breaking news
racially motivated attack
-
అమానుష దాడి: నెత్తిపై జుట్టు చర్మంతో సహా వచ్చేలా మహిళ పై దాడి!!
woman had hair ripped from her scalp in a racial attack: లండన్లో జాతి విద్వేషపూరిత దాడిలో భాగంగా ఒక వ్యక్తి మహిళ పై అత్యంత అమానుషంగా దాడి చేశాడు. ఆ మహిళ నెత్తిపై జుట్టు చర్మంతో సహా వచ్చేలా భయంకరంగా దాడి చేశాడు. అయితే ఈ సంఘటన డిసెంబర్ 18, 2021న దక్షిణ లండన్లోని ఈస్ట్ క్రోయ్డాన్ రైల్వే స్టేషన్ వెలుపల చోటు చేసుకుంది. ఆమె రూట్ నెం 119 బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఒక దుండగుడు ఆమె పై దాడి చేశాడు. స్కాట్లాండ్ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..మహిళ జుట్టును దుండగడు గట్టిగా లాగాడని చెప్పారు. ఫలితంగా ఆమె నెత్తిపై ఒక వైపు భాగం జుట్టు చర్మంతో సహా ఊడిపోయిందని తెలిపారు. అంతేగాక ఆ నిందితుడు ఆమెను తల వెనుక భాగంలో గట్టిగా కొట్టడంతో ఆమె పడిపోయిందని కూడా చెప్పారు. పైగా సుదీర్ఘమైన జాతి విద్వేషపూరిత దాడిలో బాధితురాలి ముఖానికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయని తెలిపారు. ఈ మేరకు డిటెక్టివ్ కానిస్టేబుల్ బెక్కీ హ్యూస్ మాట్లాడుతూ, "ఇది పూర్తిగా రెచ్చగొట్టబడని దాడి. బాధితురాలు నేలపై పడిపోయినప్పుడు ఈ దుశ్చర్యకు పూనకున్నాడు. అంతేకాదు ఆ ఘటనకు సంబంధించిన ఫోటోని కూడా విడుదల చేశాం. ఆ సంఘటన జరిగినప్పుడూ ఉన్నవారు ఎవరైన మా ముందుకు రావాలి. ఆ నిందుతుడి గురించి తెలియజేయాలి" అని కోరారు. పైగా హింసాత్మక దాడులను ఎదుర్కొంటున్న మహిళల, పిల్లలను రక్షించడమే తమ తక్షణ కర్తవ్వం అని బెక్కీ హ్యూస్ చెప్పారు. (చదవండి: తొలిసారిగా పైలెట్ లేకుండానే దూసుకెళ్లిన హెలికాప్టర్.. ఎలాగో తెలుసా!!) -
వైట్ హౌస్ ఒప్పుకుంది
వాషింగ్టన్: తెలుగు ఇంజనీర్ కూచిభొట్ల శ్రీనివాస్ హత్యను అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఖండిచింది. కూచిభొట్ల శ్రీనివాస్ ది జాత్యంహకార హత్యగా అంగీకరించింది. జాతి వివక్షతో కూడిన దాడిగా వర్ణించింది. ఇలాంటి ఘటనలను సహించబోమని స్పష్టం చేసింది. ‘ఇప్పటివరకు వెల్లడైన వాస్తవాలను బట్టి చూస్తే కాన్సస్ కాల్పులు.. జాతి వివక్షతో కూడిన విద్వేష దాడిగా రూడీ అవుతోంది. జాత్యంహకార దాడులను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండిస్తారు. ఇటువంటి దాడులను సహింబోమ’ని వైట్ హౌస్ అధికార ప్రతినిధి సారా శాండర్స్ మీడియాతో అన్నారు. మరోవైపు కూచిభొట్ల శ్రీనివాస్ మృతికి అమెరికా కాంగ్రెస్ సంతాపం తెలిపింది. కాన్సస్ కాల్పులు బాధితుల కోసం అమెరికా చట్టసభ సభ్యులు నిమిషం మౌనం పాటించారు. గత బుధవారం రాత్రి కాన్సస్ లోని ఆస్టిన్స్ బార్లో ఆడమ్ పూరింటన్ అనే వ్యక్తి జరిపిన కాల్పుల్లో కూచిభొట్ల శ్రీనివాస్ మృతి చెందాడు. మరో తెలుగు ఇంజనీర్ అలోక్ రెడ్డి, అమెరికన్ ఇయాన్ గ్రిల్లాట్ గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్టు ఎఫ్ బీఐ తెలిపింది. జాత్యంహకార దాడిగానే భావించి విచారణ చేపట్టామని ఎఫ్ బీఐ వెల్లడించింది.