railvejon
-
విశాఖ రైల్వే జోన్ కోసం గుడివాడ అమర్ నాథ్ పాదయాత్ర
-
'విశాఖ రైల్వే జోన్ కోసం మరో ఉద్యమం'
విశాఖపట్నం: రాష్ర్ట విభజన సమయంలో రాష్ట్రనికి రైల్వే జోన్ ఇస్తామని ప్రకటించిన కేంద్రం ఆ విషయని మరిచిందని రైల్వే జోన్ కోసం మరో ఉద్యమాన్ని చేపడుతున్నట్లు విశాఖ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్ చెప్పారు. రేపు అనకాపల్లి నుంచి భీమిలి వరకు పాదయాత్ర చేస్తున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. ఈ పాదయాత్రలో భారీగా ప్రజలు, నేతలు, కార్యకర్తలు పాల్గొగనున్నట్లు అమర్ నాథ్ వెల్లడించారు. -
పదిహేడులోనైనా ప్రగతి ప్రభవించేనా!
పాలకులు మనసు మారాలి అభివృద్ధి పరుగులు పెట్టాలి కోటి ఆశలు..కొత్త కాంతులు..కొంగొత్త ఆలోచనలు.. మోసుకొస్తోంది 2017. కొత్త ఏడాదిలోనైనా ఆశించిన విజయాలు అందుకోవాలని..అభివృద్ధిలో జిల్లా వాయువేగంతో పరుగు పెట్టాలని విశాఖ జిల్లా వాసులు ఎదురు చూస్తు న్నారు. గతేడాది మాదిరిగా హంగూ ఆర్భాటాలు.. శంకుస్థాపనల శిలాఫలకాలకు పరిమితం కాకుండా తలపెట్టిన ప్రతి కార్యక్రమం కార్యరూపం దాల్చాలని..వాటి ఫలితాలు అందుకోవాలని జిల్లా వాసులు కోటి ఆశలతో 2017కు ఘనంగా స్వాగతం చెబుతున్నారు. గడిచిన రెండున్నరేళ్లలో ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయని పాలక పక్షాలు కొత్త ఏడాదిలోనైనా ప్రజలకు మేలుచేయాలని కోరుతున్నారు.పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా విషయంలో యూ టర్న్ తీసుకున్న కేంద్ర పెద్దలు వచ్చే ఏడాదిలోనైనా వారి మనసులు మారి రాష్ట్రానికి హోదా ఇవ్వాలని ఆశిస్తున్నారు. విభజన హామీల్లో ఒకటైన రైల్వేజోన్ ప్రకటన రానున్న కేంద్రబడ్జెట్ రోజైనా ప్రకటించాలని కోరుతున్నారు. ఇక ఊరించి ఊసురుమనిపించిన మెట్రోరైల్వేప్రాజెక్టు కొత్త సంవత్సరంలోనైనా పట్టాలెక్కేలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతేడాది విశాఖ కేంద్రంగా జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో చేసుకున్న రూ.4.67 లక్షల కోట్ల పెట్టుబడుల్లో కనీసం పదోశాతమైనా వచ్చే ఏడాది కార్యరూపం దాల్చాలని.. తద్వారా తమ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. మరో పక్క టాప్–20లో చోటు దక్కించుకుని స్మార్ట్‌సిటీగా ఎంపికైన విశాఖలో గతేడాది పూర్తిగా డీపీఆర్‌ల తయారీ, శంకుస్థాపనలకే పరిమితమైన స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులు వచ్చే ఏడాదైనా పట్టాలెక్కాలని కోరుతున్నారు. శంకుస్థాపనకు పరిమితమైన ఐఎఎం, పెట్రోయూనివర్శిటీ, అంకురం, ఈఎస్ఐ ఆస్పత్రి, జాతీయ మౌలికసదుపాయాల శిక్షణా సంస్థ, ఇన్క్యూబేషన్ సెంటర్లతో సిగ్నేచర్ టవర్స్వంటి జాతీయ, రాష్ట్ర ప్రభుత్వాలు తలపెట్టిన వివిధ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చాలని కోరుకుంటున్నారు. గతేడాది శంకుస్థాపన చేసి పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం వచ్చే ఏడాదిలో పూర్తయి గోదావరి నీళ్లు విశాఖకు పరుగులు తీయాలని..తద్వారా సాగులోలేని ఆరున్నరలక్షల హెక్టార్ల వ్యవసాయ భూములు సైతం సాగులోకివచ్చి జిల్లా సశ్యశ్యామలంగా సుభిక్షం కావాలని కోరుతున్నారు. –సాక్షి, విశాఖపట్నం -
రైల్వే జోన్‌పై బీజేపీ-టీడీపీ డ్రామాలు
ఎంపీ హరిబాబు ప్రకటనపై సీపీఎం నిరసన డాబాగార్డెన్స్: విశాఖ పార్లమెంట్ సభ్యుడు కంభంపాటి హరిబాబు రైల్వేజోన్‌పై చేసిన కుట్రపూరిత ప్రకటనను సీపీఎం తీవ్రంగా ఖండిస్తోందని సీపీఎం నగర కార్యదర్శి బి.గంగారావు తెలిపారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ రావడానికి చాలా అవరోధాలు, సాంకేతిక అడ్డంకులు ఉన్నాయని ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. సీపీఎం నగర కార్యదర్శి మాట్లాడుతూ మొన్నటి వరకు అదిగో వస్తోంది.. ఇదిగో వస్తోందని ప్రకటనలు గుప్పించిన ఎంపీ హరిబాబు చావు కబురు చల్లగా చెప్పినట్టు విశాఖకు రైల్వేజోన్ రాదని పరోక్షంగా వెల్లడించారన్నారు. రైల్వేజోన్‌పై వేసిన కమిటీ విశాఖకు వ్యతిరేకంగా రిపోర్టు ఇచ్చిందని చెప్పడం వెనుక ఎంపీ కుట్ర ఉందన్నారు. చట్టంలో రైల్వేజోన్ ఇవ్వాలని స్పష్టంగా పేర్కొన్న తర్వాత రైల్వేజోన్ ప్రకటించకుండా తీవ్ర జాప్యం చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని భావిస్తున్నామన్నారు. ఇది బీజేపీ-టీడీపీ ఆడుతున్న డ్రామా అని విమర్శించారు. బీజేపీ శాసనసభాపక్ష సమావేశం విశాఖలో పెట్టి విశాఖకు రైల్వేజోన్ రాకుండా కుట్రకు పాల్పడినట్టు అర్థమవుతోందన్నారు. విశాఖకు అన్యాయం చేసే చర్యలను ప్రతిఘటిస్తామని, అమరావతికి రైల్వేజోన్‌ను తరలించే కుట్రలను బీజేపీ-టీడీపీ నాయకులు ఉపసంహరించాలని సీపీఎం డిమాండ్ చేస్తుందన్నారు. కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్కేఎస్వీ కుమార్, మద్దిలపాలెం జోన్ కార్యదర్శి పి.మణి, పార్టీ నగర కమిటీ సభ్యులు వెంకట్‌రెడ్డి, అప్పారావు, నరేంద్రకుమార్, డి రాజు, నూకరాజు, నాయుడు, రమణ, భూలోకరావు, కుమారి, విజయ తదితరులు పాల్గొన్నారు.