breaking news
Raghunathan
-
లాక్డౌన్ ఆంక్షలతో పెరిగిన నిరుద్యోగం
న్యూఢిల్లీ: కరోనా వల్ల ఎంతోమంది ఉద్యోగాలు హుష్కాకి అయ్యాయి. ఇప్పటికే నిరుద్యోగ భారతంగా పేరు గాంచిన మన దేశంలో నిరుద్యోగుల సంఖ్య ఇప్పుడు మరింత పెరిగింది. అర్బన్ ప్రాంతాల్లో లాక్డౌన్ వల్ల విధిస్తున్న కఠిన ఆంక్షల వల్ల పట్టణాల్లో నిరుద్యోగుల సంఖ్య 11.26 శాతానికి ఎగబాకిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనం ప్రకారం గత నాలుగువారాలుగా తగ్గుముఖంగా ఉన్న పట్టణ నిరుద్యోగిత జూలై 5 నాటికి 10.69 నుంచి 11.26 శాతానికి పెరిగింది. ఈ పెరుగుదల కర్ణాటక, తమిళనాడు, అస్సాం, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలో అధికంగా ఉంది. మరోవైపు లాక్డౌన్ వల్ల మార్కెట్లో డిమాండ్ పడిపోవడం, కూలీల కొరత.. సూక్ష్మ, స్థూల పరిశ్రమలపై ప్రభావం చూపుతోందని, ప్రతిఫలంగా ఉద్యోగ భద్రతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయని స్పష్టం చేసింది. (నిరుద్యోగ రేటు స్ధిరంగా ఉన్నా..) ఏప్రిల్లో 17.7 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోగా ఈ సంఖ్య మేనాటికి 17.8కి చేరింది. అయితే జూన్లో 3.9 మిలియన్ల మంది తిరిగి ఉద్యోగాల్లో చేరినట్లు సీఎంఐఈ గతవారం తన వెబ్సైట్లో పేర్కొంది. ఆల్ ఇండియా మ్యానుఫాక్చర్స్ ఆర్గనైజేషన్ మాజీ అధ్యక్షుడు కెఈ రఘునాథన్ మాట్లాడుతూ.. ఫార్మల్ సెక్టార్ కోలుకోవడానికి కొంత సమయం పడుతుందన్నారు. ముఖ్యంగా వలస కార్మికులు తిరిగి పట్టణాల బాట పట్టేందుకు కనీసం ఆరు నెలలు పడుతుందని తెలిపారు. అలాగే అటు ఉద్యోగాలు కోల్పోవడంతోపాటు, ఆదాయం తగ్గింపు కూడా అనేక రంగాల్లో పనిచేస్తున్నవారి జీవితాలను ప్రమాదంలోకి నెట్టివేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. (విపత్కరంలోనూ ‘ఉపాధి’) -
కింగ్ ఫిషర్ అధికారికి జైలు శిక్ష ఖరారు
హైదరాబాద్ : పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా ..కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ చెక్ బౌన్స్ కేసులో ఎర్రమంజిల్ ప్రత్యేక కోర్టు గురువారం శిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో దోషిగా తేలిన కింగ్ ఫిషర్ మాజీ ముఖ్య అధికారి ఎ ఎ. రఘు నాథన్ కు18 నెలల జైలు శిక్షవిధిస్తూ తీర్పు చెప్పింది. ఇదే కేసులో కింగ్ ఫిషర్ మాజీ అధినేత మాల్యా కూడా దోషిగా తేలినప్పటికీ, ఆయన విదేశాలకు పారిపోవడంతో శిక్ష ఖరారు వాయిదా పడుతోంది. కాగా శంషాబాదు ఎయిర్ పోర్టులో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ విమానాల రాకపోకలకు సంబంధించి విజయ్ మాల్యా సంస్థ జీఎంఆర్ బకాయిల చెల్లింపుల్లో భాగంగా ఇచ్చిన 50 లక్షల రూపాయల విలువ గల రెండు చెక్కులు బౌన్సయ్యాయి. దీంతో జీఎంఆర్ సంస్థ హైదరాబాదు ఎర్రమంజిల్ లోని ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేసింది. కేసును విచారించిన కోర్టు కింగ్ ఫిషర్ మాజీ అధినేత విజయ మాల్యా, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ లిమిటెడ్ సీనియర్ అధికారి రఘునాథన్ ఏప్రిల్ 20 న దోషిగా తేల్చిల్చింది. కానీ విజయ్ మాల్యా గైర్హాజరుతో మాల్యా పరోక్షంలో శిక్షను ఖరారు చేయలేమని చెప్పిన సంగతి తెలిసిందే.