breaking news
radison
-
ఉత్సాహంగా 'సైకిల్ ఫర్ ఏ కాజ్'..!
సామాజిక అభివృద్ధి, బాధ్యతపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా నగరంలోని రాడిసన్ బ్లూ ప్లాజాలో ‘సైకిల్ ఫర్ ఏ కాజ్’ పేరుతో రైడ్ నిర్వహించారు. రాడిసన్ హోటల్ గ్రూప్ సౌత్ ఆసియా చేపట్టిన ఈ ఈవెంట్లో 120 మందికి పైగా సైక్లిస్టులు పాల్గొన్నారు. రాడిసన్ పీపుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక అభివృద్ధికి, అవగాహనకు మద్దతివ్వడంలో భాగంగా నిర్వహించిన ఈ రైడ్‌లో సైక్లిస్టులు రైడ్ ఫర్ హోప్ (3 కి.మీ), రైడ్ ఫర్ చేంజ్ (6 కి.మీ), రైడ్ ఫర్ ఇంపాక్ట్ (50 కి.మీ) వంటి మూడు విభాగాల్లో పోటీపడ్డారు. ఈ సందర్భంగా సంస్థ జనరల్ మేనేజర్ సందీప్ జోషి మాట్లాడారు. హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా 60కి పైగా నగరాల్లో దీనిని నిర్వహించామన్నారు. ఈ సైక్లోథాన్ కేవలం సైక్లింగ్ మాత్రమే కాదు, సమాజంలో నిజమైన మార్పే దీని ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన నిధులు ఆతిథ్య రంగంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తామని పేర్కొన్నారు. నయనానందకరం అనుష్క నృత్యంనాట్య గురువు ప్రమోద్‌రెడ్డి శిష్యురాలు చెరుకు అనుష్క భరతనాట్యం నయనానందకరమని ఐపీఎస్ అధికారి ఎం.రమేష్ అన్నారు. రవీంద్రభారతిలో అభినేత్రి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో అనుష్క అరంగేట్రం కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే పిల్లలకు సంస్కృతి, సంప్రదాయ నృత్యం పట్ల అవగాహన కల్పిచి శిక్షణ ఇప్పించాలని అన్నారు. ఓ వైపు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ, మరోవైపు సంప్రదాయ నృత్యాన్ని నేర్చుకోవడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా పుష్పాంజలి, ఆనంద నర్తన గణపతి, వర్ణం, థిల్లాన, ప్రదోష సమయం వంటి అంశాలపై చక్కటి హావాభావాలతో సాగిన నృత్య ప్రదర్శన అహూతులను ఆకట్టుకుంది. భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, నాట్య గురువు అనుపమ కైలాష్, తల్లిదండ్రులు చెరుకు గోవర్ధన్‌రెడ్డి, అంజలి పాల్గొన్నారు. (చదవండి: కాశీ నేపథ్యంలో.. 'కైలాసవాస శివ'..) -
రాడిసన్ డ్రగ్స్ కేసులో నటి పేరు!
