breaking news
rachamallu prasada reddy
-
మంత్రి ఆదినారాయణరెడ్డికి భంగపాటు
-
మంత్రి ఆదినారాయణరెడ్డికి భంగపాటు
కడప: వైఎస్ఆర్ జిల్లా పరిషత్ సమావేశంలో మంత్రి ఆదినారాయణరెడ్డికి భంగపాటు కలిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ గురించి మాట్లాడే ముందు పార్టీ ఫిరాయించిన ఆదినారాయణ రెడ్డి తన పదవులకు రాజీనామా చేయాలని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు. దీంతో మంత్రి తత్తరపాటుకు గురయ్యారు. ఫిరాయింపు అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు విఫలయత్నం చేశారు. రాజీనామా అంశాన్ని ప్రశ్నించడంతో టీడీపీ సభ్యులు గొడవకు దిగారు. ఫిరాయింపు జెడ్పీటీసీలు బల్లలు చరుస్తూ టీ కప్పులు పగలగొట్టారు. రసాభాసగా సమావేశం జిల్లా పరిషత్ సమావేశం రసాభాసగా మారింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తే...ఇది దానికి వేదిక కాదంటూ మంత్రులు చెప్పడం రచ్చకు దారి తీసింది. ఒక దశలో మంత్రి సోమిరెడ్డికి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గృహనిర్మాణంపై రాచమల్లు లేవనెత్తిన ప్రశ్నకు మంత్రులు సమాధానం చెప్పలేక శాసనసభలో చర్చిద్దామంటూ దాటవేసే ధోరణి అవలంభించారు. అంతేకాక రాచమల్లు ప్రసాదరెడ్డి అర్బన్ ఏరియాకు చెందిన ఎమ్మెల్యే కాబట్టి ఈ మీటింగుకు రాకూడదని ఎదురుదాడి చేశారు. దీంతోవైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. నేలపై కూర్చుని తమ నిరసన తెలిపారు. -
వారానికోసారి నీళ్లిస్తున్నారు
హైదరాబాద్: నీటిఎద్దడితో ప్రొద్దుటూరులో తీవ్రమైన ఇబ్బంది పడుతున్నామని వైఎస్ఆర్ సీపీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. మంగళవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ వాళ్లు వారానికి ఒకసారి నీళ్లిస్తున్నారని చెప్పారు. '18 కోట్ల రూపాయలతో వరద కాలువను పెన్నాకు అనుసంధానం చేసే పనులు మొదలుపెట్టారు. రైతులు కోర్టుకు వెళ్లడంతో పనులు పూర్తి కాలేదు. అనుసంధానం పూర్తయితే ప్రొద్దుటూరుకు నీటి సమస్య తీరుతుంది. ఇటీవల మంత్రి దేవినేని ఉమా కూడా వచ్చారు. ఆ పనులు ఎప్పటిలోగా పూర్తిచేస్తారు' అని రాచమల్లు ప్రసాదరెడ్డి ప్రశ్నించారు. -
కలెక్టర్ గైర్హాజరు: నిలదీసిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు
కడప: వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ వ్యాఖ్యాలపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ సంఘటన మంగళవారం కడప జడ్పీ సమావేశంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.... వైఎస్ఆర్ జిల్లా కేంద్రమైన కడపలో జడ్పీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ హాజరుకాలేదు. దీంతో జిల్లాకు చెందిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు... కలెక్టర్ కె.వి.రమణ ఎందుకు ఈ సమావేశానికి హజరుకాలేదంటూ జిల్లాకు చెందిన ఉన్నతాధికారులను నిలదీశారు. ఈ అంశంపై ఉన్నతాధికారులు నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఉండి కలెక్టర్ ఈ సమావేశానికి హాజరుకాకపోవడం సరైనది కాదని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అభిప్రాయపడ్డారు. పోలీసులు, అధికారులు జిల్లాకు చెందిన తమ పార్టీ ఎమ్మెల్యేలను అడుగడుగునా అవమానపరుస్తున్నారని ఆయన ఆరోపించారు. సీఆర్ఎఫ్ నిధుల విషయంలో కలెక్టర్ సమాధానం చెప్పాలని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. పారిశ్రామికవేత్తలు కడప రావాలంటే భయపడుతున్నారని జిల్లా కలెక్టర్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ అంశం కడప జిల్లా వాసుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి అన్నారు. -
ప్రొద్దుటూరులో.. ఫ్యాన్ హోరు
