breaking news
pv rajeshwar rao
-
పీవీ రాజేశ్వరరావుకు కన్నీటి వీడ్కోలు
- తరలివచ్చిన కాంగ్రెస్ ప్రముఖులు.. భౌతికకాయం గాంధీభవన్‌కు తరలింపు - మహాప్రస్థానంలో ముగిసిన అంత్యక్రియలు హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తనయుడు, కాంగ్రెస్ పార్టీ మాజీ లోక్‌సభ సభ్యుడు పీవీ రాజేశ్వరరావుకు ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. తీవ్ర అనారోగ్యానికి గురై సోమవారం సాయం త్రం రాజేశ్వరరావు కన్నుమూసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ ఆదర్శనగర్‌లోని స్వగృహంలో ఆయన భౌతికకాయానికి మం గళవారం పలువురు కాంగ్రెస్ ప్రముఖులు నివాళులు అర్పించారు. పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, కాంగ్రెస్ నేతలు జైపాల్‌రెడ్డి, సుబ్బిరామిరెడ్డి జానారెడ్డి, శ్రీధర్‌బాబు, దానం నాగేందర్, అంజన్‌కుమార్ యాదవ్, సంతోష్‌రెడ్డి, శ్రీచరణ్జోషి, దైవజ్ఞశర్మ తదితరులు రాజేశ్వరరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. రాజేశ్వరరావు భార్య రాధిక, కుమారుడు రాఘవేంద్ర కశ్యప్, కుమార్తెలు సత్యశ్రీ, విశాలలను పరామర్శించి సానుభూతిని ప్రకటించారు. భౌతికకాయం గాంధీభవన్‌కు తరలింపు ఇతర కాంగ్రెస్ నేతల సందర్శనార్ధం రాజేశ్వరరావు భౌతికకాయాన్ని గాంధీ భవన్ కు తరలించారు. ఇక్కడ గంట పాటు ఉంచి అనంతరం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థా నానికి తరలించి అంత్యక్రియలను పూర్తి చేశారు. అంతిమయాత్రలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గాంధీభవన్‌లో నివాళులు పీవీ రాజేశ్వరరావు భౌతికకాయానికి హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో పలువురు నేతలు మంగళవారం నివాళులర్పించారు. అనారోగ్యంతో సోమవారం తుదిశ్వాస విడిచిన రాజేశ్వరరావు భౌతిక కాయాన్ని కార్యకర్తలు, అభిమానుల సందర్శన కోసం గాంధీభవన్‌లో మంగళవారం కొద్దిసేపు ఉంచారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రులు డి.శ్రీధర్ బాబు, దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. -
పీవీ రాజేశ్వరరావు కన్నుమూత
-
పీవీ రాజేశ్వరరావు కన్నుమూత..నేడు అంత్యక్రియలు
- తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో తుదిశ్వాస - నేటి మధ్యాహ్నం హైదరాబాద్‌లో అంత్యక్రియలు - మాజీ ప్రధాని మన్మోహన్, కేసీఆర్ తదితరుల సంతాపం సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నర్సిం హారావు తనయుడు, లోక్‌సభ మాజీ సభ్యుడు పీవీ రాజేశ్వరరావు(70) సోమ వారం సాయంత్రం కన్నుమూశారు. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజేశ్వరరావు ఈ నెల 5న సోమాజిగూడ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతుండగానే తీవ్ర అస్వస్థతకు లోనై తుదిశ్వాస విడిచారు. భౌతికకాయాన్ని ఆదర్శ నగర్‌లోని ఆయన స్వగృహానికి తరలించారు. రాజేశ్వరరావు మరణవార్త తెలియగానే పీవీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు భారీగా చేరుకున్నారు. వివిధ పార్టీల నేతలు నివాళి అర్పించారు. అమెరికాలో ఉన్న పీవీ కుటుంబీ కులు మంగళవారం ఉదయం హైదరాబాద్ చేరుకోనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు విష్పర్ వ్యాలీలో మహా ప్రస్థానం శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రాజేశ్వరరావుకు భార్య రాధిక, కుమారుడు రాఘవేంద్ర కశ్యప్ ఉన్నారు. కశ్యప్ రాజకీయాలకు దూరంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. రాజేశ్వరరావు మృతిపట్ల మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ సంతాపం తెలిపారు. సికింద్రాబాద్ నుంచి ఎంపీగా.. రాజేశ్వరరావు 1996లో జరిగిన లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి బండారు దత్తాత్రేయపై 2,14,358 ఓట్ల మెజారిటీతో విజయం సా«ధించారు. అంతకుముందు రాజేశ్వరరావు భాగ్యనగర ఖాదీ సమితి వైస్ చైర్మన్‌గా, ఆలిండియా రేడి యో, దూరదర్శన్‌లో లైట్ మ్యూజిక్ సింగర్ గా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల అడ్వయిజరీ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. పీవీ నర్సింహారావుకు రాజేశ్వరరావంటే అమిత మైన ప్రేమ. పీవీకి ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. వీరిలో మాజీ మంత్రి పీవీ రంగారావు పెద్ద. తరువాత శారదాదేవి, రాజేశ్వరరావు, సరస్వతి, వాణిదేవి, ప్రభాకర రావు, జయ, విజయలున్నారు. రాజేశ్వరరావు మృతికి సీఎం కేసీఆర్ సంతాపం మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తన యుడు, సికింద్రా బాద్ లోక్‌సభ మాజీ సభ్యుడు పీవీ రాజేశ్వరరావు మృతికి సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. రాజ కీయ, సాహిత్య, సంగీత రంగాల్లో అభి రుచి, ఆసక్తి గల రాజేశ్వరరావుతో తన కున్న అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. రాజేశ్వరరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైఎస్ జగన్ సంతాపం పీవీ రాజేశ్వరరావు మృతికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. సాహితీ, సాంస్కృతిక రంగాల్లో రాజేశ్వరరావు చురుకైన పాత్ర పోషించారని కొనియా డారు. రాజేశ్వరరావుకు నివాళుల ర్పిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సాను భూతి తెలిపారు. పలువురు ప్రముఖుల సంతాపం రాజేశ్వరరావు మృతికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్య నిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, ప్రతిపక్ష నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సంతాపం ప్రక టించారు. పీవీ మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.