హైదరాబాద్, సాక్షి: గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ఓ నటి పేరు వినవస్తోంది. ఆమె పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిన పోలీసులు.. పిలిచి విచారిస్తామని అంటున్నారు. విశేషం ఏంటంటే.. ఆ నటి పేరు, ఆమె సోదరి పేర్లు గతంలోనూ డ్రగ్స్ వ్యవహారంలో వినవచ్చాయి. యూట్యూబర్‌గా, షార్ట్ ఫిల్మ్స్‌తో లిషి గణేష్పేరును రాడిసన్ డ్రగ్స్‌పార్టీ కేసులో సైబరాబాద్ పోలీసులు చేర్చినట్లు సమాచారం. బీజేపీ నేత తనయుడైన గజ్జల వివేకానంద రాడిసన్ హోటల్లో ఈ డ్రగ్స్ పార్టీ ఇచ్చాడు. అయితే ఆ పార్టీకి లిషి కూడా వెళ్లిందని గుర్తించామని.. ఆమెను కచ్చితంగా పిలిచి విచారిస్తామని కూడా చెబుతున్నారు. జియోమెట్రీ బాక్స్ లాంటి షార్ట్ ఫిల్మ్‌తో నటిగా ఆమె ఓ గుర్తింపు తెచ్చుకుంది. యూట్యూబ్ వీడియోలతోనూ ఆమె యూజర్లను అలరిస్తుంటారు. ఇక.. 2022లో సంచలన చర్చకు దారి తీసిన మింక్ పబ్ డ్రగ్ కేసులోనూ లిషితో పాటు ఆమె సోదరి కుషిత పేరు కూడా వినిపించింది. ఆ సమయంలో కుషిత ఆ ఆరోపణల్ని ఖండిస్తూ చీజ్ బజ్జీలు తినడానికి వెళ్లామంటూ ఓ ఇంటర్వ్యూ లో పేర్కొంది. అంతే.. ఆమెను తెగ ట్రోల్ చేశారు. ఇప్పుడు ఆమె సోదరి లిషి గణేష్ పేరు రాడిసన్ డ్రగ్స్ కేసులో వినిపించడం గమనార్హం. లిషితో పాటు శ్వేత అనే వీఐపీ పేరును ఎఫ్ఐఆర్లో పోలీసులు చేర్చారు. Actor Lishi named again in drugs case Gachibowli police of #Cyberabad named Kallapu Lishi Ganesha as accused in the Radisson hotel drugs case in which BJP leader’s son Gajjala Vivekananda was caught. She acted in a short film titled 'Geometry Box' Vivekananda confessed and… pic.twitter.com/QHrEnRQHJp — Sudhakar Udumula (@sudhakarudumula) February 26, 2024 -
HYD:10 మంది వీఐపీలపై డ్రగ్స్ కేసు
హైదరాబాద్, సాక్షి: రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్స్ కేసులో పురోగతి చోటు చేసుకుంది. డ్రగ్స్ పార్టీలో పాలు పంచుకున్న పది మంది వీఐపీలపై కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఇద్దరు అమ్మాయిలతో పాటు మొత్తం 9 మందిపై కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. వ్యాపారవేత్తలు గజ్జల వివేకానంద్, అబ్బాస్, కేదార్, సందీప్‌లు.. సెల్రబిటీ శ్వేతతో పాటు లిశి, నీల్‌పైనా కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. అలాగే.. డ్రగ్స్ సేవించిన నిర్భయతో పాటు రఘు చరణ్‌పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. అబ్బాస్ దగ్గర వివేకానంద డ్రగ్స్ కొనుగోలు చేసి.. తన స్నేహితులతో పార్టీ చేసుకున్నట్లు తేలింది. వీళ్లంతా కొకైన్ పేపర్లో చుట్టి డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొని ఉంది. అంతేకాదు.. ఈ డ్రగ్స్ పార్టీలో మరికొంత మంది ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి.. ‘‘రాడిసన్ బ్ల్యూ హోటల్ పై స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులతో దాడి చేశాం. అక్కడ డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం రావడం తో సెర్చ్ చేశాం. అప్పటికే హోటల్ నుండి నిందితులు పరారయ్యారు . అప్పటికే అందించిన సమాచారంతో.. వివేకానంద ఇంటికి వెళ్ళాం. వివేకానంద మంజీర గ్రూప్ కి డైరెక్టర్ గా ఉన్నాడు. ఇంటికి వెళ్లిన సమయం లో పోలీసులకు విచారణకు సహకరించకుండా కొంత ఇబ్బంది పెట్టారు. వివేకానందను అదుపులోకి తీసుకొని డ్రగ్స్ టెస్ట్ చేశాం. వివేకా నంద తో పాటు నిర్భయ్ , కేదార్‌లకు పాజిటివ్ వచ్చింది. వివేక్ కు యూరిన్ టెస్ట్ చేయించాము, కొకైన్ తీసుకున్నట్లు రిపోర్ట్ వచ్చింది. మొత్తం ఈ పార్టీ లో 10 మంది ఉన్నట్లు గుర్తించాం. రాడిసన్ హోటల్ లో గతంలో పార్టీలు జరిగాయి. సయ్యద్ అబ్బాస్ అనే వ్యక్తి డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించాం. వివేకా నంద, నిర్భయ్ , కేదార్ పై 121b 27, NDPS యాక్ట్ కింద కేసులు నమోదు చేశాం. డ్రగ్స్ ద్వారా సంపాదించిన ఆస్తులు ను కూడా మేము అటాచ్ చేస్తున్నాం అని సీపీ వెల్లడించారు. -
వారిని మాత్రం ఉగ్రవాదులు వదిలేశారు..