మరోమారు అదృష్టాన్ని పరీక్షించుకోనున్న వరద ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: ప్రజా సేవలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని తొలిమారు ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తరపున పోటీ చేస్తున్న రాచమల్లు ప్రసాదరెడ్డికే స్థానిక పరిస్థితుల దృష్ట్యా విజయావకాశాలు మెండుగా ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. 16 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్న ఈయన కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్మన్, ఇన్చార్జి చైర్మన్‌గా పనిచేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విద్యావంతుడు కావడం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతుండడం రాచమల్లుకు లాభించే అంశాలు. సమీప ప్రత్యర్థిగా ఉన్న నంద్యాల వరదరాజులరెడ్డి పాతికేళ్లు ఎమ్మెల్యేగా ఉండి అభివృద్ధి నిరోధకుడుగా ప్రజల మనసుల్లో ముద్రవేసుకున్నారనే భావన ప్రజల్లో ఉంది. ఈ కారణంగానే 2009 ఎన్నికల్లో లింగారెడ్డి చేతిలో 16,156 ఓట్లతో వరద ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో దేవగుడి నారాయణరెడ్డి చేతిలో ఓటమి పాలైన వరద ప్రస్తుతం మరో మారు ఎమ్మెల్యే ఎన్నికలలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పోటీ చేస్తున్నారు. వరదకు ఎదురుగాలి... 2009 ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వరద ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరి టికెట్ పొందారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన ఎన్నికల్లో జి ల్లాలోని 10 అసెం బ్లీ నియోజకవర్గాలకు గాను ప్రొద్దుటూరులో మాత్రమే వరదరాజులరెడ్డి కాంగ్రెస్‌పార్టీ తరపున ఓటమి చెందారు. ఇది లావుండగా 1981లో రాజకీయ రంగ ప్రవే శం చేసి సమితి ఎన్నికల్లో పోటీ చేయగా శెట్టిపల్లె రఘురామిరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత 1983లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎంవీ రమణారెడ్డి చేతిలో వరదరాజులరెడ్డి ఓటమి పాలయ్యారు. 1985, 1989, 1994, 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. అలాగే 1981లో తొలిమారు సమితి ప్రెసిడెంట్, 1983లో, 2009లో ఎమ్మెల్యేగా, 2011లో ఎమ్మెల్సీకి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈ ప్రకారం వరద జీవితంలో మొత్తం 5 మార్లు గెలుపొందగా, మరో నాలుగు మార్లు ఓటమిపాలయ్యారు. అయితే ప్రస్తుతం నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులు వరదకు ప్రతికూలంగా పరిణమించే అవకాశాలు ఉన్నాయి. ప్రొద్దుటూరు ఎమ్మెల్యేలు వీరే... సంవత్సవం పార్టీ గెలుపొందిన అభ్యర్థి 1952 కాంగ్రెస్ కె. బాలనారాయణరెడ్డి 1955 కాంగ్రెస్ కె. బాలనారాయణరెడ్డి 1957 ఇండిపెండెంట్ ఆర్సీ ఓబులరెడ్డి 1962 కాంగ్రెస్ ఆర్. రామసుబ్బారెడ్డి 1972 కాంగ్రెస్ కొప్పరపు సుబ్బారావు 1978 కాంగ్రెస్. ఐ చంద్ర ఓబులరె డ్డి రామిరెడ్డి 1983 టీడీపీ ఎం.వీ రమణారెడ్డి 1985 టీడీపీ ఎన్. వరదరాజులరెడ్డి 1989 కాంగ్రెస్ ఎన్. వరదరాజులరెడ్డి 1994 కాంగ్రెస్ ఎన్. వరదరాజులరెడ్డి 1999 కాంగ్రెస్ ఎన్. వరదరాజులరెడ్డి 2004 కాంగ్రెస్ ఎన్. వరదరాజులరెడ్డి 2009 టీడీపీ మల్లెల లింగారెడ్డి పట్టణ ఓటర్లే కీలకం.. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 2,20,000 వరకు ఓటర్లు ఉండగా ఇందులో పట్టణంలోనే 1,23,000 మంది ఓటర్లు ఉన్నారు. అభ్యర్థుల గెలుపోటములు ప్రధానంగా ప్రొద్దుటూరు పట్టణంపైనే ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం ప్రొద్దుటూరు పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. పాతికేళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్న వరద ఈ సమస్యను పరిష్కరించలేకపోయారని, పెపైచ్చు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తాగునీటి కోసం మంజూరు చేసిన కుందూ-పెన్నా నీటి పథకాన్ని పూర్తి చేయలేకపోయారనే అపవాదు ప్రజల్లో ఉంది. అలాగే ట్రాఫిక్ సమస్య కూడా తీవ్రంగా ఉంది. వీటికి తోడు పట్టణంతోపాటు నియోజకవర్గంలో ప్రజలకు కనీసం మౌలిక వసతులు సమకూర్చడంలో విఫలమయ్యారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇలాంటి అంశాలు ఎక్కువగా వరద ఓటమికి ప్రభావం చూపనున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ కారణంగా తొలిమారు బలమైన పార్టీ తరపున పోటీ చేస్తున్న రాచమల్లు ప్రసాదరెడ్డినే విజయం వరిస్తుందని ప్రజలు భావిస్తున్నారు. ఇదిలావుండగా ప్రొద్దుటూరులో అప్పుడే రాచమల్లు ప్రసాదరెడ్డి మెజారిటీపై బెట్టింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఆయన ఎన్ని వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తారని బెట్టింగ్‌లు జరుగుతున్నాయి.