breaking news
Recording tampering
-
భార్య అనుమతి లేకుండా ఆమె ఫోన్ కాల్స్ రికార్డు చేయడం నేరం: హైకోర్టు
Recording wife’s telephonic call without her consent is a blatant violation of her privacy చండీఘడ్: భార్య అనుమతి లేకుండా ఆమె ఫోన్ కాల్స్‌ను భర్త రికార్డు చేయడం గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని పంజాబ్, హర్యానా ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. జనవరి 20, 2020 నాటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ లిసా గిల ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. పంజాబ్‌లోని భటిండాకు చెందిన ఓ వ్యక్తి భార్య వేదింపులకు గురిచేస్తోందని, విడాకులు ఇప్పించమని కోర్టును ఆశ్రయించాడు. అందుకు సాక్షంగా ఫోన్ సంభాషణలను సమర్పించాడు. దీంతో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఫిబ్రవరి 20, 2007లో సదరు భార్యభర్తలిరువురికీ వివాహం జరిగింది. 2011 మేలో వీరికి ఒక కుమార్తె కూడా జన్మించింది. ఐతే మనస్పర్ధల కారణంగా 2017లో విడాకులు కోరుతూ భర్త పిటిషన్ దాఖలు చేశాడు. క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో జూలై 9, 2019న భార్య భర్తలిరువురి ఫోన్ సంభాషణకు సంబంధించిన సీడీ, సిమ్ కార్డులను సాక్షాలుగా సమర్పించాడు. దీన్ని సవాల్ చేస్తూ భార్య హైకోర్టును ఆశ్రయించింది. తనకు తెలియకుండా తన సంభాషణలను రికార్డు చేయడం గోప్యతను ఉల్లంఘించడమేనని వాదించింది. ఐతే భార్య వేధింపులకు సాక్షాలుగా మాత్రమే వీటిని సమర్పించామని, ఆమె గోప్యతకు భంగం కలిగించాలనే ఉద్దేశ్యంతోకాదని భర్త తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఇరువురి వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఫోన్ రికార్డులను సాక్షాలుగా పరిగణించలేమని తేల్చిచెప్పింది. అంతేకాకుండా భార్య అనుమతి లేకుండా, ఆమెకు తెలియకుండా ఫోన్ సంభాషణలు రికార్డు చేయడం నేరమని పంజాబ్- హర్యానా హైకోర్టు వెల్లడించింది. ఈ సందర్భంగా ఫోన్ రికార్డింగ్‌లను సాక్ష్యంగా పరిగణించకుండా విడాకుల కేసుపై ఆరు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని భటిండా ఫ్యామిలీ కోర్టును హైకోర్టు ఆదేశించింది. చదవండి: అదిరిపోయే స్కీమ్! ఈ సేవింగ్ స్కీమ్‌లో పొదుపు చేసిన సొమ్ము 124 నెలల్లో రెట్టింపవుతుంది! -
కస్టడీకి గణేష్ డ్రైవర్ చంద్రశేఖర్?
► గణేష్ ఆగడాలపై నిజాలు రాబట్టే ప్రయత్నం ► నేడో రేపో కోర్టు నుంచి ఉత్తర్వులు సాక్షి, విశాఖపట్నం: రికార్డుల ట్యాంపరింగ్‌లో కీలక నిందితుడైన ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ జీఎల్ గణేశ్వరరావు(గణేష్) డ్రైవర్ దామోదర చంద్రశేఖర్‌ను కస్టడీ కోరుతూ సిట్.. కోర్టులో పిటీషన్ వేసింది. ఒకటి రెండ్రోజుల్లో ఆయన్ని కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. అంతకుముందు గణేష్‌ను ఆరు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని సిట్ పోలీసులు విచారించారు. నకిలీ డాక్యుమెంట్లు, రికార్డుల ద్వారా సుమారు 3,900 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు చేతుల మారడంలో గణేష్ కీలకపాత్ర పోషించాడని అతడ్ని అరెస్ట్ చేసిన సమయంలో సీపీ యోగానంద్ ప్రకటించారు. వందలాది పట్టాదారు పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్స్, తహసీల్దార్ల సంతకాలు, 1బీ రిజిస్ట్రార్లు, ఎఫ్‌ఎంబీలు, 200 మందికి పైగా ప్రైవేటు వ్యక్తుల ఫొటో ఆల్బమ్ ఇలా పెద్ద ఎత్తున విలువైన రికార్డులను గణేష్ డ్రైవర్ చంద్రశేఖర్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ రికార్డులతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అసలు చంద్రశేఖర్‌తో తనకు ఎలాంటి పరిచయం లేదని కస్టడీలో సిట్ పోలీసుల ఎదుట గణేష్ స్పష్టం చేసినట్టు తెలియవచ్చింది. ఆరు రోజుల పాటు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా.. తనకు సంబంధం లేదని గణేష్ సమాధానాలు చెప్పినట్టుగా సిట్ వర్గాల సమాచారం. ఆశించిన స్థాయిలో కీలక సమాచారం రాబట్టలేకపోవడంతో లై డిటెక్టర్ పరీక్ష ద్వారా నిజాలు రాబట్టాలన్న ఆలోచన సిట్ చేసింది. ఆ దిశగా కోర్టు అనుమతికోరేందుకు కూడా సిద్ధపడింది. మరోపక్క గణేష్ డ్రైవర్‌గా పనిచేసినట్టుగా చెబుతున్న చంద్రశేఖర్ నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు ఐదు రోజుల కస్టడీ కోరుతూ కోర్టులో పిటీషన్ వేసినట్టుగా చెబుతున్నారు. కస్టడీ కోరిన విషయం వాస్తవమేనని, అయితే కోర్టు నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు రానందున ఈరోజు సిట్ కస్టడీకి చంద్రశేఖర్‌ను అప్పగించలేదని జైలు వర్గాలు తెలిపాయి. అగనంపూడిలోని చంద్రశేఖర్ ఇంటి వద్ద లభించిన రికార్డులు, డాక్యుమెంట్లు ఎక్కడ నుంచి వచ్చాయి? వీటిని దాచేందుకు గణేష్ ఎందుకు చంద్రశేఖర్ ఇంటిని ఎంచుకున్నాడు? ఎన్నాళ్ల క్రితం దాచాడు? వీటిని ఉప యోగించి గణేష్‌తో కలిసి ఏం చేసారు? వంటి సమాచారాన్ని చంద్రశేఖర్ నుంచి రాబట్టేందుకు సిట్ ప్రయత్నిస్తోంది. సిట్ కొనసాగింపుపై జారీ కానీ జీవో సిట్ కొనసాగింపుపై బుధవారం కూడా జీవో జారీ కాలేదు. అయినా విచారణను మాత్రం ఎక్కడా ఆపడం లేదని, తమ పని తాము చేసుకుపోతున్నామని సిట్ వర్గాలు చెబుతున్నాయి.