ఎర్రచందనం అక్రమ రవాణా : ఇద్దరు అరెస్ట్
కర్నూలు : ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తూ ఇద్దరు వ్యక్తులు కర్నూలు జిల్లా పోలీసులకు పట్టుబడ్డారు. గురువారం అర్ధరాత్రి నంద్యాల చెక్పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా చెవర్లెట్ కారులో తరలిస్తున్న 9 ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కత్తి మనోహర్, నాగరాజారెడ్డిలను అరెస్ట్ చేశారు.