*ఆసియా, యూరప్, అమెరికా .. ఆఫ్రికా.. *టార్గెట్ చేస్తే ఎక్కడైనా సరే... *ఎవరినైనా చంపేస్తామన్న ఉగ్రవాదల హెచ్చరికలు నిజమవుతున్నాయి.. *తాజాగా పశ్చిమ ఆఫ్రికా దేశమైనా మాలీ రాజధాని బమాకాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. *బకామాలోని రాడిస్ బ్లూ హోటల్‌పై తెగబడ్డారు *రాడిస్ బ్లూ హోటల్‌ను 10 మంది తీవ్రవాదులు దిగ్బంధించారు.. *తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.. *హోటల్లో పెద్ద ఎత్తున అమెరికన్లు, ఫ్రెంచి - బెలిజన్ దేశస్తులు ఉన్నట్లు సమాచారం. *తీవ్రవాదుల కాల్పుల్లో 9 మంది మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి.. *మృతుల్లో ఫ్రెంచి, బెలిజియన్ దేశస్తులుగా మీడియా కథనాలు.. *తీవ్రవాదుల దగ్గర 170 మంది బందీలుగా ఉన్నారు.. *వీరిలో 140 మంది అతిథులు కాగా, 30 మంది హోటల్ సిబ్బందిగా వార్తలు వస్తున్నాయి.. *ఉగ్రవాదులు రాత్రంతా హోటల్లోనే గడిపినట్లు తెలుస్తోంది... *వారి చెరనుంచి బందీలను విడిపించేందుకు భద్రతా దళాలు విశ్వయత్నం చేస్తున్నాయి. *మరోవైపు మాలి ప్రధాని అత్యవసర సమావేశం నిర్వహించారు... *ఉగ్రవాదుల ఆధీనంలోనే రాడిసన్ బ్లూ హోటల్ * హోటల్లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు ముందుగా అందులో ఉన్నటువంటి ముస్లింలను వెల్లిపోవాల్సిందిగా సూచించి మిగిలిన వారిని బందీలుగా తీసుకున్నారు. *ఉగ్రవాదులు 190 గదులతో ఉన్నటువంటి హోటల్లోని ఒక్కో ఫ్లోరును తనిఖీ చేస్తూ బందీలుగా తీసుకున్నట్లు తెలుస్తోంది. *సుమారు 20 మందిని ముస్లింలుగా నిర్థారించుకున్న అనంతరం ఉగ్రవాదులు విడిచిపెట్టారు. *ఓ ఫ్రెంచి దేశీయుడితో సహా మరికొందరిని ఉగ్రవాదులు హతమార్చినట్లు సమాచారం. *ఎయిర్ ఫ్రాన్స్ సిబ్బంది సాధారణంగా ఈ హోటల్లోనే బస చేస్తుంటారు. దీంతో వీరిని లక్ష్యంగా చేసుకొనే ఉగ్రవాదులు హోటల్‌పై దాడి చేశారా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. *మాలిలోని యూఎస్ ఎంబసీ బందీలను విడిపించడానికి అత్యవసర సహాయాన్ని కోరింది. *7వ ఫ్లోరులో అత్యాధునిక ఆయుధాల పేలుళ్ల శబ్దం వినిపించడంతో ఉగ్రవాదులు పలువురు బందీలను హతమార్చి ఉంటారని భావిస్తున్నారు. *'రాడిసన్ హోటల్ బందీలలో భారత్‌కు చెందిన వారు 20 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది.