవారం టాయిలెట్ దినోత్సవం నిర్వహించనున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామాల్లో బహిరంగ మల విసర్జన, పారిశుద్ధ్యం, డంపింగ్ యార్డులు ఇతర అంశాలపై చర్చించాలని సూచించారు. డీఎంహెచ్ఓ గీతాంజలి, ఏజేసీ ఆర్.ఎస్.రాజ్‌కుమార్, డ్వామా పీడీ కల్యాణచక్రవర్తి పాల్గొన్నారు.


